అందరికీ పనిచేసే గోప్యతను, సెక్యూరిటీని బిల్డ్ చేయడం

మ్యూనిచ్‌లోని Google భద్రతా ఇంజినీరింగ్ కేంద్రం అనేది గోప్యత, భద్రత ఇంజనీరింగ్‌కి గ్లోబల్ హబ్. ఇంజనీర్‌లైన వైలాండ్ హోల్ఫెల్డర్, స్టీఫెన్ మిక్‌లిట్జ్‌లు, Google తన ప్రోడక్ట్‌లలోకి పారదర్శకత, అలాగే కంట్రోల్స్‌ను ఎలా బిల్డ్ చేస్తుందో వివరిస్తున్నారు.

Googleలో కొత్త ఉద్యోగంలో చేరడానికి ఆమోదపు లెటర్‌ను అందుకునే సమయానికి, అప్పట్లో వీలాండ్ హోల్ఫెల్డర్ USలో నివసిస్తున్నారు. అక్కడి నుండి తను జర్మనీ నుండి సిలికాన్ వ్యాలీకి తరలి వెళ్లి, మెర్సిడెస్ బెంజ్‌తో సహా కంపెనీలలో 12 సంవత్సరాలుగా అక్కడే పని చేస్తున్నారు. 2008లో, అంతా మారిపోయింది. హోల్ఫెల్డర్ అమెరికన్ స్నేహితులు, సహోద్యోగులు అతని కొత్త ఉద్యోగపు హోదాను గురించి, ఉపాధి సంస్థను గురించి ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. కానీ అతను పని చేయబోయే ఆఫీస్ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో లేదు - అది జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉంది. అక్కడున్న వారు మాత్రం, ఈ వార్త పట్ల తరచుగా తక్కువ ఉత్సాహాన్ని చూపేవారు. “Google” అనే పేరును పేర్కొన్నప్పుడు, హోల్ఫెల్డర్, సాధారణ అభినందన మెసేజ్‌లతో పాటు, జర్మన్ స్నేహితుల నుండి, అప్పుడప్పుడు ముఖాన్ని చిట్లించడం, ప్రశ్నార్థకంగా చూడటం వంటివి ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వారి డేటా విషయానికి వచ్చినప్పుడు యూరోపియన్లు - ముఖ్యంగా జర్మన్లు - ఎంత సున్నితంగా ఉంటారో హోల్ఫెల్డర్‌కు తెలుసు.

హోల్ఫెల్డర్, ఇప్పుడు Google ఇంజనీరింగ్ కేంద్రానికి సైట్ లీడ్, మ్యూనిచ్ ఆఫీస్ క్యాంటీన్‌లో కూర్చుని ఉన్నారు, నేల నుండి సీలింగ్ దాకా అమరి ఉన్న కిటికీలతో చక్కని అభిరుచి ఇమిడివున్న అలంకరణతో ఇది రెస్టారెంట్‌లాగే అనిపిస్తుంది. గదిలో సంభాషణల నుండి అక్కడక్కడా చెవిన పడుతున్న మాటలను బట్టి, మ్యూనిచ్ "Google ఉద్యోగుల" నడుమ ప్రధానంగా చెలామణీ అవుతున్న భాష ఇంగ్లీషే అని స్పష్టమవుతోంది. సిలికాన్ వ్యాలీ ప్రభావం దానితోనే అంతం కాదు - 2016లో ప్రారంభించిన ఇటుక భవనంలో ఫిట్‌నెస్ స్టూడియో, కాఫీ బార్, బిలియర్డ్ రూమ్ లైబ్రరీ కూడా చేరి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 750 మంది ఉద్యోగులు ఈ శాఖలో పనిచేస్తున్నారు, వీరిలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్లు. మౌంటెన్ వ్యూలోని "Google" ప్రధాన కార్యాలయంలో సహోద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లు సాయంత్రం నుండి మాత్రమే సాధ్యమవుతాయి కాబట్టి వారి పని గంటలు తరచుగా సాయంత్రానికి సాగుతాయి.

