"డేటా సెక్యూరిటీ సంక్లిష్టంగా ఉండకూడదు."
Google మ్యూనిచ్‌లో ఉన్న Google Safety Engineering Center (GSEC)లో 2019 నుండి ఇంటర్నెట్‌లో డేటా గోప్యతను, డేటా సెక్యూరిటీని సురక్షితంగా ఉంచడంపై దృష్టి పెడుతోంది. సైట్ లీడ్ వైలాండ్ హోల్‌ఫెల్డర్ GSECలో తాజా పరిణామాల గురించి, తన టీమ్ పని విధానాల గురించి, డిజిటల్ ఎక్సలెన్స్ కేంద్రంగా మ్యూనిచ్ స్థానం గురించి చర్చించారు.
డాక్టర్ హోల్‌ఫెల్డర్, Google భద్రతా ఇంజినీరింగ్ కేంద్రం, లేదా క్లుప్తంగా GSEC, మ్యూనిచ్‌లో 2019లో తెరవబడింది. ఆ కేంద్రంలో ఏం జరుగుతోంది?
GSEC Google గ్లోబల్ గోప్యత, అలాగే సెక్యూరిటీ ఇంజనీరింగ్ హబ్. ఇక్కడే మేం కొత్త ప్రొడక్ట్‌లను అభివృద్ధి చేస్తాం, యూజర్ అవసరాలను గుర్తిస్తాం, మా జ్ఞానాన్ని పంచుకుంటాం, అలాగే ఇంటర్నెట్ సెక్యూరిటీని మెరుగుపరచడానికి మా పార్ట్‌నర్‌లతో కలిసి పని చేస్తాము.
జర్మనీలో డేటా గోప్యతకు, సెక్యూరిటీకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ Google భద్రతా ఇంజినీరింగ్ కేంద్రాన్ని స్థాపించడంలో లోకల్ సంప్రదాయానికి ఎంత ప్రాముఖ్యత ఉంది?
చాలా ముఖ్యమైనది. యూరప్ ఖండానికి మధ్యలో మేం మా డేటా గోప్యత, సెక్యూరిటీ కోసం డెవలప్‌మెంట్ టీమ్‌లను కావాలనే ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్ గోప్యత, సెక్యూరిటీ గురించి యూరోపియన్ ఆలోచనలను ప్రతిబింబించే గొప్ప సంప్రదాయం జర్మనీకి ఉంది, కాబట్టి మేము మ్యూనిచ్‌లో Google ఇంజనీరింగ్ ఆఫీసును ప్రారంభించినప్పుడు మేము ఏర్పాటు చేసిన మొదటి టీమ్‌ల్లో వారు కూడా ఉన్నారు. మ్యూనిచ్‌లో ఈ టీమ్‌లను అభివృద్ధి చేసిన పది సంవత్సరాల తర్వాత, మేము పరిధిని విస్తృతం చేయాలని, బహిరంగ చర్చలు నిర్వహించాలని, విభిన్న బ్యాక్‌గ్రౌండ్‌ల యూజర్‌లతో, అలాగే బాధ్యతాయుతమైన సహోద్యోగులతో నిమగ్నం అవ్వాలని కోరుకున్నాం. అందుకే ఇలాంటి సమస్యలపై దృష్టి సారించేందుకు మ్యూనిచ్‌లో GSECని ఏర్పాటు చేయడం అనేది ప్రయోజనకరమైంది. యూరోపియన్ జనరల్ డేటా రక్షణ నియంత్రణ చట్టం (GDPR) ప్రకారం మా ప్రొడక్ట్‌ల ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని మేము నిర్ధారించుకున్నాము. ఈ విజ్ఞానం, అవగాహన ఇతర దేశాలకు విస్తరిస్తోంది. నిజానికి, డేటా గోప్యత, సెక్యూరిటీ అనేవి ప్రపంచవ్యాప్తంగా మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
GSEC అనేది 40కి పైగా వివిధ దేశాల ఉద్యోగులతో కలిసి పని చేయడానికి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ప్రదేశం.
