ఇల్లు ప్రైవేట్‌గా ఉంటేనే ఉపయోగకరంగా ఉన్నట్టు.

మీ ఇల్లు అనేది ఒక ప్రత్యేకమైన స్థలం. మీరు ఇంటికి తీసుకువచ్చే వస్తువులపై మీకు నమ్మకం ఉండాలి. ఇంట్లోని వ్యక్తులు ఆ ఇంటి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సంరక్షించుకోగల ఇంటిని క్రియేట్ చేయడంలో సహాయపడటానికి రూపొందించిన పరికరాలు, అలాగే సర్వీస్‌లతో ఆ నమ్మకాన్ని సంపాదించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

గోప్యత, సెక్యూరిటీల పట్ల మాకున్న నిబద్దత

Google చేపట్టే చర్యలన్నింటికీ మార్గనిర్దేశం చేసే ప్రధానమైన గోప్యత, సెక్యూరిటీ నియమాలకు మేము కట్టుబడి ఉంటాము. మీ గోప్యతను మేము ఎలా గౌరవిస్తాము, అలాగే కనెక్ట్ చేసిన మీ ఇంటి పరికరాలు, సర్వీస్‌లను మేము ఎలా సురక్షితంగా ఉంచుతామో ఈ గైడ్ వివరిస్తుంది.

ఈ నిబద్ధతలు ఏ పరికరాలు, సర్వీస్‌లకు వర్తిస్తాయి?

ఇంటి గోప్యతకు సంబంధించిన మా నిబద్ధత అనేది – ఈ గైడ్‌లో వివరించబడినట్లుగా – Google ఖాతాలను ఉపయోగించి, Google Nest, Google Home, Nest, Google Wifi, లేదా Chromecast బ్రాండ్‌ను కలిగి ఉన్న మా కనెక్ట్ చేయబడిన ఇంటి పరికరాలు, సర్వీస్‌లకు వర్తిస్తుంది. అంటే అందుబాటులో ఉన్న చోట ఇది Nest ఖాతాల నుండి Google ఖాతాలకు మారే వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. అదనంగా, Google గోప్యతా పాలసీ అనేది ఎగువున పేర్కొన్న పరికరాలు, సర్వీస్‌లకు కూడా వర్తిస్తుంది; ఉదాహరణకు, మేము సర్వీస్ ప్రొవైడర్‌లను ఎలా ఉపయోగిస్తాము, వ్యక్తిగతం కానిదిగా గుర్తించిన సమాచారాన్ని మేము ఎలా షేర్ చేయవచ్చు, అలాగే చట్టపరమైన కారణాల వల్ల మీ సమాచారాన్ని ఎలా, ఎప్పుడు స్టోర్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు అనే అంశాలను ఇది వివరిస్తుంది – వీటిలో ఏదీ దిగువున పేర్కొన్న కట్టుబాట్ల ద్వారా ప్రభావితం కాదు. అలాగే, అందుబాటులో ఉన్న చోట మీరు కనెక్ట్ చేసిన ఇంటి పరికరాలతో YouTube, Google Maps, అలాగే Google Duo వంటి అనేక ఇతర Google సర్వీస్‌లను ఉపయోగించవచ్చని గమనించండి. ఈ ఇతర Google సర్వీస్‌లను మీరు ఉపయోగించినప్పుడు, ఆ సర్వీస్‌లు ఏ డేటాను సేకరిస్తాయి, ఆ డేటా ఎలా ఉపయోగించబడుతుంది అనేది ఆయా సర్వీస్‌లకు చెందిన ప్రత్యేక నియమాలు, Google గోప్యతా పాలసీ ద్వారా నిర్ణయించబడతాయి.

మీకోసం ఈ కట్టుబాట్లకు మేము ఎందుకు లోబడి ఉంటాము?

ఈ పరికరాలు, సర్వీస్‌లు మీరు, మీ ఫ్యామిలీ, అలాగే మీ గెస్ట్‌లు ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము, ఎందుకంటే వాటి ఉద్దేశ్యం సహాయ పడటం, అలాగే ప్రశాంతతను అందించడం కనుక. మేము మీ ఇంటి గెస్ట్ అని కూడా మేము గుర్తించాము, అలాగే మేము ఆ ఆహ్వానాన్ని గౌరవించి, అభినందిస్తున్నాము. ఇంట్లో వాడే టెక్నాలజీ అనేది మారుతూ ఉంటుంది, అలాగే అభివృద్ధి చెందుతోంది, కాబట్టి మేము మా పనిని వినయంగా, పలు కోణాలలో ఆలోచించడానికి, అలాగే మరింత నేర్చుకొని అనుకూలంగా పని చేయడానికి ఆత్రుతతో ముందుకు సాగుతాము.

నిబద్ధత

సాంకేతిక నిర్దేశాల పారదర్శకత

మా కనెక్ట్ చేయబడిన ఇంటి పరికరాల్లో కెమెరాలు, మైక్రోఫోన్‌లు లేదా మీ ఇంటి వాతావరణం గురించి సమాచారాన్ని గుర్తించే పర్యావరణ లేదా యాక్టివిటీ సెన్సార్‌లు ఉన్నప్పుడు, మేము ఈ హార్డ్‌వేర్ ఫీచర్‌లను ఎనేబుల్ చేసి ఉన్న లేదా లేకపోయినా పరికరం సాంకేతిక ఫీచర్‌లతో లిస్ట్ చేస్తాము.

నిబద్ధత

పబ్లిష్ చేసిన సెన్సార్‌ల గైడ్

ఈ సెన్సార్‌లు ఏ ఏ రకాల సమాచారాన్ని Googleకు పంపుతాయి అనేది మేము మరింత స్పష్టంగా వివరిస్తాము, అదే విధంగా వాటి ప్రయోజనాన్ని మెరుగ్గా అర్ధం చేసుకోవడంలో సహాయపడటానికి ఆ సమాచారాన్ని సెన్సార్‌ల గైడ్‌లో ఎలా ఉపయోగిస్తాము అనే దాని కోసం ఉదాహరణలను కూడా అందిస్తాము.

