మీ గోప్యత
బాధ్యతాయుతమైన డేటా ప్రాక్టీసుల ద్వారా రక్షించబడుతుంది.

మీరు ప్రతిరోజూ ఉపయోగించే ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను మరింత సహాయకరంగా మార్చడంలో డేటా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ డేటా విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి, కఠినమైన ప్రోటోకాల్‌లు, వినూత్న గోప్యతా టెక్నాలజీలతో మీ గోప్యతను రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

డేటా పరిమితి నియమం

ఉపయోగించిన, సేవ్ చేసిన వ్యక్తిగత సమాచారాన్ని పరిమితం చేయడం

మీకు ఉపయోగకరంగా, సహాయకరంగా ఉన్నంత వరకు మాత్రమే మీ సమాచారాన్ని ప్రోడక్ట్‌లు స్టోర్ చేసుకోవాలని మేము నమ్ముతాము - అది Mapsలో మీకు ఇష్టమైన గమ్యస్థానాలను కనుగొనడం కోసమైనా సరే లేదా YouTubeలో ఏమి చూడాలనే దాని కోసం సిఫార్సులు పొందడం కోసమైనా సరే.

మీరు ఆటోమేటిక్‌గా ఆఫ్ చేయబడి ఉన్న లొకేషన్ హిస్టరీని – మొదటిసారిగా ఆన్ చేస్తే – మీ ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్ ఆటోమేటిక్‌గా 18 నెలలకు సెట్ చేయబడుతుంది. కొత్త ఖాతాల కోసం కూడా వెబ్ & యాప్ యాక్టివిటీ ఆటోమేటిక్ తొలగింపు అనేది, 18 నెలలకు ఆటోమేటిక్‌గా సెట్ చేయబడుతుంది. మీ యాక్టివిటీ డేటాను తొలిగించడాన్ని మీరు ఎంచుకునే వరకు ఉంచకుండా, 18 నెలల తర్వాత ఆటోమేటిక్‌గా, నిరంతరం తొలగించబడుతుందని దీని అర్థం. మీరు ఎప్పుడైనా ఈ సెట్టింగ్‌లను ఆఫ్ చేయవచ్చు లేదా మీ ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్‌ను ఎప్పుడైనా మార్చవచ్చు.

యాక్సెస్‌ను బ్లాక్ చేయడం

మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ విక్రయించము, అలాగే ఎవరికి యాక్సెస్ ఉండవచ్చు అనేదానిపై మీకు కంట్రోల్స్ ఇస్తాము

మీ డేటాను థర్డ్ పార్టీల నుండి రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. అందుకే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ విక్రయించకూడదనేది మా కఠినమైన పాలసీ. మీరు మమ్మల్ని అడిగితే తప్ప, మీ పేరు లేదా ఇమెయిల్ వంటి, మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారాన్ని మేము అడ్వర్టయిజర్‌లతో షేర్ చేయము. ఉదాహరణకు, మీరు సమీపంలోని పూల దుకాణానికి సంబంధించిన యాడ్‌ను చూసి, “కాల్ చేయడం కోసం ట్యాప్ చేయండి” బటన్‌ను ఎంచుకున్నట్లయితే, మేము మీ కాల్‌ను కనెక్ట్ చేస్తాము, అలాగే మీ ఫోన్ నంబర్‌ను పూల దుకాణం వారికి షేర్ చేయవచ్చు. మీరు Android పరికరాన్ని ఉపయోగిస్తుంటే, మీ ఫోటోలు, కాంటాక్ట్‌లు లేదా లొకేషన్ వంటి కొన్ని రకాల డేటాను యాక్సెస్ చేయడానికి, థర్డ్-పార్టీ యాప్‌లు మీ అనుమతి అడగాల్సిన అవసరం ఉండేలా మేము చేస్తాము.

గోప్యతా ఆవిష్కరణ

అధునాతన గోప్యతా టెక్నాలజీలు మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి

మా ప్రోడక్ట్‌లతో మీరు పొందే అనుభవాలు ప్రభావితం కాకుండా చూస్కుంటూనే, మీ ప్రైవేట్ సమాచారాన్ని రక్షించే కొత్త టెక్నాలజీలను మేము నిరంతరం ఆవిష్కరిస్తున్నాము.

ఫెడరేటెడ్ లెర్నింగ్ అనేది Google రూపొందించిన డేటా పరిమితి నియమ టెక్నాలజీ, ఇది మీ పరికరంలోనే పద సూచనల వంటి మా సహాయక ఫీచర్‌లకు ఊతమిచ్చే మెషిన్ లెర్నింగ్ మోడల్‌లకు శిక్షణ ఇస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా, మీ వ్యక్తిగత సమాచారాన్ని మీ పరికరాల్లోనే ఉంచి, తద్వారా మీ గోప్యతను కాపాడుతూనే, మా ప్రోడక్ట్‌లలో మీకు సహాయకరమైన అనుభూతిని అందించడంలో సహాయపడుతుంది.

మా సర్వీస్‌లు మీ కోసం ఉత్తమంగా పని చేసేలా అభివృద్ధి చేస్తూనే, మీ డేటాను రక్షించడానికి మేము ప్రముఖ అజ్ఞాతీకరణ పద్ధతులను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మిమ్మల్ని మరింత వేగంగా ఇంటికి చేర్చగల ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడానికి మేము మిలియన్‌ల మంది యూజర్‌ల నుండి డేటాను అగ్రిగేట్ చేసి, అజ్ఞాతీకరిస్తాము.