అంతర్జాతీయ ప్రొడక్ట్‌లతో పని చేయాలంటే మనం విభిన్న దృక్పథాలను కలిగి ఉండాలని అర్థం. మా సిబ్బంది యూజర్‌లకు వీలైనంత ఎక్కువగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అయినప్పటికీ, ఈ సమయంలో మేం కోరుకున్న స్థాయికి దగ్గరగా కూడా చేరుకోలేకపోయాము, జెండర్‌తో సంబంధం లేకుండా వైవిధ్యంతో కూడిన టీమ్ అభివృద్ధిని మేం దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్నాం, ఉదా. కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉన్న మహిళలకు స్కాలర్‌షిప్‌లను అందించడం ద్వారా లేదా మహిళా విద్యార్థులకు సపోర్ట్ ఇవ్వడానికి మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా స్థానిక విశ్వవిద్యాలయంతో కలిసి పని చేయడం ద్వారా మేము మా లక్ష్యాన్ని చేరుకోగలం.
GSECలో సాధారణ రోజు ఎలా ఉంటుంది?
ప్రతిరోజూ Google ఖాతా, Google Chrome బ్రౌజర్ వంటి Google ప్రొడక్ట్‌లపై పని చేసే 200 మంది గోప్యతా ఇంజనీర్‌లు మాకు ఉన్నారు. మేం సెక్యూరిటీ ట్రైనింగ్, భేదాత్మక గోప్యత కోడ్‌ల్యాబ్‌ల వంటి ఈవెంట్‌లతో సహా ఆసక్తి ఉన్నవారి కోసం వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తాం. ల్యాండ్‌స్కేప్ వేగంగా మారుతున్నందున, ఇంటర్నెట్ సెక్యూరిటీ టాపిక్ గురించి మరింత సమాచారం అందుబాటులో ఉండాలని మేం కోరుకోవడం వల్ల ఇది నాకు చాలా ముఖ్యమైన విషయం.
ఇంటర్నెట్ యూజర్‌లు ప్రతిరోజూ ఎదుర్కొనే అవకాశమున్న సమస్యలకు సంబంధించి మీరు ఏమి చేస్తారు?
మీరు Google ప్రొడక్ట్‌లను ఉపయోగిస్తుంటే, మెరుగైన సెర్చ్ ఫలితాలను అందించడం కోసం వ్యక్తిగతీకరణ కోసం ఉపయోగించే డేటా రకాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు, ఉదాహరణకు. వివిధ ప్రొడక్ట్‌లు అంతటా Google మీకు ఉత్తమంగా పనిచేసేలా చేసేందుకు మీ సమాచారం, గోప్యత, అలాగే సెక్యూరిటీని మేనేజ్ చేయడానికి Google ఖాతా మీకు సహాయపడుతుంది. యాక్టివిటీ కంట్రోల్స్, అలాగే యాడ్ సెట్టింగ్‌ల వంటి కంట్రోల్స్ మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఏ డేటాను ఉపయోగించాలో నిర్ణయించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి, కాబట్టి Google మొత్తం మీ కోసం మెరుగ్గా పని చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం మేం గోప్యతా చెకప్‌ను డెవలప్ చేశాం, ఇది మీ Google ఖాతాలోని మీ గోప్యతా ప్రాధాన్యతలను త్వరగా సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. Chrome, Androidల కోసం, మేం Password Managerను అభివృద్ధి చేశాం. ఇది మీరు ఉపయోగించే ప్రతి వెబ్‌సైట్ కోసం, యాప్ కోసం ఆన్-డిమాండ్‌పై పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసి, స్టోర్ చేస్తుంది. సెక్యూరిటీ సమస్యల కోసం యూజర్‌లు తమ పాస్‌వర్డ్‌లను విశ్లేషించడానికి పాస్‌వర్డ్ చెకప్‌ను కూడా ఉపయోగించవచ్చు. మనకు తెలిసిన డేటా ఉల్లంఘనలో వారి పాస్‌వర్డ్ హ్యాక్‌కు గురైందో లేదో వారు తెలుసుకోగలుగుతారు. అప్పుడు వారికి తమ పాస్‌వర్డ్‌లను ఎలా మార్చుకోవాలో సూచనలు అందించబడతాయి. ఈ పాస్‌వర్డ్ రక్షణ టూల్స్‌కు సంబంధించి GSEC చేసిన కృషికి నేను ప్రత్యేకంగా గర్విస్తున్నాను.