యూజర్‌ల డేటా ఎలా ఉపయోగించబడుతుందనే విషయంలో వారు పూర్తి పారదర్శకతను, కంట్రోల్‌ను కలిగి ఉండాలనేదే ప్రధాన లక్ష్యం

అయినా కూడా మ్యూనిచ్‌లోని Google ఆపరేషన్ ఇప్పటికీ చాలా జర్మన్ అనుభూతిని కలిగిస్తుంది - కొంతవరకూ స్థానిక సబ్‌వే స్టేషన్‌లను పోలి ఉండే కాన్ఫరెన్స్ రూమ్‌లు లేదా క్లాసిక్ బవేరియన్ వుడ్-ప్యానెల్ రూమ్‌లలో కనపడే గమ్మత్తయిన వివరాలే ఇందుకు కారణం. కానీ హోల్ఫెల్డర్‌కు జర్మన్ సంబంధిత విశేషంగా అనిపించే విషయం "మా లోకల్ ప్రయోజనం": తన మ్యూనిచ్ ఇంజినీర్‌లు. హోల్ఫెల్డర్ వివరిస్తూ, "ఇక్కడ మ్యూనిచ్‌లో, మేము డేటా గోప్యతా రంగంలో Google కోసం - ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్‌ల కోసం, ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను బిల్డ్ చేస్తున్నాము." యూజర్‌లు తమ డేటా ఎలా ఉపయోగించబడుతుందనే విషయంలో పూర్తి పారదర్శకతను, కంట్రోల్‌ను కలిగి ఉండటం ప్రధాన లక్ష్యం. ఈ టాస్క్‌పై పని చేయడానికి వ్యక్తులకు జర్మనీ అనువైన ప్రదేశం.

ప్రపంచవ్యాప్తంగా Google ప్రోడక్ట్‌ల డేటా గోప్యతా ప్రమాణాలకు బాధ్యత వహించే ఇంజినీరింగ్ కేంద్ర డైరెక్టర్ స్టీఫెన్ మిక్‌లిట్జ్ కూడా మ్యూనిచ్ ఆఫీస్‌లో పని చేస్తున్నారు. 2007లో టీమ్‌లో చేరిన వీరు ఒరిజినల్ మ్యూనిచ్ Google ఉద్యోగులలో ఒకరు. మిక్‌లిట్జ్, తన టీమ్‌తో కలిసి ఒరిజినల్ 'మై అకౌంట్' సర్వీస్‌ను డెవలప్ చేశారు, అదే తర్వాత [Google ఖాతా] (https://myaccount.google.com/) {: target = "_blank" rel = "noopener noreferrer"}గా రూపుదిద్దుకుంది. ఈ డిజిటల్ కాక్‌పిట్‌ను Googleలో అకౌంట్ ఉన్న ఎవరైనా, అలాగే కేవలం Google సెర్చ్ ఇంజిన్ లేదా YouTubeను ఉపయోగించే వారెవరైనా కూడా ఉపయోగించవచ్చు. Google ఖాతా, సెట్టింగ్‌లను సులభంగా మేనేజ్ చేసే వీలును కల్పిస్తుంది. బాహ్య దాడి నుండి తమ డేటా ఎంతవరకు రక్షణను కలిగి ఉందో చూడటానికి యూజర్‌లు [సెక్యూరిటీ చెకప్] (https://myaccount.google.com/security-checkup) {: target = "_blank" rel = "noopener noreferrer"}ను కూడా రన్ చేయవచ్చు. అంతేకాకుండా, Google సర్వర్‌లలో, తమ వ్యక్తిగత సమాచారంలో దేనిని స్టోర్ చేయడం జరుగుతోందో, దేనిని స్టోర్ చేయడం లేదో తెలుసుకోవడానికి [గోప్యతా చెకప్] (https://myaccount.google.com/privacycheckup) {: target = "_blank" rel = "noopener noreferrer"}ను కూడా ఉపయోగించవచ్చు.

"ఇక్కడ మ్యూనిచ్‌లో, మేము డేటా గోప్యతా రంగంలో Google కోసం - ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్‌ల కోసం, ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను బిల్డ్ చేస్తున్నాము."

