బ్యాక్‌గ్రౌండ్ చెక్

Google ఇంటర్నెట్‌ను మరింత సురక్షితంగా ఎలా చేయగలుగుతుంది అనే దానికి సంబంధించి తెర వెనుక జరిగే దాన్ని తెలిపే సమాచారం

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

Google ప్రపంచంలోనే అతిపెద్ద, అలాగే సురక్షితమైన క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లలో ఒకటిగా పనిచేస్తుంది. దీని డేటా కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, అలాగే ఇవి జలాంతర్గామి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. మొత్తం వ్యవస్థ రోజులో ప్రతి క్షణం జాగ్రత్తగా పర్యవేక్షించబడుతుంది.

Google Play Protect

ప్రతిరోజూ, Play Protect మాల్‌వేర్, అలాగే వైరస్‌ల కోసం 50 బిలియన్ Android యాప్‌లను చెక్ చేస్తుంది. ప్రొవైడర్ Google Play Storeకు యాప్‌ను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మొదటి పరీక్ష జరుగుతుంది. యూజర్‌లు యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలనుకున్నప్పుడు లేదా దాన్ని వారి పరికరంలో ఉపయోగించాలనుకున్నప్పుడు Google Play Protect కూడా ఉంటుంది. ఈ సర్వీస్ హాని కలిగించగల యాప్‌ను గుర్తించినప్పుడు, Google యూజర్‌ను హెచ్చరిస్తుంది లేదా యాప్‌ను ఆటోమేటిక్‌గా తీసివేస్తుంది. మరింత సమాచారం కోసం, android.comను సందర్శించండి.

ఎన్‌క్రిప్షన్

Gmail ద్వారా పంపిన ఈమెయిల్‌లు, అలాగే యూజర్‌లు క్లౌడ్‌లో సేవ్ చేసే ఫోటోగ్రాఫ్‌లను రక్షించడానికి Google HTTPS, ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ వంటి పలు రకాలైన ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. Google సెర్చ్ ఇంజిన్ HTTPSను స్టాండర్డ్ ప్రోటోకాల్‌గా కూడా ఉపయోగిస్తుంది.

డేటా రిక్వెస్ట్‌లను చెక్ చేయడం

Google, ఇంటెలిజెన్స్ లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు యూజర్ డేటాకు నేరుగా యాక్సెస్ ఇవ్వదు. ఇది అమెరికా, జర్మనీల లాగానే ప్రపంచంలోని ప్రతి దేశానికీ వర్తిస్తుంది. యూజర్ డేటాకు యాక్సెస్ కోసం ఒక అధికారులు రిక్వెస్ట్ చేసినప్పుడు, Google ఆ రిక్వెస్ట్‌ను పరిశీలిస్తుంది, అలాగే మంచి కారణం లేకుండా యాక్సెస్‌ను మంజూరు చేయదు. Google కొన్నిసంవత్సరాలుగా పారదర్శకత రిపోర్ట్‌లను పబ్లిష్ చేసింది, దానిలో డేటా కోసం రిక్వెస్ట్‌లు కూడా భాగంగా ఉన్నాయి. రిపోర్ట్‌లను చదవడానికి, transparencyreport.google.comను సందర్శించండి.

సురక్షితమైన సర్ఫింగ్

Google సురక్షిత బ్రౌజింగ్ టెక్నాలిజీ యూజర్‌లను ప్రమాదకరమైన సైట్‌లు, అలాగే హానికరమైన సాఫ్ట్‌వేర్‌ల బారినపడటం నుండి రక్షిస్తుంది. దాని ప్రధాన భాగం అనుమానాస్పద వెబ్‌సైట్‌ల అడ్రస్‌లతో కూడిన డేటాబేస్‌ను కలిగి ఉంది. యూజర్ ఈ సైట్లలో ఒకదాన్ని సందర్శించడానికి ప్రయత్నిస్తే, అతను లేదా ఆమె ఒక హెచ్చరికను అందుకుంటారు. కొత్తగా అభివృద్ధి చేసిన ఫిషింగ్ వ్యూహాలను ఎదుర్కోవడానికి Google ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా ఉపయోగిస్తుంది. మరింత చదవడానికి, safebrowsing.google.comను సందర్శించండి.

