ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడంలో
సహాయపడటానికి టూల్స్, చిట్కాలు.
అత్యాధునిక సెక్యూరిటీతో మేము మీ గోప్యతను ఆటోమేటిక్‌గా సంరక్షిస్తాము. మీ ఆన్‌లైన్ సెక్యూరిటీని మేనేజ్ చేయడానికి, అలాగే మీ కోసం సరైన స్థాయి రక్షణను ఎంచుకోవడానికి మీరు తీసుకోవలసిన కొన్ని అదనపు దశలు ఉన్నాయి.
సెక్యూరిటీ చెకప్
సెక్యూరిటీ చెకప్ నిర్వహించండి
మీ Google ఖాతాను రక్షించడానికి ఒక సులభమైన మార్గం సెక్యూరిటీ చెకప్ చేయడం. ఈ దశల వారీ టూల్ మీ Google ఖాతాకు చెందిన సెక్యూరిటీని బలోపేతం చేయడానికి వ్యక్తిగతీకరించిన, చర్య తీసుకోగల సిఫార్సులను అందిస్తుంది.
2-దశల వెరిఫికేషన్
2-దశల వెరిఫికేషన్‌తో హ్యాకర్‌ల దాడి నుండి రక్షించుకోండి
2-దశల వెరిఫికేషన్ మీ ఖాతాలో లాగిన్ చేయడానికి, మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ మాత్రమే కాకుండా, మీరు రెండవ అంశాన్ని ఉపయోగించాల్సిన వీలు కల్పించడం ద్వారా మీ ఖాతాకు యాక్సెస్ లేని ఎవ్వరినైనా అడ్డుకోవడంలో సహాయపడుతుంది. టార్గెట్ చేసిన ఆన్‌లైన్ దాడులకు గురయ్యే అవకాశం ఉన్నవారికి, మరింత శక్తివంతమైన భద్రత అవసరమయ్యే వారి కోసం, మేము అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ను క్రియేట్ చేశాము.
చిన్న సహాయం.
శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి
ప్రతి ఖాతాకు శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం అనేది మీ గోప్యతను రక్షించడానికి మీరు తీసుకోగల అత్యంత కీలకమైన దశలలో ఒకటి. మీ Google ఖాతా, సోషల్ మీడియా ప్రొఫైల్‌లు, రిటైల్ వెబ్‌సైట్‌ల వంటి పలు ఖాతాల్లోకి లాగిన్ చేయడానికి ఒకే రకమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తుంటే, అది మీ సెక్యూరిటీకి సంబంధించిన రిస్క్‌ను పెంచుతుంది.
మీ పాస్‌వర్డ్‌లు అన్నింటినీ ట్రాక్ చేస్తూ ఉండండి
మీ Google ఖాతాలో ఉన్నటువంటి పాస్‌వర్డ్ మేనేజర్, మీరు సైట్‌లు, యాప్‌లలో ఉపయోగించే పాస్‌వర్డ్‌లను రక్షించడంలో, అలాగే ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. మీ ఖాతాలకు సురక్షితంగా, సులభంగా సైన్ ఇన్ చేయడం కోసం, మీ పాస్‌వర్డ్‌లన్నింటిని క్రియేట్ చేయడం, గుర్తుంచుకోవడం, అలాగే సురక్షితంగా స్టోర్ చేయడంలో Google పాస్‌వర్డ్ మేనేజర్ మీకు సహాయపడుతుంది.
సెక్యూరిటీకి సంబంధించిన సమస్యలను తెలుసుకునేందుకు, మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయండి
మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు ఎంత శక్తివంతంగా ఉన్నాయో, ఎంత సురక్షితంగా ఉన్నాయో త్వరిత పాస్‌వర్డ్ చెకప్‌తో చెక్ చేయండి. థర్డ్-పార్టీ సైట్‌లు లేదా ఖాతాలకు సంబంధించి మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు ఏవైనా చోరీకి గురయ్యాయేమో తెలుసుకోండి, అవసరమైతే సులభంగా వాటిని మార్చుకోండి.