రివ్యూ అయిన అన్ని సెట్టింగ్‌లను చూపుతున్న Google ఖాతా మొబైల్ మెనూ.

నిబద్ధత

బాధ్యతాయుతమైన అడ్వర్టయిజింగ్ పద్ధతులు

కనెక్ట్ చేయబడిన అన్ని ఇంటి పరికరాలు, అలాగే సర్వీస్‌ల విషయంలో, మీ వీడియో ఫుటేజ్, ఆడియో రికార్డింగ్‌లు, ఇంకా ఇంటి పరిసరాల సెన్సార్ రీడింగ్‌లను మేము యాడ్‌ల నుండి వేరుగా ఉంచుతాము, అంతే కాక ఈ డేటాను యాడ్ వ్యక్తిగతీకరణ కోసం ఉపయోగించము. మీ Assistantతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు, యాడ్ వ్యక్తిగతీకరణ కోసం మీ ఆసక్తులను తెలుసుకునేందుకు మేము ఆ ఇంటరాక్షన్‌లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు "Ok Google, జూలైలో హవాయిలో వాతావరణం ఎలా ఉంది?" అని అడిగితే. మీకు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూపడానికి మేము ఆ వాయిస్ ఇంటరాక్షన్‌కు సంబంధించిన టెక్స్ట్‌ను ఉపయోగించవచ్చు (కానీ ఆడియో రికార్డింగ్‌ను కాదు). యాడ్ వ్యక్తిగతీకరణను పూర్తిగా నిలిపివేయడంతో పాటు మీకు కనిపించే యాడ్‌లను కంట్రోల్ చేయడానికి మీరు ఎప్పుడైనా మీ Google సెట్టింగ్‌లను రివ్యూ చేయవచ్చు. Google Assistant గురించి, అలాగే మీకు అందుబాటులో ఉన్న ఎంపికల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

నిబద్ధత

స్వతంత్ర సెక్యూరిటీ ప్రామాణీకరణ

2019లో లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన Google Nestకు కనెక్ట్ చేసిన ఇంటి పరికరాలు థర్డ్-పార్టీ స్టాండర్డ్‌లను, అలాగే పరిశ్రమ వ్యాప్తంగా గుర్తించబడిన సెక్యూరిటీ స్టాండర్డ్‌లను ఉపయోగించి ప్రామాణీకరించబడతాయి, అంతే కాక ఆ ప్రామాణీకరణ ఫలితాలను కూడా మేము పబ్లిష్ చేస్తాము.

నిబద్ధత

సెక్యూరిటీ రీసెర్చ్ మీద పెట్టుబడి పెట్టడం

Google Nest Google వల్నెరబిలిటీ రివార్డ్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటుంది.

దీని ప్రాముఖ్యత ఏమిటి
ఈ విధానాన్ని ఈ రంగంలోని పరిశ్రమలన్నీ అనుసరిస్తాయి. దీని ద్వారా, బాహ్య సెక్యూరిటీ రీసెర్చర్లు Nest సెక్యూరిటీ సిస్టమ్‌లోని లోపాలను మా సెక్యూరిటీ బృందానికి బహిర్గతం చేస్తే, అందుకు ప్రతిఫలంగా నగదు రూపంలో రివార్డ్‌లు, అలాగే ప్రజలలో గుర్తింపును పొందవచ్చు. మా ప్రోడక్ట్‌లను పరిశీలించడానికి మాకు బాధ్యతాయుతమైన సెక్యూరిటీ పరిశోధకుల అవసరం ఉంటుంది, అంతే కాక బహిర్గతమైన లోపాలను పరిష్కరించిన తర్వాత మాత్రమే మేము మానిటరీ రివార్డ్‌లను పేమెంట్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ ద్వారా వెలుగులోకి వచ్చిన లోపాలను Nest సెక్యూరిటీ బృందం తెలుసుకొని, అవి దుర్వినియోగానికి గురి కాక ముందే వాటిని పరిష్కరిస్తుంది.

ఇది Nest పరికరాలను మరింత సురక్షితంగా ఎలా చేస్తుంది?

Google వెలుపల ఎవరైనా మా పరికరాల్లో ఒకదానిలో సెక్యూరిటీ బలహీనతలను కనుగొంటే, మేము దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మానిటరీ అవార్డ్‌కు అర్హత పొందటానికి, ఎవరికైనా బహిర్గతం చేసే ముందు Google దాని బలహీనతలను ప్యాచ్ చేసేంత వరకు పరిశోధకుడు వేచి ఉండాలి. ఈ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెక్యూరిటీ పరిశోధకులకు మా పరికరాలను మరింత సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ప్రోత్సాహాకాన్ని క్రియేట్ చేస్తుంది.

సెక్యూరిటీ బలహీనతలను కనుగొనేందుకు Google వేరే ఏదైనా మార్గాన్ని అనుసరిస్తుందా?

ప్రతి పరికరంలోని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ముందు వాటిని విశ్లేషించేందుకు ప్రత్యేకమైన సెక్యూరిటీ బృందాలను మేము ఏర్పరిచాము, వాటి ద్వారా మా పరికరాలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మా వంతు కృషి చేస్తాము. ప్రారంభంలో వెరిఫికేషన్ చేసిన తర్వాత, పరికరాలను ప్రవేశపెట్టిన అనంతరం కూడా మేము రిస్క్‌లు, సెక్యూరిటీ ప్రమాదాలను విశ్లేషించడం కొనసాగించి, US Google స్టోర్‌లో పరికరం మొట్టమొదటగా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి కనీసం 5 సంవత్సరాల పాటు ముఖ్యమైన సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఆటోమేటిక్‌గా అందిస్తాము.

అనుమానాస్పద యాక్టివిటీ అంటే ఏమిటి?

Google మీరు చేయడంలేదు అని అనిపించే యాక్టివిటీ కోసం చూస్తుంది. ఉదాహరణకు, గుర్తు తెలియని పరికరం నుండి మీ ఖాతాకు సైన్ ఇన్ చేసే ప్రయత్నం జరగడం లాంటిది.

2-దశల వెరిఫికేషన్ నా ఖాతాను ఎలా రక్షిస్తుంది?

