కంట్రోల్ మీ చేతుల్లో ఉంచే
గోప్యతా టూల్స్.

గోప్యతకు సంబంధించి, అందరికీ ఒకే రకమైన ప్రాధాన్యతలు ఉండవని మాకు తెలుసు. అందుకోసమే మేము ఉపయోగించడానికి సులభమైన కంట్రోల్స్‌ను రూపొందిస్తాము, కాబట్టి మీరు మీకు తగిన విధంగా ఉండే గోప్యతా సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు.

మీ Google ఖాతాకు
ఏ డేటా సేవ్ చేయబడుతుందో అనేది కంట్రోల్ చేయండి

యాక్టీవిటీ కంట్రోల్స్

ఏ డేటా సేవ్ చేయబడుతుందో అనేది కంట్రోల్ చేయండి

యాక్టీవిటీ కంట్రోల్స్‌ను ఉపయోగించి, Google సర్వీస్‌ల అంతటా మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి మీ ఖాతాకు ఏ రకమైన యాక్టివిటీలు జత చేయాలో మీరు నిర్ణయించుకోవచ్చు. మీ సెర్చ్, అలాగే బ్రౌజింగ్ యాక్టివిటీ, YouTube హిస్టరీ లేదా లొకేషన్ హిస్టరీ వంటి – నిర్దిష్ట రకాల డేటాను మీ ఖాతాలో సేవ్ చేయకుండా మీరు పాజ్ చేయవచ్చు.

యాక్టీవిటీ కంట్రోల్స్‌కు వెళ్లండి

ఆటోమేటిక్ తొలగింపు

మీ డేటాను ఆటోమేటిక్‌గా తొలగించబడేలా సెట్ చేయండి

మీకు మరింత కంట్రోల్‌ను ఇవ్వడానికి, ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్‌లు మీ యాక్టివిటీని మీరు ఎంత కాలం పాటు ఉంచాలనుకుంటున్నారో ఆ సమయ పరిధిని ఎంచుకొనే వీలును కల్పిస్తాయి. మీరు ఎంచుకున్న పరిమితి కంటే పాతది అయిన డేటా మీ ఖాతా నుండి నిరంతరం, అలాగే ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది. అది మీకు సెట్ చేయడాన్ని, అలాగే మర్చిపోవడాన్ని సులభతరం చేస్తుంది, కానీ మీరు వెనక్కి తిరిగి వెళ్లి ఎప్పుడైనా ఈ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయవచ్చు.

మీ యాక్టివిటీని ఆటోమేటిక్‌గా తొలగించండి

నా యాక్టివిటీ

ఏ సమయంలోనైనా మీ ఖాతా నుండి డేటాను తొలగించండి

నా యాక్టివిటీ అనేది మా సర్వీస్‌లను ఉపయోగించి సెర్చ్ చేసిన, వీక్షించిన, అలాగే చూసిన అంశాలను కనుగొనగలిగే కేంద్ర స్థానం. మీ గత ఆన్‌లైన్ కార్యకలాపం సులభంగా తిరిగి పొందడం కోసం, అంశం, తేదీ మరియు ఉత్పత్తి ఆధారంగా శోధించగల సాధనాలను మేము మీకు అందిస్తాము. మీరు మీ ఖాతాతో అనుబంధించకూడదనుకునే నిర్దిష్ట యాక్టివిటీలు లేదా మొత్తం అంశాలను కూడా శాశ్వతంగా తొలగించవచ్చు.

నా యాక్టివిటీకి వెళ్లు
మీకు సరైన
గోప్యతా సెట్టింగ్‌లను
ఎంచుకోండి.

గోప్యతా చెకప్

గోప్యతా చెకప్ నిర్వహించండి

కొద్ది నిమిషాల్లో, మీరు మీ Google ఖాతాకు ఏ రకమైన డేటాను సేవ్ చేయవచ్చో ఎంచుకోవచ్చు, మీరు ఫ్రెండ్స్‌తో లేదా పబ్లిక్‌గా షేర్ చేసుకొనే వాటిని అప్‌డేట్ చేయవచ్చు, అలాగే మేము మీకు చూపించాలనుకుంటున్న యాడ్‌ల రకాలను సర్దుబాటు చేయవచ్చు. మీరు ఈ సెట్టింగ్‌లను తరచుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చవచ్చు, అలాగే రిమైండర్‌లు పంపించే విధంగా కూడా ఎంచుకోవచ్చు.

మీరు ప్రతి రోజు ఉపయోగించే
యాప్‌ల నుండి నేరుగా
మీ గోప్యతను కంట్రోల్ చేయండి.

అజ్ఞాత మోడ్

Chrome, Search, YouTube, అలాగే Mapsలో అజ్ఞాత మోడ్‌ను ఆన్ చేయండి

మొదటి సారిగా Chromeలో ప్రారంభించబడిన, అజ్ఞాత మోడ్ అప్పటి నుండి అత్యంత జనాదరణ పొందిన మా యాప్‌లలో అందుబాటులోకి వచ్చింది. YouTube, iOSలో Search అలాగే Mapsల్లో, దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి మీ ప్రొఫైల్ ఫోటో నుండి ట్యాప్ చేయండి. మీరు Maps, అలాగే YouTube‌లో అజ్ఞాత మోడ్‌ను ఆన్ చేసినప్పుడు, మీరు సెర్చ్ చేసే స్థలాలు లేదా మీరు చూసే వీడియోలు వంటి మీ యాక్టివిటీ మీ Google ఖాతాకు సేవ్ చేయబడవు. మీరు అన్ని అజ్ఞాత విండోలను మూసివేసిన తర్వాత మీ అజ్ఞాత సెషన్ నుండి బ్రౌజింగ్ హిస్టరీ, అలాగే కుక్కీలు Chrome నుండి తొలగించబడతాయి.

దీనిలోని మీ డేటా

యాప్‌ల నుండి నేరుగా మీ డేటాను కంట్రోల్ చేయండి

మీరు ప్రతిరోజూ ఉపయోగించే Google సర్వీస్‌లలోనే మీ డేటా గురించి నేరుగా నిర్ణయాలు తీసుకోవడాన్ని మేము సులభతరం చేసాము. ఉదాహరణకు, Searchను ఎప్పటికీ వదలకుండా, మీరు మీ ఇటీవలి Searchకు సంబంధించిన యాక్టివిటీని రివ్యూ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు, మీ Google ఖాతా నుండి సంబంధిత గోప్యతా కంట్రోల్స్‌కు త్వరిత యాక్సెస్‌ను పొందవచ్చు, ఇంకా మీ డేటాతో Search ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోవచ్చు. మీరు Search, Maps, అలాగే Google Assistantలో ఈ కంట్రోల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు.

మేము మిమ్మల్ని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచే
మరిన్ని మార్గాలను అన్వేషించండి.