ఎందుకో వివరించగలరా?
Password Managerను ఫిషింగ్ వెబ్‌సైట్‌ల ద్వారా మోసగించలేరు, మీరు ప్రతి వెబ్‌సైట్ కోసం ఒక కొత్త, శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయవచ్చు, మీరు వీటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది హ్యాకర్‌లు మీ పాస్‌వర్డ్‌లను ఊహించకుండా చేస్తుంది – అలాగే పలు సైట్‌లలో మీరు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించకుండా కూడా ఇది మిమ్మల్ని నిరోధిస్తుంది.
అది ఎందుకు సమస్య అవుతుంది?
నేను ఒక వెబ్‌సైట్‌లో నా సతీమణి కోసం పూలు ఆర్డర్ చేశానని అనుకుందాం, ఆ సైట్‌లో నా కస్టమర్ ఖాతా కోసం తొందరపాటుగా నేను వేరే చోట కూడా ఉపయోగించే పాస్‌వర్డ్‌ను నమోదు చేశాననుకోండి. హ్యాకర్‌లు పూల దుకాణం సర్వర్‌ను యాక్సెస్ చేసి, ఈ పాస్‌వర్డ్‌ను తెలుసుకోగలిగితే, అదే పాస్‌వర్డ్‌ను ఉపయోగించి నా ఈమెయిల్ ఖాతాను లేదా నా Google ఖాతాను కూడా యాక్సెస్ చేయవచ్చో లేదో వారు త్వరగా గుర్తించగలరు. అంతేకాదు, నేను ఉపయోగించే ఇతర ఖాతాల కోసం వారు కొత్త పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయగలరు. Password Manager ప్రతి సైట్ కోసం శక్తివంతమైన, నిర్దిష్ట పాస్‌వర్డ్‌లను జనరేట్ చేయడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండేలా చూస్తుంది.
“అంతర్జాతీయ ప్రోడక్ట్‌లతో పని చేయడం అంటే మనం విభిన్న దృక్పథాలను కలిగి ఉండాలి.”
వైలాండ్ హోల్ఫెల్డర్, Google, సైట్ లీడ్‌లో ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్
ఉపయోగించడానికి వీలైన మరిన్ని సురక్షితమైన మార్గాలు ఉన్నాయా?
అవును, మీకు Google ఖాతా ఉన్నట్లయితే, మీరు రెండు-దశల ప్రామాణీకరణను కూడా ఉపయోగించవచ్చు. అంటే కొత్త పరికరంలో మీ ఖాతాకు మీరు సైన్ ఇన్ చేసే ప్రతిసారి, మేం మీకు ఫోన్ ద్వారా పంపే కోడ్‌ను మీరు ఉపయోగించాల్సి ఉంటుందని అర్థం. కాబట్టి విదేశంలో ఉన్న ఎవరైనా మీ పాస్‌వర్డ్ హ్యాక్ చేసినప్పటికీ, వారు మీ ఖాతాను యాక్సెస్ చేయాలంటే ఆ రెండవ దశ ప్రామాణీకరణ అవసరం. ఉదాహరణకు, వ్యక్తిగతంగా చూస్తే, నా ఖాతాలో ఆన్‌లైన్‌లో చాలా విలువైన సమాచారం ఉండి, ఎటువంటి అదనపు రక్షణ లేకుండా నాకు నిద్ర పట్టనటువంటి సందర్భాలు.
మీరు GSECలో ఈ రకమైన కొత్త ప్రొడక్ట్‌లను సరిగ్గా ఎలా డెవలప్ చేస్తారు?