2-దశల వెరిఫికేషన్ అనేది మీ పాస్‌వర్డ్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఎవరైనా మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది. 2-దశల వెరిఫికేషన్ ఎనేబుల్ చేసి ఉన్నప్పుడు, మీ ఖాతాకు సైన్ ఇన్ చేసే ఎవరైనా సైన్ ఇన్ చేయడానికి ముందు రెండవ దశ లేదా “కారకాన్ని” పూర్తి చేయాలి. మీరు టెక్స్ట్ మెసేజ్, Google Authenticator యాప్ నుండి కోడ్ లేదా ఇన్‌స్టాల్ చేసిన Google యాప్ నుండి నోటిఫికేషన్‌తో సహా పలు రకాలైన రెండవ కారకాల నుండి ఎంచుకోవచ్చు.

నాకు Nest ఖాతా ఉంది, అలాగే Nest యాప్‌నకు సైన్ ఇన్ చేయడానికి దాన్ని ఉపయోగిస్తాను. నేను Google ఖాతాకు ఎందుకు మారాలి?

Google ఖాతాకు మారడం ద్వారా మీకు ఇక్కడ పేర్కొన్న కొత్త ప్రయోజనాలు అందుతాయి:

  • అనుమానిత యాక్టివిటీ గుర్తింపు వంటి ఆటోమేటిక్ సెక్యూరిటీ సంరక్షణ, 2-దశల వెరిఫికేషన్, అలాగే సెక్యూరిటీ చెకప్.
  • మీ Google Nest పరికరాలు, అలాగే సర్వీస్‌లు కలిసి పనిచేస్తాయి. ఉదాహరణకు, మీరు Nest Cam, అలాగే Chromecastను కలిగి ఉంటే, మీ కెమెరా స్ట్రీమ్‌ను ఎటువంటి సెటప్ చేయకుండానే మీ టీవీకి ప్రసారం చేయడానికి “Ok Google, వెనుక వైపు కెమెరాను చూపించు” అని చెప్పండి.
  • Nest, అలాగే Google Home యాప్‌లలో సైన్ ఇన్ చేయడానికి ఒకే ఖాతాను ఉపయోగించవచ్చు.
  • మీ వర్చువల్ ఇళ్లు, ఆ ఇళ్ల మెంబర్‌లు Nest, అలాగే Google Home యాప్‌లన్నింటితో సులువుగా కనెక్ట్ కావచ్చు.


ఇదివరకే Nest ఖాతా కలిగిన వారెవరైనా Google ఖాతాకు మారవచ్చు. మీ ఖాతాను తరలించడానికి, Nest యాప్‌లో, ఖాతా సెట్టింగ్‌లకు వెళ్లండి, ఆపై Google ఖాతాకు తరలించండిని ఎంచుకోండి.

నిబద్ధత

ఆటోమేటిక్ సెక్యూరిటీ అప్‌డేట్‌లు

మేము, ముఖ్యమైన సెక్యూరిటీ అప్‌డేట్లను Google Nest పరికరాలకు కనీసం 5 సంవత్సరాల పాటు, US Google స్టోర్‌లో మొట్టమొదటగా పరికరం అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి ఆటోమేటిక్‌గా అందిస్తాము.

దీని ప్రాముఖ్యత ఏమిటి
యూజర్‌లను రక్షించడానికి మేము మల్టీ లేయర్ రక్షణలను ఉపయోగిస్తాము, అయినప్పటికీ, సాంకేతిక మార్పులు, అలాగే కొత్త ప్రమాదాలు తలెత్తుతాయి. కనుక Google Nestకు తెలిసిన ముఖ్యమైన సమస్యలను పరిష్కరించే ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము పరికరాల లిస్ట్‌ను, అలాగే వాటి కోసం అప్‌డేట్‌లను అందించడానికి మేము ఎంతకాలం కట్టుబడి ఉన్నాము అనేది పబ్లిష్ చేస్తాము.

నా పరికరానికి అప్‌డేట్‌లు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం ఎలా?

ముఖ్యమైన సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించే విషయంలో మేము కట్టుబడి ఉన్న కనిష్ఠ తేదీల పరిధిని తెలియజేసే Google పరికరాల లిస్ట్‌ను మేము పబ్లిష్ చేస్తాము.

సెక్యూరిటీ అప్‌డేట్‌ల పరిధిలోకి రాని అంశాలు ఏవి?

పరికరాలను ఉద్దేశించిన విధంగా ఉపయోగించనప్పుడు లేదా వాటిలోని సెక్యూరిటీ ఫీచర్‌లను మార్చినప్పుడు ఏర్పడే బలహీనతలను సెక్యూరిటీ అప్‌డేట్‌లు పరిష్కరించవు. ఉదాహరణకు:

  • పరికరాలను ఇతరులెవరికైనా ఇచ్చే ముందు సరిగ్గా ఫ్యాక్టరీ రీసెట్ చేయనివి
  • 2-దశల వెరిఫికేషన్‌ను ఉపయోగించని పరికరాలు
  • మీ నెట్‌వర్క్, అలాగే Google Nest పరికరాలకు యాక్సెస్ కలిగి ఉండి, Google ద్వారా అంచనా వేయబడని ఇతర తయారీదారులు చేసిన పరికరాలు

నిబద్ధత

వెరిఫై చేసిన సాఫ్ట్‌వేర్

Google Nest పరికరాలు, అవి రన్ చేయాల్సిన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నట్టు వెరిఫై చేసుకోవడానికి, ఆ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ముందే మేము వెరిఫై చేస్తాము. 2019లో, లేదా ఆ తర్వాత రిలీజ్ అయిన మా పరికరాలన్నీ వెరిఫై చేయబడిన బూట్‌ను ఉపయోగిస్తాయి.

దీని ప్రాముఖ్యత ఏమిటి
Google Nest పరికరాల్లో హానికరమైన సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయకుండా నిరోధించడానికి మేము చర్యలు తీసుకుంటాము. మీ అనుమతి లేకుండా మీ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేయకుండా, లేదా మీ పరికరాలను ఇతరులు కంట్రోల్ చేయకుండా నిర్ధారించుకోవడానికి ఇది సహాయపడుతుంది.

