సురక్షితమైన,
మరింత విశ్వసనీయ ఇంటర్నెట్‌ను
రూపొందించడం.

గోప్యత, సెక్యూరిటీ, బాధ్యతాయుతమైన కంటెంట్, ఫ్యామిలీ భద్రత వంటి అంశాలపై నేడు ప్రపంచం నలుమూలలా Google టీమ్‌లు పని చేస్తున్నాయి. ఇంజినీర్‌లు, పాలసీ స్పెషలిస్ట్‌లు, అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న నిపుణులతో కూడిన అనుభవజ్ఞులైన టీమ్‌ల సారథ్యంలో, మ్యూనిచ్, అలాగే డబ్లిన్‌లో ఉండే మా Google భద్రతా ఇంజినీరింగ్ కేంద్రాలు ఈ ఇంటర్నెట్ భద్రతా పనులను గైడ్ చేయడంలో సహాయపడుతుంటాయి.

మ్యూనిచ్ కేంద్రం
GSEC మ్యూనిచ్

గోప్యత, అలాగే సెక్యూరిటీ ఇంజినీరింగ్‌కు సంబంధించిన వ్యవహారాలను చూసుకోవడం మా మ్యూనిచ్ కేంద్రం ప్రత్యేకత.

వివరాలు తెలుసుకోండి
డబ్లిన్ కేంద్రం
GSEC డబ్లిన్

బాధ్యతాయుతమైన కంటెంట్‌ను ప్రోత్సహించడం మా డబ్లిన్ కేంద్రం ప్రత్యేకత.

వివరాలు తెలుసుకోండి

భద్రతా ఇంజినీరింగ్ విషయంలో మేము అనుసరించే విధానం.

ఇంటర్నెట్ భద్రత విషయంలో ఉన్న ఆందోళనలను అర్థం చేసుకోవడానికి మేము ప్రపంచ నలుమూలల ఉన్న వ్యక్తులతో మాట్లాడుతుంటాము. ఆన్‌లైన్ భద్రతను మెరుగుపరచడంలో సహాయపడటానికి, అత్యంత అధునాతన పరిష్కార సాధనాలను అభివృద్ధి చేయడం కోసం మేము మా నిపుణుల టీమ్‌లకు స్వేచ్ఛను, స్ఫూర్తిని, అలాగే సపోర్ట్‌ను అందిస్తుంటాము.

అర్థం చేసుకుంటాము

ఇంటర్నెట్ భద్రతకు ప్రస్తుతం ఉన్న, అలాగే భవిష్యత్తులో ఎదురవ్వగల ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి మేము వ్యక్తులను అడుగుతాము, అలాగే వారు చెప్పేది ఆలకిస్తాము

అభివృద్ధి చేస్తాము

ప్రతిస్పందనగా, మేము కొత్త, అలాగే సందర్భోచితమైన ఇంజినీరింగ్ పరిష్కార సాధనాలను అభివృద్ధి చేస్తాము

చైతన్యపరుస్తాము

టూల్స్, ఈవెంట్‌లు, రిసోర్స్‌లు, ఇంకా కార్యక్రమాలతో వ్యక్తులను, తమను తాము సంరక్షించుకొనేందుకు చైతన్యపరుస్తాము

పార్ట్‌నర్‌షిప్ పెట్టుకుంటాము

విజ్ఞానాన్ని షేర్ చేయడానికి, అలాగే సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి మేము పాలసీ రూపకర్తలతో కలిసి పని చేస్తాము

సైబర్ సెక్యూరిటీ అడ్వాన్స్‌మెంట్‌లు

ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్‌లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.