ఇంటర్నెట్ను అందరికీ సురక్షితం చేయడానికి, ప్రతి రోజూ Google పని చేస్తుంది
ప్రజలను, బిజినెస్‌లను, ప్రభుత్వాలను రక్షించండి
సెక్యూరిటీ అనేది మా ప్రోడక్ట్ స్ట్రాటజీలో ప్రధానమైనది. అందుకే మా ప్రోడక్ట్‌లు అన్నింటిలో బిల్ట్-ఇన్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు వాటిని ఆటోమేటిక్‌గా సురక్షితంగా ఉంచుతాయి.
మరింత తెలుసుకోండిసైబర్ సెక్యూరిటీ రిస్క్‌లను పరిష్కరించడానికి సొసైటీకి అధికారం ఇవ్వండి
మేము కమ్యూనిటీలు ఓపెన్ సోర్స్ సామర్థ్యాన్ని గ్రహించడంలో సహాయం చేస్తాము, అలాగే ఎకో-సిస్టమ్‌లను సురక్షితంగా ఉంచడానికి పరిశ్రమతో మా జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పారదర్శకంగా షేర్ చేసుకుంటాము.
మరింత తెలుసుకోండిఅడ్వాన్స్ ఫ్యూచర్ టెక్నాలజీలు
కొత్త కొత్త మార్గాల్లో వస్తున్న సైబర్ ప్రమాదాల నుంచి సమాజాన్ని రక్షించాలని భావిస్తున్నాము. మా AI నైపుణ్యం ఆధారంగా, సెక్యూరిటీ ఆవిష్కరణల పరిమితులను అధిగమించడానికి మేము తదుపరి తరం ఆర్కిటెక్చర్లను రూపొందిస్తాము.
మరింత తెలుసుకోండిమేము మా ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంకా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని ప్రతి దశలో అధునాతన సెక్యూరిటీని రూపొందిస్తాము. యూజర్లు వారి వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచుకోవడంలో, ఇంటర్నెట్ను సురక్షితంగా యాక్సెస్ చేయడంలో సహాయపడుతున్నప్పుడు, సంస్థలు వారి IT సెక్యూరిటీని ఆధునీకరించడానికి, బలోపేతం చేయడానికి ఇది అనుమతిస్తుంది.
-
హానికరమైన కంటెంట్‌తో పోరాడటం
మా పాలసీలను ఉల్లంఘించే చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్‌ను గుర్తించి, తీసివేయడం ద్వారా మేము దుర్వినియోగాన్ని నివారించి, యూజర్లను, ప్రత్యేకించి పిల్లలను రక్షిస్తాము. మోసపూరిత యాడ్స్, తప్పు దోవ పట్టించే సమాచారం, ద్వేషం, స్కామ్‌లు ఇంకా పిల్లల భద్రతతో సహా వివిధ రకాల వేధింపు కేటగిరీలలో మేము దీన్ని చేస్తాము.
మేము సైబర్ సెక్యూరిటీ లీడర్లు, ప్రభుత్వాలు ఇంకా సెక్యూరిటీ కమ్యూనిటీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటున్నాము, ఇది యూజర్ రక్షణకు మొదటి స్థానం ఇవ్వడానికి, తప్పు దోవ పట్టించే సమాచారాన్ని ఎదుర్కోవడానికి అలాగే ఇంటర్నెట్ను అందరికీ యాక్సెస్ అయ్యేలా, సురక్షితంగా ఉంచడానికి థ్రెట్ ఇంటెలిజెన్స్‌ను షేర్ చేసే అత్యున్నత గ్లోబల్ స్టాండర్డ్‌లను అభివృద్ధి చేయడానికి దోహద పడుతుంది.
-
సైబర్ వర్క్‌ఫోర్స్‌ను శక్తివంతం చేయడం
అనుభవం లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా సైబర్ సెక్యూరిటీలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో అలాగే అందరికీ సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయం చేయడానికి మా నైపుణ్యాన్ని పంచుకోవడం, కెరీర్ మార్గాలను విస్తరించడం, అలాగే బలమైన పరిశ్రమ, ప్రభుత్వ భాగస్వామ్యాలను ఏర్పరచడం ద్వారా మేము సైబర్ వర్క్‌ఫోర్స్‌ను శక్తివంతం చేస్తున్నాము.
