మీరు రూపొందించే వాటిపై యూజర్‌లు ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవడం.

యూజర్‌లు ప్రోడక్ట్‌లతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనేది యూజర్ అనుభవ పరిశోధకులు స్టడీ చేస్తారు. యూజర్ అనుభవం, అలాగే ఆన్‌లైన్ గోప్యతకు సంబంధించిన అంశాల్లో ఆర్న్ డి బూయిజ్ నిపుణులు. స్టెఫాన్ మిక్‌లిట్జ్, గోప్యత, అలాగే సెక్యూరిటీకి ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు, ఈయన గోప్యత, అలాగే సెక్యూరిటీ టూల్స్‌ను రూపొందించే పనిని చూసుకుంటుంటారు.

ఆర్న్ డి బూయిజ్, Googleలో ఒక యూజర్ అనుభవ పరిశోధకులుగా, గోప్యత, అలాగే సెక్యూరిటీ టూల్స్‌తో యూజర్‌లు ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనేది మీరు విశ్లేషిస్తుంటారు. మీరు ఏమి తెలుసుకున్నారు?

ఆర్న్ డి బూయిజ్, Google UX రీసెర్చ్ మేనేజర్: ఇది అందరికీ తెలిసిన విషయమే కావచ్చు, సాధారణంగా యూజర్‌లు ఆన్‌లైన్‌లో సురక్షితంగా, క్షేమంగా ఉండాలనుకుంటారు. వారి డేటా గోప్యంగా ఉండాలనుకుంటారు. ఇటీవలి సంవత్సరాలలో, ఇంటర్నెట్ వ్యాప్తి అలాగే సంక్లిష్టత బాగా పెరగడంతో, యూజర్‌లు, తాము ఎంత సురక్షితంగా ఉన్నాము, అలాగే తమ గోప్యతకు తగినంతగా రక్షణ ఉందా అని ప్రశ్నించసాగారు. ఈ రోజుల్లో మనమందరం ఇంటర్నెట్‌ను ఎంతగానో ఉపయోగిస్తున్నాము, అలాగే డేటా లీకేజీ వంటి మరెన్నో విషయాల గురించి మనమందరం వార్తా కథనాలను చదువుతూనే ఉన్నాము, కాబట్టి ఈ ప్రశ్నలను అడగటం సమంజసమే.

సంభాషణలో: ఆర్న్ డి బూయిజ్ (ఎడమ వైపు), UX పరిశోధకులు, స్టెఫన్ మిక్‌లిట్జ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

గోప్యత, అలాగే సెక్యూరిటీ విషయంలో వాస్తవానికి యూజర్‌లు ఆన్‌లైన్‌లో ఎలా ప్రవర్తిస్తుంటారు?

డి బూయిజ్: గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలోని వ్యక్తులతో రీసెర్చ్ స్టడీలను నిర్వహించాము, వారందరి అభిప్రాయం ప్రకారం గోప్యత అనేది చాలా ముఖ్యమైన అంశం. చరిత్రను పరిశీలిస్తే, నిజానికి యూజర్‌లు గోప్యతా సమాచారాన్ని చదవడానికి లేదా వారి గోప్యతా సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడానికి ఎక్కువ సమయం కేటాయించడానికి అంతగా ఇష్టపడరు. యూజర్‌లు తెలియని వెబ్‌సైట్‌లలో వారి కాంటాక్ట్ వివరాలను ఎంటర్ చేయడానికి పెద్దగా సంకోచించరని ఇతర స్టడీలు చెబుతున్నాయి - ఉదాహరణకు, ఏదైనా పోటీలో పాల్గొనడానికి ఇలా చేయవచ్చు. కాబట్టి, డేటాను మేము ఎలా ఉపయోగిస్తున్నామనే దాని గురించి మాకు స్పష్టత ఉందని, అలాగే యూజర్‌లు వారి ఆన్‌లైన్ అనుభవాన్ని వారికి అనుకూలంగా ఉండే విధంగా మేనేజ్ చేసుకోవడానికి సులభంగా ఉపయోగించగల కంట్రోల్స్‌ను మేము అందిస్తున్నామని నిర్ధారించుకోవడం Google వంటి కంపెనీల బాధ్యత.

"దీన్ని యూజర్‌లకు అర్థమయ్యే విధంగా వివరించడం మా బాధ్యత."

