Google Assistant
మీ సమాచారాన్ని
ప్రైవేట్‌గా, భద్రంగా, సురక్షితంగా ఉంచేందుకు రూపొందించబడింది.
మీరు Google Assistantను ఉపయోగించేటప్పుడు, మీ డేటా విషయంలో మమ్మల్ని నమ్ముతారు, అలాంటప్పుడు దాన్ని సంరక్షించడం, గౌరవించడం మా బాధ్యత. గోప్యత వ్యక్తిగతమైనది. అందుకే మేము మీకేది సరైనదో మీరు ఎంచుకోవడంలో సహాయపడేందుకు, సులభమైన గోప్యతా కంట్రోల్స్‌ను రూపొందిస్తాము. Google Assistant ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి, మీ బిల్ట్-ఇన్ గోప్యతా కంట్రోల్స్ గురించి, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు పొందడం, మరెన్నో విషయాలను గురించి మరింత తెలుసుకోవడానికి ఈ పేజీని అన్వేషించండి.
స్టాండ్‌బై మోడ్‌లో ప్రారంభమవుతుంది
యాక్టివేషన్‌ను గుర్తించేంత వరకు, అంటే దానికి "Ok Google" వంటివి వినిపించేంత వరకు, స్టాండ్‌బై మోడ్‌లో ఉండేలా Google Assistant డిజైన్ చేయబడింది. స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు, మీ Assistant మీరు చెప్తున్నదాన్ని Googleకు గాని, ఇంకెవరికైనా గాని పంపదు.
Google Assistant యాక్టివేషన్‌ను గుర్తించిన తర్వాత, అది స్టాండ్‌బై మోడ్‌ను వదిలివేసి, మీ రిక్వెస్ట్‌ను Google సర్వర్‌లకు పంపుతుంది. "Ok Google"లా అనిపించే శబ్దం వినిపించినప్పుడు లేదా చేయాలని అనుకోని మాన్యువల్ యాక్టివేషన్ అయ్యినప్పుడు కూడా ఇది జరగవచ్చు.
Google Assistant ఆడియో రికార్డింగ్‌లను, Web & App Activity, అలాగే యాడ్స్ వ్యక్తిగతీకరణను ఎలా హేండిల్ చేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
నేను చెప్పే ప్రతీదీ Google Assistant రికార్డ్ చేస్తోందా?
లేదు. యాక్టివేషన్‌ను గుర్తించేంత వరకు, అంటే దానికి "Ok Google" వంటివి వినిపించేంత వరకు, స్టాండ్‌బై మోడ్‌లో ఉండేలా Google Assistant డిజైన్ చేయబడింది. స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు, మీ Assistant మీరు చెప్తున్నదాన్ని Googleకు గాని, ఇంకెవరికైనా గాని పంపదు. Google Assistant యాక్టివేషన్‌ను గుర్తించిన తర్వాత, అది స్టాండ్‌బై మోడ్‌ను వదిలివేసి, మీ రిక్వెస్ట్‌ను Google సర్వర్‌లకు పంపుతుంది. "Ok Google"లా అనిపించే శబ్దం వినిపించినప్పుడు లేదా చేయాలని అనుకోని మాన్యువల్ యాక్టివేషన్ అయ్యినప్పుడు కూడా ఇది జరగవచ్చు.
నా Google Assistantను నేను ఎలా యాక్టివేట్ చేయాలి?
మీ పరికరాన్ని బట్టి, మీ Assistantను మీరు కొన్ని మార్గాలలో యాక్టివేట్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు "Ok Google" అని చెప్పవచ్చు లేదా మీ ఫోన్ పవర్ బటన్ లేదా హోమ్ బటన్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా మాన్యువల్‌గా యాక్టివేట్ చేయవచ్చు.
Google Assistant యాక్టివేట్ అయినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది?
మీ పరికరంలో ఉన్న స్టేటస్ ఇండికేటర్, అంటే పరికరం పైభాగంలో ఉండే ఆన్-స్క్రీన్ ఇండికేటర్ లేదా మెరిసే LEDలు, Google Assistant యాక్టివేట్ అయినప్పుడు మీకు తెలియజేస్తాయి.
నాకు ఆ ఉద్దేశ్యం లేకపోయినా, ఒక్కోసారి Google Assistant ఎందుకు యాక్టివేట్ అయిపోతుంది?
