ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడంలో
సహాయపడటానికి
టూల్స్, చిట్కాలు.

అత్యాధునిక సెక్యూరిటీతో మేము మీ గోప్యతను ఆటోమేటిక్‌గా సంరక్షిస్తాము. మీ ఆన్‌లైన్ సెక్యూరిటీని మేనేజ్ చేయడానికి, అలాగే మీ కోసం సరైన స్థాయి రక్షణను ఎంచుకోవడానికి మీరు తీసుకోవలసిన కొన్ని అదనపు దశలు ఉన్నాయి.

మీ Google ఖాతా
సెక్యూరిటీని బలోపేతం చేయండి.

సెక్యూరిటీ చెకప్

సెక్యూరిటీ చెకప్ నిర్వహించండి

మీ Google ఖాతాను రక్షించడానికి ఒక సులభమైన మార్గం సెక్యూరిటీ చెకప్ చేయడం. ఈ దశల వారీ టూల్ మీ Google ఖాతాకు చెందిన సెక్యూరిటీని బలోపేతం చేయడానికి వ్యక్తిగతీకరించిన, చర్య తీసుకోగల సిఫార్సులను అందిస్తుంది.

2-దశల వెరిఫికేషన్

2-దశల వెరిఫికేషన్‌తో హ్యాకర్‌ల దాడి నుండి రక్షించుకోండి

2-దశల వెరిఫికేషన్ మీ ఖాతాలో లాగిన్ చేయడానికి, మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ మాత్రమే కాకుండా, మీరు రెండవ అంశాన్ని ఉపయోగించాల్సిన వీలు కల్పించడం ద్వారా మీ ఖాతాకు యాక్సెస్ లేని ఎవ్వరినైనా అడ్డుకోవడంలో సహాయపడుతుంది. టార్గెట్ చేసిన ఆన్‌లైన్ దాడులకు గురయ్యే అవకాశం ఉన్నవారికి, మరింత శక్తివంతమైన భద్రత అవసరమయ్యే వారి కోసం, మేము అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ను క్రియేట్ చేశాము.

మీ పాస్‌వర్డ్‌లకు సంబంధించి
చిన్న సహాయం.

శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి

ప్రతి ఖాతాకు శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం అనేది మీ గోప్యతను రక్షించడానికి మీరు తీసుకోగల అత్యంత కీలకమైన దశలలో ఒకటి. మీ Google ఖాతా, సోషల్ మీడియా ప్రొఫైల్‌లు, రిటైల్ వెబ్‌సైట్‌ల వంటి పలు ఖాతాల్లోకి లాగిన్ చేయడానికి ఒకే రకమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తుంటే, అది మీ సెక్యూరిటీకి సంబంధించిన రిస్క్‌ను పెంచుతుంది.

మీ పాస్‌వర్డ్‌లు అన్నింటినీ ట్రాక్ చేస్తూ ఉండండి

మీ Google ఖాతాలో ఉన్నటువంటి పాస్‌వర్డ్ మేనేజర్, మీరు సైట్‌లు, యాప్‌లలో ఉపయోగించే పాస్‌వర్డ్‌లను రక్షించడంలో, అలాగే ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. మీ ఖాతాలకు సురక్షితంగా, సులభంగా సైన్ ఇన్ చేయడం కోసం, మీ పాస్‌వర్డ్‌లన్నింటిని క్రియేట్ చేయడం, గుర్తుంచుకోవడం, అలాగే సురక్షితంగా స్టోర్ చేయడంలో Google పాస్‌వర్డ్ మేనేజర్ మీకు సహాయపడుతుంది.

సెక్యూరిటీకి సంబంధించిన సమస్యలను తెలుసుకునేందుకు, మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయండి

మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు ఎంత శక్తివంతంగా ఉన్నాయో, ఎంత సురక్షితంగా ఉన్నాయో త్వరిత పాస్‌వర్డ్ చెకప్‌తో చెక్ చేయండి. థర్డ్-పార్టీ సైట్‌లు లేదా ఖాతాలకు సంబంధించి మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు ఏవైనా చోరీకి గురయ్యాయేమో తెలుసుకోండి, అవసరమైతే సులభంగా వాటిని మార్చుకోండి.

Google పాస్‌వర్డ్ మేనేజర్ గురించి మరింత తెలుసుకోండి
మీ పరికరాలను సురక్షితంగా ఉంచండి.
వెబ్‌లో సురక్షితంగా బ్రౌజ్ చేయండి.
కనెక్షన్ సురక్షితం అని తెలియజేసే నోటిఫికేషన్ ఫీచర్ ఉన్న ఫోన్
ఆన్‌లైన్ స్కామ్‌లు,
ఫిషింగ్ ప్రయత్నాలను నివారించండి

స్కామ్ చేసే వారు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో తెలుసుకోండి

స్కామ్ చేసే వారు తమ స్కామ్‌లను చట్టబద్ధమైన మెసేజ్‌ల రూపంలో పంపడం ద్వారా సదరు చట్టబద్ధ సంస్థలకు లేదా వ్యక్తులకు ఉన్న పేరు ప్రతిష్ఠలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేయవచ్చు. స్కామ్ చేసే వారు మిమ్మల్ని మోసం చేయడానికి ఇమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, ఆటోమేటిక్ కాల్స్‌తో పాటు, హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగిన వెబ్‌సైట్‌లను కూడా ఉపయోగించవచ్చు.

