మా గోప్యతా సూత్రాలు

అందరి కోసం డిజైన్‌లోనే గోప్యత చేర్చబడి ఉండే ప్రోడక్ట్‌లను రూపొందించడం.

మేము ప్రోడక్ట్‌లను డిజైన్ చేసే దశ నుండే యూజర్ల గోప్యతను దృష్టిలో పెట్టుకుని, వాటిని అందరూ సులభంగా వాడగలిగేలా రూపొందిస్తాము. మేము ఉపయోగించే డేటా గురించి, దానిని ఎలా ఉపయోగిస్తున్నాము, ఎలా సంరక్షిస్తున్నాము అనే అంశాలను మేము గమనంలో పెట్టుకుంటామని దీని అర్థం.

డేటాను గోప్యంగా, సురక్షితంగా ఉంచడానికి, మీ సమాచారాన్ని మీ కంట్రోల్‌లోనే ఉంచడానికి ఈ సూత్రాలు మా ప్రోడక్ట్‌లను, ప్రాసెస్‌లను నిర్దేశిస్తాయి.

1.

మీ వ్యక్తిగత సమాచారాన్ని, మేము ఎప్పటికీ విక్రయించము, ఎవరికీ విక్రయించము.

మేము ముఖ్యమైన క్షణాల్లో Google ప్రోడక్ట్‌లు సహాయకరంగా ఉండేలా చేయడానికి డేటాను ఉపయోగిస్తాము. సమీపంలోని రెస్టారెంట్ లేదా ఇంటికి మరింత అధిక మైలేజీ వచ్చే మార్గాన్ని కనుగొనడంలో మీకు సహాయం చేయడం వంటివి.

మేము మరింత సందర్భోచితమైన యాడ్‌లను అందించడానికి కూడా ఈ డేటాను ఉపయోగిస్తాము. ఈ యాడ్‌ల ద్వారా ఛార్జీలు విధించకుండా ప్రతి ఒక్కరికీ ప్రోడక్ట్‌లను అందించడం సాధ్యం అవుతోంది. అయితే అదే సమయంలో యాడ్‌ల ప్రయోజనాలతో సహా మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ఎవరికీ విక్రయించబోమని విస్పష్టంగా తెలియజేస్తున్నాము. ఈ విషయంలో పరిమితులు ఉంటాయి.

2.

ఏ డేటాను కలెక్ట్ చేస్తాము, ఎందుకు కలెక్ట్ చేస్తాము అనే విషయంలో మేము పారదర్శకంగా ఉంటాము.

ఏ డేటాను కలెక్ట్ చేస్తాము, ఎందుకు కలెక్ట్ చేస్తాము, కలెక్ట్ చేసిన దాన్ని ఎలా ఉపయోగిస్తాము అన్న విషయాలను మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. పారదర్శకత అనేది చాలా ముఖ్యం, అందుకే మేము ఈ సమాచారాన్ని సులభంగా కనుగొనేలా, అర్థం చేసుకునేలా చేస్తాము. తద్వారా, Google ప్రోడక్ట్‌లను ఎలా ఉపయోగించాలనే అంశంపై మీరు సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవచ్చు.

3.

మీ వ్యక్తిగత సమాచారాన్ని కంట్రోల్ చేయడం మేము సులభతరం చేస్తాము.

దీని అర్థం మీకు అనుకూలమైన గోప్యతా సెట్టింగ్‌లను మీరు సులభంగా ఎంచుకోవచ్చు, అలాగే మీకు కావలసినప్పుడు Googleతో షేర్ చేసిన వ్యక్తిగత సమాచారాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు - ఇందులో మీ డేటాను రివ్యూ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, అలాగే మీరు కోరుకుంటే దాన్ని మరొక సర్వీస్‌కు తరలించడం లేదా పూర్తిగా తొలగించడం వంటివి కూడా ఉంటాయి.

4.