వైలాండ్ హోల్ఫెల్డర్

"ఈ రకమైన ప్రశ్నలన్నింటికీ సెంట్రల్ హబ్‌ను క్రియేట్ చేయాలన్నదే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం," అంటారు మిక్‌లిట్జ్. "మేము సెట్టింగ్ కాన్ఫిగరేషన్ ఆప్షన్‌లన్నిటితో పాటు, సమాధానాలను రెండు పేజీలలో పొందుపరచాలనుకున్నాము - అయితే అలా చేసినా, ముఖ్యమైన దశలపై మాత్రం ఫోకస్ ఉంచాము, ఎందుకంటే, యూజర్‌లను విస్తుపోయేలా చేయకూడదు కదా." మిక్‌లిట్జ్ ఇప్పుడే ఒక కాఫీని తీసుకొచ్చారు. "మైక్రో కిచెన్" అని పిలిచే Google సిబ్బందికి చెందిన చిట్టి వంటిళ్లలో ఒకదాని నుండి దానిని తీసుకువచ్చారు. అక్కడ డ్రింక్‌లతో నిండిపోయి ఉన్న ఆరు అడుగుల ఎత్తైన ఫ్రిజ్ ఉంది. దాని గాజు తలుపులలో నుండి, మినరల్ వాటర్ బాటిళ్లతో నిండి ఉన్న పై రెండు వరుసలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగిలినవన్నీ ఫ్రిజ్‌లోని ఫ్రోస్టెడ్ గ్లాస్ వెనుక దాగి ఉన్నాయి. మొదట మెరిసే జ్యూస్‌లు, తరువాత సాధారణ జ్యూస్‌లు, ఆపై ఐస్ టీలు, కింది అరలలో అనారోగ్యకరమైన ఫిజీ డ్రింక్‌లు ఉన్నాయి. "ఇంజినీర్లుగా మేము దేన్నీ వదిలిపెట్టే అవకాశాన్ని ఇవ్వడానికి ఇష్టపడము" అంటారు మిక్‌లిట్జ్.

వైలాండ్ హోల్ఫెల్డర్ (కుడి) జర్మనీలోని Googleలో ఇంజినీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్. అతని సహోద్యోగి, స్టీఫెన్ మిక్‌లిట్జ్, 2010 నుండి Google గ్లోబల్ గోప్యత, సెక్యూరిటీ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి డేటాను కంపెనీ ఎలా హ్యాండిల్ చేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారెవరైనా సంప్రదించడానికి వీరే సరైన వారవుతారు.

హోల్ఫెల్డర్, మిక్‌లిట్జ్‌ల ప్రకారం, ఆన్‌లైన్ దాడుల నుండి తమ యూజర్‌ల డేటాను రక్షించడానికి, పరిశ్రమలో మరే ఇతర కంపెనీ ఇంతగా కృషి చేయడం లేదు. Google సర్వర్ మౌలిక సదుపాయాలు ప్రపంచంలో అత్యంత సురక్షితమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి అనేది వాస్తవం. దాని సెక్యూరిటీ సిస్టమ్ సంక్లిష్టమైనది, అనేక స్థాయిలను కలిగి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా కేంద్రాలలో, డేటా, ఎన్‌క్రిప్ట్ చేసిన రూపంలో స్టోర్ చేయబడుతుంది - సౌకర్యాలు అత్యధిక సెక్యూరిటీతో కూడిన జైళ్లను పోలి ఉంటాయి. "మా బయోమెట్రిక్ విధానంలో రక్షించబడే డేటా కేంద్రాలలోని వారు ఎవరైనా మీ ఈమెయిల్స్‌ను కలిగి ఉన్న హార్డ్ డ్రైవ్‌ను చూసినప్పటికీ, వారు దానితో ఏమీ చేయలేరు" అని వివరిస్తారు హోల్ఫెల్డర్. "దానిలోని మొత్తం సమాచారం వివిధ డేటా కేంద్రాలకు పంపిణీ చేయబడుతుంది - అంతే కాదు, అది ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది." అదనంగా, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఒకవేళ హ్యాకర్‌లు Google ఇంటర్‌ఫేస్‌లు లేదా ప్రోడక్ట్‌లలో బలహీనతను కనుగొంటే, అటువంటి సమాచారానికి ప్రతిగా, కంపెనీ ఉదారంగా రివార్డ్‌లను అందిస్తుంది. అందువల్ల, సైబర్ నేరాలకు పాల్పడబోయే వారికి, దాని సెక్యూరిటీ బలహీనతలను దుర్వినియోగం చేయడం కంటే, వాటిని రిపోర్ట్ చేయడమే మరింత లాభదాయకం.