ఏదైనా పరికరంలో హానికరమైన సాఫ్ట్‌వేర్ రన్ అవ్వకుండా మీరు ఎలా నిరోధిస్తారు?

మొదట, మేము సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ముందే దాన్ని Google వెరిఫై చేసిందని నిర్ధారించుకోవడానికి క్రిప్టోగ్రాఫికల్‌గా వెరిఫై చేస్తాము. తర్వాత, 2019 తర్వాత రిలీజ్ చేసిన మా హార్డ్‌వేర్ పరికరం రీస్టార్ట్ అయిన ప్రతిసారీ సరైన సాఫ్ట్‌వేర్‌ను రన్ చేస్తుందో లేదో చెక్ చేయడానికి వెరిఫై చేయబడిన బూట్‌ను ఉపయోగిస్తుంది.

నిబద్ధత

పరికర పారదర్శకత

మీ Google Home యాప్‌లో కనిపించే Google Nest పరికరాలను మీ Google ఖాతా పరికర యాక్టివిటీ పేజీలో చూడవచ్చు.

దీని ప్రాముఖ్యత ఏమిటి
మీరు సైన్ ఇన్ చేసిన పరికరాలన్నీ మీ Google ఖాతా పరికర యాక్టివిటీ పేజీలో కనిపిస్తాయి. ఆ విధంగా, మీ ఖాతా ఏ పరికరాలకు అయితే కనెక్ట్ అవ్వాలో వాటికి మాత్రమే కనెక్ట్ అయ్యి ఉన్నాయని మీరు నిర్ధారించుకోవచ్చు.

ఏదైనా ఒక పరికరం నా Google ఖాతాకు ఎలా కనెక్ట్ అవుతుంది?

ఫోన్, కంప్యూటర్, యాప్ లేదా కనెక్ట్ చేసిన ఏదైనా ఇంటి పరికరంలోకి సైన్ ఇన్ చేయడానికి మీరు ఎప్పుడైనా మీ Google ఖాతాను ఉపయోగిస్తే, అవి కనెక్ట్ చేయబడతాయి. మీకు సొంతం కాని లేదా మీరు కంట్రోల్ చేయని పరికరాల నుండి మీరు సైన్ అవుట్ చేశారని నిర్ధారించుకోండి, మీ Google ఖాతాను చెక్ చేసి మీరు గుర్తించని పరికరాలు ఏవైనా ఉన్నాయేమో చూడండి.

నా ఖాతాలో నేను గుర్తించలేని పరికరం నాకు కనిపిస్తే ఏమవుతుంది?

కెమెరాలు

కెమెరాలు ఇంట్లోని జ్ఞాపకాలను క్యాప్చర్ చేయడం, ప్రియమైనవారితో కనెక్ట్ చేయడం, అలాగే మీరు సురక్షితంగా ఉండటానికి సహాయపడటం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయి. Nest Cam వంటి పరికరాలు మీ ఇంటిపై నిఘా ఉంచడానికి, అలాగే మీరు లేనప్పుడు కూడా జరిగిన విషయాలను గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి వీడియోను ఉపయోగిస్తాయి.

కెమెరాలతో కనెక్ట్ చేసిన మా అన్ని ఇంటి పరికరాల విషయంలో, మేము మీకు వీటికి కట్టుబడి ఉంటాము:

మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా కెమెరాను స్పష్టంగా ఆన్ చేసినప్పుడు, లేదా అవసరమైన ఫీచర్‌ను (Nest Cam పర్యవేక్షణ వంటివి) ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే మీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను Googleకు పంపుతుంది. మీరు ఎప్పుడైనా కెమెరాను ఆఫ్ చేయవచ్చు.

మీ కెమెరా ఆన్ అయ్యి, Googleకు వీడియో ఫుటేజ్‌ను పంపుతున్నప్పుడు, మేము స్పష్టమైన విజువల్ ఇండికేటర్‌ను (మీ పరికరంలో ఆకుపచ్చ రంగు లైట్ వంటివి) అందిస్తాము.

వీడియో ఫుటేజ్ మీ Google ఖాతాలో స్టోర్ చేయబడినప్పుడు (ఉదాహరణకు, Nest Aware సబ్‌స్క్రిప్షన్‌ను పొందటం ద్వారా), మీరు ఎప్పుడైనా ఈ ఫుటేజీని యాక్సెస్ చేయవచ్చు, రివ్యూ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు.

మీరు లేదా మీ ఇంటి మెంబర్ మాకు స్పష్టంగా అనుమతిని ఇస్తే మాత్రమే, మీ వీడియో ఫుటేజ్‌ను మా పరికరాలతో పనిచేసే థర్డ్-పార్టీ యాప్‌లు, అలాగే సర్వీస్‌లతో షేర్ చేస్తాము.

Face Match (ఇది మీ పరికరం మిమ్మల్ని గుర్తించడంలో సహాయపడుతుంది), అలాగే క్విక్ సంజ్ఞలు (ఇవి మీ పరికరాన్ని కంట్రోల్ చేయడంలో మీకు సహాయపడతాయి) లాంటి కెమెరాకు కనబడే ఫీచర్ల ఆధారంగా మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, అలాగే కంట్రోల్ చేయడంలో మీకు సహాయపడటానికి, అందుబాటులో ఉన్న చోట, Nest Hub Max పరికరంలోని కెమెరా సెన్సింగ్ ఫీచర్లను అందిస్తుంది. ఒకసారి ఎనేబుల్ చేసిన తర్వాత, ఈ పరికరంలోని కెమెరా సెన్సింగ్ ఫీచర్లు మీ Nest Hub Max నుండి వీడియోను లేదా ఇమేజ్‌లను Googleకు పంపించవు.

స్టోర్ చేసిన నా వీడియో ఫుటేజ్‌ను నేను రివ్యూ చేసి, ఎలా తొలగించగలను?

స్టోర్ చేసిన వీడియో ఫుటేజీని (Nest Cam రికార్డింగ్‌ల విషయంలో) Nest యాప్ ద్వారా లేదా (Google Assistant‌తో జరిపిన ఇంటరాక్షన్‌ల విషయంలో) నా యాక్టివిటీ ద్వారా రివ్యూ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు.

