మేము మీ వ్యక్తిగత
సమాచారాన్ని ప్రైవేట్‌గా, భద్రంగా, సురక్షితంగా ఉంచుతాము.
భద్రతా రంగంలోని అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థతో, బాధ్యతాయుతమైన డేటా ప్రాక్టీసులతో, అలాగే కంట్రోల్ మీ చేతుల్లో ఉంచే సులభంగా ఉపయోగించగల గోప్యతా టూల్స్‌తో Googleలో మేము మీ గోప్యతను గౌరవిస్తాము, అలాగే దాన్ని సంరక్షిస్తాము.
అనేది ప్రపంచంలోని
అత్యంత అధునాతన సెక్యూరిటీతో మొదలవుతుంది.
ప్రమాదాలు మీ దాకా చేరుకోక ముందే, వాటిని ఆటోమేటిక్‌గా ఆపివేసేలా రూపొందించబడిన బిల్ట్-ఇన్ సెక్యూరిటీ ద్వారా Google అంతటా మీ గోప్యత సంరక్షించబడుతుంది.
అధునాతన ఎన్‌క్రిప్షన్, డేటా బదిలీ జరిగే సమయంలో మీ డేటాను సురక్షితంగా ఉంచుతుంది
ఎన్‌క్రిప్షన్ మా సర్వీస్‌లకు అత్యుత్తమ స్థాయి సెక్యూరిటీని, గోప్యతను అందిస్తుంది. మీరు ఇమెయిల్ పంపడం, వీడియోను షేర్ చేయడం, వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా మీ ఫోటోలను నిల్వ చేయడం లాంటివి చేస్తున్నప్పుడు మీరు సృష్టించే డేటా మీ పరికరం, Google సేవలు మరియు మా డేటా కేంద్రాల మధ్య తరలించబడుతుంది. HTTPS, ఇంకా ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ వంటి అత్యుత్తమ ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీతో పాటు అనేక లేయర్‌ల సెక్యూరిటీతో మేము ఈ డేటాను సురక్షితంగా ఉంచుతాము.
చురుకైన సెక్యూరిటీ అలర్ట్‌లు, మీ ప్రైవేట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి
మీకు తెలియాల్సిన అవసరం ఉన్న అనుమానాస్పద లాగిన్ లేదా హానికరమైన వెబ్‌సైట్, ఫైల్ లేదా యాప్ వంటి వాటిలో దేనినైనా మేము గుర్తిస్తే వెంటనే మీకు తెలియజేస్తాము - దానితో పాటు మీరు మరింత సురక్షితంగా ఉండటంలో సహాయపడటానికి మేము మార్గనిర్దేశం అందిస్తాము. మేము మీ ఖాతాలో అనుమానాస్పదంగా ఏదైనా గుర్తించినప్పుడు, మీ ఇన్‌బాక్స్ లేదా ఫోన్‌కు నోటిఫికేషన్‌ను పంపుతాము, తద్వారా మీరు మీ ఖాతాను ఒక క్లిక్‌తో రక్షించుకోవచ్చు.
ప్రమాదాలను పసిగట్టి, ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయడం జరుగుతుంది
Safe Browsing రోజుకు 5 బిలియన్ల పరికరాలను రక్షిస్తుంది, మీ పరికరం కూడా. ఇంటర్నెట్‌ను అందరికీ సురక్షితంగా చేయడానికి, మేము ఈ సాంకేతికతను ఇతర కంపెనీలు తమ బ్రౌజర్‌లలో ఉపయోగించడానికి ఉచితంగా అందుబాటులో ఉంచాము, అందులో Apple యొక్క Safari మరియు Mozilla యొక్క Firefox ఉన్నాయి. కాబట్టి మీరు Google మరియు అంతకంటే ఎక్కువగా బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీరు రక్షించబడతారు.
సులభంగా ఉపయోగించగల గోప్యతా టూల్స్.
మీ Google ఖాతాకు ఏ డేటా సేవ్ చేయబడాలో కంట్రోల్ చేయండి
గోప్యతకు సంబంధించి, అందరికీ ఒకే రకమైన ప్రాధాన్యతలు ఉండవని మాకు తెలుసు. అందుకే మీకు తగిన విధంగా ఉండే గోప్యతా సెట్టింగ్‌లను ఎంచుకోవడంలో మేము మీకు సహాయపడతాము. మీరు మీ డేటాను సేవ్ చేయాలనుకున్నా, తొలగించాలనుకున్నా, లేదా ఆటోమేటిక్ తొలగింపు చేయాలనుకున్నా, అందుకు కావలసిన టూల్స్‌ను మేము మీకు అందిస్తాము.
బాధ్యతాయుతమైన డేటా ప్రాక్టీసుల ద్వారా సంరక్షించబడుతుంది.
మీరు ప్రతిరోజూ ఉపయోగించే ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను మరింత సహాయకరంగా మార్చడంలో డేటా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ డేటా విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి, కఠినమైన ప్రోటోకాల్‌లు, వినూత్న గోప్యతా టెక్నాలజీలతో మీ గోప్యతను రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము.
మరిన్ని మార్గాలను తెలుసుకోండి.
-
బిల్ట్-ఇన్ సెక్యూరిటీఆటోమేటిక్ సెక్యూరిటీ రక్షణల గురించి మరింత తెలుసుకోండి.
-
గోప్యతా కంట్రోల్స్మీకు సరిపోయే గోప్యతా సెట్టింగ్‌లను ఎంచుకోండి.
-
డేటా ప్రాక్టీస్లుబాధ్యతాయుతమైన డేటా ప్రాక్టీస్‌లతో మీ గోప్యతను ఎలా గౌరవిస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
-
సెక్యూరిటీ చిట్కాలుఆన్లైన్లో సురక్షితంగా ఉండటానికి త్వరిత చిట్కాలు, అలాగే బెస్ట్ ప్రాక్టీస్‌లను కనుగొనండి.
-
యాడ్లు, డేటామా ప్లాట్‌ఫామ్‌లలో మీరు చూసే యాడ్ల గురించి మరింత తెలుసుకోండి.