ఉదాహరణకు, మా "యూజర్ అనుభవ పరిశోధనా ల్యాబ్"కు రావాలని లేదా ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని మేం వ్యక్తులను ఆహ్వానిస్తాం, తద్వారా వారు ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు లేదా వస్తువుల కోసం ఎలా సెర్చ్ చేస్తున్నారు అనే దాని గురించి మేం తెలుసుకోగలం. వారి గోప్యతా ప్రాధాన్యతలకు సంబంధించి సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి వారికి సాధారణంగా ఏ టూల్స్, ఇంకా ఎటువంటి సహాయం అవసరమో అర్థం చేసుకోవడంలో ఇది మాకు సహాయపడుతుంది. మేం వ్యక్తులను “మీరు వేర్వేరు ఫ్యామిలీ మెంబర్‌లతో Chrome బ్రౌజర్‌ను ఎలా ఉపయోగిస్తారో మాకు చెప్పగలరా?” వంటి ప్రశ్నలను అడుగుతాం, అలాగే వారిని మా ప్రొడక్ట్‌లతో ఇంటరాక్ట్ అవ్వమని కూడా అడుగుతాం, తద్వారా వాటికి వారు ఎలా ప్రతిస్పందిస్తారో మేం అంచనా వేయగలుగుతాం. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే మా సమాచారం సరైన ప్రదేశంలో ఉంచబడిందా లేదా ఇంటర్‌ఫేస్, బటన్‌లు సహాయకరంగా ఉన్నాయా లేదా అనే విషయాలను అర్థం చేసుకోవడంలో ఇవి మాకు సహాయపడతాయి. ఇది మా ప్రొడక్ట్‌లను మా యూజర్ అవసరాలకు సరిపోయేలా చూసుకోవడానికి మమ్మల్ని అనుమతిస్తుంది. వెబ్‌లో సురక్షితంగా ఉండేందుకు మీరు సెక్యూరిటీ నిపుణులుగా ఉండాల్సిన అవసరం లేదని మేం విశ్వసిస్తున్నాం.
అదనంగా, మీరు ప్రస్తుతం థర్డ్ పార్టీ కుక్కీలను నిరర్థకం చేయడానికి కృషి చేస్తున్నారు. కుక్కీలు అంటే ఏమిటి?
ఇంటర్నెట్ వచ్చినప్పటి నుండి కుక్కీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి వెబ్‌సైట్ ప్రొవైడర్‌లు కంప్యూటర్‌లో సమాచారాన్ని లోకల్‌గా స్టోర్ చేయడానికి ఉపయోగించే చిన్న ఫైళ్లు. కుక్కీలు ఇంటర్నెట్‌లో ఇప్పటికీ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఉదాహరణకు, మిమ్మల్ని ఆన్‌లైన్ ఖాతాకు లాగిన్ చేయడానికి లేదా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో షాపింగ్ కార్ట్‌లను ఆపరేట్ చేయడానికి ఫస్ట్ పార్టీ కుక్కీలు ఉపయోగిస్తారు. సందర్భోచితమైన అడ్వర్టయిజింగ్‌ను ప్రదర్శించడానికి అనుమతించే థర్డ్-పార్టీ కుక్కీలు కూడా ఉన్నాయి. మీరు ఆన్‌లైన్‌లో నిర్దిష్ట ప్రొడక్ట్ కోసం వెతికితే దాన్ని థర్డ్ పార్టీ కుక్కీలు కూడా రికార్డ్ చేయగలవు. ఈ విధంగా, మీరు ఒక సైట్‌లో బ్యాక్‌ప్యాక్ కోసం సెర్చ్ చేస్తుంటే కుక్కీ ఆ హిస్టరీని రిజిస్టర్ చేసి, ఆపై మరొక సైట్ నుండి బ్యాక్‌ప్యాక్‌కు సంబంధించిన యాడ్‌ను మీకు చూపిస్తుంది.
ఎందుకిలా?
ఇంటర్నెట్ పబ్లిక్ ప్లాట్‌ఫారం, ఇంకా చెప్పాలంటే ఉచిత ప్లాట్‌ఫామ్. వెబ్‌సైట్‌కు వచ్చే రాబడులు ప్రధానంగా అడ్వర్టయిజింగ్ ద్వారా చెల్లిస్తారు, అడ్వర్టయిజింగ్ ఎంత సందర్భోచితంగా ఉంటే అది యూజర్‌లకు, అలాగే ప్రొవైడర్‌లకు అంత ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది.
