మీ డిజిటల్ లైఫ్,
Pixel ద్వారా సురక్షితం.

మీ ఫోన్ మీ డిజిటల్ లైఫ్‌కి హృదయం లాంటిది. అంటే, మీకు అత్యంత వ్యక్తిగతమైన సమాచారం, అలాగే ప్రైవేట్ సమాచారంలో కొంత ఇందులో ఉంటుంది. అందుకే మేము Pixel ఫోన్‌ను సెక్యూరిటీ, అలాగే గోప్యత కీలకమైన ప్రధాన అంశాలుగా ఉండేలా డిజైన్ చేశాము.

Pixel
మీ డేటాను సురక్షితంగా ఉంచే అన్ని మార్గాలు.

డిజైన్ ద్వారా సెక్యూరిటీ

మీ డేటా మొత్తం పలు సెక్యూరిటీ లేయర్‌ల రక్షణలో ఉంది.

ప్రామాణీకరణ

ప్రామాణీకరణ, మీ ఫోన్‌కు మీకు మాత్రమే యాక్సెస్ ఉండేలా చేయడంలో సహాయపడుతుంది.

Pixel ఇంటెలిజెన్స్

పరికరంలోని ఇంటెలిజెన్స్ మీ డేటాను మరింత ప్రైవేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

రక్షణ, కంట్రోల్స్

మీరు డౌన్‌లోడ్ చేసే, బ్రౌజ్ చేసే, అలాగే షేర్ చేసే వాటి కోసం సులువుగా ఉపయోగించగలిగే గోప్యతా కంట్రోల్స్, చురుకైన సెక్యూరిటీ.

డిజైన్ ద్వారా సెక్యూరిటీ

మీ ఫోన్‌ను, డేటాను, ప్రైవేట్‌గా, భద్రంగా, అలాగే సురక్షితంగా ఉంచడంలో సహాయపడటం కోసం మేము Pixel హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కలిసి పనిచేసే విధంగా డిజైన్ చేశాము.

Titan™ M చిప్

Titan™ M చిప్

Titan M ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ సెక్యూరిటీ చిప్ అనేది, అత్యంత సున్నితమైన మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడంలో సహాయపడేందుకు అనుకూలంగా ఉండే విధంగా తయారు చేయబడింది. Google క్లౌడ్ డేటా కేంద్రాల రక్షణకు మేము ఉపయోగించే చిప్ నుండే రూపొందించబడిన ఈ చిప్, యాప్‌లలో పాస్‌కోడ్ రక్షణ, ఎన్‌క్రిప్షన్, సురక్షితమైన లావాదేవీల వంటి అత్యంత గోప్యమైన ప్రాసెస్‌లను, సమాచారాన్ని, హ్యాండిల్ చేస్తుంది.

పరికరంలోని ఇంటెలిజెన్స్

Pixel ఫోన్‌లతో సహా, మా ప్రోడక్ట్‌లను మరింత సహాయకరంగా ఉండేలా చేయడానికి, Google చాలా సంవత్సరాలుగా మెషిన్ లెర్నింగ్ (ML)ను ఉపయోగిస్తూ వస్తోంది. పరికరంలోని ఇంటెలిజెన్స్, మీ ఫోన్‌లో ఉన్న Now Playing వంటి ఫీచర్‌లను, రికార్డర్ యాప్‌ను శక్తివంతం చేయడానికి ML మోడల్స్‌ను ఉపయోగిస్తుంది. దీని వలన మీ డేటాలో ఎక్కువ భాగం మీ ఫోన్‌లోనే ఉంటుంది, మీకు ప్రైవేట్‌గా కూడా ఉంటుంది.

మీ డేటాను ఎక్కువగా మీ పరికరంలోనే ఉంచే విధంగా MLను ఉపయోగించడంలో కొత్త మార్గాలను కనుగొనడానికి మేము ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూ వస్తున్నాము. అటువంటి మార్గాలలో ఒకటి, ఫెడరేటెడ్ లెర్నింగ్. ఈ కొత్త విధానం ML మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి వివిధ పరికరాల నుండి అజ్ఞాతీకరించబడిన సమాచారాన్ని కలిపి అందిస్తుంది. అలాగే ప్రత్యేకించి ఎవరి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోకుండా అందరి నుండి నేర్చుకోవడంలో మాకు సహాయపడుతుంది. ఫెడరేటెడ్ లెర్నింగ్ మీ గోప్యతను సంరక్షించడంలో మాకు సహాయపడుతుంది, అంతేకాకుండా Now Playing లాంటి మరింత సహాయకరమైన ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను మేము క్రియేట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. మరింత తెలుసుకోండి