"గోప్యతకు, సెక్యూరిటీకి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ సెంట్రల్ హబ్‌ను క్రియేట్ చేయాలన్నదే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం."

స్టీఫెన్ మిక్‌లిట్జ్

హోల్ఫెల్డర్, మిక్‌లిట్జ్‌ల సంభాషణ నుండి ప్రధానంగా గ్రహించాల్సిన ముఖ్యమైన మెసేజ్‌లు రెండు ఉన్నాయి. వాటిలో మొదటిది, ఎవరైనా ఈమెయిల్ ఖాతాను సెటప్ చేసినా లేదా Google ద్వారా క్లౌడ్‌కు ఫోటోలను అప్‌లోడ్ చేసినా, వారి మెసేజ్‌లు, ఇమేజ్‌లు అన్నీ, అవి ఎంత సురక్షితంగా ఉండవచ్చో, అంత సురక్షితంగానూ ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోవాలి. రెండవది, వెబ్‌లో సెర్చ్ చేయడానికి, సర్ఫ్ చేయడానికి Googleను ఉపయోగించే ఎవరైనా, ఏ డేటాను సేకరించడానికి, ఉపయోగించడానికి Googleకు అనుమతి ఉందో, వారంతట వారే నిర్ణయించగలరు. "వ్యక్తిగతంగా చూస్తే, నా సెల్ ఫోన్ నాకు ట్రాఫిక్ అప్‌డేట్‌లను ఇచ్చినప్పుడు, అంటే ఉదాహరణకు, హైవేపై ట్రాఫిక్ జామ్ ఉన్నందున నేను నా విమానాన్ని అందుకోవాలనుకుంటే ఇప్పుడే బయలుదేరాలి అని చెప్పినప్పుడు నేను అభినందిస్తాను" అంటారు హోల్ఫెల్డర్. "అయితే ఈ ఫంక్షన్‌ను ఆన్ చేయాలా వద్దా అనే విషయంపై ప్రతి ఒక్కరూ ఎవరికి వారే స్వయంగా నిర్ణయించుకోవచ్చు."

Google Chrome జింజర్‌బ్రెడ్ హార్ట్‌లు: మ్యూనిచ్‌లోని Google సైట్‌లోని గదులు సరదాగా, వ్యంగ్యంగా అనిపిస్తాయి.

యాడ్‌ల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది, Google తన డబ్బును ఎక్కువగా ఇలాగే సంపాదిస్తుంది. యాడ్‌లు మీకు మరింత సందర్భోచితంగా ఉండేలా రూపొందడంలో డేటా సహాయపడగలదు -- తద్వారా మీరు కొత్త బూడిద రంగు సోఫా కోసం చూస్తున్నట్లయితే, ఆ అవసరానికి బదులిచ్చే యాడ్‌లను మీరు చూస్తారు. కొంతమందికి ఇది ఉపయోగకరంగా అనిపిస్తుంది; మరికొందరికి ఇది చిరాకుగా ఉంటుంది. ఈ యాడ్ వ్యక్తిగతీకరణ ఫీచర్‌ను స్విచ్ ఆఫ్ చేసేయడం సాధ్యమేనని మిక్‌లిట్జ్ చెప్తున్నారు. "Google ఖాతా ద్వారానే అనుకోండి" అని కూడా అంటున్నారు. ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసిన యూజర్‌లు ఇప్పటికీ యాడ్‌లను చూస్తారు, కానీ ఇకపై అవి వారి ఆసక్తులకు అనుగుణంగా ఉండవు. "మా యూజర్‌లకు యాడ్‌లను మరింత సందర్భోచితంగా చేయడానికి మేము డేటాను ఉపయోగిస్తాము" అని హోల్ఫెల్డర్ కూడా అన్నారు. "కానీ మేము ఎలాంటి వ్యక్తిగత డేటాను విక్రయించము."

ఫోటోగ్రాఫ్‌లు: మైర్జిక్ & జారిష్

సైబర్ సెక్యూరిటీ పురోగతులు

ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్‌లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.

మరింత తెలుసుకోండి