థర్డ్-పార్టీ కుక్కీలు యూజర్‌ల కదలికలను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడానికి అనుమతిస్తాయి. మీరు ప్రస్తుతం భవిష్యత్తులో ఈ ట్రాకింగ్‌ను ఆపడానికి సంబంధించిన మార్గాలపై పని చేస్తున్నారు. అవునా?
అవును, మేము ప్రస్తుతం “గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్"ను డెవలప్ చేస్తున్నాం, తద్వారా భవిష్యత్తులో అడ్వర్టయిజర్‌లు నా కుక్కీల ద్వారా నన్ను గుర్తించలేరు. థర్డ్-పార్టీ కుక్కీలు, యూజర్ అంచనాలకు తగ్గట్లుగా ఉండటం లేదని వెబ్ కమ్యూనిటీ అంతటా ఒక విస్తృతమైన అభిప్రాయం ఉంది. తమ డేటా ఎలా ఉపయోగించడుతుంది అనే దానిపై పారదర్శకత, ఎంపిక, కంట్రోల్‌తో సహా - మరింత గోప్యత ఉండాలని యూజర్‌లు డిమాండ్ చేస్తున్నారు - ఈ డిమాండ్లకు అనుగుణంగా వెబ్ ఎకో-సిస్టమ్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది. క్రాస్-సైట్ ట్రాకింగ్‌ను ముగించడానికి, వెబ్ అనేది థర్డ్-పార్టీ కుక్కీలకు, బ్రౌజర్ ఫింగర్‌ప్రింటింగ్ వంటి ఇతర రహస్య పద్ధతులకు దూరంగా ఉండాలి. అయితే గత 30-సంవత్సరాలకు పైగా, చాలా వరకు ఇంటర్నెట్‌లో ముఖ్యమైన సామర్థ్యాలు ఈ టెక్నిక్‌ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. పబ్లిషర్‌లు తమ బిజినెస్‌లను అభివృద్ధి చేసుకోవడం, ఇంటర్నెట్ ఎకోసిస్టమ్‌ను ఆరోగ్యంగా ఉంచడం, కంటెంట్‌కు గ్లోబల్ యాక్సెస్ ఉండేలా నిర్ధారించడం, వ్యక్తులకు వారి వ్యక్తిగత పరికరాలలో అత్యుత్తమ అనుభవాన్ని అందించడం, అలాగే బాట్‌లు, మోసగాళ్లు, ఇంకా అలాంటి వారి నుండి, నిజమైన యూజర్‌లను వేరు చేయడం అనే లక్ష్యాల కోసం, మేము ఇంటర్నెట్ కీలకమైన సామర్థ్యాలను కోల్పోకూడదు అని భావిస్తున్నాము. గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్ ఓపెన్ సోర్స్‌ను ప్రారంభించడం ద్వారా, పబ్లిషర్‌లకు సపోర్ట్ ఇస్తూనే వెబ్‌ను మరింత ప్రైవేట్‌గా, సురక్షితంగా ఉంచాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాము.
Google అనేది సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తోంది?
గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్‌లో భాగంగా, యూజర్ సమాచారాన్ని గోప్యతగా ఉంచడానికి, అలాగే ఫింగర్‌ప్రింటింగ్ వంటి అనుచిత ట్రాకింగ్ సాంకేతికతను నివారించేందుకు, సైట్‌కు ఉపయోగకరమైన యాడ్స్‌ను అందించడానికి, వారి బిజినెస్‌కు నిధులు సమకూర్చడానికి మేము వెబ్ కమ్యూనిటీతో కలిసి పని చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రారంభంలో, మేము ఒక కొత్త గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్ అయిన Topics APIని ప్రివ్యూ చేశాము. ఈ కొత్త సెట్, ఫీడ్‌బ్యాక్ రెగ్యులేటర్‌లు, గోప్యతను కోరుకుంటున్న వారు, డెవలపర్‌ల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఆసక్తి-ఆధారిత అడ్వర్టయిజింగ్‌తో FloCని రీప్లేస్ చేస్తుంది. ఇది యూజర్‌లకు అత్యంత గోప్యతను సంరక్షించే మార్గంలో, వారు సందర్శించే వెబ్‌సైట్‌ల నుండి వ్యక్తులకు వారికి ఆసక్తి ఉన్న (ఉదా., “క్రీడలు” వంటివి) సందర్భోచితమైన యాడ్స్‌ను చూపడానికి అడ్వర్టయిజర్‌లను అనుమతిస్తుంది. యూజర్లను గుర్తించడానికి ఇంతకుముందు కుక్కీలు ఉపయోగించబడేవి. అయితే Topics ఉద్దేశం ఏంటంటే మీ వ్యక్తిగత బ్రౌజింగ్ హిస్టరీ మీ బ్రౌజర్‌ను దాటి వెళ్లదు. అలాగే అది అడ్వర్టయిజర్‌లతో సహా ఎవరితోనూ పంచుకోరు. అంటే అడ్వర్టయిజర్‌లు సందర్భోచిత యాడ్స్‌ను ప్రదర్శించడాన్ని కొనసాగించవచ్చు, అలాగే వెబ్ అంతటా ఉన్న కంటెంట్‌ను ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు.