Nest Hub Maxకు సంబంధించిన కెమెరా సెన్సింగ్ ఫీచర్‌లు ఎప్పుడైనా నా ఇంటి నుండి వీడియో లేదా ఇమేజ్‌లను Googleకు పంపుతాయా?

అవును, కానీ Face Match సెటప్ ప్రాసెస్‌లో భాగంగా మాత్రమే పంపుతాయి, అలాగే మీరు సెటప్ పూర్తి చేసిన తర్వాత పంపవు. మీరు మీ Nest Hub Maxలో Face Match‌ను సెటప్ చేసినప్పుడు, మీరు మీ ఫోన్‌ను అనేక ఫోటోలను క్యాప్చర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆ ఫోటోలు అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన ఫేస్ నమూనాను క్రియేట్ చేస్తాయి. ఈ ఫోటోలు Googleకు పంపబడతాయి, అలాగే మీరు నా యాక్టివిటీని సందర్శించడం ద్వారా వాటిని ఎప్పుడైనా రివ్యూ చేయవచ్చు లేదా తొలగించవచ్చు. ఈ సెటప్ ప్రాసెస్ తర్వాత, Face Match అనేది Googleకు ఏ వీడియోనూ లేదా ఇమేజ్‌లనూ పంపదు. త్వరిత సంజ్ఞల ఫీచర్‌కు వీడియో లేదా ఇమేజ్‌లను Googleకు పంపించాల్సిన అవసరం ఏదీ లేదు. అదనంగా, ఈ ఫీచర్‌లను శక్తివంతం చేసే వీడియో, ఇమేజ్‌లను మేము అడ్వర్టయిజింగ్ నుండి వేరుగా ఉంచుతాము, అలాగే వాటిని యాడ్ వ్యక్తిగతీకరణ కోసం ఉపయోగించము.

నా వీడియో ఫుటేజ్ థర్డ్-పార్టీ యాప్‌లు, అలాగే సర్వీస్‌లతో ఎప్పుడు షేర్ చేయబడుతుంది అనే దానికి ఉదాహరణ ఏమిటి?

దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, మీ ఇంటి సెక్యూరిటీ సర్వీస్‌తో Nest Cam నుండి వీడియో క్లిప్‌లను షేర్ చేసుకొనే ఆప్షన్‌ను మేము ఆఫర్ చేయవచ్చు, తద్వారా అవి మీ ఇంటిని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే, మీరు మీ పరికర కెమెరాను ఇతర Google సర్వీస్‌లతో ఉపయోగించవచ్చని గుర్తుంచుకోండి (YouTube‌లోకి వీడియోను అప్‌లోడ్ చేయడం లేదా Google Duoతో వీడియో కాల్ చేయడం వంటివి, అందుబాటులో ఉన్న చోట), – మీరు ఇలా చేసినప్పుడు, Google గోప్యతా పాలసీ వర్తిస్తుంది.

విజువల్ ఇండికేటర్ లేకుండా Googleకు వీడియో ఫుటేజ్ పంపిన సందర్భాలు ఉన్నాయా?

ఆఫ్‌లైన్‌లో ఉండగా వీడియో ఫుటేజ్‌ను రికార్డ్ చేయడాన్ని మా కెమెరాలలోని కొన్ని మోడల్స్ సపోర్ట్ చేస్తాయి. ఈ కెమెరాలలో వీడియో ఫుటేజ్ రికార్డ్ అవడం పూర్తయిన తర్వాత కెమెరా ఆన్‌లైన్‌లోకి వెళ్లినప్పుడు ఆ వీడియో ఫుటేజ్ అప్‌లోడ్ అవుతుంది. అంటే మీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను మా సర్వర్‌లకు పంపుతున్నప్పుడు మీకు విజువల్ ఇండికేటర్ కనిపించకపోవచ్చు - అయితే ఆ సందర్భాలలో, ఆ వీడియో ఫుటేజీని వాస్తవానికి కెమెరా రికార్డ్ చేస్తున్నప్పుడు విజువల్ ఇండికేటర్ కనిపిస్తుంది.

మైక్రోఫోన్‌లు

మైక్రోఫోన్‌లు ఇల్లు అంతటా మీ పరికరాలను కేవలం మీ వాయిస్‌ను మాత్రమే ఉపయోగించి కంట్రోల్ చేయడానికి మిమ్మల్ని అనుమతించడం, మీరు లేనప్పుడు మీ ఇంట్లో ఊహించని యాక్టివిటీని గుర్తించడం, అలాగే స్మార్ట్ స్పీకర్ లేదా డిస్‌ప్లేను ఉపయోగించి వాయిస్ కాల్ చేయడం వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి.

మైక్రోఫోన్‌లతో కనెక్ట్ చేసిన మా ఇంటి పరికరాలన్నింటి విషయంలో, మేము మీకు వీటికి కట్టుబడి ఉంటాము:

మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా మీ Assistantతో (ఉదాహరణకు, "Ok Google" అని చెప్పడం ద్వారా) ఇంటరాక్ట్ అవుతున్నారని మేము గుర్తించినట్లయితే, లేదా దానికి అవసరమైన ఫీచర్‌ను మీరు ఉపయోగిస్తే (ఉదాహరణకు, అందుబాటులో ఉన్న చోట, Nest Camలో సౌండ్ అలర్ట్‌లు, లేదా ఆడియో ఎనేబుల్ చేసిన Nest Cam వీడియో రికార్డింగ్) మాత్రమే మీ పరికరం ఆడియోను Googleకు పంపుతుంది. మీరు ఎప్పుడైనా మైక్రోఫోన్‌ను ఆఫ్ చేయవచ్చు.

మీ మైక్రోఫోన్ ఆన్ అయ్యి, ఆడియోను Googleకు పంపుతున్నప్పుడు, మేము స్పష్టమైన విజువల్ ఇండికేటర్‌ను (మీ పరికరం పైన మెరుస్తున్న చుక్కలు లేదా స్క్రీన్‌లోని సూచీ వంటివి) అందిస్తాము.