హామీ ఇచ్చే, ఆటోమేటిక్‌గా జరిగే అప్‌డేట్‌లు

మీ Pixel ఫోన్ ఆటోమేటిక్‌గా తాజా OSను, సెక్యూరిటీ అప్‌డేట్‌లను కనీసం మూడు సంవత్సరాల పాటు అందుకుంటుంది1 Google యాప్‌లు Google Play ద్వారా అప్‌డేట్ చేయబడతాయి కాబట్టి, మీకిష్టమైన యాప్స్‌లో కొత్త ఫీచర్‌లు, సెక్యూరిటీ మెరుగుదలలు సిద్ధం అయిన వెంటనే మీరు వాటిని పొందుతారు.

నిరంతరాయంగా అప్‌డేట్‌లను పొందుతూ ఉండండి

ఫోన్‌ను ఉపయోగించడంలో మీకు అంతరాయం కలిగిస్తూ OS అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి బదులుగా, Pixel, ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసి, దానిని విభజన అనే ప్రత్యేకమైన స్టోరేజ్ విభాగంలో ఇన్‌స్టాల్ చేస్తుంది. మీరు ఫోన్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా ఉపయోగించేందుకు వీలుగా, ఇదంతా పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంది. అప్‌డేట్ ఇన్‌స్టాల్ అయి, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చేయవలసిందల్లా మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయడమే, దీనితో మీరు OS తాజా వెర్షన్‌ను పొందుతారు.

వెరిఫై చేయబడిన బూట్

మీరు మీ Pixelను ప్రారంభించిన ప్రతిసారీ, Titan M, అలాగే 'వెరిఫై చేయబడిన బూట్' రంగంలోకి దిగి, మీరు ఉపయోగిస్తున్న OS, Google నుండి వచ్చినదేనని, ట్యాంపర్ చేయబడలేదని నిర్ధారించడంలో సహాయపడతాయి. మీ Pixelలో అత్యంత తాజా OS వెర్షన్ ఉందని నిర్ధారించడానికి 'వెరిఫై చేయబడిన బూట్', Titan Mలో స్టోర్ చేయబడిన సమాచారాన్ని చెక్ చేస్తుంది. అలాగే ఏదైనా పాత వెర్షన్‌ను ఉపయోగించకుండా మీ Pixelను నివారిస్తుంది. దీని వల్ల ఇప్పటికే బయటపడిన సెక్యూరిటీ ప్రమాదాలు ఉండటానికి అవకాశం ఉన్న OS మునుపటి వెర్షన్‌లను, దాడి చేసే వారు లోడ్ చేయకుండా నివారించడంలో సహాయం లభిస్తుంది, మీ ఫోన్ సురక్షితంగా ఉంటుంది.

ప్రామాణీకరణ

మీ ఫోన్‌ను ఇతరులు యాక్సెస్ చేయకుండా నివారించడంలో సహాయపడే విధంగా, Pixelలో బిల్ట్-ఇన్ ప్రామాణీకరణతో కూడిన సెక్యూరిటీ ఉంటుంది.

Pixelను అన్‌లాక్ చేయడం

Pixelను అన్‌లాక్ చేయడం

మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడం అనేది సులభతరంగా, వేగవంతంగా, సురక్షితంగా ఉండాలి. Pixel 4aలోని Pixel Imprint లాంటి ఫీచర్‌లు మీ ఫోన్‌కు మీకు మాత్రమే యాక్సెస్ ఉండేలా చూడటంలో సహాయపడతాయి. అవి మీకు ఇష్టమైన యాప్‌లలో సురక్షితంగా పేమెంట్‌లు చేసే వీలును కూడా కల్పిస్తాయి. మీ వేలిముద్ర డేటా సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది, ఎప్పటికీ మీ ఫోన్‌లోనే ఉంటుంది.