ఆర్న్ డి బూయిజ్

స్టెఫాన్ మిక్‌లిట్జ్, డేటా గోప్యత, అలాగే సెక్యూరిటీకి భరోసా ఇచ్చే బాధ్యత ఉన్న వ్యక్తిగా, దీని నుండి మీరు ఎటువంటి నిర్ధారణకు వచ్చారు?

మిక్‌లిట్జ్: యూజర్‌లకు, వారి డేటాపై కంట్రోల్ ఇచ్చే సర్వీస్‌లను డెవలప్ చేయడం కొనసాగించాలనేదే మా లక్ష్యం. డేటా గోప్యత, సెక్యూరిటీ అనే అంశాలను ఏదైనా సమస్య తలెత్తే వరకు యూజర్‌లు అంత ఎక్కువగా పట్టించుకోరు – ఉదాహరణకు, వారి ఖాతా హ్యాక్ అవ్వడం, లేదా ఏదైనా చెడు జరిగిందని వారు వార్తల్లో చదవడం వంటివి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ సమయాల్లో తమ ఆన్‌లైన్ యాక్టివిటీని ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే అవసరమైతే పాస్‌వర్డ్‌లను ఎలా మార్చుకోవాలి అనేవి యూజర్‌లకు తెలుసు.

డి బూయిజ్: వాస్తవానికి ఎవరూ ఉదయాన్నే లేచి, “నేను ఇప్పుడే నా Google ఖాతాలో నా గోప్యతా సెట్టింగ్‌లను చెక్ చేసుకోవడం మంచిది,” అని అనుకోరు. ఇది ఆ విధంగా జరగదు. డేటా గోప్యత, అలాగే సెక్యూరిటీ విషయాలకు వచ్చే సరికి, మనలో చాలా మంది వాటిని వాయిదా వేస్తూ ఉంటారు. అందుకే, ఇటీవలి సంవత్సరాలలో, యూజర్‌లు వారి సెట్టింగ్‌లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాల్సిందిగా మేము ప్రాంప్ట్ చేయడం ప్రారంభించాము.

అయితే మెరుగైన ప్రోడక్ట్‌లను రూపొందించడంలో మీకు సహాయపడే గణాంకాలను మీరు ఎలా పొందుతారు?

డి బూయిజ్: అందుకు అనేక రకాల ఆప్షన్‌లు ఉన్నాయి. Google ఖాతా వంటి యాప్‌ను యూజర్‌లు ఎలా నావిగేట్ చేస్తారో విశ్లేషించడానికి ఆన్‌లైన్ సర్వేలు బాగా ఉపయోగపడతాయి. అభిప్రాయాలు, భావోద్వేగాల గురించి తెలుసుకోవాలనుకుంటే, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా మరింత ఎక్కువ సమాచారం లభిస్తుంది. సాంస్కృతిక భేదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మేము ప్రపంచ వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తుంటాము - వీధుల్లో, మార్కెట్ రీసెర్చ్ స్టూడియోలలో, లేదా యూజర్‌ల ఇళ్లలో కూడా. ప్రత్యేకించి, ఇళ్లలో సర్వే చేయడమనేది ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వ్యక్తులకు వారి సొంత పరికరాలకు, డేటాకు యాక్సెస్ ఉంటుంది, తద్వారా వారి యూజర్ ప్రవర్తన మరింత ప్రామాణికంగా ఉంటుంది.

ఆర్న్ డి బూయిజ్ (ఎడమ వైపు) యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగన్ నుండి ఎక్స్‌పరిమెంటల్ సైకాలజీలో MA డిగ్రీని, అలాగే ఐండ్‌హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజినీరింగ్‌లో ప్రొఫెషనల్ డాక్టరేట్‌ను పొందారు. ఈయన అన్నారు: “యూజర్‌ల అవసరాలు గుర్తించబడేలా UX పరిశోధకులు చూసుకుంటారు.”

మాకు ఒక ఉదాహరణ చెప్పగలరా?

