ఇంటర్నెట్‌ను
అందరికీ సురక్షితంగా ఉండేలా చేయడానికి
ఇండస్ట్రీ స్టాండర్డ్‌లను మెరుగుపరచడం.

మేము ఏ పని చేసినా, ఏ ప్రోడక్ట్‌ను రూపొందించినా, మా యూజర్‌ల సెక్యూరిటీని, గోప్యతను దృష్టిలో ఉంచుకొని చేస్తాము. అందరికీ ఇండస్ట్రీ స్టాండర్డ్‌లను మెరుగుపరిచే భద్రతా టెక్నాలజీలను క్రియేట్ చేయడంలో, అలాగే షేర్ చేయడంలో మేము పరిశ్రమలో అందరి కంటే ముందు ఉన్నాము.

మా యూజర్‌లను ఆన్‌లైన్‌లో మరింత భద్రంగా ఉంచడం
కోసం వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టడం.

కొత్త ప్రమాదాలు పుట్టుకొస్తున్న కొద్దీ, తదనుగుణంగా యూజర్ రక్షణ విషయంలో కూడా మార్పులు చోటుచేసుకోవలసిన అవసరం ఉన్నందున, మా ప్రోడక్ట్‌లన్నింటిలో, ప్రతి యూజర్‌కు సంబంధించిన ప్రైవేట్ సమాచారాన్ని ప్రతి ప్రమాద స్థాయిలోనూ ఆటోమేటిక్‌గా సంరక్షించడానికి మేము నిరంతరం వినూత్న పద్ధతులను కనుగొంటూనే ఉంటాము.

అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్

సెక్యూరిటీ యొక్క అవసరం అత్యధికంగా ఉన్న వారి కోసం,
Google అందించే అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ

అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది Google అందించే అత్యంత శక్తివంతమైన ఖాతా సెక్యూరిటీ ప్రోగ్రామ్, అలాగే పాలసీ రూపకర్తలు, క్యాంపెయిన్ టీమ్‌లు, జర్నలిస్ట్‌లు, యాక్టివిస్ట్‌లు, బిజినెస్ లీడర్‌లు వంటి టార్గెట్ చేసిన ఆన్‌లైన్ దాడులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి చెందిన వ్యక్తిగత, అలాగే ఎంటర్‌ప్రైజ్ Google ఖాతాలను సంరక్షించడానికి సెక్యూరిటీ పరిశ్రమలో రూపొందించబడిన తొలి ఉచిత ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్, వివిధ రకాల ప్రమాదాల నుండి సమగ్రమైన ఖాతా సెక్యూరిటీని అందిస్తుంది, అలాగే కొత్త రక్షణలను జోడించడానికి, నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.

అధునాతన రక్షణ గురించి తెలుసుకోండి

డేటా పరిమితి నియమం

ఉపయోగించబడే, అలాగే సేవ్ చేయబడే వ్యక్తిగత సమాచారాన్ని పరిమితం చేయడం

మీకు ఉపయోగకరంగా, సహాయకరంగా ఉన్నంత వరకు మాత్రమే మీ సమాచారాన్ని ప్రోడక్ట్‌లు స్టోర్ చేసుకోవాలని మేము నమ్ముతాము - అది Mapsలో మీకు ఇష్టమైన గమ్యస్థానాలను కనుగొనడం కోసమైనా సరే లేదా YouTubeలో ఏమి చూడాలనే దాని కోసం సిఫార్సులను పొందడం కోసమైనా సరే.

మీరు ఆటోమేటిక్‌గా ఆఫ్ చేయబడి ఉన్న లొకేషన్ హిస్టరీని మొదటిసారిగా ఆన్ చేస్తే, మీ ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్ ఆటోమేటిక్‌గా 18 నెలలకు సెట్ చేయబడుతుంది. కొత్త ఖాతాల విషయంలో కూడా వెబ్ & యాప్ యాక్టివిటీ ఆటోమేటిక్ తొలగింపు అనేది, 18 నెలలకు ఆటోమేటిక్‌గా సెట్ చేయబడుతుంది. అంటే, మీ యాక్టివిటీ డేటాను మీరు ఎప్పుడు తొలగించాలని ఎంచుకుంటారో, అప్పటి దాకా ఉంచకుండా, 18 నెలల తర్వాత అది ఆటోమేటిక్‌గా, నిరంతరం తొలగించబడుతుందని దీని అర్థం. మీరు ఎప్పుడైనా ఈ సెట్టింగ్‌లను ఆఫ్ చేయవచ్చు లేదా మీ ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్‌ను ఎప్పుడైనా మార్చవచ్చు.