Pixel 4లోని ఫేస్ అన్‌లాక్, మీ ముఖ డేటా ఎప్పుడూ క్లౌడ్‌కు అప్‌లోడ్ కావడం లేదా ఇతర సర్వీస్‌లకు షేర్ చేయడం జరగకుండా ఉండటం కోసం, మీ ఫోన్‌లో ప్రాసెస్ అయ్యే ముఖ గుర్తింపును ఉపయోగిస్తుంది. ముఖ ఇమేజ్‌లను ఎప్పుడూ స్టోర్ చేయడం లేదా వాటి నిల్వను కొనసాగించడం జరగదు. మీ గోప్యతను, సెక్యూరిటీని కాపాడటం కోసం, అన్‌లాక్ చేయడానికి ఉపయోగించే మీ ముఖ డేటా Pixelలోని Titan M సెక్యూరిటీ చిప్‌లో సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది, మీ ఫోన్‌లో మిగిలిన భాగానికి గాని, ఆపరేటింగ్ సిస్టమ్‌కి గాని అది అందుబాటులో ఉండదు.

Find My Device

మీరు ఎప్పుడైనా మీ Pixelను ఎక్కడైనా మర్చిపోతే, Find My Device సహాయం చేయగలుగుతుంది.2 మీరు ఏదైనా బ్రౌజర్‌లో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా గానీ లేదా ఏదైనా Android పరికరంలోని Find My Device యాప్ ద్వారా గానీ మీ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టి దానిని రింగ్ అయ్యేలా చేయవచ్చు.

Find My Device రిమోట్ విధానంలో మీ ఫోన్‌ను లాక్ చేసేందుకు లేదా లాక్ స్క్రీన్‌పై మెసేజ్‌ను ప్రదర్శించడానికి కూడా వీలు కల్పిస్తుంది, కాబట్టి ఎవరికైనా ఫోన్ దొరికితే ఎవరిని కాంటాక్ట్ చేయాలో వారికి తెలుస్తుంది. ఫోన్ పోయిందని, ఇక ఎప్పటికీ దొరకదని మీరు ఖచ్చితంగా అనుకుంటే, రిమోట్ విధానంలో మీ డేటా అంతటినీ తొలగించి ఫ్యాక్టరీ రీసెట్ చేయగలుగుతారు. మరింత తెలుసుకోండి

ఫ్యాక్టరీ రీసెట్ రక్షణ

దొంగతనాలను నిరోధించే మెరుగైన రక్షణ కోసం, ప్రతి Pixelతోనూ ఫ్యాక్టరీ రీసెట్ రక్షణ అందుబాటులో ఉంటుంది. ఇది మీ పాస్‌కోడ్ లేదా Google ఖాతా పాస్‌వర్డ్ లేకుండా ఎవరూ మీ ఫోన్‌ను తిరిగి యాక్టివేట్ చేయకుండా చూడడంలో సహాయపడుతుంది. మీ ఫోన్‌ను మేము భద్రంగా, సురక్షితంగా ఉంచే అనేక మార్గాలలో ఇది ఒకటి. మరింత తెలుసుకోండి

Pixel మేధస్సు

పరికరంలోని మెషిన్ లెర్నింగ్, AIలలో మేము సాధించిన పురోగతి వలన, మరింత డేటా మీ ఆధీనంలోనే ఉండటంతో పాటు, Pixel మరింత సహాయకరంగా ఉంటుంది.

Now Playing

Now Playing

మీ Pixel, మీ చుట్టుపక్కల ప్లే అయ్యే మ్యూజిక్‌ను, Now Playingతో గుర్తించగలుగుతుంది. పాటలను గుర్తించే ఇతర సర్వీస్‌లలా కాకుండా, ప్రాసెస్ విధానం అంతా మీ Pixelలోనే జరిగిపోతుంది. కాబట్టి, పాట వచ్చినప్పుడు, మీ ఫోన్, ఎటువంటి ఆడియోను బయటికి పంపకుండానే, మ్యూజిక్‌లోని కొద్ది సెకన్లను, పరికరంలోని మ్యూజిక్ డేటాబేస్‌తో సరిపోల్చి, ప్లే అవుతున్నది ఏమిటో త్వరితంగా గుర్తిస్తుంది. Now Playing త్వరితంగా పనిచేస్తుంది, గోప్యతను కల్పిస్తుంది.