మీ Google ఖాతాతో ఆడియో రికార్డింగ్‌లు స్టోర్ చేయబడినప్పుడు (ఉదాహరణకు, అందుబాటులో ఉన్న చోట, మీరు Nest Awareకు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నప్పుడు మీ Nest Cam ఫుటేజ్ నుండి వచ్చిన ఆడియో), మీరు ఎప్పుడైనా మీ రికార్డింగ్‌లను యాక్సెస్ చేయవచ్చు, రివ్యూ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు.

మీరు లేదా మీ ఇంటి మెంబర్ మాకు స్పష్టంగా అనుమతిని ఇస్తే మాత్రమే, మా పరికరాలతో పనిచేసే థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌లతో మీ పరికరాల నుండి ఆడియో రికార్డింగ్‌లను షేర్ చేస్తాము.

స్టోర్ చేసిన నా ఆడియో రికార్డింగ్‌లను నేను రివ్యూ చేసి, ఎలా తొలగించగలను?

స్టోర్ చేసిన ఆడియో రికార్డింగ్‌లను మీరు Nest యాప్ ద్వారా (Nest Cam రికార్డింగ్‌ల విషయంలో) లేదా నా యాక్టివిటీ (Google Assistant‌తో జరిపిన ఇంటరాక్షన్‌ల విషయంలో) ద్వారా రివ్యూ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు. మీరు Google Assistant యాక్టివిటీని వాయిస్ కమాండ్‌లతో కూడా తొలగించవచ్చు.

నా Assistant వాయిస్ క్వెరీల ఆధారంగా యాడ్‌లను వ్యక్తిగతీకరించడం జరుగుతుందా?

మీ ఆడియో రికార్డింగ్‌లను అడ్వర్టయిజింగ్ నుండి వేరుగా ఉంచుతాము, వాటిని యాడ్‌ల వ్యక్తిగతీకరణ కోసం ఉపయోగించము – కానీ మీ వాయిస్ ద్వారా Assistantతో ఇంటరాక్ట్ చేసినప్పుడు, మీ ఆసక్తులను తెలుసుకుని యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి మేము ఆ ఇంటరాక్షన్‌ల టెక్స్ట్‌ను ఉపయోగించవచ్చు. యాడ్ వ్యక్తిగతీకరణను పూర్తిగా నిలిపివేయడంతో పాటు మీకు కనిపించే యాడ్‌లను కంట్రోల్ చేయడానికి ఎప్పుడైనా మీ Google సెట్టింగ్‌లను మీరు రివ్యూ చేయవచ్చు. Google Assistant గురించి, అలాగే మీకు అందుబాటులో ఉన్న ఎంపికల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

నా ఆడియో రికార్డింగ్‌లు థర్డ్-పార్టీ యాప్‌లు, అలాగే సర్వీస్‌లతో ఎప్పుడు షేర్ చేయబడవచ్చు అనే దానికి ఉదాహరణ ఏమిటి?

దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, మీ ఇంటి సెక్యూరిటీ సర్వీస్‌తో Nest Cam నుండి ఆడియో క్లిప్‌లను షేర్ చేసుకొనే ఆప్షన్‌ను మేము ఆఫర్ చేయవచ్చు, తద్వారా అవి మీ ఇంటిని సురక్షితంగా ఉంచుకోవడంలో సహాయపడతాయి.

విజువల్ ఇండికేటర్ లేకుండా Googleకు ఆడియో రికార్డింగ్‌లు పంపిన సందర్భాలు ఉన్నాయా?

కొన్నిసార్లు, మీ Google Assistant రిక్వెస్ట్‌ను స్థానికంగా, పరికరంలో నెరవేర్చడం కోసం, విజువల్ ఇండికేటర్ ఆపివేయబడి, మీ రిక్వెస్ట్ నెరవేరిన తర్వాత మాత్రమే మీ ఆడియో రికార్డింగ్ Google సర్వర్‌లకు ప్రసారం చేయబడుతుంది. ఇటువంటి సందర్భాలలో, మైక్రోఫోన్ ఆడియో డేటా Google సర్వర్‌లకు ప్రసారం చేయబడినప్పుడు కాకుండా యాక్టివ్‌గా ఉన్నప్పుడు విజువల్ ఇండికేటర్ కనిపించేలా ఉంటుంది.

వర్చువల్ హోమ్ సెన్సార్‌లు

మీ ఇంటి పరిసరాలు, అలాగే ఇంట్లో ఏమి జరుగుతుంది అనే దాని గురించి, ఉదాహరణకు కదలికలు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అనే సమాచారంతో పాటు పరిసర కాంతి, ఉష్ణోగ్రత, తేమ వంటి సమాచారాన్ని గుర్తించే సెన్సార్‌లు మా పరికరాలలో కొన్నిటికి ఉన్నాయి. ఈ సెన్సార్‌లు మీ ఇంటిని మీకోసం మరింత సౌకర్యవంతంగా మార్చడంలో సహాయపడతాయి – ఉదాహరణకు మీరు ఇంట్లో లేనప్పుడు మీ Nest Learning Thermostat, అందుబాటులో ఉన్న చోట, ఆటోమేటిక్‌గా ఆఫ్ చేయబడుతుంది, – అలాగే మీ పరికరాలు, సర్వీస్‌లను మెరుగుపరచడంలో మాకు సహాయపడటం వంటి వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడతాయి.

పర్యావరణ సెన్సార్లు, అలాగే యాక్టివిటీ సెన్సార్‌లతో కనెక్ట్ అయ్యే ఇంటి పరికరాలన్నింటి విషయంలో, మేము వీటికి కట్టుబడి ఉంటాము:

మీ ఇంటి పరిసరాల నుండి సేకరించిన సెన్సార్ రీడింగ్‌లను మా పరికరాలు, సర్వీస్‌లలో ఎలా ఉపయోగిస్తాము అనేది మీకు అర్థం అయ్యేలా మేము సహాయం చేస్తాము. అందుకోసమే మా పరికరాలలో సెన్సార్‌లకు సంబంధించిన గైడ్‌ను పబ్లిష్ చేశాము.