-
Mandiant థ్రెట్ ఇంటెలిజెన్స్
Mandiant, ప్రపంచ వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీలో అగ్రగామిగా ఉన్న సంస్థలతో కలిసి రియల్-టైమ్‌లో, ఇన్ డెప్త్ థ్రెట్‌లను ఎదుర్కోవడానికి తప్పనిసరిగా అవసరమయ్యే సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ను తీసుకు వస్తోంది. మేము, Google క్లౌడ్ సెక్యూరిటీని ఉపయోగించుకుంటూ బిజినెస్ సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు/ఏజెన్సీలకు సహాయకరంగా ఉంటాము. సెక్యూరిటీ లైఫ్‌సైకిల్ పొడవునా ప్రతి దశలోనూ ఆ సంస్థలను సురక్షితంగా ఉంచడానికి దోహదం చేస్తాము.
AI, హార్డ్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా క్వాంటం కంప్యూటింగ్ కోసం అంతర్జాతీయ స్టాండర్డ్‌లను అనుసరించడం ద్వారా వారి గోప్యతను కాపాడుతూ ఆన్లైన్ అటాక్‌ల ద్వారా హాని కలిగే అవకాశమున్న యూజర్లను రక్షించడానికి మేము పని చేస్తాము.
-
Google Trust సర్వీస్‌లు
GTS అనేది భౌగోళికంగా పంపిణీ చేయబడిన Google ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రూపొందించిన ఉచిత సర్టిఫికేట్ అథారిటీ, ఇది కనెక్షన్లను ప్రామాణీకరిస్తుంది, ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. Google మా స్వంత సైట్లను GTSతో సురక్షితం చేస్తుంది అలాగే ఇప్పుడు అన్ని వెబ్సైట్లు ఉపయోగించడానికి అదే టెక్నాలజీని అందిస్తోంది.
సైబర్‌సెక్యూరిటీ అనేది టీమ్ స్పోర్ట్, ఇది మనం కలిసి పని చేసినప్పుడు, ఈ సంక్లిష్టమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ల్యాండ్‌స్కేప్‌లో అందరికీ ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలను ప్రోత్సహించవచ్చు, బెస్ట్ ప్రాక్టీసులను ముందుకు తీసుకెళ్లవచ్చు.
మా టీమ్‌లు, గోప్యత, సెక్యూరిటీ, బాధ్యతాయుతమైన కంటెంట్, ఫ్యామిలీ భద్రత వంటి అంశాలపై నేడు ప్రపంచం నలుమూలలా పని చేస్తున్నాయి. మా GSECలు, అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, పాలసీ స్పెషలిస్ట్‌లు, విషయ నిపుణుల నేతృత్వంలో, ఈ వర్క్‌ను గైడ్ చేయడంలో సహాయపడతాయి.
మా ప్రోడక్ట్‌లు ఆశించిన విధంగా పని చేసేలా చూడడానికి, ఇంటర్నెట్ను సురక్షితంగా ఉంచడానికి మా Bug Huntersకు చెందిన గ్లోబల్ కమ్యూనిటీ ఆ ప్రోడక్ట్లను నిశితంగా పరిశీలిస్తుంటుంది.
మేము, ప్రభుత్వాలు, కీలకమైన మౌలిక సదుపాయాలు, సంస్థలు ఇంకా చిన్న బిజినెస్‌ల సెక్యూరిటీకి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు సపోర్ట్ చేయడానికి, ప్రపంచంలోని అత్యుత్తమ సెక్యూరిటీ అడ్వైజరీ టీమ్‌ను నియమించాము.
మరిన్ని మార్గాలను అన్వేషించండి.
-
మా ప్రోడక్ట్లలోGoogleకు సంబంధించిన అన్ని ప్రోడక్ట్లలో మీ భద్రత ఎలా రక్షించబడుతుందో తెలుసుకోండి.
-
సెక్యూరిటీ, గోప్యతGoogle మీ ప్రైవేట్ సమాచారాన్ని ఎలా రక్షిస్తుందో అలాగే మీకు కంట్రోల్‌ను ఎలా ఇస్తుందో అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
-
ఫ్యామిలీ భద్రతఆన్లైన్లో మీ ఫ్యామిలీకి ఏది సరైనది అనేది మేనేజ్ చేయడానికి Google మీకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.