Google Assistant మీకు సహాయం కావాలని తప్పుగా గుర్తించినందున మీరు అనుకోని సమయంలో యాక్టివేట్ కావచ్చు - ఉదాహరణకు "Ok Google" లాంటి శబ్దం వచ్చినప్పుడు లేదా మీరు అనుకోకుండా మాన్యువల్‌గా యాక్టివేట్ చేసినప్పుడు. ఉద్దేశపూరితం కాని యాక్టివేషన్‌లను తగ్గించడంలో మా సిస్టమ్‌లను మెరుగుపరచడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము.
ఒకవేళ ఆ విధంగా జరిగినట్లయితే, మీ వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్ చేయబడితే, మీరు “Ok Google, అది నీ కోసం కాదు” అని చెప్పవచ్చు, అప్పుడు మీ Assistant మీరు చెప్పిన వాటిని నా యాక్టివిటీ నుండి తొలగిస్తుంది. మీరు ఏ సమయంలోనైనా నా యాక్టివిటీలో మీ Assistant ఇంటరాక్షన్‌లను రివ్యూ చేసి, తొలగించవచ్చు. మీరు అనుకోని సమయంలో Google Assistant యాక్టివేట్ చేయబడి, మీ వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్ డిజేబుల్ చేయబడి ఉంటే, మీ Assistant ఇంటరాక్షన్ నా యాక్టివిటీలో స్టోర్ చేయబడదు.
మీ వాతావరణానికి అనుకూలంగా Google Assistantను మెరుగ్గా మలచుకోడానికి, స్మార్ట్ స్పీకర్‌లు, స్మార్ట్ డిస్‌ప్లేల కోసం Google Home యాప్ ద్వారా యాక్టివేషన్ పదబంధాలకు ("Ok Google" వంటివి) మీరు మీ Assistant ఎంత సున్నితత్వాన్ని కలిగి ఉండాలో సర్దుబాటు చేయవచ్చు.
స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు Google Assistant ఏం చేస్తోంది?
Google Assistant యాక్టివేషన్‌ను గుర్తించే వరకు స్టాండ్‌బై మోడ్‌లో వేచి ఉండేలా డిజైన్ చేయబడింది.n. స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు, యాక్టివేషన్‌ను గుర్తించడానికి, పరికరం, ఆడియోతో ఉన్న షార్ట్ టెక్స్ట్ ప్రివ్యూలను (కొన్ని సెకన్లు) ప్రాసెస్ చేస్తుంది – అంటే మీరు చెప్పే “Ok Google” లాంటి వాటిని. యాక్టివేషన్ ఏదీ గుర్తించబడకపోతే, అప్పుడు ఆ ఆడియో టెక్స్ట్ ప్రివ్యూలను Googleకు పంపడం గాని సేవ్ చేయడం గాని జరగదు.
Google Assistant యాక్టివేషన్‌ను గుర్తించినప్పుడు ఏమి జరుగుతుంది?
ఇది యాక్టివేషన్‌ను గుర్తించిన తర్వాత, మీ అసిస్టెంట్ స్టాండ్‌బై మోడ్ నుండి నిష్క్రమిస్తుంది - ఇందులో ఉద్దేశపూరితం కానీ మాన్యువల్ యాక్టివేషన్ లేదా "Ok Google" లాగా శబ్దం ఉంటే కూడా ఉంటుంది. మీ పరికరం ఏదైతే విన్నదో దాన్ని రికార్డ్ చేసి, మీ రిక్వెస్ట్‌ను నెరవేర్చడానికి ఆడియో రికార్డింగ్‌ను Google సర్వర్‌లకు పంపుతుంది. రికార్డింగ్‌లో మీ పూర్తి రిక్వెస్ట్‌ను క్యాచ్ చేయడానికి యాక్టివేట్ చేసే కొద్ది సెకన్ల ముందటి సమయం కూడా రికార్దింగ్‌లో ఉండవచ్చు.
Google సర్వర్‌లకు పంపబడిన ఏవైనా ఆడియో రికార్డింగ్‌లు మీ Google ఖాతాలో సేవ్ చేయబడతాయా లేదా అనే దానిపై మీరు ఎల్లప్పుడూ కంట్రోల్‌లో ఉంటారు. మీ ఆడియో రికార్డింగ్‌లను మేము ఆటోమేటిక్‌గా సేవ్ చేయము. "వాయిస్, ఆడియో రికార్డింగ్‌లను చేర్చు" చెక్‌బాక్స్‌ను వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్ కింద చూడడం ద్వారా మీ ప్రస్తుత సెట్టింగ్‌ను మీరు చెక్ చేయవచ్చు.