మేము FLEDGE, measurement APIలతో సహా గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్ కోసం ఇతర ప్రతిపాదనలపై కూడా గొప్ప పురోగతిని సాధిస్తున్నాము, అలాగే ఎకో-సిస్టమ్ అంతటా పని చేసేలా మా ప్రతిపాదనలు అభివృద్ధి చేయబడ్డాయని నిర్ధారించుకోవడానికి UK యొక్క కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA)తో కలిసి పని చేయడాన్ని కొనసాగిస్తున్నాము.
ఇటీవలి సంవత్సరాలలో, డిజిటల్ స్టార్ట్-అప్‌లు, ఇతర టెక్ కంపెనీలకు మ్యూనిచ్ ప్రముఖ గమ్యస్థానంగా మారింది. మ్యూనిచ్‌లో సైట్ లీడ్‌గా మీ అనుభవం ఎలా ఉంది?
మ్యూనిచ్‌లో చాలా పెద్ద మార్పులు జరుగుతున్నాయి. డేటా ఎనలిటిక్స్ సర్వీసులను అందించే యూనికార్న్ కంపెనీ అయిన Celonis వంటి ఇతర అద్భుతమైన కంపెనీలతో సహా Apple, Amazon, Google అన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టి తమ యాక్టివిటీలను విస్తరిస్తున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పెద్ద సంఖ్యలో B2B కంపెనీలు ఏర్పాటయ్యాయి, ఎక్కువ సంఖ్యలో టెక్నాలజీకి సంబంధించి సమర్థవంతమైన ఇతర బిజినెస్‌లు ఉండటమే ఇందుకు కారణం. అలాగే, లోకల్‌గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్లను నిర్వహిస్తున్న LMU, TUM వంటి అద్భుతమైన విశ్వవిద్యాలయాలను కూడా మేము కలిగి ఉన్నాము. అంతే కాకుండా, బవేరియన్ రాష్ట్ర ప్రభుత్వం దాని “ఉన్నత సాంకేతికమైన ఎజెండా” యాక్షన్ ప్లాన్ ద్వారా పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. ఉదాహరణకు, మేం కృతిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్‌లో భారీ పెట్టుబడులను చూస్తున్నాము – ఇది చాలా గొప్ప విషయం. సుదీర్ఘ ప్రాంతీయ సంప్రదాయంతో పాటు, ఇంజినీరింగ్, సాంకేతికతలో నైపుణ్యం, బలమైన ఆర్థిక స్థితి, ఉత్తమమైన రాజకీయ సపోర్ట్, అద్భుతమైన విద్యా సంస్థలు, మంచి ఉన్నత జీవన ప్రమాణాలు అన్నీ కలిసి మ్యూనిచ్‌ను మంచి ప్రదేశంగా మార్చాయి.
మ్యూనిచ్‌లో కొత్త Google ఆఫీసులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి మీ ప్లాన్‌లను మార్చివేసిందా?