ఒకరు "he" అని టైప్ చేస్తుంటే, దాన్ని Google "Hey" అని ఆటోమేటిక్‌గా సూచించడాన్ని ఫీచర్ చేస్తున్న ఫోన్

ఫెడరేటెడ్ లెర్నింగ్

తక్కువ డేటాతో సహాయకర ప్రోడక్ట్‌లను రూపొందించడం

ఫెడరేటెడ్ లెర్నింగ్ అనేది Google అభివృద్ధి చేసిన డేటా పరిమితి నియమ టెక్నాలజీ, ఇది నేరుగా మీ పరికరంలోకే మెషిన్ లెర్నింగ్‌ను (ML) తీసుకువస్తుంది. ఈ కొత్త విధానం, ML మోడల్‌లకు శిక్షణ ఇవ్వడానికి, వివిధ పరికరాల నుండి అజ్ఞాతీకరించబడిన సమాచారాన్ని కలుపుతుంది. ఫెడరేటెడ్ లెర్నింగ్, వీలైనంత వ్యక్తిగత సమాచారాన్ని మీ పరికరంలోనే ఉంచడం ద్వారా, మీ గోప్యతను సంరక్షించడంలో సహాయపడుతుంది.

అజ్ఞాతీకరణ

అజ్ఞాతీకరించడం ద్వారా గోప్యతా రక్షణలను బలోపేతం చేయడం

మా సర్వీస్‌లను మీ కోసం ఉత్తమంగా పని చేసేలా అభివృద్ధి చేస్తూనే, మీ డేటాను సంరక్షించడానికి, మేము అత్యుత్తమ స్థాయి అజ్ఞాతీకరణ పద్ధతులను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీరు ఒక ప్రదేశానికి చేరుకోక ముందే, ఆ ప్రదేశం ఎంత రద్దీగా ఉంటుందో చూపడానికి వీలుగా మేము ఎన్నో లక్షల మంది యూజర్‌ల డేటాను అగ్రిగేట్ చేసి, అజ్ఞాతీకరిస్తాము.

మెరుగైన సురక్షిత బ్రౌజింగ్

మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడం

మరింత చురుగ్గా ఉండేందుకు, అలాగే మీ వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు, మెరుగైన సురక్షిత బ్రౌజింగ్, ప్రస్తుతం ఉన్న సురక్షిత బ్రౌజింగ్ రక్షణలను అందించడం మాత్రమే కాకుండా అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. Chromeలో మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను ఎనేబుల్ చేసుకున్న వారి విషయంలో, ఫిషింగ్, మాల్‌వేర్, ఇంకా ఇతర వెబ్ ఆధారితమైన ప్రమాదాల నుండి మరింత చురుకైన, ఇంకా మీకు సరిపోయే విధంగా ఉండే రక్షణలను అందించడానికి, వెబ్‌లో మీకు ఎదురయ్యే ప్రమాదాలన్నింటినీ, అలాగే మీ Google ఖాతా మీద జరిగే దాడులన్నింటినీ Google ఆటోమేటిక్‌గా పరిశీలిస్తుంది. మెరుగైన సురక్షిత బ్రౌజింగ్ గురించి మరింత తెలుసుకోండి.

సహకారం ద్వారా ఆన్‌లైన్‌లో అందరినీ
మరింత భద్రంగా ఉంచడం.

వెబ్‌ను అందరికీ సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ పని చేయడంలో సహాయపడటానికి, మా టెక్నాలజీలలో చాలా వాటిని మేము ఓపెన్ సోర్స్ చేస్తున్నాము, అలాగే డెవలపర్‌లకు, సంస్థలకు మా రిసోర్స్‌లకు యాక్సెస్‌ను ఇస్తున్నాము.