గోప్యత కోసం డిజైన్ చేయబడింది
ఆటోమేటిక్ సెట్టింగ్‌గా, మేము Google Assistant ఆడియో రికార్డింగ్‌ల నిల్వను కొనసాగించము. మీ డేటా, Google Assistant మీ కోసం పనిచేసేలా ఎలా చేస్తుందో మరింత తెలుసుకోవడానికి, “Google Assistantలో మీ డేటా”ను సందర్శించండి.
Google Assistant నా డేటాను ఎలా ఉపయోగిస్తుంది?
మీరు ఏమి అడుగుతున్నారు అన్నది అర్థం చేసుకుని, ప్రతిస్పందించడానికి గానూ, లింక్ అయిన మీ పరికరాల నుండి, సర్వీస్‌ల నుండి వచ్చే క్వెరీలను, సమాచారాన్ని Assistant ఉపయోగిస్తుంది. వీటిని మీ ఎక్స్‌పీరియన్స్‌ను వ్యక్తిగతీకరించడానికి కూడా ఉపయోగిస్తుంది. లొకేషన్, కాంటాక్ట్‌లు, పరికరం పేర్లు, టాస్క్‌లు, ఈవెంట్‌లు, అలారమ్‌లు, ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు, అలాగే ప్లేలిస్ట్‌లు మొదలగునవి, మీ లింక్ చేయబడిన పరికరాలకు, సర్వీస్‌లకు సంబంధించిన సమాచారానికి ఉదాహరణలు.
Google గోప్యతా పాలసీలో వివరించిన విధంగా Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు ఇంకా మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, వాటిని మెరుగుపరచడానికి కూడా మీ డేటా ఉపయోగించబడుతుంది. క్వాలిటీని అంచనా వేయడంలో, అలాగే Assistantను మెరుగుపరచడంలో సహాయం చేయడానికి, రివ్యూవర్‌లు మీ Assistant క్వెరీలను, సంబంధిత సమాచారాన్ని చదవడం, అదనపు గమనికలు జోడించడం ఇంకా వాటి టెక్స్ట్‌ను ప్రాసెస్ చేయడం వంటివి చేస్తారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా మీ గోప్యతను రక్షించడానికి మేము తగిన చర్యలను తీసుకుంటాము. రివ్యూవర్‌లు వాటిని చూడటానికి లేదా అదనపు గమనికలను జోడించడానికి ముందు, మీ Google ఖాతా నుండి మీ క్వెరీలను డిస్‌కనెక్ట్ కూడా చేస్తారు.
Google Assistant, మీ డేటాను ఎలా ఉపయోగిస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోండి. Google, మీ డేటాను ఎలా భద్రపరుస్తుంది, ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, Googleకు చెందిన గోప్యతా పాలసీ లింక్‌కు వెళ్లండి.
Google Assistant నా ఆడియో రికార్డింగ్‌లను సేవ్ చేస్తుందా?
ఆడియో రికార్డింగ్‌లు ఆటోమేటిక్‌గా నిల్వ చేయబడవు. "ఆడియో రికార్డింగ్‌లను చేర్చండి" ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్‌లో మీ ఆడియో రికార్డింగ్‌లను సేవ్ చేయడాన్ని ఎంచుకోవచ్చు.
నా ఆడియో రికార్డింగ్‌లను, నా Google ఖాతాకు సేవ్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?
మీరు అందరికీ మా ఆడియో గుర్తింపు టెక్నాలజీను మెరుగుపరచడంలో సహాయం చేయాలనుకుంటే, మీ ఆడియో రికార్డింగ్‌లను, భద్రంగా నిల్వ ఉంచి, మా 'స్పీచ్‌ను మెరుగుపరిచే సిస్టమ్‌ల'కు అందుబాటులో ఉంచడాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇలా చేయడం వలన Google Assistant లాంటి ప్రోడక్ట్‌లకు, భవిష్యత్తులో భాషను అర్థం చేసుకొనే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం లభిస్తుంది. ఈ ప్రాసెస్ గురించి మరింత తెలుసుకోండి.
సేవ్ చేయబడిన నా ఆడియో రికార్డింగ్‌లను, నేను తప్ప ఇంకెవరైనా వినగలుగుతారా?