మీరు లేదా మీ కుటుంబ సభ్యులెవరైనా మాకు స్పష్టంగా అనుమతిని ఇస్తే మాత్రమే, మీ పరికర సెన్సార్ డేటాను మా పరికరాలతో పనిచేసే థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌లతో షేర్ చేస్తాము.

Google, నా ఇంటి నుండి పర్యావరణం, యాక్టివిటీ సెన్సార్ డేటాను ఎందుకు సేకరిస్తుంది, అది ఎలా ఉపయోగించబడుతుంది?

మీ ఇంటి పరిసరాలు, కదలికలు, ఇంటిలో ఏమి జరుగుతోంది, ఎవరైనా ఉన్నారా లేదా అనే సమాచారంతో పాటు, పరిసర కాంతి, ఉష్ణోగ్రత, తేమ వంటి వాటి విషయాల గురించిన సమాచారాన్ని గుర్తించేందుకు మా పరికరాలలో పర్యావరణ, యాక్టివిటీ సెన్సార్‌లు ఉన్నాయి. ఈ సెన్సార్‌ల నుండి డేటా, క్రమం తప్పకుండా Googleకు పంపబడుతుంది, మీ ఇల్లు మిమ్మల్ని బాగా చూసుకోవడంలో సహాయపడటం, మీ పరికరాలను, అలాగే సర్వీస్‌లను మెరుగుపరచడంలో మాకు సహాయపడటం, అలాగే మీకు సమాచారాన్ని అందించడం వంటి వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు:

  • అందుబాటులో ఉన్న చోట, మీ Nest Learning Thermostat‌లోని ఉష్ణోగ్రత, అలాగే తేమకు సంబంధించిన సెన్సార్‌లు విద్యుత్తును ఆదా చేసేటప్పుడు మీ ఇంటిని సౌకర్యవంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
  • 'ఇంట్లో ఉన్నారు', 'ఎవరూ లేరు' మోడ్‌ల మధ్య మారడం అనేది మీరు బయటికి వెళ్లినప్పుడు, అలాగే మీరు తిరిగి వచ్చినప్పుడు మీ ఇంట్లో Nest పరికరాల ప్రవర్తనను ఆటోమేటిక్‌గా మార్చడానికి మీ ఇంట్లోని పలు Nest పరికరాలలో యాక్టివిటీ సెన్సార్‌లను ఉపయోగిస్తుంది.
  • థర్మోస్టాట్‌లు నేరుగా పడే సూర్యకాంతి వలన వాస్తవంగా కంటే ఎక్కువ వెచ్చదనాన్ని వెదజల్లుతున్నాయా అన్నది నిర్ధారించడానికి మేము మా కస్టమర్‌ల దగ్గర ఉన్న థర్మోస్టాట్‌ల నుండి సేకరించిన పరిసర కాంతిని, అలాగే ఉష్ణోగ్రత సెన్సార్ డేటాను ఉపయోగిస్తాము. ఈ నేపథ్యంలో మీ థర్మోస్టాట్ దీనికి సర్దుబాటు అయ్యేలా చేయడంలో సహాయపడటానికి, మేము ఒక కొత్త ఫీచర్ సన్‌బ్లాక్‌ను ప్రవేశపెట్టాము, తద్వారా ఇది సరైన ఉష్ణోగ్రతను సెట్ చేస్తుంది
  • మా పరికరాలు, సర్వీస్‌ల పనితీరును, భద్రతను, విశ్వసనీయతను మెరుగుపరచడంలోనూ, అలాగే సమస్యల పరిష్కారంలోనూ మాకు సహాయపడేందుకు మేము సెన్సార్ డేటాను ఉపయోగిస్తాము – ఉదాహరణకు, బ్యాటరీ జీవితకాలంపై పర్యావరణ పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడానికి మా పరికరాల నుండి ఉష్ణోగ్రతకు, తేమకు సంబంధించిన డేటాను ఉపయోగిస్తాము.
  • విద్యుత్తు, అలాగే ఇంటి భద్రతా ప్రోగ్రామ్‌ల వంటి మీకు ఆసక్తి కలిగించవచ్చని మేము భావిస్తున్న కనెక్ట్ చేయబడిన ఇంటి సర్వీస్‌లతో సహా Google సర్వీస్‌ల అప్‌డేట్‌ల గురించి, అందుబాటులో ఉన్న చోట, మీకు తెలియజేస్తూ ఉండటానికి కూడా మేము సెన్సార్ డేటాను ఉపయోగించవచ్చు – అదే సమయంలో మీరు Google నుండి ప్రమోషనల్ ఈమెయిళ్లను అందుకోవాలనుకుంటున్నారా లేదా అనే దానిపై మీ ఎంపికను మేము ఎల్లప్పుడూ గౌరవిస్తాము.
  • యాడ్ వ్యక్తిగతీకరణ కోసం మేము పర్యావరణ, అలాగే యాక్టివిటీ సెన్సార్ డేటాను ఉపయోగించము. ఉదాహరణకు, అందుబాటులో ఉన్న చోట, యాడ్ వ్యక్తిగతీకరణ కోసం, మేము మీ Nest Hub (2వ జనరేషన్) నుండి నిద్రకు సంబంధించిన డేటాను ఉపయోగించము. (కనెక్ట్ చేయబడిన మీ ఇంటి పరికరాలకు సంబంధించిన కొన్ని రిక్వెస్ట్‌లను నెరవేర్చాలని గుర్తుంచుకోండి — ఉదాహరణకు, “Ok Google, లోపల ఉష్ణోగ్రత ఎంత?” అని చెప్పినప్పుడు — మీ Assistant సెన్సార్ రీడింగ్‌ను తిరిగి పొందుతుంది. Google Assistant గురించి, అలాగే మీకు అందుబాటులో ఉన్న ఎంపికల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.)
  • మీరు మీ ఖాతాను తొలగించినప్పుడు, మా నిల్వ కొనసాగింపు పాలసీలో వివరించిన విధంగా ఈ సెన్సార్ డేటా మా సర్వర్‌ల నుండి తొలగించబడుతుంది.