Pixel 4లో, Now Playing, ఫెడరేటెడ్ ఎనలిటిక్స్ అనే గోప్యతా పరిరక్షణ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఏ ఫోన్ నుండి ఏయే పాటలు విన్నారనే విషయాన్ని బయటపెట్టకుండానే, Pixel ఫోన్‌లు అన్నింటా అత్యంత తరుచుగా గుర్తుపట్టబడిన పాటలను, ప్రాంతాలవారీగా ఇది కనిపెడుతుంది. ఈ సమగ్ర డేటాను ఉపయోగించి, వ్యక్తులు ఎక్కువగా వినే అవకాశం ఉన్న పాటల డేటాబేస్‌ను, మీరు ఏం వింటారనేది Google ఎప్పుడూ చూడకుండా ఉండే పద్ధతిలో, పరికరంలో అప్‌డేట్ చేస్తుంది. మరింత తెలుసుకోండి

ముఖ్యమైన ముఖాలు

ఈ Pixel ఫీచర్, మీరు ఎక్కువగా ఎవరి ఫోటోలు తీస్తారో అర్థం చేసుకొని, అత్యుత్తమ షాట్‌లయిన ఫోటోలను, అంటే వారు కనురెప్పలు మూసుకొని ఉన్నవి కాకుండా, చిరునవ్వుతో ఉన్న వాటిని క్యాప్చర్ చేస్తుంది. ఇలా చేయడం కోసం Pixel, మీ ఫోటోలలో చాలా తరచుగా కనిపించే ముఖాల సమాచారాన్ని సేకరించి, దానిని ప్రాసెస్ చేసి సేవ్ చేస్తుంది. ఈ సమాచారం నిజ జీవితంలోని గుర్తింపుతో ముడిపడి ఉండదు. ఇది పూర్తిగా మీ పరికరంలోనే జరుగుతుంది, ఎప్పడూ Googleకు అప్‌లోడ్ చేయబడడం గానీ, Google ఖాతాకు అనుబంధించబడటం గానీ, లేదా ఇతర యాప్‌లతో షేర్ చేయబడటం గానీ జరగదు. ముఖ్యమైన ముఖాలు ఫీచర్ ఆటోమేటిక్ సెట్టింగ్‌గా ఆఫ్‌లో ఉంటుంది, ముఖ్యమైన ముఖాలు డేటా అంతా కూడా, దానిని ఎప్పుడు డిజేబుల్ చేసినా తొలగించబడుతుంది.

స్క్రీన్ అటెన్షన్

స్క్రీన్ అటెన్షన్‌తో చూస్తున్నప్పుడు, మీ స్క్రీన్‌ను ఆన్‌లో ఉంచండి. స్క్రీన్ అటెన్షన్ అనే ఫీచర్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ను, అలాగే ఫ్రంట్ కెమెరాను ఉపయోగిస్తూ, ఎవరైనా స్క్రీన్ వైపు చూస్తుంటే ఆ విషయాన్ని గుర్తిస్తుంది. తద్వారా మీ ఫోన్ స్క్రీన్‌ను, స్లీప్ మోడ్‌లోకి వెళ్లకుండా నివారిస్తుంది. ఈ విశ్లేషణ అంతా పరికరంలోనే జరుగుతుంది. ఎటువంటి డేటాను స్టోర్ చేయడం గానీ, షేర్ చేయడం గానీ, Googleకు పంపడం గానీ జరగదు. మీరు డిస్‌ప్లే సెట్టింగ్‌లలో ఎప్పుడైనా సరే స్క్రీన్ అటెన్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

Motion Sense

Motion Sense

సంజ్ఞలను గుర్తించి, ఎవరైనా సమీపంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోవడానికి, Pixel 4, మోషన్ సెన్సింగ్ రాడార్ చిప్ అయిన Soliని, విశిష్టమైన సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. Motion Senseను మీరు3ఏ సమయంలో అయినా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. సెన్సార్ డేటా అంతా మీ Pixelలోనే ప్రాసెస్ చేయబడుతుంది. అది ఎప్పుడూ మీ Google సర్వీస్‌లతో గాని, ఇతర యాప్‌లతో గాని సేవ్ లేదా షేర్ చేయబడదు.

