సరైన బ్యాలెన్స్‌ను కనుగొనడం
స్టీఫన్ సోమోగి Googleలో సెక్యూరిటీ, గోప్యత ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో పని చేస్తున్నారు. మన ఆన్లైన్ ప్రవర్తన గురించి మనం మరింత తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాలని వారు భావిస్తున్నారు
శ్రీ సోమోగి, మేము జర్మనీలో కారులో ఎల్లప్పుడూ రక్షణ బెల్ట్లని కట్టుకుని తిరుగుతాము, అన్ని రకాల బీమా ప్లాన్లను కలిగి ఉన్నాము, PIN ప్యాడ్‌ను ATM వద్ద కప్పి ఉంచుతాము – మరి ఇంటర్నెట్ విషయం వచ్చే సరికి మేము ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నాము?
ఇలా కేవలం జర్మనీలోనే కాదు, ప్రపంచమంతటా జరుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే, స్పష్టమైన రూపం కలిగిన, కంటికి కనిపించే ప్రమాదాలను ఎదుర్కోవటానికి మానవ మనస్తత్వం ఎక్కువ సంసిద్ధంగా ఉంటుంది. అయితే, ఇంటర్నెట్లో ఎదురయ్యే ప్రమాదాలకు అది వర్తించదు. అందుకే Google వంటి టెక్ కంపెనీలు తమ యూజర్లు సురక్షితంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఇటీవలి సంవత్సరాలలో, మేము దానిని సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము.
మీరు దేనిపై పని చేస్తున్నారు?
మా యూజర్ల గురించి బాగా తెలుసుకోవడానికి మేము చాలా సమయాన్ని, డబ్బును కేటాయించాము. ఉదాహరణకు, మేము చాలా ఎక్కువ భద్రతా హెచ్చరికలను చూపిస్తున్నాము, ఆ కారణంగా వ్యక్తులు వాటిని తీవ్రంగా పరిగణించకపోవడం జరుగుతోందని మేము కనుగొన్నాము. ప్రశ్న ఏమిటంటే: హెచ్చరికల సరైన సంఖ్య ఏమిటి? సరైన బ్యాలెన్స్‌ను కనుగొనడం అంత సులభం కాదు. తరచుగా, మనం మానవ ప్రాతినిధ్యాన్ని తక్కువగా అంచనా వేస్తాము.
మీరు ఏమంటున్నారు?
ఒక యూజర్ ఒక ఈమెయిల్‌లోని లింక్‌పై క్లిక్ చేయడానికి లేదా ఆలోచించకుండా వారి డేటాను షేర్ చేసుకోవడానికి యాక్టివ్ నిర్ణయం తీసుకుంటే, దాని గురించి మీరు చేయగలిగేది పెద్దగా ఏమీ ఉండదు. చాలా దాడులు మానవ విశ్వసనీయతపై ఆధారపడి ఉంటాయి.
"ఇతర వ్యక్తులను విశ్వసించే నైజం మనకు సహజంగా ఉంటుంది. ఆ విషయం నేరస్తులకు తెలుసు."
స్టీఫన్ సోమోగి
ఫలితం ఏమిటి?
ఇతర వ్యక్తులను విశ్వసించే నైజం సహజంగా మనకు ఉంటుంది. నేరస్తులకు ఆ విషయం తెలుసు. ఆ కారణంగానే, తెలియని ఈమెయిల్ అడ్రస్ నుండి వచ్చినప్పటికీ, ఆ ఈమెయిల్‌ను మనం విశ్వసించేలా కొన్నిసార్లు వారు మనల్ని మోసం చేయగలరు. లేదంటే వారు మనల్ని భయపెడతారు. రెండు సందర్భాలలో, పర్యవసానాలు ఒక్కటే – మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం.
ఒక ఉదాహరణ ఇవ్వగలరా?
మీకు ఇష్టమైన TV సిరీస్ కొత్త ఎపిసోడ్లను చూడటానికి మీరు ఉపయోగించాలనుకుంటున్న వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ బ్లాక్ చేయబడుతుందని మీ ఇన్‌బాక్స్‌లో మీకు మెసేజ్ వచ్చిందని ఊహించుకోండి. అలా జరగకుండా ఆపడానికి, మీరు ఈ కింది లింక్‌పై క్లిక్ చేసి, మీ బ్యాంక్ వివరాలను నిర్ధారించాలి. అలాంటి సమయంలో, చాలా మంది తప్పు నిర్ణయం తీసుకుని, ఆ సూచనలను ఫాలో చేస్తారు. తర్వాత నేరస్తులకు వారి బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ లభిస్తుంది.
కాబట్టి దాడి చేసేవారు ఎల్లప్పుడూ యూజర్లను ఆలోచించకుండా ప్రతిస్పందించేలా ప్రయత్నిస్తారా?