-
మీరు మీ ఫోన్‌ను కోల్పోతే, దాన్ని లాక్ చేయండి
మీ ఫోన్ ఎప్పుడైనా పోయినా లేదా దొంగిలించబడినా, మీరు మీ Google ఖాతాను సందర్శించి, మీ డేటాను కొన్ని త్వరిత దశల్లో రక్షించడానికి “మీ ఫోన్‌ను కనుగొనండి” ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మీ వద్ద Android లేదా iOS పరికరం ఉంటే, మీరు మీ ఫోన్‌ను రిమోట్ విధానంలో గుర్తించవచ్చు, అలాగే లాక్ చేయవచ్చు, తద్వారా ఎవరూ మీ ఫోన్‌ను ఉపయోగించలేరు, మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు.
-
అప్డేట్ అయ్యి ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి
మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న తాజా వెర్షన్‌ను వాడుతున్నట్లు నిర్ధారించుకోవడానికి మీరు సాధారణంగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు రివ్యూ చేయండి. Chrome బ్రౌజర్‌తో సహా కొన్ని సర్వీస్‌లు ఆటోమేటిక్‌గా అప్డేట్ చేయబడతాయి కాబట్టి మీరు తాజా సెక్యూరిటీ ఫీచర్లు, అలాగే సమస్య పరిష్కారాలను కలిగి ఉంటారు.
-
మీ ఫోన్‌కు హాని కలిగించగల యాప్‌లను బ్లాక్ చేయండి
Android కోసం Googleకు చెందిన బిల్ట్-ఇన్ మాల్వేర్ రక్షణ, Google Play Protectలతో మేము మీ పరికరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము, అయితే మీరు ఎల్లప్పుడూ తప్పనిసరిగా విశ్వసించే సోర్స్ నుండి మాత్రమే మీ మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ డేటాను భద్రంగా ఉంచడానికి, మీ యాప్‌లను రివ్యూ చేయండి, మీరు ఉపయోగించని వాటిని తొలగించండి, యాప్ ఆటో-అప్డేట్లను ఎనేబుల్ చేయండి, అలాగే మీ లొకేషన్, ఫోటోల వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారానికి యాప్ యాక్సెస్‌ను పరిమితం చేయండి.
-
స్క్రీన్ లాక్‌ను ఉపయోగించండి
మీరు మీ కంప్యూటర్, లాప్టాప్, టాబ్లెట్ లేదా ఫోన్‌ను ఉపయోగించనప్పుడు, మీ పరికరాన్ని ఇతరులు తెరవకుండా ఉండడానికి మీ స్క్రీన్‌ను లాక్ చేయండి. అదనపు భద్రత కోసం, మీ పరికరం స్లీప్‌లోకి వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా లాక్ అయ్యేలా సెట్ చేయండి.
-
సురక్షిత నెట్‌వర్క్‌లను ఉపయోగించండి
పబ్లిక్ లేదా ఉచిత Wi-Fi నెట్‌వర్క్‌కు పాస్‌వర్డ్ ఉన్నప్పటికీ, దాన్ని ఉపయోగించడంలో జాగ్రత్త వహించండి.ఈ నెట్‌వర్క్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడకపోవచ్చు, కాబట్టి మీరు పబ్లిక్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసినప్పుడు, మీరు సందర్శించే వెబ్సైట్లు, మీరు సైట్లలో టైప్ చేసే సమాచారం వంటి మీ ఇంటర్నెట్ యాక్టివిటీని సమీపంలోని ఎవరైనా పర్యవేక్షించగలరు. పబ్లిక్ లేదా ఉచిత Wi-Fi మాత్రమే మీకు అందుబాటులో ఉంటే, సైట్‌కు మీ కనెక్షన్ సురక్షితంగా లేకుంటే అడ్రస్ బార్లో Chrome బ్రౌజర్ మీకు తెలియజేస్తుంది.