మీ గోప్యతను మరింత మెరుగ్గా సంరక్షించడానికి, మేము ఉపయోగించే డేటాను తగ్గిస్తున్నాము.

Drive, Gmail, అలాగే Photos వంటి యాప్‌లలో మీరు క్రియేట్ చేసి స్టోర్ చేసే కంటెంట్‌ను మేము అడ్వర్టయిజింగ్ ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఉపయోగించము, అలాగే మీకు యాడ్‌లను రూపొందించడానికి ఆరోగ్యం, జాతి, మతం, లేదా లైంగిక ఓరియంటేషన్ వంటి గోప్యమైన సమాచారాన్ని మేము ఎప్పటికీ ఉపయోగించము.

మీరు Google ఖాతా కోసం సైన్ అప్ చేసినప్పుడు మేము 'ఆటోమేటిక్ తొలగింపు' అనే సెట్టింగ్ మీ ప్రమేయం అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా వర్తించేలా సెట్ చేశాము, తద్వారా మీరు సెర్చ్ చేసిన, అలాగే చూసిన అంశాల వంటి మీ Google ఖాతాతో లింక్ అయ్యి ఉన్న మీ ఆన్‌లైన్ యాక్టివిటీ డేటాను మేము క్రమం తప్పకుండా తొలగిస్తాము.

5.

ఆటోమేటిక్‌గా సురక్షితంగా ఉండే ప్రోడక్ట్‌లను రూపొందించడం ద్వారా మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాము.

మీరు మా ప్రోడక్ట్‌లను ఉపయోగించినప్పుడు, మీ డేటా విషయంలో మమ్మల్ని నమ్ముతారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే, మీ డేటాను సంరక్షించడానికి మేము ప్రపంచంలోనే అత్యంత అధునాతన సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌లో ఒకటిగా పేరు పొందిన దాన్ని ఉపయోగిస్తున్నాము.

మా ప్రోడక్ట్‌లు ఆటోమేటిక్‌గా సురక్షితంగా ఉండడానికి రూపొందించబడ్డాయి, అలాగే సెక్యూరిటీ చర్యలను నిరంతర ప్రాతపదికన బలోపేతం చేస్తాము. తద్వారా మోసపూరితమైన వ్యక్తులు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించడం వంటి ఆన్‌లైన్‌లో కొత్తగా వస్తున్న ప్రమాదాలను ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి, అలాగే ఆ ప్రమాదాల బారిన పడక ముందే వాటి నుండి మీకు రక్షణ కల్పించడానికి శక్తివంచన లేకుండా పని చేస్తాము.

6.

మేము అధునాతన గోప్యతా టెక్నాలజీలను డెవలప్ చేసి, వాటిని ఇతరులతో షేర్ చేస్తాము.

ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులో ఉంచడం, ప్రైవేట్‌గా ఉంచడం, ఇంకా సురక్షితంగా ఉంచడం మా ప్రధాన లక్ష్యం. మీ ఆన్‌లైన్ భద్రత Googleతో ఆగిపోకూడదు - ఇది మొత్తం ఇంటర్నెట్‌కు విస్తరించాలి. అందుకే మేము గోప్యతా టెక్నాలజీలను ఆవిష్కరించడం, అలాగే వాటిని విస్తృతంగా అందుబాటులో ఉంచడాన్ని కొనసాగిస్తున్నాము. ఇంటర్నెట్‌కు సంబంధించి మేము నేర్చుకున్న అంశాలను, మా ఎక్స్‌పీరియన్స్‌లను, టూల్స్‌ను పార్ట్‌నర్‌లతో, సంస్థలతో, పోటీదారులతో షేర్ చేస్తాము. ఎందుకంటే, ఇంటర్నెట్‌ను సురక్షితంగా ఉంచడం కోసం అందరూ కలిసి పనిచేయడం అవసరం.

ఆన్‌లైన్‌లో అందరినీ సురక్షితంగా ఉంచడంలో
Google ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.