ఈ మహమ్మారికి ముందు, మేము ఎక్కువ సమయం ఆఫీసులోనే గడిపే వాళ్ళం, అక్కడ ఉద్యోగులు స్వయంగా కలుసుకోవడానికి, అలాగే కలిసి పని చేసుకోవడానికి చాలా కేఫ్‌లు, మీటింగ్ రూమ్‌లు, రెస్టారెంట్‌లు ఉండేవి. మహమ్మారి వలన మనం పని చేసే విధానంలో చాలా తీవ్రమైన మార్పులు వచ్చాయి, అలాగే మేము ఇప్పుడు మునుపటి సంవత్సరాల నుండి నేర్చుకున్న పలు విషయాలను కొత్త, ఉత్తేజకరమైన Arnulfpost ప్రాజెక్ట్ కోసం ఉపయోగించడానికి సిద్ధమవుతున్నాము.
రిమోట్ వర్కింగ్‌తో ఆఫీసు వాతావరణాన్ని క్రియేట్ చేయవచ్చా?
మా కంపెనీ క్లౌడ్‌తో ప్రారంభమైంది, అలాగే క్లౌడ్ సర్వీసుల సహాయంతో అభివృద్ధి చెందింది, మేమంతా క్లౌడ్ సర్వీసులను ఉపయోగిస్తాము. అందుకే మేము, ఆన్‌లైన్‌లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్స్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి అని లేదా వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రారంభించండి అని సిబ్బందిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాము. అయినప్పటికీ, మేము సంవత్సరాలుగా అభివృద్ధి చేసుకున్న అమూల్యమైన సామాజిక సంబంధాలను ఎప్పటికీ విస్మరించలేమని మేము నమ్ముతున్నాము. మేము చాలా మంది ఉద్యోగులను నియమించుకున్నాము, వాళ్లు ఇప్పటివరకు మా ఆఫీసులకు కూడా రాలేదు. ప్రతి ఉద్యోగిని తమతో పాటు అభివృద్ధి చేయడం అనేది మేనేజర్లందరికీ ఒక సవాలు లాంటిది.
భవిష్యత్తులో ముఖ్యంగా మ్యూనిచ్‌లోని GSEC పని తీరుపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది?
కొత్త వినూత్న ఆలోచనలతో ముందుకు రావడానికి అవసరమైన ఆహ్లాదకరమైన పని వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఉద్యోగులంతా కలిసి పని చేయడం చాలా ముఖ్యం అని మేము గట్టిగా నమ్ముతున్నాము, కాబట్టి మేము 100 శాతం వర్చువల్ విధానంలో పని చేయము. అయితే పని చేయడానికి ప్రతి ఒక్కరికీ ఒక స్థిరమైన ప్రదేశం ఎంత వరకు అవసరం అనే విషయం గురించి మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నాము. మా సేల్స్ టీమ్‌లు ఇప్పటికే ఇంటి నుంచి, అలాగే ఆఫీసు నుంచి కూడా వీలును బట్టి పని చేయడం ప్రారంభించాయి. మా ఇంజినీర్‌ల డెవలప్‌మెంట్ టూల్స్‌లో చాలా వరకు క్లౌడ్‌కు మారుతున్నాయి. భవిష్యత్తులో, ప్రతి టీమ్ దానికి సంబంధించిన వర్క్‌స్టేషన్‌లలో ఎన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి, ఎన్ని ఫిక్స్‌డ్‌గా ఉండాలి అన్నది తనకు తానుగా నిర్ణయించుకోగలుగుతుంది. ఈ రోజు మేము త్వరిత డెస్క్ కేటాయింపు టూల్స్‌ను, అనువైన కొత్త ప్రదేశాల ఎంపికను అందించడం ద్వారా పని చేయడానికి అవసరమైన కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాము, ఇవి ఒక్కొక్కరి వర్కింగ్ లొకేషన్ ప్రాధాన్యతలు, ఇంకా సమయాల ఆధారంగా వేగంగా మారుతున్న సెటప్‌తో కలిసి పని చేయడానికి టీమ్‌లను అనుమతిస్తాయి.
ఫోటోలు: సీమ దేహగై
సైబర్ సెక్యూరిటీ పురోగతులు
ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్‌లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.
మరింత తెలుసుకోండి