కాలర్ ID, స్పామ్ రక్షణ

తెలియని నంబర్‌ల నుండి వచ్చే కాల్స్ స్కామ్‌లు కావచ్చు. అందువల్లే ప్రతి Pixel ఫోన్‌లోనూ కాలర్ ID, స్పామ్ రక్షణలు పొందుపరచబడి ఉన్నాయి. వీటి ద్వారా మీ కాంటాక్ట్‌లలో లేని కాలర్స్‌, లేదా బిజినెస్‌ల నుంచి వచ్చే కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని మీరు చూడవచ్చు. అలాగే స్పామ్ కాలర్స్‌ అయ్యే అవకాశం ఉన్న వారి గురించి హెచ్చరికలను పొందుతారు. మరింత తెలుసుకోండి

Messages కోసం వెరిఫై చేయబడిన SMS, స్పామ్ రక్షణ

Messages కోసం వెరిఫై చేయబడిన SMS అనే ఫీచర్, మీకు SMS పంపుతున్న బిజినెస్‌ల అసలైన గుర్తింపును తెలుసుకోవడంలో మీకు సహాయపడుతుంది. ఈ ఫీచర్ ఒక్కో మెసేజ్ చొప్పున, కంటెంట్ ఫలానా బిజినెస్ ద్వారా పంపబడిందని వెరిఫై చేసే పద్ధతిలో పని చేస్తుంది. ఒక మెసేజ్‌ను వెరిఫై చేసినప్పుడు, మెసేజ్ థ్రెడ్‌లో మీరు, బిజినెస్ పేరు, లోగోతో పాటు ధృవీకరణ బ్యాడ్జ్‌ను కూడా చూస్తారు. వెరిఫై చేయడం అన్నది Googleకు మీ మెసేజ్‌లను పంపకుండా జరుగుతుంది.

అంతే కాకుండా, మీకు మెసేజ్‌లను పంపుతున్న బిజినెస్‌లను వెరిఫై చేయడంతో పాటు మేము మిమ్మల్ని Messagesలో స్పామ్ నుండి రక్షించడానికి కృషి చేస్తున్నాము. Messages కోసం ఉద్దేశించిన స్పామ్ రక్షణ ద్వారా మేము గుర్తించిన అనుమానిత స్పామ్ మెసేజ్‌ల గురించి, సురక్షితం కాని వెబ్‌సైట్‌ల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తాము. Messagesలో అనుమానాస్పద స్పామ్ హెచ్చరికను మీరు చూస్తే, అది స్పామ్ అవునో కాదో మాకు తెలిజేయడం ద్వారా మా స్పామ్ మోడల్‌లను మెరుగుపరచడంలో మీరు మాకు సహాయపడవచ్చు. మీరు Messagesలో స్పామ్ SMSలను ఎప్పుడైనా సరే రిపోర్ట్ చేయవచ్చు, భవిష్యత్తులో మెసేజ్‌లు రాకుండా, సంబంధిత సంభాషణను బ్లాక్ చేయవచ్చు.

కాల్ స్క్రీనింగ్

Pixelలో కాల్ స్క్రీనింగ్ కూడా ఉంది,4మీరు కాల్‌ను పికప్ చేసేలోపు, Google Assistantను ఉపయోగించి, ఎవరు, ఎందుకు కాల్ చేస్తున్నారు అన్నది కనుగొనడంలో మీకు సహాయపడే ఫీచర్ ఇది. ఇది సమయాన్ని ఆదా చేయడంలోనూ, అవాంఛిత కాల్స్‌ను తప్పించడంలోనూ మీకు సహాయపడుతుంది. మీ గోప్యతను రక్షించడం కోసం, మీ కాల్‌కు చెందిన మాటల టైపింగ్, పూర్తిగా మీ పరికరంలోనే జరుగుతుంది. మరింత తెలుసుకోండి

Gboard

Pixelలోని ఆటోమేటిక్ సెట్టింగ్ కీబోర్డ్, మీరు మీ ఫ్రెండ్స్‌తోనూ, ఫ్యామిలీతోనూ వివిధ రకాలుగా కమ్యూనికేట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది - పదం పూర్తయ్యే దాకా వేలిని తీసివేయకుండా టైప్ చేయడం, వాయిస్ ద్వారా, సంజ్ఞల ద్వారా కమ్యూనికేట్ చేయడం కూడా ఇందులో ఉంటాయి. మీరు 900+ భాషల మధ్య టోగుల్ చేయగలుగుతారు, అలాగే GIFలు, ఎమోజిలు, స్టిక్కర్‌లు మరిన్నిటిని, యాప్‌లు మారే అవసరం లేకుండానే షేర్ చేయగలుగుతారు. మీరు ఏమి టైప్ చేస్తున్నారనే విషయాన్ని ప్రైవేట్‌గా ఉంచడం కోసం, Gboard, ఫెడరేటెడ్ లెర్నింగ్ అనే మెషిన్ లెర్నింగ్ విధానాన్ని ఉపయోగిస్తుంది. ఇది మీ మెసేజ్‌లు పరికరంలోనే ఉండేలా జాగ్రత్త వహిస్తూనే, Google, Gboardలో ఆటోమేటిక్ కరెక్షన్, పద సూచనలు, ఎమోజి సూచనల పనితీరును మెరుగు పరిచేలా చేస్తుంది. మరింత తెలుసుకోండి

