సెక్యూరిటీ గురించి
మీరు ఎప్పటికీ ఆలోచించాల్సిన అవసరం లేదు.
Chrome సెక్యూరిటీ ఫీచర్లు మిమ్మల్ని మాల్వేర్ ఇంకా ప్రమాదకరమైన సైట్ల నుండి సురక్షితంగా ఉంచుతాయి, కాబట్టి మీరు బ్రౌజింగ్ అనుభవం నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి.
ఆటోమేటిక్‌గా సురక్షితమైనది
ఆటోమేటిక్‌గా సురక్షితమైనది
Chrome ఆటోమేటిక్‌గా సురక్షితమైనది, మీ పాస్‌వర్డ్‌లను దొంగిలించే లేదా మీ కంప్యూటర్‌కు హాని కలిగించే ప్రమాదకరమైన, అలాగే మోసపూరిత సైట్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. సైట్ ఐసోలేషన్, శాండ్‌బాక్సింగ్, అలాగే సూచనాత్మక ఫిషింగ్ రక్షణలు వంటి అధునాతన సాంకేతికతలు మిమ్మల్ని, అలాగే మీ డేటాను సురక్షితంగా ఉంచుతాయి.
మీరు వెబ్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఉపయోగించే శక్తివంతమైన, అలాగే ప్రత్యేకమైన పాస్వర్డ్లు
మీరు వెబ్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఉపయోగించే శక్తివంతమైన, అలాగే ప్రత్యేకమైన పాస్వర్డ్లు
పలు సైట్లకు మీ డేటాను బహిర్గతం చేయగల బలహీనమైన, వేరే చోట వాడిన పాస్‌వర్డ్‌లకు వీడ్కోలు చెప్పండి. Chrome శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేస్తుంది, అలాగే మీరు మీ ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఫోన్లో వెబ్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ కోసం వాటిని ఆటోఫిల్ చేస్తుంది. మీ ఆధారాలు చోరీకి గురైనప్పుడు Chrome మిమ్మల్ని హెచ్చరించగలదు.
ఎల్లప్పుడూ అప్డేట్ అయ్యి ఉంటుంది
ప్రతి ఆరు వారాలకు Chrome ఆటోమేటిక్‌గా అప్డేట్ చేయబడుతుంది, కాబట్టి మీరు ఎల్లప్పుడూ తాజా సెక్యూరిటీ ఫీచర్లు, అలాగే పరిష్కారాలను పొందుతారు. అలాగే ముఖ్యమైన సెక్యూరిటీ బగ్‌ల కోసం, మేము 24 గంటల్లోపు పరిష్కార చర్యను తీసుకుంటాము - మీ నుండి ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు.
అజ్ఞాత మోడ్
అజ్ఞాత మోడ్
మీరు మీ పరికరాన్ని ఫ్రెండ్స్, అలాగే ఫ్యామిలీతో అజ్ఞాత మోడ్‌లో షేర్ చేయడం అనేది మీకు ప్రశాంతతను ఇస్తుంది. అజ్ఞాత మోడ్‌లో బ్రౌజ్ చేయండి, తద్వారా మీరు వాటిని మూసివేసిన తర్వాత మీ అజ్ఞాత విండోల్లో ఉండే మీ బ్రౌజింగ్ హిస్టరీ అనేది Chrome నుండి తొలగించబడుతుంది.
భద్రతా తనిఖీ
Chrome భద్రతా తనిఖీ అనేది మీ బ్రౌజింగ్ అనుభవానికి సంబంధించిన మొత్తం సెక్యూరిటీ, అలాగే గోప్యతను నిర్ధారించగలదు. Chromeలో సేవ్ చేయబడిన ఏదైనా పాస్వర్డ్లు చోరీకి గురైనప్పుడు ఇది తెలియజేస్తుంది, ప్రమాదకరమైన ఎక్స్టెన్షన్లను ఫ్లాగ్ చేసి సెక్యూరిటీ రక్షణలు అప్డేట్ అయ్యి ఉన్నాయని నిర్ధారించుకోవడంలో మీకు సహాయపడుతుంది.
గోప్యతా కంట్రోల్స్
వ్యక్తిగతీకరించిన ఫీడ్ నుండి అనుకూలమైన పాస్వర్డ్ మేనేజ్మెంట్, అలాగే సందర్భోచిత సెర్చ్ ఫలితాల వరకు, మీ Chrome అనుభవం మీకు అనుగుణంగా ఉంటుంది. మీ లొకేషన్ లేదా కెమెరాకు యాక్సెస్ వంటి వెబ్సైట్ అనుమతులను కంట్రోల్ చేయడంతో పాటు, సింక్ చేయడం, అలాగే Chromeకు సంబంధించిన గోప్యతా కంట్రోల్స్‌తో మీ అనుభవాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి.
మరింత తెలుసుకోండి.