అనుమానాస్పద URLలు లేదా లింక్‌లు నిజమైనవేనా? కాదా? అన్నది ప్రతిసారి ధృవీకరించుకోండి

ఫిషింగ్ అనేది పాస్‌వర్డ్ లేదా బ్యాంక్ వివరాల వంటి కీలకమైన వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని బహిర్గతం చేసేలా మిమ్మల్ని మోసగించే ఒక ప్రయత్నం. ఇది నకిలీ లాగిన్ పేజీ వంటి అనేక రూపాలలో ఉండవచ్చు. ఫిషింగ్ బారిన పడకుండా ఉండటానికి, అనుమానాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు; వెబ్‌సైట్ లేదా యాప్ చట్టబద్ధమైనదని నిర్ధారించుకోవడానికి - లింక్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచడం ద్వారా లేదా మొబైల్‌లో టెక్స్ట్‌ను ఎక్కువసేపు నొక్కి, ఉంచడం ద్వారా - URLను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి; అలాగే URL అనేది “https”తో ప్రారంభమవుతోందని నిర్ధారించుకోండి.

మరొక వ్యక్తిలా నటించే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి

స్కామ్ చేసే వారు ప్రభుత్వ లేదా లాభాపేక్ష రహిత సంస్థల వంటి చట్టబద్ధమైన సంస్థలుగా నటిస్తారు. అధికారిక రిసోర్స్ అని క్లెయిమ్ చేసే వారి నుండి వచ్చిన మెసేజ్‌లను చదివేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వారు ఎవరైనా మీకు ఇమెయిల్ పంపినప్పుడు, ఆ మెసేజ్ అసాధారణమైనదిగా కనిపిస్తే, వారి ఖాతా హ్యాక్ చేయబడి ఉండవచ్చు. మీకు వచ్చిన ఇమెయిల్ మోసపూరితమైనది కాదు అని నిర్ధారించుకునే వరకు, మెసేజ్‌కు రిప్లయి ఇవ్వవద్దు లేదా ఏవైనా లింక్‌లను క్లిక్ చేయవద్దు. డబ్బు కోసం చేసే అత్యవసర రిక్వెస్ట్‌ల పట్ల, విదేశాలలో చిక్కుకుపోయాం అంటూ వచ్చే దీన గాథల పట్ల లేదా తన ఫోన్ దొంగతనానికి గురయిందని, కాల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని క్లెయిమ్ చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

ఇమెయిల్ స్కామ్‌లు లేదా వ్యక్తిగత సమాచారం కోసం చేసే రిక్వెస్ట్‌ల విషయంలో జాగ్రత్త వహించండి

అపరిచితుల నుండి వచ్చిన మెసేజ్‌లు అనుమానాస్పదంగా ఉండవచ్చు, అలాగే మీకు విశ్వసనీయమైన బ్యాంక్ లాగా నటిస్తూ వేరే వారి దగ్గర నుండి వచ్చే కమ్యూనికేషన్ కూడా ఒక వంచన కావచ్చు. వ్యక్తిగత సమాచారం గురించి అడిగే అనుమానాస్పద ఇమెయిల్‌లు, ఇన్‌స్టంట్ మెసేజ్‌లు లేదా పాప్-అప్ విండోలకు రిప్లయి ఇవ్వవద్దు. అనుమానాస్పద లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు లేదా సందేహాస్పద ఫారమ్‌లలో లేదా సర్వేలలో వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయవద్దు. ఒక లాభాపేక్ష రహిత సంస్థ, మిమ్మల్ని విరాళం అడిగితే, మీకు పంపిన లింక్‌పై క్లిక్ చేయకుండా నేరుగా సదరు సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి విరాళం ఇవ్వండి.

ఫైళ్లను డౌన్‌లోడ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరి చూసుకోండి

కొన్ని అధునాతన ఫిషింగ్ దాడులు, వైరస్ సోకిన డాక్యుమెంట్‌లు, PDF అటాచ్‌మెంట్‌ల ద్వారా జరగవచ్చు. మీకు అనుమానాస్పద అటాచ్‌మెంట్ కనిపిస్తే, దాన్ని తెరవడానికి Chrome లేదా Google Driveను ఉపయోగించండి. మేము ఫైల్‌ను ఆటోమేటిక్‌గా స్కాన్ చేస్తాము, ఒకవేళ మేము వైరస్‌ను గుర్తించినట్లయితే మిమ్మల్ని హెచ్చరిస్తాము.

మేము మిమ్మల్ని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడానికి సహాయపడే
మరిన్ని మార్గాలను తెలుసుకోండి.