కనెక్షన్ సురక్షితం కాదు అని తెలియజేసే నోటిఫికేషన్‌ను ఫీచర్ చేస్తున్న ఫోన్

HTTPS ఎన్‌క్రిప్షన్

ఎన్‌క్రిప్షన్ ద్వారా వెబ్‌లో ఉన్న సైట్‌లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటం

మా సర్వీస్‌లకు HTTPS ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉన్నందున, మీ సమాచారానికి ఇతరుల నుండి అంతరాయం కలగకుండా మీరు సైట్‌లలోకి సురక్షితంగా కనెక్ట్ అయ్యి, క్రెడిట్ కార్డ్ నంబర్‌లు లాంటి మీ ప్రైవేట్ సమాచారాన్ని ఎంటర్ చేయవచ్చు. మా సైట్‌లు, సర్వీస్‌లు ఆటోమేటిక్‌గా అత్యాధునిక HTTPSను అందిస్తున్నాయని నిర్ధారించడానికి మేము తగినంత కృషి చేస్తూనే ఉంటాము, అలాగే డెవలపర్‌లు అందరికీ కావలసిన టూల్స్‌ను, రిసోర్స్‌లను అందించడం ద్వారా వెబ్‌లోని ఇతరులు కూడా HTTPS వైపు అడుగులు వేసేలా మేము సహాయపడతాము.

మోసపూరిత వెబ్‌సైట్ అని హెచ్చరించే Google Chrome నోటిఫికేషన్‌ను ఫీచర్ చేస్తున్న ఫోన్

సురక్షిత బ్రౌజింగ్

వెబ్‌లో ఉన్న ప్రమాదకరమైన సైట్‌లు, యాప్‌లు, యాడ్‌ల నుండి మిమ్మల్ని సంరక్షించడం

వెబ్ యూజర్‌లు ప్రమాదకరమైన వెబ్‌సైట్‌లను సందర్శించడానికి ట్రై చేసినప్పుడు వారిని అలర్ట్ చేయడం ద్వారా, మాల్‌వేర్, అలాగే ఫిషింగ్ దాడుల నుండి వారిని సంరక్షించడానికి మేము మా సురక్షిత బ్రౌజింగ్ టెక్నాలజీని రూపొందించాము. సురక్షిత బ్రౌజింగ్ కేవలం Chrome యూజర్‌లను మాత్రమే కాకుండా, ఇతర యూజర్‌లను కూడా సంరక్షిస్తుంది – అందరికీ ఇంటర్నెట్‌ను సురక్షితంగా ఉంచడానికి, ఈ టెక్నాలజీని ఇతర కంపెనీలు కూడా వారి బ్రౌజర్‌లలో (Apple వారి Safari, అలాగే Mozilla వారి Firefoxతో సహ) ఉచితంగా ఉపయోగించుకోగలిగేలా మేము రూపొందించాము. నేడు, 4 బిలియన్‌లకు పైగా పరికరాలు సురక్షిత బ్రౌజింగ్ ద్వారా సంరక్షించబడుతున్నాయి. అలాగే, వెబ్‌సైట్ ఓనర్‌ల సైట్‌లలో సెక్యూరిటీ లోపాలు ఉంటే మేము వారిని అలర్ట్ చేస్తాము, ఇంకా సమస్యలను త్వరగా పరిష్కరించడంలో సహాయపడటానికి వారికి ఉచిత టూల్స్‌ను అందిస్తాము.

వివిధ రంగాలకు సంబంధించి ప్రదర్శించబడుతున్న COVID-19 గణాంకాలను చూపుతున్న ఫోన్

Googleకు చెందిన COVID-19 కమ్యూనిటీ కదలికల రిపోర్ట్‌లు, యూజర్ డేటాను ప్రైవేట్‌గా, భద్రంగా, ఇంకా సురక్షితంగా ఉంచడానికి భేదాత్మక గోప్యతతో పాటు ప్రపంచ స్థాయి అజ్ఞాతీకరణ టెక్నాలజీని ఉపయోగిస్తాయి.