లొసుగులను మూసివేయడం

ప్రతి సంవత్సరం, Google పరిశోధన ప్రాజెక్ట్‌లలోను, అలాగే “బగ్స్‌ను కనుగొనడం”లోను - మిలియన్‌ల డాలర్‌లను పెట్టుబడి పెడుతుంది. నిగూఢ సెక్యూరిటీ లొసుగులను కనుగొనడంలో కంపెనీకి సహాయపడే IT నిపుణులకు ఇవి రివార్డ్‌లుగా అందజేయబడతాయి. అలాంటి నిపుణులలో ఒకరు ఉరుగ్వేకు చెందిన 18 ఏళ్ల ఎజెక్వియల్ పెరీరా, ఇటువంటి అంతరాలను గుర్తించడంలో Googleకు సహాయపడ్డారు. అతను ఈ ముఖ్యమైన అంశాన్ని గుర్తించినందుకు, గత సంవత్సరం $36,337 రివార్డ్‌ను అందుకున్నారు.

ప్రాజెక్ట్ జీరో

హ్యాకర్‌లు, డేటా దొంగలు కనుగొనే ముందే భద్రతా లొసుగులను మూసివేయడానికి Googleకు చెందిన ఎలీట్ సెక్యూరిటీ టీమ్ తీవ్రంగా కృషి చేస్తుంది. నిపుణులు ఈ అంతరాలను "జీరో బలహీనతల రోజు"గా పిలుస్తారు, అందుకే ఈ టీమ్‌కు ప్రాజెక్ట్ జీరో అని పేరు పెట్టారు. ఈ టీమ్ Google సర్వీస్‌లలో మాత్రమే కాకుండా; పోటీదారుల సర్వీస్‌లలో బలహీనతలను కూడా చూస్తుంది, కనుక ఇది వారికి తెలియజేసి, వారి యూజర్‌లను కూడా రక్షించుకోవడంలో సహాయపడుతుంది. ప్రాజెక్ట్ జీరో పనితీరు గురించి మరింత సమాచారం కోసం, googleprojectzero.blogspot.comను సందర్శించండి.

ఇతర IT ప్రొవైడర్‌లకు సహాయం చేయడం

Google పరిధికి వెలుపల కూడా ఇంటర్నెట్‌ను సురక్షితంగా ఉంచే ప్రయత్నంలో Google తన సెక్యూరిటీ టెక్నాలజీలను ఇతర కంపెనీలకు ఛార్జీ విధించకుండానే అందుబాటులో ఉంచుతుంది. ఉదాహరణకు, ఇతర కంపెనీలలో డెవలపర్‌లు క్లౌడ్ సెక్యూరిటీ స్కానర్‌ను ఉపయోగించి బలహీనతలను సెర్చ్ చేయవచ్చు. అలాగే Google సురక్షిత బ్రౌజింగ్ టెక్నాలజీని Apple వారి Safari బ్రౌజర్, అలాగే Mozilla Firefox ఉపయోగిస్తున్నాయి.

స్పామ్ రక్షణ కోసం AIకు ధన్యవాదాలు

Gmail యూజర్‌లను స్పామ్ నుండి రక్షించడానికి Google మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తుంది. న్యూరల్ నెట్‌వర్క్‌లు కోట్లాది అయాచిత లేదా అవాంఛిత ఈమెయిల్స్‌ను విశ్లేషిస్తాయి, అలాగే స్పామ్‌ను గుర్తించడానికి అనుమతించే ఆకృతులను గుర్తిస్తాయి. ఈ విధానం విజయవంతమైందని నిరూపించబడింది. ఇప్పుడు, యూజర్‌ల ఇన్‌బాక్స్‌లలోకి వెయ్యిలో ఒకటి కంటే తక్కువ స్పామ్ ఈమెయిల్స్ వస్తున్నాయి - అలాగే ఆ సంఖ్య ప్రతిరోజూ తగ్గుతూ వస్తుంది!

దిగువ అందించిన లింక్‌లో మరిన్నిటిని కనుగొనండి:

safety.google

ఉదాహరణలు: రాబర్ట్ శామ్యూల్ హాన్సన్

సైబర్ సెక్యూరిటీ పురోగతులు

ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్‌లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.

మరింత తెలుసుకోండి