మీ ప్రైవేట్ సమాచారాన్ని సురక్షితంగా
ఉంచే ఇమెయిల్.
స్పామ్, ఫిషింగ్, అలాగే మాల్వేర్ మీ ఇన్‌బాక్స్‌కు చేరుకోవడానికి ముందే వాటి నుండి మిమ్మల్ని రక్షించడానికి Gmail తీవ్రంగా కృషి చేస్తోంది. మా AIతో-మెరుగుపరచబడిన స్పామ్-ఫిల్టరింగ్ సామర్థ్యాలు ప్రతి నిమిషం దాదాపు 10 మిలియన్ స్పామ్ ఇమెయిల్‌లను బ్లాక్ చేస్తాయి.
ఫిషింగ్ రక్షణలు
ఫిషింగ్ రక్షణలు
అనేక మాల్వేర్, అలాగే ఫిషింగ్ దాడులు ఇమెయిల్‌తోనే ప్రారంభమవుతాయి. 99.9% కంటే ఎక్కువ స్పామ్‌ను, ఫిషింగ్ ప్రయత్నాలను, అలాగే మాల్వేర్ను మీ దాకా రాకుండా Gmail బ్లాక్ చేస్తుంది.
సురక్షిత బ్రౌజింగ్
సురక్షిత బ్రౌజింగ్
సురక్షిత బ్రౌజింగ్ ఇమెయిల్ మెసేజ్‌లలో ప్రమాదకరమైన లింక్‌లను గుర్తించడం ద్వారా మిమ్మల్ని రక్షిస్తుంది, అలాగే మీరు సైట్‌ను సందర్శించే ముందు మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
క్రియాశీల అలర్ట్‌లు
క్రియాశీల అలర్ట్‌లు
మీ సెక్యూరిటీకి ప్రమాదం కలిగించే అటాచ్‌మెంట్‌ను డౌన్లోడ్ చేయడానికి ముందు Gmail మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
ఖాతా భద్రత
ఖాతా భద్రత
పలు సెక్యూరిటీ సంకేతాలను పర్యవేక్షించడం ద్వారా అనుమానాస్పద లాగిన్లు, అలాగే అనధికార యాక్టివిటీ నుండి మేము మీ ఖాతాను రక్షిస్తాము. టార్గెట్ చేసిన ఆన్లైన్ దాడులకు గురి కాగల అత్యంత ప్రమాదంలో ఉన్న ఖాతాల కోసం మేము అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాము.
కాన్ఫిడెన్షియల్ మోడ్
కాన్ఫిడెన్షియల్ మోడ్
మీరు నిర్దేశించిన వ్యవధి తర్వాత మీ మెసేజ్‌లకు గడువు తీరిపోయే విధంగా సెట్ చేయవచ్చు, అలాగే స్వీకర్తలకు మీ మెసేజ్‌ను Gmail నుండి ఫార్వర్డ్ చేయడానికి, కాపీ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి లేదా ప్రింట్ చేయడానికి గల ఆప్షన్‌ను తీసివేయవచ్చు.
ఇమెయిల్ ఎన్క్రిప్షన్
ఇమెయిల్ ఎన్క్రిప్షన్
Google ప్రాథమిక సదుపాయాలలో, నిల్వ సమయంలోను, అలాగే డేటా కేంద్రాల మధ్య బదిలీ చేసే సమయంలోను మెసేజ్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. థర్డ్-పార్టీ ప్రొవైడర్లకు బదిలీ చేసే మెసేజ్‌లు, సాధ్యమైనప్పుడు లేదా కాన్ఫిగరేషన్ ద్వారా అవసరమైనప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీతో ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి.