మీరు ఎక్కడికి వెళ్లినా మీ డేటాను మీతో పాటు ఎలా తీసుకువెళ్ళవచ్చు

మీ ఇంట్లో ఉన్న కంప్యూటర్‌లో వ్యక్తిగత డేటాను డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా లేదా దాన్ని ఒక ప్రొవైడర్ నుండి మరొకదానికి బదిలీ చేయాలనుకుంటున్నారా? Google Takeout ద్వారా ఆ రెండు పనులను చేయవచ్చని Googleకు చెందిన స్టీఫెన్ మిక్‌లిట్జ్, గ్రెగ్ ఫెయిర్ వివరిస్తున్నారు

మిస్టర్ మిక్‌లిట్జ్, మిస్టర్ ఫెయిర్, మీరు Google Takeoutకు బాధ్యత వహిస్తారు. అసలు ఇది దేని ఉద్దేశించబడింది?

స్టీఫెన్ మిక్‌లిట్జ్, Google గోప్యతా, సెక్యూరిటీ టీమ్‌కు ఇంజినీరింగ్ డైరెక్టర్: Google Driveలో స్టోర్ చేయబడిన ఫోటోలు, కాంటాక్ట్‌లు, ఈమెయిళ్లు, క్యాలెండర్ ఎంట్రీలు, లేదా మ్యూజిక్ ఫైళ్లను మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేయడం లేదా వాటిని మరొక ప్రొవైడర్‌కు బదిలీ చేయడం వంటి చర్యలను చేయడానికి Google Takeout మిమ్మల్ని అనుమతిస్తుంది.

గ్రెగ్ ఫెయిర్, Google Takeout ప్రోడక్ట్ మేనేజర్: నేను, నా భార్య, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అలాగే చాలా మంది తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టుగానే మా దగ్గర కూడా మా పిల్లల ఫోటోలు చాలా ఉన్నాయి - కరెక్ట్‌గా చెప్పాలంటే 600 గిగాబైట్‌ల ఫోటోలు. మేము ఈ ఫోటోలను సేవ్ చేసిన హార్డ్ డ్రైవ్ క్రాష్ అయినప్పుడు, నేను ఆ ఫోటోలన్నింటినీ Google Photosలో కూడా సేవ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీని వల్ల నేను Google Takeoutను ఉపయోగించి కొత్త హార్డ్ డ్రైవ్‌కు ఫోటోలను చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోగలిగాను.

గ్రెగ్ ఫెయిర్
స్మార్ట్‌ఫోన్

Google ప్రోడక్ట్ మేనేజర్ 'గ్రెగ్ ఫెయిర్', Google Takeoutకు సంబంధించి బాధ్యత వహిస్తారు, దీని ద్వారా యూజర్‌లు Google నుండి వారి డేటాను డౌన్‌లోడ్ చేయడమే కాకుండా, దీన్ని ఇతర ప్రొవైడర్‌లకు బదిలీ చేయడానికి కూడా ఇది వారిని అనుమతిస్తుంది.

ప్రజలు Takeoutను ఎలా ఉపయోగిస్తారు?

ఫెయిర్: చాలా వరకు వారు Google Driveలో స్టోర్ చేసిన మొత్తం డేటాను బ్యాకప్ చేయడానికి ఉపయోగిస్తారు.

మిక్‌లిట్జ్: ఇది అంత సరైనది కాదు, ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలంటే డేటా మా హోమ్ స్టోరేజ్ పరికరాలలో కంటే Google Driveలో మరింత సురక్షితంగా ఉంటుంది.

ఫెయిర్: ఇంట్లో పిల్లి హార్డ్ డ్రైవ్‌ను పాడుచేయవచ్చు లేదా పిల్లలు దానిని విరగొట్టవచ్చు లేదా మంటలు అంటుకోవచ్చు. Googleలో, ప్రతి ఫైల్ వేర్వేరు సర్వర్‌లో చాలా సార్లు స్టోర్ చేయబడుతుంది. ఇంత కంటే సురక్షితంగా ఎక్కడా ఉండకపోవచ్చు.

అయినప్పటికీ, మిస్టర్ ఫెయిర్, మీరు ఇప్పటికీ మీ డేటాను హార్డ్ డ్రైవ్‌లో బ్యాకప్ చేస్తారు!

ఫెయిర్: ఎందుకంటే నా భార్య ఇమేజ్ ఎడిటింగ్ ప్రోగ్రామ్‌ను ఉపయోగిస్తుంది, అటువంటి పరిస్థితిలో, క్లౌడ్‌లోని అన్ని ఇమేజ్‌లను సేవ్ చేయడం వాస్తవికంగా సాధ్యపడదు.

"Googleలో, ప్రతి ఫైల్ వేర్వేరు సర్వర్‌లో చాలా సార్లు స్టోర్ చేయబడుతుంది. ఇంత కంటే సురక్షితంగా ఎక్కడా ఉండకపోవచ్చు."

గ్రెగ్ ఫెయిర్

అర్థమైంది.

మిక్‌లిట్జ్: నాలాంటి వాళ్ళను కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు, నేను అలాంటి ప్రోగ్రామ్‌లను ఉపయోగించను, కానీ ఇప్పటికీ నేను నా ఫోటోలన్నింటినీ హార్డ్ డ్రైవ్‌లో బ్యాకప్ చేస్తాను. నేను ఎప్పుడూ కూడా నా డేటా ఫిజికల్ కాపీని కలిగి ఉండాలనుకుంటున్నాను.

మీరు ఎందుకు అలా చేస్తారు?

మిక్‌లిట్జ్: చెప్పాలంటే మాకు ఫొటోలతో వ్యక్తిగత, అలాగే భావోద్వేగపరమైన ఒక కనెక్షన్ ఉంటుంది. వాటితో చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. ఒక యూజర్‌గా, నా ఫోటోల భద్రత విషయంలో నేను ఒకే కంపెనీ మీద ఆధారపడి ఉండాలనుకోవట్లేదు - అది నేను పని చేసే కంపెనీ అయినా సరే. అందువల్ల Google టేక్అవుట్ వంటి పోర్టబిలిటీ సర్వీస్‌లు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే యూజర్‌లు వారి డేటాను ఎప్పుడైనా తిరిగి పొందడానికి ఆ సర్వీస్‌లు వారిని అనుమతిస్తాయి - క్లౌడ్‌లో సేవ్ చేయబడిన డేటాను కూడా.

ఎప్పటి నుండి Googleలో 'పోర్టబిలిటీ' ఒక ముఖ్యమైన అంశంగా అయింది?

ఫెయిర్: ఒక దశాబ్దానికి పైగా. మేము మొదట ఒక్కో డేటా రకానికి సంబంధించిన పోర్టబిలిటీ సర్వీస్‌లను అభివృద్ధి చేసాము. ఆ తర్వాత, 2011లో Google, అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారంగా ఒక యాప్‌ను లాంచ్ చేసింది: అదే Takeout. అప్పటి నుండి, మేము Takeoutతో ఎక్కువ శాతం Google సర్వీస్‌లను ఇంటిగ్రేట్ చేశాము, ఈ రోజు ఇది 40కి పైగా సర్వీస్‌లను సపోర్ట్ చేస్తుంది.

చాలా మంది యూజర్‌లు తమ కంప్యూటర్‌లో డేటాను డౌన్‌లోడ్ చేసినప్పటికీ, వారు తమ డేటాను ఇతర సర్వీస్‌లకు చాలా అరుదుగా బదిలీ చేస్తారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది?

ఫెయిర్: నేడు, యూజర్‌లు తమ డేటాను Google నుండి Dropbox, Box, లేదా Microsoft Office 365కు బదిలీ చేయవచ్చు - అలాగే ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి డేటాను Googleకు బదిలీ చేయవచ్చు. మా చాలామంది పోటీదారులు ఇప్పటికీ ఈ ఫీచర్‌లను అందించలేదు. దాన్ని మార్చడానికి ట్రై చేసేందుకు, 2017లో మేము డేటా బదిలీ ప్రాజెక్ట్ను, అలాగే అధికారికంగా ప్రకటించాము ప్రాజెక్ట్‌ను 2018 జూలైలో ప్రారంభించాము. ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, ఇది కంపెనీలకు పోర్టబిలిటీ ఫంక్షన్‌ల కోసం ఉచిత కోడ్‌ను అందిస్తుంది, అలాగే ఒక సర్వీస్ నుండి వేరొక సర్వీస్‌కు డేటాను సునాయాసంగా బదిలీ చేయడానికి ఇది యూజర్‌లను అనుమతిస్తుంది.