సురక్షితమైన Wi-Fi కనెక్షన్లను ఉపయోగించడానికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి మరింత తెలుసుకోవడానికి, అలాగే మీ స్వంత Wi-Fi నెట్‌వర్క్‌ను ఎలా సురక్షితంగా ఉంచాలో అనే దానికి సంబంధించిన చిట్కాల కోసం ఈ వీడియో చూడండి.
-
గోప్యమైన సమాచారాన్ని ఎంటర్ చేయడానికి ముందు మీ కనెక్షన్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి
మీరు వెబ్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు – ముఖ్యంగా మీరు పాస్‌వర్డ్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్ లాంటి గోప్యమైన సమాచారాన్ని ఎంటర్ చేయాలనుకున్నప్పుడు - మీరు సందర్శించే సైట్లకు కనెక్షన్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి. ఏదైనా కనెక్షన్ యొక్క ఆటోమేటిక్ సెట్టింగ్ స్టేట్ సురక్షితంగా ఉంటుంది. కనెక్షన్ సురక్షితంగా లేకుంటే, Chrome బ్రౌజర్ అడ్రస్ బార్లో ఎరుపు రంగులో ఉన్న సురక్షింతగా లేదు చిప్‌ను డిస్ప్లే చేస్తుంది. HTTPS అనేది మీ బ్రౌజర్ లేదా యాప్‌లను మీరు సందర్శించే వెబ్సైట్లతో సురక్షితంగా కనెక్ట్ చేయడం ద్వారా మీ బ్రౌజింగ్‌ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
-
Google లొకేషన్ ఖచ్చితత్వం
లొకేషన్ సర్వీస్‌లను మెరుగుపరచడానికి 'Google లొకేషన్ ఖచ్చితత్వం' వైర్లెస్ యాక్సెస్ పాయింట్లు, GPS, సెల్ టవర్, అలాగే సెన్సార్ డేటా నుండి పబ్లిక్‌గా ప్రసారం చేసిన Wi-Fi డేటాను ఉపయోగిస్తుంది. మీ Wi-Fi యాక్సెస్ పాయింట్‌ను గురించిన సమాచారం సేకరించకుండా ఎలా నిలిపివేయాలనే సూచనల కోసం, ఇక్కడ మరింత తెలుసుకోండి.
ఫిషింగ్ ప్రయత్నాలను నివారించండి
స్కామ్ చేసే వారు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో తెలుసుకోండి
స్కామ్ చేసే వారు తమ స్కామ్‌లను చట్టబద్ధమైన మెసేజ్‌ల రూపంలో పంపడం ద్వారా సదరు చట్టబద్ధ సంస్థలకు లేదా వ్యక్తులకు ఉన్న పేరు ప్రతిష్ఠలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేయవచ్చు. స్కామ్ చేసే వారు మిమ్మల్ని మోసం చేయడానికి ఇమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, ఆటోమేటిక్ కాల్స్‌తో పాటు, హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగిన వెబ్‌సైట్‌లను కూడా ఉపయోగించవచ్చు.
అనుమానాస్పద URLలు లేదా లింక్‌లు నిజమైనవేనా? కాదా? అన్నది ప్రతిసారి ధృవీకరించుకోండి
ఫిషింగ్ అనేది పాస్‌వర్డ్ లేదా బ్యాంక్ వివరాల వంటి కీలకమైన వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని బహిర్గతం చేసేలా మిమ్మల్ని మోసగించే ఒక ప్రయత్నం. ఇది నకిలీ లాగిన్ పేజీ వంటి అనేక రూపాలలో ఉండవచ్చు. ఫిషింగ్ బారిన పడకుండా ఉండటానికి, అనుమానాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు; వెబ్‌సైట్ లేదా యాప్ చట్టబద్ధమైనదని నిర్ధారించుకోవడానికి - లింక్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచడం ద్వారా లేదా మొబైల్‌లో టెక్స్ట్‌ను ఎక్కువసేపు నొక్కి, ఉంచడం ద్వారా - URLను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి; అలాగే URL అనేది “https”తో ప్రారంభమవుతోందని నిర్ధారించుకోండి.