ఓపెన్ సోర్స్ గోప్యతా టెక్నాలజీలు

మా గోప్యతా రక్షణలను, ఆవిష్కరణలను షేర్ చేయడం

మేము అందించే గోప్యతా రక్షణలను నిరంతరం మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఆ ప్రక్రియలో భాగంగా సాధించిన పురోగతులను ఇతరులతో షేర్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. అందుకనే, భేదాత్మక గోప్యత, ఫెడరేటెడ్ లెర్నింగ్, ఇంకా Private Join and Compute వంటి మా అధునాతన అజ్ఞాతీకరణ, డేటా పరిమితి నియమ టెక్నాలజీలను మేము ఓపెన్ సోర్స్ చేస్తాము. ఈ ఓపెన్ సోర్స్ టూల్స్, వ్యక్తిగత గోప్యతను సంరక్షిస్తూనే, అందరికీ ప్రయోజనం కలిగించే గణాంకాలను అందించడంలో సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము.

బహుళ స్థాయి ఖాతా రక్షణ
సెక్యూరిటీ రక్షణలను మీ Google ఖాతాకు మాత్రమే కాకుండా వెలుపలకు కూడా విస్తరింపజేయడం

Google ఖాతాలో మనకు ఉన్న సెక్యూరిటీ రక్షణలను, 'బహుళ స్థాయి ఖాతా రక్షణ', Google సైన్ ఇన్ ద్వారా మీరు సైన్ ఇన్ చేసే యాప్‌లకు, అలాగే సైట్‌లకు విస్తరింపజేస్తుంది. యాప్‌లు, సైట్‌లు, 'బహుళ స్థాయి ఖాతా రక్షణ'ను అమలు చేసినప్పుడు, అవి కూడా మిమ్మల్ని సంరక్షించగలిగేలా, సెక్యూరిటీ ఈవెంట్‌లకు – ఉదాహరణకు, ఖాతా హైజాకింగ్ – సంబంధించిన సమాచారాన్ని వాటికి మేము పంపగలము. ఈ అత్యుత్తమమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, మేము ఇతర ప్రముఖ టెక్నాలజీ కంపెనీలతో, అలాగే స్టాండర్డ్‌ల కమ్యూనిటీతో కలిసి పని చేసి, అన్ని యాప్‌లకు దీన్ని సులభంగా అమలు చేయగల వీలును కల్పించాము.

బలహీనత రివార్డ్‌లు
సెక్యూరిటీ బలహీనతలను కనిపెట్టడానికి పరిశ్రమ పార్టనర్‌లకు ప్రోత్సాహకాలను అందించడం

Googleలో, మా సర్వీస్‌లలోని బలహీనతలను కనుగొనడానికి స్వతంత్ర పరిశోధకులకు ప్రోత్సాహకాలను అందించే బలహీనతల గుర్తింపు రివార్డ్ ప్రోగ్రామ్‌లను మేము ప్రవేశపెట్టాము. మా యూజర్‌లను సురక్షితంగా ఉంచడంలో తోడ్పడగల అన్ని అత్యుత్తమ బాహ్య కంట్రిబ్యూషన్‌లకు రివార్డ్ అందించడానికి, మేము ప్రతి సంవత్సరం, రీసెర్చ్ గ్రాంటులు, అలాగే బగ్స్‌ను కనుగొనడానికి కానుకల రూపంలో లక్షల కొద్దీ డాలర్లను అవార్డులుగా అందచేస్తున్నాము. మేము ప్రస్తుతం Chrome, Androidలతో సహా మా ప్రోడక్ట్‌లలోని చాలా వాటికి సంబంధించి బలహీనతల గుర్తింపు రివార్డ్‌లను అందిస్తున్నాము.

స్వతంత్ర పరిశోధకులను భాగమయ్యేలా చేయడంతో పాటు, మా వద్ద ప్రాజెక్ట్ జీరో అని పిలవబడే అంతర్గత ఇంజినీర్ల టీమ్ కూడా ఉంది, ఈ టీమ్ ఇంటర్నెట్ వ్యాప్తంగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లోని సెక్యూరిటీ లోపాలను ట్రాక్ చేసి, వాటిని పరిష్కరిస్తుంది.

ప్రామాణీకరణ స్టాండర్ట్‌లు
మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి, ప్రామాణీకరణ స్టాండర్డ్‌లను మెరుగుపరచడం

వెబ్‌లో సాధ్యమైనంత శక్తివంతమైన సైన్ ఇన్ స్టాండర్డ్‌లను, అలాగే ప్రామాణీకరణ స్టాండర్డ్‌లను ఇతరులతో కలిసి క్రియేట్ చేయడంలోనైనా లేదా వాటిని అందిపుచ్చుకోవడంలోనైనా మేము మొదటి నుండీ అందరి కంటే ముందే ఉన్నాము. కేంద్రీకృత వెబ్ స్టాండర్డ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా మేము పరిశ్రమలోని అందరితో కలిసి పని చేసి, టెక్నాలజీని షేర్ చేస్తాము. అలాంటి ఒక భాగస్వామ్యమే లాభాపేక్ష రహిత సంస్థ అయిన FIDO Alliance, ఇది యూజర్‌లు, కంపెనీలు, అలాగే ఆ కంపెనీల ఉద్యోగులు ఉపయోగించడం కోసం కొత్త ఇండస్ట్రీ స్టాండర్డ్‌లను సెట్ చేసి, అమలు చేయడానికి పని చేసింది, తద్వారా అందరికీ సురక్షితమైన ఖాతా యాక్సెస్ అందుతుందని నిర్ధారించింది.

ఓపెన్ సోర్స్ భద్రత
సెక్యూరిటీ ప్రమాదాలను నివారించడంలో డెవలపర్‌లు సహాయపడగలిగేలా, వారికి సెక్యూరిటీ టూల్స్‌ను అందుబాటులో ఉంచడం

మా సెక్యూరిటీ టెక్నాలజీ ఇతరులకు ఉపయోగపడగలదని మేము విశ్వసించినప్పుడు, దాన్ని మేము షేర్ చేస్తాము. ఉదాహరణకు, మేము మా Google Cloud వెబ్ సెక్యూరిటీ స్కానర్‌ను డెవలపర్‌లకు ఉచితంగా అందుబాటులో ఉంచుతాము, తద్వారా వారు సెక్యూరిటీ బలహీనతలను గుర్తించడం కోసం వారి వెబ్ అప్లికేషన్‌లను స్కాన్ చేసి, విశ్లేషించగలరు. అంతర్గతంగా రూపొందించిన అనేక సెక్యూరిటీ టూల్స్‌ను ఇతరులు ఉపయోగించడం కోసం, వాటిని ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లుగా మేము కంట్రిబ్యూట్ చేశాము.

Google విశ్వసనీయత & భద్రత నిపుణులు, వాషింగ్టన్, DCలోని ఫెడరల్ ట్రయాంగిల్‌లో గోప్యత, అలాగే సెక్యూరిటీ చిట్కాలను షేర్ చేస్తారు.

ఆన్‌లైన్ భద్రతా శిక్షణ
అందరికీ మెరుగైన సెక్యూరిటీని అందించడానికి, విస్తృతమైన, అలాగే ఆన్‌లైన్ భద్రతా శిక్షణను అందించడం

ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఎలా ఉండాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు నేర్పడంలో సహాయపడటానికి మేము బోధనా మెటీరియల్‌లు, శిక్షణ, ఇంకా టూల్స్‌ను అందిస్తాము. మా అవుట్‌రీచ్ టీమ్, ఆన్‌లైన్ భద్రతా రిసోర్స్‌లను, శిక్షణను ప్రతి సంవత్సరం 100 మిలియన్‌ల కంటే ఎక్కువ మంది వ్యక్తులకు అందిస్తోంది – వీరిలో విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు తదితరులు ఉన్నారు.