నా సెన్సార్ డేటా థర్డ్-పార్టీ యాప్‌లకు, అలాగే సర్వీస్‌లతో ఎప్పుడు షేర్ చేయబడవచ్చు అనే దానికి ఉదాహరణ ఏమిటి?

దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, అందుబాటులో ఉన్న చోట, పవర్ అధిక వినియోగానికి సంబంధించిన రివార్డ్‌లు మొదలైన, విద్యుత్తును ఆదా చేసే ప్రోగ్రామ్‌లు, సర్వీస్‌ల నుండి లబ్ధి పొందడానికి యుటిలిటీ కంపెనీలతో మీరు డేటాను షేర్ చేసుకోవడానికి ఎంచుకోవచ్చు.

Wi-Fi డేటా

Google Wifi పరికరాలు అనేవి, అందుబాటులో ఉన్న చోట, మీ మోడెమ్, అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌తో కలిసి మొత్తం-ఇంటికి Wi-Fi మెష్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేయడానికి పని చేసే రూటర్ సిస్టమ్‌లు. మీకు Wi-Fi కవరేజీని అందించడానికి, మీరు పొందే అనుభూతిని మరింత మెరుగుపరచడంలో సహాయపడటానికి ఈ పరికరాలు మీ నెట్‌వర్క్ పనితీరు గురించి డేటాను ఉపయోగిస్తాయి (ఉదాహరణకు, నెట్‌వర్క్ వేగం, అలాగే బ్యాండ్‌విడ్త్ వినియోగం). ఏ పరికరాలు కనెక్ట్ చేయబడ్డాయి, అలాగే అవి ఎంత బ్యాండ్‌విడ్త్‌ను ఉపయోగిస్తాయో చూడటానికి కూడా ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.

Google Wifi పరికరాల విషయంలో, మేము మీకు వీటికి కట్టుబడి ఉంటాము:

Google Wifi మీరు సందర్శించే వెబ్‌సైట్‌లను ట్రాక్ చేయదు, అలాగే మీ Wi-Fi నెట్‌వర్క్‌లోని ట్రాఫిక్ కంటెంట్‌ను పర్యవేక్షించదు.

మేము మీ Wi-Fi నెట్‌వర్క్ పనితీరు డేటాను యాడ్‌ల నుండి వేరుగా ఉంచుతాము, అలాగే యాడ్ వ్యక్తిగతీకరణ కోసం దీన్ని ఉపయోగించము.

మీరు లేదా మీ Wi-Fi నెట్‌వర్క్ మేనేజర్ మాకు అనుమతిని ఇస్తే మాత్రమే, మీ Google Wi-Fi పరికరాల నుండి థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌లు, కనెక్ట్ చేసిన మా ఇంటి పరికరాలతో పనిచేసే సర్వీస్‌లతో మీ Wi-Fi నెట్‌వర్క్ పనితీరు డేటాను షేర్ చేస్తాము.

నా Google Wifi రూటర్ నుండి డేటా Googleకి ఎందుకు పంపబడుతుంది, అలాగే ఇది ఎలా ఉపయోగించబడుతుంది?

మీ వద్ద కనెక్ట్ చేయబడిన పరికరాల రకాలు, అలాగే వాటి నెట్‌వర్క్ వినియోగం గురించి సమాచారంతో సహా Google Wifi ఇక్కడ వివరించిన విధంగా డేటాను సేకరించి, ఉపయోగిస్తుంది. ఇక్కడ వివరించిన క్లౌడ్ సర్వీస్‌లు, Wi-Fi పాయింట్ గణాంకాలు, అలాగే యాప్ గణాంకాల డేటా (వీటిని మేము "Wi-Fi నెట్‌వర్క్ పనితీరు డేటా" అని పేర్కొంటాము) అనేవి యాడ్ వ్యక్తిగతీకరణ కోసం ఉపయోగించబడవు. మీ ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి అదనపు Wifi పాయింట్ వంటి — మీకు సహాయపడగలవని మేము భావిస్తున్న సర్వీస్‌లతో పాటు Google సర్వీస్‌లు అలాగే కనెక్ట్ చేయబడిన ఇంట్లోని పరికరాల, అప్‌డేట్‌ల గురించి మీకు తెలియజేయడానికి మేము ఈ డేటాను ఉపయోగించవచ్చు. మీరు ఇక్కడ వివరించిన విధంగా ఈ డేటా సేకరణకు సంబంధించిన కొన్ని భాగాలను నిలిపివేయవచ్చు.

Google Wifi మీరు సందర్శించే వెబ్‌సైట్‌లను ట్రాక్ చేయదు, అలాగే మీ Wi-Fi నెట్‌వర్క్‌లోని ట్రాఫిక్ కంటెంట్‌ను పర్యవేక్షించదు. Google Wi-Fi మీ డిఫాల్ట్ సెట్టింగ్ DNS ప్రొవైడర్‌ను "ఆటోమేటిక్"కు సెట్ చేస్తుంది, నిర్దిష్ట షరతులకు అనుకూలంగా ఉంటే ఇది Google పబ్లిక్ DNS లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) DNSను ఉపయోగిస్తుంది. Google పబ్లిక్ DNS సేకరించే వాటి గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు. మీరు Google Home యాప్‌నకు సంబంధించిన అధునాతన నెట్‌వర్కింగ్ సెట్టింగ్‌లలో మీ DNS ప్రొవైడర్‌ను ఎప్పుడైనా మార్చవచ్చు.

నా Wi-Fi నెట్‌వర్క్ పనితీరు డేటా థర్డ్-పార్టీ యాప్‌లు, అలాగే సర్వీస్‌లతో ఎప్పుడు షేర్ చేయబడవచ్చు అనే దానికి ఉదాహరణ ఏమిటి?

దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, మీరు మీ Wi-Fi నెట్‌వర్క్ పనితీరు డేటాను మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌తో షేర్ చేసుకోగలుగుతారు, తద్వారా వారు మీ Wi-Fi లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడతారు.

నెస్ట్
Google స్టోర్‌లో
Nest కోసం షాపింగ్ చేయండి.
మేము రూపొందించే ప్రతీ ప్రోడక్ట్‌లో
భద్రతను ఎలా పొందుపరుస్తామో తెలుసుకోండి.