మీ కుటుంబాలు మరింతగా ఆస్వాదించడం కోసం మా ప్రోడక్ట్‌లలో అనేక వాటిలో – స్మార్ట్ ఫిల్టర్‌లు, సైట్ బ్లాకర్‌లు, కంటెంట్ రేటింగ్‌లు వంటి – ప్రత్యేక ఫీచర్‌లను మేము రూపొందిస్తున్నాము.
కనుగొనడానికి, క్రియేట్ చేయడానికి, అభివృద్ధి చెందడానికి పిల్లలకు సహాయపడే కంటెంట్‌తో టాబ్లెట్ అనుభవం.*
Kids space
పిల్లల ఉత్సుకతను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది
అది జంతువులకు సంబంధించినది కావచ్చు లేదా ఆర్ట్ ప్రాజెక్టుల గురించి కావచ్చు, ఏదైనా గానీ, వారు ఇష్టపడే విషయాలలో పిల్లలు ఎక్కువ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అందువల్ల వారు ఎంచుకున్న ఆసక్తుల ఆధారంగా Kids Space మీ పిల్లలకు మంచి క్వాలిటీ ఉన్న కంటెంట్‌ను సిఫార్సు చేస్తుంది. సిఫార్సు చేసిన కంటెంట్‌తో, పిల్లలు వారి తాజా అభిరుచులను కొత్తగా, ఎంగేజ్ అయ్యే పద్దతులలో అన్వేషించవచ్చు. పిల్లలు వారి స్వంత క్యారెక్టర్‌ను క్రియేట్ చేసుకోవడం ద్వారా వారికి తగినట్లుగా మంచి అనుభూతిని పొందగలరు.
సిఫార్సు చేయబడిన యాప్‌లు, పుస్తకాలు, వీడియోలు
ఒక చిన్నారి, Kids Spaceను తెరిచినప్పుడు, వారికి మంచి క్వాలిటీ గల కంటెంట్ ఉన్న లైబ్రరీ కనిపిస్తుంది. పిల్లలు ఆడటానికి, అలాగే నేర్చుకోవడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి యాప్‌లు, ఆటలు, పుస్తకాలు, వీడియోల కోసం సిఫార్సులను అన్వేషించవచ్చు.†
తల్లిదండ్రుల కంట్రోల్స్ ద్వారా పరిధులను సెట్ చేయండి
Family Linkలో ఉన్న తల్లిదండ్రుల కంట్రోల్స్‌తో, మీ సొంత పరికరం నుండి కంటెంట్‌ను మేనేజ్ చేయడం, పరికర వినియోగ వ్యవధి పరిమితులను సెట్ చేయడం ఇంకా మరిన్నింటి ద్వారా మీ చిన్నారి అనుభవాన్ని మీరు గైడ్ చేయవచ్చు.
ఫ్యామిలీ ఫ్రెండ్లీ డిజైన్‌తో మీకు ఇష్టమైన ప్రొడక్ట్‌లు.
YouTube Kids
YouTube Kidsతో విజ్ఞాన ప్రపంచాన్ని తెలుసుకోండి, వినోదాన్ని ఆవిష్కరించండి
మేము చిన్నారుల కోసం YouTube Kidsను పిల్లలు వారి ఆసక్తులను ఆన్‌లైన్ వీడియోల ద్వారా అన్వేషించడానికి ఒక సురక్షితమైన వాతావరణం అందించేలా క్రియేట్ చేశాము. మీరు YouTube Kids యాప్‌ను డౌన్‌లోడ్ చేసినా, వెబ్‌లో మమ్మల్ని సందర్శించినా, లేదా మీ స్మార్ట్ టీవీలో YouTube Kids చూసినా మీ అన్ని పరికరాల్లో విభిన్న టాపిక్‌లపై ఫ్యామిలీ-ఫ్రెండ్లీ వీడియోలను మీరు కనుగొనవచ్చు.
Google Playలో మీ చిన్నారి కోసం “టీచర్ ఆమోదించిన” కంటెంట్
మీ చిన్నారికి సరైన కంటెంట్‌ను కనుగొనడంలో మీకు సహాయపడటానికి మేము దేశవ్యాప్తంగా విద్యా నిపుణులు, టీచర్‌లతో జతకట్టాము. వికాసాన్ని అందించే, వినోదాత్మకంగా ఉండే “టీచర్ ఆమోదించిన” యాప్‌లను కనుగొనడానికి Google Play స్టోర్‌లో మా పిల్లల ట్యాబ్‌ను బ్రౌజ్ చేయండి. యాప్ వివరాల పేజీలో, టీచర్‌లు యాప్‌లను ఎందుకు ఎక్కువగా రేట్ చేస్తున్నారో మీరు చూడవచ్చు, అలాగే ఆ యాప్ మీ పిల్లల వయస్సుకు తగినదా లేదా అని అర్థం చేసుకోవడానికి కంటెంట్ రేటింగ్‌లను చెక్ చేయండి. యాప్‌లో యాడ్‌లు ఉన్నాయో లేదో, యాప్‌లో కొనుగోళ్లకు అనుమతి ఉందో లేదా పరికర అనుమతులు అవసరమా అనే విషయాలను కూడా మీరు చూడవచ్చు.
Google Assistant సహాయంతో కుటుంబ సభ్యులందరూ ఆనందించండి
మీ Assistant, మొత్తం కుటుంబం కలిసి ఆనందించడానికి వినోదాన్ని కనుగొనడం సులభం చేస్తుంది. మా ఇంటిల్లిపాదీ ఉపయోగించగల చర్యల ప్రోగ్రామ్ ద్వారా లేదా నిద్రపోవడానికి ముందు మీకు కథ చెప్పమని మీ Assistantను అడిగి మీకు ఇష్టమైన కథలను వినడం ద్వారా క్రియేట్ చేయబడిన ఫ్యామిలీ-ఫ్రెండ్లీ గేమ్‌లు, యాక్టివిటీలను కనుగొనండి. మీరు ఫిల్టర్‌లను సెటప్ చేసిన తర్వాత ఫ్యామిలీ మొత్తం ఆనందించే మ్యూజిక్‌ను వినండి, అలాగే మీ పరికరంలో డౌన్‌టైమ్‌ను అన్‌ప్లగ్ చేసి, అందరూ కలిసి మీ సమయాన్ని ఆనందించండి.
మా ప్రతి ఇంటిల్లిపాదీ ఉపయోగించగల చర్యల యాక్టివిటీలను మాన్యువల్ రివ్యూవర్‌లు రివ్యూ చేశారు, కానీ ఏ సిస్టమ్ పరిపూర్ణంగా ఉండదు. అనుచితమైన కంటెంట్ పొరపాటుగా వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి మేము మా రక్షణ ఛత్రాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నాము.
ఆన్‌లైన్‌లో సురక్షితమైన శిక్షణ కోసం విద్యార్థులు, టీచర్‌లకు టూల్స్‌ను అందించడం.
Google Workspace
తరగతి గదుల కోసం మరింత సురక్షితమైన విద్యాభ్యాస విధానాన్ని రూపొందిస్తున్నాము
Google Workspace for Education టీచర్‌లు, విద్యార్థులు పరికరాల్లో సురక్షితంగా ఇంటరాక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. దాని ప్రధాన సర్వీస్‌లలో యాడ్‌లు ఉండవు, అలాగే యాడ్‌లను టార్గెట్‌గా చేసుకోవడానికి మేము ప్రాథమిక, మాధ్యమిక (K-12) స్కూల్‌లలో ఉన్న యూజర్‌ల వ్యక్తిగత సమాచారం ఏదీ ఉపయోగించము. అడ్మినిస్ట్రేటర్‌లకు సముచితమైన యాక్టివిటీలపై పాలసీలను సెట్ చేయడానికి టూల్స్‌ను కూడా అందిస్తాము, అలాగే విద్యార్థులు వారి స్కూల్ Google ఖాతాలను ఉపయోగించడంలో సహాయం చేస్తాము. మేము స్కూల్‌లకు టూల్స్, రిసోర్స్‌లను అందించడానికి కట్టుబడి ఉన్నాము, వారి విద్యార్థులు ఉపయోగించే Google Workspace for Education సర్వీస్‌ల వినియోగం గురించి అర్థం చేసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి అవసరమవుతాయి.
లక్షలాది మంది విద్యార్థులు తరగతి గదిలో Chromebookలు, Google ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తారు. వీలైనంత ఎక్కువ లేదా తక్కువ ఫంక్షనాలిటీని, లేదా అవసరమైనంత యాక్సెస్‌ను విద్యార్థులకు అందించేలా గ్రూప్ సెట్టింగ్‌లను అడ్మినిస్ట్రేటర్‌లు మేనేజ్ చేయవచ్చు. మా గోప్యత, సెక్యూరిటీ ఫీచర్‌లు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి సహాయపడతాయి, అలాగే U.S. K–12 స్కూల్‌లు, ఇతర దేశాల్లోని అనేక స్కూల్‌లలో Chromebookలు ప్రాథమికంగా ఎంచుకోవడానికి సహాయపడ్డాయి.
* Google Kids Spaceకు మీ చిన్నారి కోసం Google ఖాతా అవసరం. తల్లిదండ్రుల కంట్రోల్స్ కోసం Family Link యాప్‌ను సపోర్ట్ చేసే Android, Chromebook లేదా iOS వంటి పరికరం ఉండడం అవసరం.
† Books. ఇంకా వీడియో కంటెంట్ అన్ని ప్రాంతాలలో అందుబాటులో లేదు. వీడియో కంటెంట్ అనేది YouTube Kids యాప్ లభ్యతకు లోబడి ఉంటుంది. Books కంటెంట్‌కు Play Books యాప్ అవసరం. యాప్‌లు, పుస్తకాలు, ఇంకా వీడియో కంటెంట్ల లభ్యత అనేది నోటీసు లేకుండా మారవచ్చు. Google Kids Spaceలో Google Assistant అందుబాటులో లేదు.
తల్లిదండ్రుల కంట్రోల్స్
డిజిటల్ ప్రాథమిక నియమాలను సెట్ చేసి, ఆన్‌లైన్‌లో మంచి అలవాట్లను క్రియేట్ చేయడంలో కుటుంబాలకు Google ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.