ప్రాజెక్ట్ షీల్డ్
వార్తల వెబ్‌సైట్‌లు షట్ డౌన్ కాకుండా వాటిని సంరక్షించడం

ప్రాజెక్ట్ షీల్డ్ అనే సర్వీస్, వార్తలను, మానవ హక్కుల సంస్థలను, ఎన్నికల సైట్‌లను, రాజకీయ సంస్థలను, క్యాంపెయిన్‌లను, అలాగే అభ్యర్థులను మూకుమ్మడి సర్వీస్ నిరాకరణ (DDoS) దాడుల నుండి రక్షించడంలో సహాయపడటానికి మా సెక్యూరిటీ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. నకిలీ ట్రాఫిక్‌ను భారీ ఎత్తున పంపించడం ద్వారా వెబ్‌సైట్‌లు క్రాష్ అయ్యేలా చేసి, కీలక సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా యూజర్‌లను నిరోధించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు జరుగుతాయి. వెబ్‌సైట్ సైజ్‌తో లేదా దాడి తీవ్రతతో సంబంధం లేకుండా, ప్రాజెక్ట్ షీల్డ్ ఎల్లప్పుడూ ఉచితంగానే అందించబడుతుంది.

డేటా పోర్టబిలిటీ
డేటా పోర్టబిలిటీలో అత్యుత్తమ గోప్యత, అలాగే సెక్యూరిటీ ఆవిష్కరణలు

వ్యక్తులు తమ డేటాను వెబ్ వ్యాప్తంగా తరలించుకోవడంలో, అలాగే కొత్త ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్‌లను సులభంగా ట్రై చేయడంలో సహాయపడటానికి, ఇంకా Apple, Microsoft, Facebook, ఇంకా Twitter లాంటి కంపెనీలకు సహకరించడం కొనసాగించడానికి మేము ఒక ఓపెన్ సోర్స్ డేటా పోర్టబిలిటీ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేశాము,

గోప్యతా సహకారం
అందరికీ మరింత ప్రైవేట్‌గా ఉండే వెబ్‌ను రూపొందించడం

యూజర్ గోప్యతను సంరక్షిస్తూనే, వెబ్‌లో ఉచిత, యాక్సెస్ చేయదగిన కంటెంట్‌ను సపోర్ట్ చేయగల కొన్ని ఓపెన్ స్టాండర్డ్‌లను అభివృద్ధి చేయడానికి మేము గోప్యతా పరిరక్షణ టెక్నాలజీల సెట్ వంటి సహకార ప్రదేశాలను క్రియేట్ చేయడానికి, అలాగే వెబ్ కమ్యూనిటీతో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నాము. మా రిసోర్స్‌లను, ప్లాట్‌ఫామ్‌లను షేర్ చేయడం ద్వారా, మరింత ప్రైవేట్‌గా ఉండే వెబ్ వైపు అడుగులు వేయడంలో పురోగతి సాధించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నాము.

కాంటాక్ట్ ట్రేసింగ్

ప్రజారోగ్య అధికార యంత్రాంగానికి COVID-19తో పోరాడటంలో సహాయపడుతూనే,
యూజర్ గోప్యతను సంరక్షించడం

COVID-19 మహమ్మారిపై పోరాడటంలో ప్రభుత్వాలకు సహాయపడటానికి, Google, అలాగే Apple కలిసి సంయుక్తంగా 'వ్యాధి సోకగల అవకాశాన్ని తెలిపే నోటిఫికేషన్‌ల సిస్టమ్' లాంటి కాంటాక్ట్ ట్రేసింగ్ టెక్నాలజీలను క్రియేట్ చేశాయి, ఈ టెక్నాలజీలు గోప్యతను, అలాగే సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి. డెవలపర్‌లు, ప్రభుత్వాలు, ఇంకా ప్రజారోగ్య సంరక్షణ ప్రదాతలతో పరస్పరం సహకరించుకుంటూ వారితో కలిసి పని చేయడం ద్వారా, యూజర్ గోప్యతకు సంబంధించి అత్యుత్తమ స్టాండర్డ్‌లను సంరక్షిస్తూనే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలను పరిష్కరించడాన్ని కొనసాగించడానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటామని ఆశిస్తున్నాము.

ఇంజినీరింగ్ కేంద్రం

ఆన్‌లైన్ భద్రతకు సంబంధించిన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని Google భద్రతా ఇంజినీరింగ్ కేంద్రం ఏ విధంగా డిజైన్ చేస్తోందో తెలుసుకోండి.