Mapsలో ఒక ప్రదేశం రద్దీగా ఉంది అని తెలియజేయడం వంటి ఫీచర్‌లను అందించడానికి, మీ సమాచారానికి కృత్రిమమైన నాయిస్‌ను చేకూర్చే 'భేదాత్మక గోప్యత' అనే అధునాతన అజ్ఞాతీకరణ టెక్నాలజీని వర్తింపజేస్తాము, కనుక దానిని ఉపయోగించి మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించడం సాధ్యపడదు.

గోప్యతా రివ్యూలు

ప్రతి ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ వ్యవధి అంతటా
కఠినమైన గోప్యతా ప్రోటోకాల్‌లు అనుసరించబడతాయి

ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌లోని ప్రతి దశలోనూ, కఠినమైన గోప్యతా స్టాండర్డ్‌ల మార్గనిర్దేశంతో, మేము ప్రోడక్ట్‌లను ఎలా బిల్డ్ చేస్తాం అనే దానికి, గోప్యతే మూలం. ప్రతి ప్రోడక్ట్, ఫీచర్ ఈ గోప్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటాయి, ఇవి సమగ్ర గోప్యతా రివ్యూల ద్వారా అమలు చేయబడతాయి. మా గోప్యతా పాలసీలో మరింత తెలుసుకోండి

డేటా పారదర్శకత

మీ డేటాను చూడటాన్ని, తొలగించడాన్ని సులభతరం చేయడం

మీరు మా ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను ఎలా ఉపయోగిస్తారనేది మీ వ్యక్తిగతమైన ఎంపిక, అది మీ ఇష్టం. ఏ డేటాను సేవ్ చేయాలి, షేర్ చేయాలి లేదా తొలగించాలి అనేదాని గురించి మీరు అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడటానికి, ఏ డేటా ఎందుకు సేకరించబడుతుందో మేము మీకు మరింత సులభంగా అర్థమయ్యేలా చేస్తాము.

ఉదాహరణకు, డ్యాష్‌బోర్డ్‌తో, మీరు ఉపయోగించే Google ప్రోడక్ట్‌లకు సంబంధించిన ఓవర్‌వ్యూను, అలాగే మీరు స్టోర్ చేసే ఇమెయిల్స్, ఫోటోల వంటి ఐటెమ్‌లను మీరు చూడవచ్చు. అలాగే 'నా యాక్టివిటీ'తో, మీరు సెర్చ్ చేసిన అంశాలు, చూసిన కంటెంట్, ఇంకా చూసిన వీడియోలతో సహా Google సర్వీస్‌ల అంతటా మీకు సంబంధించిన యాక్టివిటీ నుండి సేకరించిన డేటాను సులభంగా చూడవచ్చు లేదా తొలగించవచ్చు.

డేటా పోర్టబిలిటీ

మీ డేటాను మీతో తీసుకెళ్లగల సాధికారతను అందిస్తున్నాం

ప్రతి యూజర్, వారు మాతో షేర్ చేసిన కంటెంట్‌కు ఎప్పుడైనా, అలాగే ఏ కారణం చేతనైనా యాక్సెస్‌ను కలిగి ఉండాలి. అందుకే మేము 'మీ డేటాను డౌన్‌లోడ్ చేయండి' ఆప్షన్‌ను క్రియేట్ చేశాము – దీని ద్వారా మీరు మీ ఫోటోలు, ఇమెయిల్‌లు, కాంటాక్ట్‌లు, బుక్‌మార్క్‌లను డౌన్‌లోడ్ చేయవచ్చు. మీరు మీ డేటాకు ఒక కాపీని చేసుకుంటారా, దాన్ని బ్యాకప్ చేసుకుంటారా, లేదా దాన్ని మరో సర్వీస్‌కు తరలించుకుంటారా అనేది మీ ఇష్టం.

మీ Google ఖాతాకు సేవ్ చేయబడిన డేటా మీద కంట్రోల్ ఎల్లప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ మరింత తెలుసుకోండి.

వర్తించే డేటా రక్షణ చట్టాలను
పాటించడానికి మేము కట్టుబడి ఉన్నాము

వర్తించే గోప్యతా నియమాలకు అనుగుణంగా ఉండటానికి మేము ఎల్లప్పుడూ పని చేస్తున్నాము. సంవత్సరాలుగా, మేము ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రొటెక్షన్ అథారిటీలతో కలిసి పనిచేశాము, అలాగే వారి మార్గనిర్దేశాన్ని ప్రతిబింబించే బలమైన గోప్యతా రక్షణలను అమలు చేశాము. ప్రపంచవ్యాప్తంగా అమలు చేయబడుతున్న గోప్యతా చట్టాలకు అనుగుణంగా మా వ్యవస్థలు, పాలసీలను అప్‌గ్రేడ్ చేయడానికి మేము గణనీయంగా కృషి చేస్తున్నాము.

మరింత తెలుసుకోండి
మేము మిమ్మల్ని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచే
మరిన్ని మార్గాలను అన్వేషించండి.