అవును. అయితే, అవగాహన లేకపోవడం లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రజలు భద్రతా హెచ్చరికలను పట్టించుకోని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే భద్రతా హెచ్చరికల విషయంలో మేము అందించే గైడెన్స్‌ను మరింత సూటిగా స్పష్టంగా ఉండేలా చేయడానికి మేము కృషి చేస్తున్నాము. యూజర్లు ఏమి చేయాలో లేదా చేయకూడదో మేము నిర్దేశించాలనుకోవడం లేదు, కానీ విషయాలు ప్రమాదకరంగా మారవచ్చని వారు తెలుసుకోవాల్సి ఉంది. వారు సముచితమైన నిర్ణయం తీసుకునేలా వారికి సమాచారం ఇవ్వడానికి అవసరమైన అన్ని వాస్తవాలను మేము అందించాలనుకుంటున్నాము - అంత కంటే ఎక్కువ గానీ, తక్కువ గానీ కాదు.
ఇప్పుడు వ్యక్తులకు కేవలం డెస్క్‌టాప్ కంప్యూటర్లు మాత్రమే యాక్సెస్‌ను అందించే పాయింట్‌గా లేవు. ఇతర పరికరాలకు కూడా భద్రతా అవసరాలు ఇలాగే ఉన్నాయా?
ప్రస్తుతం అది మనకు పెద్ద సవాలుగా ఉంది. ఆన్లైన్ భద్రత కోసం ఎల్లప్పుడూ అదనపు డేటా మార్పిడి అవసరం ఉంటుంది – ఉదాహరణకు ఎన్క్రిప్షన్. డెస్క్‌టాప్ కంప్యూటర్లో దీన్ని అంతగా పట్టించుకోనవసరం లేదు, కానీ స్మార్ట్‌ఫోన్‌లో డేటా వాల్యూమ్ పరిగణనల కారణంగా కాస్త గమనించవలసి ఉంటుంది. అంటే, వాటికి అవసరమైన దాని కంటే ఎక్కువ డేటాను ఉపయోగించని భద్రతా చర్యలను మనం రూపొందించాలి. మొబైల్ పరికరాలలో బదిలీ చేయబడిన డేటా మొత్తాన్ని తగ్గించడానికి మేము తీవ్ర ప్రయత్నం చేశాము, ఇప్పుడు అది మునుపు ఉన్న మొత్తం కంటే నాలుగవ వంతుకు తగ్గింది. ఏది ఏమైనా, తమ డేటా ఖాళీ అయిపోకుండా ఉండటానికి కస్టమర్లు తమ భద్రతా సెట్టింగ్‌లను స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితి రాకూడదని మేము భావిస్తాము. ఇక్కడే మానవ ప్రాతినిధ్యాన్ని మళ్లీ పరిగణించాల్సి వస్తుంది.
అన్ని భద్రతా సలహాలను నేను పాటించాను, నా వ్యక్తిగత డేటా విషయంలో నేను జాగ్రత్తగానే ఉన్నాను అనుకుందాం. అప్పుడు నా వద్ద ఎక్స్టర్నల్ యాంటీ-వైరస్ ప్రోగ్రామ్ లేకపోయినా పర్వాలేదని నేను అనుకోవచ్చా?
దీనిని ఇలా అర్థం చేసుకోండి: మీరు మీ సిస్టమ్‌ను నిరంతరం అప్డేట్ చేస్తూ ఉంటే, ప్రస్తుతానికి మీరు సురక్షితంగా ఉన్నారని అర్థం. కానీ దానర్థం ఎల్లప్పుడూ సురక్షితం అని కాదు. గతంలో, ఈ సమస్య వచ్చినప్పుడు చాలా కంపెనీలకు లోతయిన అవగాహన ఉండేది కాదు. ఇటీవలి సంవత్సరాలలో పరిస్థితి బాగా మెరుగుపడింది, ప్రమాదం కూడా గణనీయంగా తగ్గింది.
భవిష్యత్తును ఒకసారి క్లుప్తంగా పరిశీలిద్దాం. మీ తదుపరి లక్ష్యం ఏమిటి?
మేము HTTPSను వెబ్ అంతటా స్టాండర్డ్ ప్రోటోకాల్‌గా చేయాలనుకుంటున్నాము, తద్వారా కనెక్షన్లు ఎల్లప్పుడూ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. మేము ఇప్పటికే మా అనేక సర్వీస్‌లలో డేటాను బదిలీ చేయడానికి సురక్షితమైన HTTPS ఎన్క్రిప్షన్ను ఉపయోగిస్తున్నాము, ఉదాహరణకు Google Search, Gmail.
కాబట్టి మీరు మొత్తం ఆన్లైన్ డేటాను సురక్షితంగా బదిలీ చేయాలనుకుంటున్నారా?
అవును. ఇప్పటి వరకు, అడ్రస్ బార్లో సురక్షితమైన కనెక్షన్లు పేర్కొనబడ్డాయి. మేము దానిని ఫ్లిప్ చేయాలనుకుంటున్నాము, తద్వారా భవిష్యత్తులో, అసురక్షిత కనెక్షన్లు ఫ్లాగ్ చేయబడతాయి.
ఫోటోగ్రాఫ్‌లు: ఫెలిక్స్ బ్రగ్గెమాన్
సైబర్ సెక్యూరిటీ పురోగతులు
ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్లైన్లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.
మరింత తెలుసుకోండి