మరొక వ్యక్తిలా నటించే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి
స్కామ్ చేసే వారు ప్రభుత్వ లేదా లాభాపేక్ష రహిత సంస్థల వంటి చట్టబద్ధమైన సంస్థలుగా నటిస్తారు. అధికారిక రిసోర్స్ అని క్లెయిమ్ చేసే వారి నుండి వచ్చిన మెసేజ్‌లను చదివేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వారు ఎవరైనా మీకు ఇమెయిల్ పంపినప్పుడు, ఆ మెసేజ్ అసాధారణమైనదిగా కనిపిస్తే, వారి ఖాతా హ్యాక్ చేయబడి ఉండవచ్చు. మీకు వచ్చిన ఇమెయిల్ మోసపూరితమైనది కాదు అని నిర్ధారించుకునే వరకు, మెసేజ్‌కు రిప్లయి ఇవ్వవద్దు లేదా ఏవైనా లింక్‌లను క్లిక్ చేయవద్దు. డబ్బు కోసం చేసే అత్యవసర రిక్వెస్ట్‌ల పట్ల, విదేశాలలో చిక్కుకుపోయాం అంటూ వచ్చే దీన గాథల పట్ల లేదా తన ఫోన్ దొంగతనానికి గురయిందని, కాల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని క్లెయిమ్ చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
ఇమెయిల్ స్కామ్‌లు లేదా వ్యక్తిగత సమాచారం కోసం చేసే రిక్వెస్ట్‌ల విషయంలో జాగ్రత్త వహించండి
అపరిచితుల నుండి వచ్చిన మెసేజ్‌లు అనుమానాస్పదంగా ఉండవచ్చు, అలాగే మీకు విశ్వసనీయమైన బ్యాంక్ లాగా నటిస్తూ వేరే వారి దగ్గర నుండి వచ్చే కమ్యూనికేషన్ కూడా ఒక వంచన కావచ్చు. వ్యక్తిగత సమాచారం గురించి అడిగే అనుమానాస్పద ఇమెయిల్‌లు, ఇన్‌స్టంట్ మెసేజ్‌లు లేదా పాప్-అప్ విండోలకు రిప్లయి ఇవ్వవద్దు. అనుమానాస్పద లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు లేదా సందేహాస్పద ఫారమ్‌లలో లేదా సర్వేలలో వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయవద్దు. ఒక లాభాపేక్ష రహిత సంస్థ, మిమ్మల్ని విరాళం అడిగితే, మీకు పంపిన లింక్‌పై క్లిక్ చేయకుండా నేరుగా సదరు సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి విరాళం ఇవ్వండి.
ఫైళ్లను డౌన్‌లోడ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరి చూసుకోండి
కొన్ని అధునాతన ఫిషింగ్ దాడులు, వైరస్ సోకిన డాక్యుమెంట్‌లు, PDF అటాచ్‌మెంట్‌ల ద్వారా జరగవచ్చు. మీకు అనుమానాస్పద అటాచ్‌మెంట్ కనిపిస్తే, దాన్ని తెరవడానికి Chrome లేదా Google Driveను ఉపయోగించండి. మేము ఫైల్‌ను ఆటోమేటిక్‌గా స్కాన్ చేస్తాము, ఒకవేళ మేము వైరస్‌ను గుర్తించినట్లయితే మిమ్మల్ని హెచ్చరిస్తాము.
మరిన్ని మార్గాలను తెలుసుకోండి.
-
బిల్ట్-ఇన్ సెక్యూరిటీఆటోమేటిక్ సెక్యూరిటీ రక్షణల గురించి మరింత తెలుసుకోండి.
-
గోప్యతా కంట్రోల్స్మీకు సరిపోయే గోప్యతా సెట్టింగ్‌లను ఎంచుకోండి.
-
డేటా ప్రాక్టీస్లుబాధ్యతాయుతమైన డేటా ప్రాక్టీస్‌లతో మీ గోప్యతను ఎలా గౌరవిస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
-
యాడ్లు, డేటామా ప్లాట్‌ఫామ్‌లలో మీరు చూసే యాడ్ల గురించి మరింత తెలుసుకోండి.