లైవ్ క్యాప్షన్

కేవలం ఒక్క ట్యాప్‌తో లైవ్ క్యాప్షన్5 మీడియా, ఫోన్ కాల్స్‌కు సంబంధించిన మాటల టైపింగ్‌ను ఆటోమేటిక్‌గా చేస్తుంది. మీరు దానిని ఫోన్ కాల్స్, వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు, ఆడియో మెసేజ్‌ల కోసమే కాదు - మీ అంతట మీరు రికార్డ్ చేసే వాటి కోసం కూడా ఉపయోగించవచ్చు. లైవ్ క్యాప్షన్ మీ పరికరంలోనే పని చేస్తుంది, కాబట్టి, స్పీచ్‌ను గుర్తించిన మరుక్షణం, మీ స్క్రిన్‌పై క్యాప్షన్‌లు కనిపిస్తాయి. డేటా అంతా మీ ఫోన్‌లోనే ఉంటుంది.

అత్యుత్తమ షాట్

అత్యుత్తమ షాట్ ఆన్‌లో ఉన్నప్పుడు, పరికరంలోని కంప్యూటర్ విజన్ మోడల్ మీ ఫోటోల నుండి అత్యుత్తమ ఫ్రేమ్‌లను, లైటింగ్, హావభావాలు, కంపోజిషన్ వంటి నాణ్యతకు సంబంధించిన అంశాల ఆధారంగా గుర్తిస్తుంది. అప్పుడు అత్యుత్తమ షాట్ మీకు అన్నిటికంటే బాగా వచ్చిన ఇమేజ్‌లను సిఫార్సు చేస్తుంది. ఇదంతా మీ ఫోన్‌లోనే జరుగుతుంది. ప్రత్యామ్నాయ షాట్‌లు ఏవీ ఎప్పడూ క్లౌడ్‌కు అప్‌లోడ్ చేయబడవు, మీరు వాటిని సేవ్ చేయడాన్ని ఎంచుకుంటే తప్ప.

Google Assistant6

వాయిస్‌ను ఉపయోగించి మరిన్ని ప్రయోజనాలను పొందడానికి Google Assistant మీకు సహాయపడుతుంది. మీ Pixelలోని Google Assistant, "Ok Google" లాంటి పదబంధాలతో కూడిన యాక్టివేషన్‌ను గుర్తించే వరకు స్టాండ్‌బై మోడ్‌లో వేచి ఉండేలా డిజైన్ చేయబడింది. అలాగే, స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు Google Assistant మీరు చెప్పే వాటిని Googleకు గానీ లేదా ఇంకెవరికైనా గానీ పంపదు.

రక్షణ, కంట్రోల్స్

చురుకైన చర్యలు తీసుకోవడం ద్వారా Pixel మీ డేటాను సురక్షితంగా ఉంచి, మీరు వేటిని షేర్ చేస్తారనే దాని గురించి మీకు వివరణాత్మకమైన కంట్రోల్స్‌ను ఇస్తుంది.

Google Play Protect

Google Play Protect

Google Play స్టోర్‌లోని యాప్‌లన్నీ ఆమోదాన్ని పొందే ముందు కఠినమైన సెక్యూరిటీ టెస్టింగ్‌ను ఎదుర్కొంటాయి. మా మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ రోజుకు 100 బిలియన్ల వరకు యాప్‌లను స్కాన్ చేస్తుంది, తెర వెనుక ఉంటూ మీ పరికరానికి, డేటాకు, యాప్‌లకు, మాల్‌వేర్ నుండి భద్రత కల్పిస్తుంది. మీ యాప్‌లను, వాటిని మీరు ఎక్కడి నుండి డౌన్‌లోడ్ చేస్తున్నప్పటికీ, డౌన్‌లోడ్ కావడానికి ముందు, జరుగుతున్నప్పుడు, జరిగాక కూడా అది వాటిని స్కాన్ చేస్తుంది. మరింత తెలుసుకోండి