మిక్‌లిట్జ్: ఒక స్టార్టప్ ఒక గొప్ప కొత్త సర్వీస్‌ను అభివృద్ధి చేసిందనుకోండి. ఒక చిన్న కంపెనీ దాని స్వంతంగా పోర్టబిలిటీ పరిష్కారాన్ని క్రియేట్ చేయాలంటే దానికి చాలా ఖర్చవుతుంది. దానికి బదులుగా, వారు డేటా బదిలీ ప్రాజెక్ట్‌ను ఉపయోగించి, సంబంధిత కోడ్‌లను వారి స్వంత సాఫ్ట్‌వేర్‌కు బదిలీ చేయవచ్చు.

ఇంజినీరింగ్ టీమ్ డైరెక్టర్ అయిన స్టీఫన్ మిక్‌లిట్జ్ (కుడి వైపు), Googleలో అంతర్జాతీయ గోప్యతా, సెక్యూరిటీకి సంబంధించి బాధ్యత వహిస్తారు. ఈయన టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్‌లో కంప్యూటర్ సైన్స్ చదివారు, 2007 చివరి నుండి Google మ్యూనిక్ ఆఫీస్‌లో పని చేస్తున్నారు.

కానీ నేను వేరే ప్రొవైడర్‌ను ఎంచుకుంటే, దాని ద్వారా మీకు వచ్చే లాభం ఏంటి?

ఫెయిర్: మా ప్రకారం మీరు Google సర్వీస్‌లను ఉపయోగించాలని అనుకుంటున్నాము, ఎందుకంటే అవి అత్యుత్తమ సర్వీస్‌లు కాబట్టి, అంతే గానీ మీరు మీ డేటాను మరెక్కడా ఉపయోగించలేరని మీరు అనుకోవడం వల్ల కాదు.

మే 2018లో అమలులోకి వచ్చిన జనరల్ డేటా రక్షణ నియంత్రణ చట్టంలో డేటా పోర్టబిలిటీపై కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ చట్టపరమైన అవసరాలను తీర్చడానికి మీరు మీ డేటా డౌన్‌లోడ్ టూల్‌లో ఏవైనా మార్పులు చేయాల్సి వచ్చిందా?

ఫెయిర్: మేము 2016లో మొదటిసారి ఈ చట్టాన్ని చదివినప్పుడు, పోర్టబిలిటీ విషయంలో మేము చాలా బాగా పని చేస్తున్నామని అప్పుడే అర్థమైంది. అయినప్పటికీ కూడా, మేము గతంలో కొన్ని రోజులు ఈ అంశంపై చాలా లోతుగా పని చేశాము.

మిక్‌లిట్జ్: ఈ రోజు ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇవ్వబడినందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రస్తుతం చాలా మంది యూజర్‌లు ఈ పోర్టబిలిటీ అనే అంశంపై ఇప్పటికీ ఆసక్తి చూపటం లేదు. కానీ రాబోయే కొన్ని సంవత్సరాలలో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాము.

"నా దగ్గర ఉన్నట్టుగానే నా పిల్లల దగ్గర కూడా వారి చిన్ననాటి స్నాప్‌షాట్‌లు ఉండాలి."

స్టెఫన్ మిక్‌లిట్జ్

ఎందుకు?

మిక్‌లిట్జ్: ప్రజలు ఇప్పుడు వారి డేటాను క్లౌడ్‌లో సేవ్ చేయడం ప్రారంభించారు. కానీ ఒక కంపెనీ దివాళా తీసింది అనుకోండి, ఇంకా మీ డేటా ఆ కంపెనీ సర్వర్‌లలో స్టోర్ చేయబడింది. మీరు ఈ డేటాను తిరిగి పొందే అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటారు. డేటా ఎంత సమయం వరకు స్టోర్ చేయవచ్చు అనే దానికి సంబంధించిన అంశం కూడా దీనితో ముడిపడి ఉంది. నా తల్లిదండ్రుల చిన్ననాటి పాత ఫోటోలను నేను అలా అయితే చూడగలుగుతున్నానో, అదే విధంగా నా పిల్లలు కూడా తమ చిన్ననాటి పోటోలను చూడగలగాలి.

అనలాగ్ ఫోటోలలాగా డిజిటల్ ఫోటోలు కూడా ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటున్నారా?

Micklitz: అవును. డేటా సెక్యూరిటీలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం - అంటే, ఈ రోజు నేను స్టోర్ చేసే డేటా 50 సంవత్సరాల తర్వాత కూడా నేను ఉపయోగించగలను.

ఫోటోగ్రాఫ్‌లు: కాన్నీ మిర్‌బాక్

సైబర్ సెక్యూరిటీ పురోగతులు

ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్‌లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.

మరింత తెలుసుకోండి