డి బూయిజ్: ఒకసారి, నా సహోద్యోగులు కొంత మంది Google ఖాతా గురించి మాట్లాడటానికి జపాన్‌లో ఉన్న ఒక మహిళ ఇంటికి వెళ్లారు. ఆమెకు ఆ సర్వీస్ గురించి తెలియదు, ఆమె దానిని తెరిచి, వెంటనే మానిటర్‌ను మా వైపు నుండి పక్కకు తిప్పేసుకున్నారు. అయితే Google ఖాతా ఎలా పని చేస్తుంది, సమాచారాన్ని ఎలా తొలగించవచ్చు, అలాగే డేటాను Google ఎలా ఉపయోగించాలి అనే దాన్ని ఎలా ఎంచుకోవచ్చు అనే విషయాలను తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయారు.

స్టెఫాన్ మిక్‌లిట్జ్, ఇటువంటి ఇంటర్వ్యూలను మీరు కూడా గమనించారా?

మిక్‌లిట్జ్: అవును! ఉదాహరణకు, ఇప్పుడు Google ఖాతా అని పిలవబడే ప్రోడక్ట్ ప్రోటోటైప్‌ను మేము రూపొందిస్తున్నప్పుడు, మేము దానిని టెస్ట్ చేసి, యూజర్‌లు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలనుకున్నాము. పాల్గొన్న మొదటి వ్యక్తి, పేజీని తెరిచి, ఏమీ చేయకుండానే చాలా సేపు స్క్రీన్ వైపు అలా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత రెండవ వ్యక్తి లోపలికి వచ్చి, సరిగ్గా అదే విధంగా స్పందించారు. “సరే, ఇది నేను ఊహించిన విధంగా జరగడం లేదు,” అని నేను అనుకున్నాను. ఆ యూజర్‌లకు Google Dashboard అంటే ఏమిటో అర్థం కాలేదని స్పష్టంగా తెలిసింది.

"UX రీసెర్చ్ అనేది డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది."

స్టెఫన్ మిక్‌లిట్జ్

దాని ఫలితంగా మీరు యూజర్ ఇంటర్‌ఫేస్‌కు మార్పులు చేశారా?

మిక్‌లిట్జ్: చాలా సార్లు చేశాము! యూజర్‌లు ప్రోడక్ట్‌ను సులభంగా యాక్సెస్ చేయగలిగి, అది వారికి అర్థమయ్యేలా తయారయ్యేంత వరకు మా పనిని కొనసాగించాము.

అయితే UX రీసెర్చ్ అనేది సర్వీస్‌ను గణనీయంగా మెరుగుపరచడంలో మీకు సహాయపడిందని అంటారా?

మిక్‌లిట్జ్: అది డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఉదాహరణకు, మేము Inactive Account Manager మీద పని చేసినప్పుడు అదే జరిగింది, ఇప్పుడు ఈ Inactive Account Manager, Google ఖాతాలో భాగంగా ఉంది. యూజర్‌లు నిర్దిష్ట కాలం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, వారి డేటాను ఏమి చేయాలో నిర్ణయించే వీలును ఇది వారికి కల్పిస్తుంది. ఈ ప్రోడక్ట్ పూర్తిగా కొత్తది; మా పోటీదారులు ఎవరూ ఇలాంటి ప్రోడక్ట్‌ను ఎన్నడూ ప్రవేశపెట్టలేదు. కాబట్టి మేము ఒక ప్రోటోటైప్‌ను డెవలప్ చేశాము, దాన్ని టెస్ట్ చేశాము, ఆ తర్వాత రెండవ ప్రోటోటైప్‌ను బిల్డ్ చేశాము. మేము ఇదే ప్రాసెస్‌ను అనేక సార్లు కొనసాగించి చివరికి ఒక ప్రోడక్ట్‌ను రూపొందించాము, అది మా యూజర్‌లకు చాలా బాగా నచ్చింది.

మీ రీసెర్చ్ వల్ల నిజ జీవితంలో మార్పులు వచ్చినప్పుడు చాలా సంతృప్తికరంగా ఉంటుంది కదా.

డి బూయిజ్: ఈ ఉద్యోగంలో ఉండే గొప్పతనం అదే. యూజర్‌ల అవసరాలను గుర్తించడం జరుగుతోందని మేము భరోసా ఇస్తున్నాము.

ఫోటోగ్రాఫ్‌లు: కానీ మిర్‌బాక్

సైబర్ సెక్యూరిటీ పురోగతులు

ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్‌లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.

మరింత తెలుసుకోండి