Family Linkను ఉపయోగించి
డిజిటల్ ప్రాథమిక నియమాలను సెట్ చేయడంలో మీకు సహాయపడటం.
Family Link అనేది మీ చిన్నారులు ఆన్లైన్లో అన్వేషించేటప్పుడు వారి ఖాతాలను, పరికరాలను మేనేజ్ చేయడంలో మీకు సహాయపడుతుంది. మీరు యాప్‌లను మేనేజ్ చేయవచ్చు, పరికర వినియోగ వ్యవధిని పర్యవేక్షించవచ్చు, అలాగే మీ ఫ్యామిలీ కోసం ఆన్లైన్లో డిజిటల్ ప్రాథమిక నియమాలను సెట్ చేయడంలో సహాయపడవచ్చు.
-
యాప్ యాక్టివిటీ రిపోర్ట్లు
పరికర వినియోగ వ్యవధి మొత్తం సమానంగా క్రియేట్ చేయబడదు. అది, మీ చిన్నారి పరికరాన్ని ఉపయోగించి ఏమి చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది, ఉదా., పుస్తకం చదవడం, వీడియోలు చూడటం లేదా గేమ్‌లు ఆడటం. మీ చిన్నారి ఏయే యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారో చూడటానికి మీరు Family Link యాప్ యాక్టివిటీ రిపోర్ట్‌లను ఉపయోగించవచ్చు, అలాగే వారికి వేటికి యాక్సెస్ ఉండాలి అనే దాని గురించి నిర్ణయాలు తీసుకోండి.
-
రోజువారీ యాక్సెస్‌ను పరిమితం చేయండి
మీ చిన్నారికి ఎంత పరికర వినియోగ వ్యవధి ఇవ్వడం సముచితమో మీరే నిర్ణయించండి. రోజువారీ పరికర వినియోగ వ్యవధి పరిమితులను సెట్ చేయడానికి, నిద్రించే సమయంలో వారి పరికరాన్ని లాక్ చేసేలా సెట్ చేయడానికి, అలాగే మీ చిన్నారి Android లేదా Chrome OS పరికరాన్ని రిమోట్ విధానంలో లాక్ చేయడానికి Family Link మిమ్మల్ని అనుమతిస్తుంది.
-
కంటెంట్‌ను, అలాగే కొనుగోళ్లను మేనేజ్ చేయండి
Google Play స్టోర్ నుండి మీ చిన్నారి చేయాలనుకునే యాప్ డౌన్లోడ్లను, అలాగే యాప్‌లో కొనుగోళ్లను ఆమోదించండి లేదా తిరస్కరించండి.
ఖాతా సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి
మీ చిన్నారి ఖాతాను మేనేజ్ చేయడం, సురక్షితంగా ఉంచడం
Family Link సెట్టింగ్‌లలో మీ చిన్నారి యాక్టీవిటీ కంట్రోల్స్‌ను యాక్సెస్ చేయండి. ఒకవేళ మీ చిన్నారి తన పాస్‌వర్డ్‌ను మర్చిపోతే, దానిని మార్చడంలో లేదా రీసెట్ చేయడంలో తల్లి/తండ్రిగా మీరు సహాయం అందించవచ్చు. దాంతోపాటు, మీరు మీ చిన్నారి వ్యక్తిగత సమాచారాన్ని కూడా సవరించవచ్చు, అలాగే, మీరు తప్పదని భావిస్తే వారి ఖాతాను సైతం తొలగించవచ్చు. మీ అనుమతి లేకుండా వారు మరొక ప్రొఫైల్‌ను వారి ఖాాతాకు లేదా పరికరానికి జోడించలేరు. చివరిగా, మీరు వారి Android పరికరం ఉన్న లొకేషన్‌ను కూడా తెలుసుకోవచ్చు (అయితే, అది ఆన్‌లో ఉన్నప్పుడు, ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఇటీవలి సమయంలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది).
మీ ఫ్యామిలీ డిజిటల్ కంటెంట్‌ను ఉపయోగించడం కోసం నియమాలను బాగా నిర్వచించడానికి, మా ఫ్యామిలీ గైడ్‌ను చూడండి. మీ చిన్నారులతో సాంకేతికత గురించి సంభాషణలకు దారితీసే చిట్కాల ద్వారా మీరు, మీ ఫ్యామిలీ కలిసి మరింత నమ్మకంగా డిజిటల్ ప్రపంచాన్ని నావిగేట్ చేయవచ్చు.
-
కంట్రోల్ చేయబడిన ఖాతా ద్వారా మీ పిల్లలను Google Assistantను యాక్సెస్ చేయడానికి అనుమతించండి
చిన్నారులు Family Link ద్వారా మేనేజ్ చేయబడుతున్న వారి సొంత ఖాతాతో Assistant ఎనేబుల్ చేయబడిన పరికరాలలో లాగిన్ చేయవచ్చు. వాళ్లు తమ స్వంత వ్యక్తిగతీకరించిన Assistant అనుభవాన్ని పొందుతారు, కుటుంబాల కోసం రూపొందించిన గేమ్‌లను, యాక్టివిటీలు, కథనాలను యాక్సెస్ చేయగలరు. చిన్నారులు లావాదేవీలు చేయకుండా బ్లాక్ చేయబడతారు, అలాగే వారు Assistantలో థర్డ్-పార్టీ అనుభవాలకు యాక్సెస్‌ను కలిగి ఉండాలా లేదా అనే విషయాన్ని వారి తల్లిదండ్రులు నిర్ణయించగలరు.
-
Chromeలోని వెబ్సైట్లకు మీ చిన్నారి యాక్సెస్‌ను మేనేజ్ చేయండి
మీ చిన్నారి తన Android లేదా Chrome OS పరికరంలో Chrome బ్రౌజర్ ఉపయోగిస్తున్నప్పుడు, నిర్దిష్ట వెబ్సైట్లకు వారి యాక్సెస్‌ను మీరు మేనేజ్ చేయవచ్చు. మీరు సౌకర్యవంతంగా భావిస్తున్న వెబ్సైట్లకు మీ చిన్నారిని పరిమితం చేసేలా ఎంచుకోవచ్చు లేదా వారు సందర్శించకూడదని మీరు భావిస్తున్న నిర్దిష్ట సైట్లకు వారి యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు.
-
Searchలో అభ్యంతరకరమైన ఫలితాలను ఫిల్టర్ చేయండి
అదనపు స్థాయి రక్షణ కోసం, అశ్లీలత వంటి మరింత అభ్యంతరకరమైన ఫలితాలను ఫిల్టర్ చేయడంలో సహాయపడటానికి, మీరు SafeSearch ను ఆన్ చేయవచ్చు. SafeSearch అనేది Family Link ద్వారా మేనేజ్ చేయబడుతున్న ఖాతాలను కలిగి ఉన్న 13 ఏళ్లలోపు వయస్సు ఉన్న, (లేదా మీ దేశంలో మైనర్లకు వర్తించే వయస్సు ఉన్న వారు) సైన్ ఇన్ చేసిన యూజర్ల కోసం ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసే ఆప్షన్‌ను లేదా మొత్తానికే Searchకు యాక్సెస్‌ను బ్లాక్ చేసే ఆప్షన్‌ను కూడా తల్లిదండ్రులు కలిగి ఉంటారు.