జీవితంలోని జ్ఞాపకాల కోసం
ఒక సురక్షితమైన ప్రదేశం.
Google Photos అనేది మీ అన్ని ఫోటోలు వీడియోలు స్టోర్ చేసే ప్రదేశం, అవి ఆటోమేటిక్‌గా ఆర్గనైజ్ చేయబడి ఉంటాయి, అలాగే వాటిని సులభంగా షేర్ చేయవచ్చు. మేము అధునాతన సెక్యూరిటీ వ్యవస్థ, అలాగే ఉపయోగించడానికి సులభమైన గోప్యతా కంట్రోల్స్‌లో మరింత శ్రద్ద వహిస్తాము, కాబట్టి మీరు మీ జ్ఞాపకాలను సురక్షితంగా స్టోర్ చేయవచ్చు, అలాగే షేర్ చేయవచ్చు.
సురక్షిత స్టోరేజ్
Google సర్వీస్‌లు అత్యంత అధునాతన సెక్యూరిటీ వ్యవస్థల ద్వారా నిరంతరం రక్షించబడతాయి. ఈ బిల్ట్-ఇన్ సెక్యూరిటీ ఆన్‌లైన్ ప్రమాదాలను గుర్తించి, వాటిని నివారించడంలో సహాయపడుతుంది కాబట్టి మీ వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుందని మీరు విశ్వసించవచ్చు.
ఎన్‌క్రిప్షన్
ఎన్‌క్రిప్షన్, బదిలీ చేసే సమయంలో డేటాను ప్రైవేట్‌గా, అలాగే భద్రంగా ఉంచుతుంది. మీరు మీ ఫోటోలను స్టోర్ చేసినప్పుడు, మీరు క్రియేట్ చేసిన డేటా మీ పరికరం, Google సర్వీస్‌లు, అలాగే మా డేటా కేంద్రాల మధ్య తరలించబడుతూ ఉంటుంది. HTTPS, అలాగే TLS ఎన్‌క్రిప్షన్ వంటి అత్యుత్తమ ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీతో పాటు మల్టీ లేయర్ సెక్యూరిటీతో మేము ఈ డేటాను సురక్షితంగా ఉంచుతాము.
ఫేస్ గ్రూపింగ్
ఫేస్ గ్రూపింగ్ ఆటోమేటిక్‌గా ఒకే రకమైన ముఖాలను గ్రూప్‌లుగా చేస్తుంది, అలాగే మీ ఫోటోలను సెర్చ్ ఇంకా మేనేజ్ చేయడాన్ని సులభతరం చేసేందుకు మీకోసం వాటిని క్రమపద్ధతిలో అమర్చుతుంది. ఫేస్ గ్రూప్‌లు, అలాగే లేబుల్‌లు మీకు మాత్రమే కనిపిస్తాయి. ఫేస్ గ్రూపింగ్ ఆన్‌లో ఉండాలా లేదా ఆఫ్‌లో ఉండాలా అనే దానికి సంబంధించిన కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది, అలాగే మీరు దాన్ని ఆఫ్ చేస్తే, మీ ఖాతా నుండి ఫేస్ గ్రూప్‌లు తొలగించబడతాయి. మేము సాధారణ ప్రయోజనానికి సంబంధించిన ముఖ గుర్తింపు సాంకేతికతను వాణిజ్యపర వినియోగానికి అందుబాటులోకి రానివ్వము. మరింత తెలుసుకోండి.
పార్ట్‌నర్ ప్రోగ్రామ్
మీ Google Photos అనుభవాన్ని మెరుగుపరిచే అర్ధవంతమైన ఇంటిగ్రేషన్‌లను వారు రూపొందిస్తున్నారని నిర్ధారించడానికి Google Photos APIను ఉపయోగించే పార్ట్‌నర్‌లు, అలాగే డెవలపర్‌లతో మేము కలిసి పని చేస్తాము. మేము కలిసి పనిచేసే పార్ట్‌నర్‌లు మా పాలసీలకు అనుగుణంగా ఉండాలి, అలాగే మీ అనుమతి లేకుండా ఏ డేటాను యాక్సెస్ చేయలేరు.
యాడ్‌లు లేవు
Google Photos మీ ఫోటోలు, వీడియోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ విక్రయించదు. అలాగే మీ ఫోటోలు, వీడియోలను మేము అడ్వర్టయిజింగ్ కోసం ఉపయోగించము.
సెలెక్టివ్ బ్యాకప్
మీరు మీ ఫోటోలు, అలాగే వీడియోలను Google Photosకు బ్యాకప్ చేయడానికి ఎంచుకోవచ్చు లేదా మీ Google ఖాతాకు స్టోర్ చేయాలనుకున్న ఫోటోలను మాత్రమే సెలెక్టివ్‌గా బ్యాకప్ చేయడానికి ఎంచుకోవచ్చు.
జ్ఞాపకాలు
మీకు ప్రైవేట్‌గా అందించిన మీ ఉత్తమ క్షణాలను మళ్లీ ఆస్వాదించండి. మీకు నిర్దిష్ట వ్యక్తుల జ్ఞాపకాలు లేదా సమయ వ్యవధులను చూడటాన్ని నిలిపివేసేందుకు ఆప్షన్, అలాగే ఈ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయగల సామర్ధ్యం ఉంది.
మ్యాప్ వీక్షణ
మీరు మాత్రమే చూడగలిగే ఇంటరాక్టివ్ మ్యాప్‌లో లొకేషన్ ఆధారంగా మీ ఫోటోలను చూడండి. ఈ మ్యాప్ వీక్షణ మీ Google ఖాతాలో సేవ్ చేయబడిన లొకేషన్ డేటాను ఉపయోగించి ఆటో-ఫిల్ చేయబడుతుంది. Photos.google.com లో మ్యాప్‌ను ఆటో-ఫిల్ చేయడానికి ఉపయోగించే లొకేషన్ సమాచారాన్ని మీరు ఎడిట్ చేయవచ్చు, అలాగే తీసివేయవచ్చు. మీరు భవిష్యత్తులో తీసే ఫోటోలు ఈ మ్యాప్ వీక్షణలో ఆర్గనైజ్ చేసి ఉండకూడనుకుంటే, మీ కెమెరా యాప్‌లో లొకేషన్ హిస్టరీ, అలాగే లొకేషన్ డేటాను ఆఫ్ చేయవచ్చు.
Google Assistant
Photosను కనుగొనడానికి, చూడటానికి, లేదా షేర్ చేయడానికి Google Assistantను సహాయం చేయమని అడగండి. మీ Assistant సెట్టింగ్‌లలో, Google Nest Hub లేదా ఏదైనా Android ఫోన్ వంటి మీ Assistant పరికరాల నుండి మీరు ప్రదర్శించాలనుకున్న వాటిని ఎంచుకొని, షేర్ చేయవచ్చు. నిర్దిష్ట స్మార్ట్ డిస్‌ప్లేలు లేదా ప్రసారం కోసం-కనెక్ట్ చేయబడిన పరికరాల్లో కనిపించే ఫోటోలను నిర్వహించడానికి, అలాగే కంట్రోల్ చేయడానికి, మీరు మీ వర్చువల్ హోమ్ యాప్‌లో వ్యక్తిగత పరికర సెట్టింగ్‌లను ఉపయోగించవచ్చు.
ఆల్బమ్ షేరింగ్
మీరు ఆల్బమ్‌ను షేర్ చేసినప్పుడు, ఒక నిర్దిష్ట వ్యక్తి లేదా వారి Google ఖాతా ద్వారా వ్యక్తులతో షేర్ చేయడం అనేది ఆటోమేటిక్ ఆప్షన్‌గా ఉంటుంది. ఇది ఆల్బమ్‌కు ఎవరు జోడించబడాలి అనే దానిపై మీకు మరింత కంట్రోల్‌ను ఇస్తుంది. మీకు ఇప్పటికీ లింక్ ద్వారా షేర్ చేసే ఆప్షన్ ఉంటుంది, ఇది Google Photosను ఉపయోగించని లేదా Google ఖాతా లేని వ్యక్తులతో ఫోటోలను షేర్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. మీరు ఎప్పుడైనా మీ ఆల్బమ్‌ల షేరింగ్ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయవచ్చు, అలాగే ప్రతి ఆల్బమ్‌కు యాక్సెస్ ఉన్న వారిని కంట్రోల్ చేయవచ్చు.
ప్రత్యక్ష షేరింగ్
మీరు వన్-ఆఫ్ ఫోటోలు, అలాగే వీడియోలను షేర్ చేసినప్పుడు, మీకు వాటిని యాప్‌లో కొనసాగుతున్న, అలాగే ప్రైవేట్ సంభాషణకు జోడించే ఆప్షన్ ఉంటుంది.
షేరింగ్ యాక్టీవిటీ
మీరు Google Photos ద్వారా షేర్ చేసిన ప్రతిదీ ఒకే చోట నిల్వ చేయబడుతుంది తద్వారా మీరు మీ ఫ్రెండ్స్, అలాగే ఫ్యామిలీతో షేర్ చేసుకున్న అన్ని క్షణాలను కనుగొనవచ్చు.
అన్వేషించండి.