సురక్షిత బ్రౌజింగ్

మీరు ఎప్పుడైనా ప్రమాదకరమైన సైట్‌లకు నావిగేట్ చేయడానికి, లేదా ప్రమాదకరమైన ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే, Google సురక్షిత బ్రౌజింగ్ టెక్నాలజీ మీకు హెచ్చరికలను చూపించడం ద్వారా మిమ్మల్ని ఫిషింగ్ దాడుల నుండి కాపాడటంలో సహాయపడుతుంది. సురక్షిత బ్రౌజింగ్, వెబ్‌మాస్టర్‌లకు, వారి వెబ్‌సైట్‌లు హానికరమైన సాఫ్ట్‌వేర్‌ బారినపడినప్పుడు నోటిఫై చేసి, సమస్యను విశ్లేషించడంలోనూ, పరిష్కరించడంలోనూ సహాయపడతాయి.

సురక్షిత బ్రౌజింగ్ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతూ, మీ గోప్యతను రక్షించడానికి డిజైన్ చేయబడింది. ఇది ఫ్లాగ్ చేయబడిన సైట్‌ల లిస్ట్‌ను మీ పరికరంలో స్టోర్ చేస్తుంది. సదరు లిస్ట్‌లో ఉన్న సైట్‌ను మీరు సందర్శిస్తే, సైట్ URLలోని కొంత భాగాన్ని మీ బ్రౌజర్, కాపీ చేసి Googleకు పంపుతుంది. తద్వారా మేము తగు చర్య తీసుకోవడానికి సహాయపడుతుంది. మీరు షేర్ చేసే సమాచారం ఆధారంగా, మీరు నిజానికి ఏ సైట్‌ను సందర్శించారనేది Googleకు తెలియదు. మరింత తెలుసుకోండి

అనుమతులు

మీ ఫోటోలు లేదా లొకేషన్ వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని మీరు డౌన్‌లోడ్ చేసే యాప్‌లు యాక్సెస్ చేసే ముందు మీ అనుమతిని పొందాల్సి ఉంటుంది. అనుమతి రిక్వెస్ట్‌లు సందర్భానుసారంగా ఉండేలా డిజైన్ చేయబడ్డాయి, ఆ క్షణానికి మీకు అవసరమైతే తప్ప మీరు వాటిని పొందరు. మీరు మీ ఆలోచనను మార్చుకుంటే, సెట్టింగ్‌లలో అనుమతులను ఎప్పుడైనా సరే ఆఫ్ చేయవచ్చు. మీ లొకేషన్ డేటా విషయంలో, మీ లొకేషన్‌ను నిర్దిష్ట యాప్‌లు మాత్రమే బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్సెస్ చేయడానికి అనుమతించే విధంగానూ, యాప్‌ను ఉపయోగిస్తున్న సమయంలో మాత్రమే మీ లొకేషన్‌కు యాక్సెస్‌ను అనుమతించే విధంగానూ, లేదా మొత్తానికే యాక్సెస్‌ను అనుమతించని విధంగానూ చేయడానికి మీకు అదనపు కంట్రోల్స్ ఉంటాయి.

Google ఖాతా సెట్టింగ్‌లు

YouTube, Search, Google Maps వంటి Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, మరింత సహాయకరంగా, సందర్భోచితంగా ఉండటం కోసం మీ యాక్టివిటీ డేటాను ఉపయోగిస్తాయి. కానీ ఈ సమాచారాన్ని మేము ఏవిధంగా ఉపయోగించవచ్చు అన్న దాన్ని మీకు మీరుగా నిర్ణయించవచ్చు. అలాగే మేము ఎలాంటి డేటాను సేకరిస్తాము, ఎలా ఉపయోగిస్తాము, ఎందుకు సేకరిస్తాము అన్నది మీకు ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలియజేస్తాము. మేము మీ Google ఖాతాలో సులువుగా ఉపయోగించగలిగే డేటా కంట్రోల్స్‌ను రూపొందించాము. వాటి ద్వారా మీరు మీకు తగిన విధంగా ఉండే గోప్యతా సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు. మరింత తెలుసుకోండి

Pixel ఫోన్
Google స్టోర్‌లో
Pixel కోసం షాపింగ్ చేయండి
మేము రూపొందించే ప్రతీ ప్రోడక్ట్‌లో
భద్రతను ఎలా పొందుపరుస్తామో తెలుసుకోండి.