మీరు మీ ఆడియో రికార్డింగ్‌లను సేవ్ చేయాలని నిర్ణయించుకుంటే, వాటిలో కొంత భాగం మా ఆడియో గుర్తింపు టెక్నాలజీలను మెరుగుపరచడంలో సహాయపడేందుకు రివ్యూ చేయబడవచ్చు.
ఉదాహరణకు, Google ఆడియో రివ్యూ ప్రాసెస్ కోసం ఆడియో రికార్డింగ్‌లను ఉపయోగించవచ్చు. ఈ ప్రాసెస్ సమయంలో, మెషిన్-ఎంచుకున్న ఆడియో టెక్స్ట్ ప్రివ్యూ శాంపిల్ వారి Google ఖాతాల నుండి వేరు చేయబడుతుంది. అప్పుడు, శిక్షణ పొందిన రివ్యూవర్‌లు, ఆడియోను విశ్లేషించి, రికార్డింగ్‌కు అదనపు గమనికలను జోడించి, మీరు పలికిన పదాలను Google ఆడియో గుర్తింపు టెక్నాలజీలు ఖచ్చితంగా అర్థం చేసుకున్నాయో లేదో వెరిఫై చేయగలుగుతారు. దీని వలన, Google Assistant లాంటి ప్రోడక్ట్‌కు, భవిష్యత్తులో, భాషను మరింత బాగా అర్థం చేసుకొనే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయం లభిస్తుంది.
నా ఆడియో రికార్డింగ్‌లను ప్రభుత్వం యాక్సెస్ చేయగలుగుతుందా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు యూజర్ సమాచారాన్ని బహిర్గతం చేయమని Googleను అడుగుతాయి. వర్తించే చట్టాలకు అది అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడం కోసం మేము ప్రతి రిక్వెస్ట్‌ను జాగ్రత్తగా రివ్యూ చేస్తాము. ఒకవేళ ఏదైనా రిక్వెస్ట్ మరీ ఎక్కువ సమాచారాన్ని అడుగుతున్నట్లయితే, మేము దానిని పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాము, ఇంకా కొన్ని సందర్భాలలో అసలు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాము. మా పారదర్శకత రిపోర్ట్‌లో, మేము అందుకొనే రిక్వెస్ట్‌ల రకాలను, వాటి సంఖ్యను షేర్ చేస్తాము. మరింత తెలుసుకోండి
మీరు నా ఆడియో రికార్డింగ్‌లను లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తారా?
Google, మీ ఆడియో రికార్డింగ్‌లను లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ విక్రయించదు.
సులువుగా ఉపయోగించగలిగే గోప్యతా కంట్రోల్స్
ఏ ఇంటరాక్షన్‌లు స్టోర్ చేయబడతాయి అనేది కంట్రోల్ చేయడానికి, “Ok Google, నేను ఈ వారం చెప్పిన దాన్ని తొలగించు” అని చెప్పండి, అప్పుడు Google Assistant ఆ ఇంటరాక్షన్‌లను “నా యాక్టివిటీ”లో తొలగిస్తుంది.
నా గోప్యతా కంట్రోల్స్ ఎక్కడ ఉంటాయి?
సాధారణంగా తలెత్తే గోప్యత, సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానాలు పొందాలంటే, Google Assistantని "నా గోప్యతా సెట్టింగ్‌లను నేను ఎక్కడ మార్చవచ్చు?" లాంటి ప్రశ్నలు అడిగితే సరిపోతుంది. లేదా, మీ గోప్యతా కంట్రోల్స్‌ను యాక్సెస్ చేయడానికి ఎప్పుడైనా సరే నేరుగా “Assistantలోని మీ డేటా”ను సందర్శించవచ్చు.
మీరు నా యాక్టివిటీ నుండి నా Assistant ఇంటరాక్షన్‌లను నేను తొలగించవచ్చని పేర్కొన్నారు. అది ఏవిధంగా జరుగుతుంది?
మీరు నా యాక్టివిటీ నుండి మీ Assistant ఇంటరాక్షన్‌లను రివ్యూ చేసి, తొలగించవచ్చు లేదా "Ok Google, నేను ఈ వారం చెప్పిన వాటిని తొలగించు" అని చెప్పడం ద్వారా చేయవచ్చు. అదనపు కంట్రోల్స్‌ను యాక్సెస్ చేయడానికి మీ Assistant సెట్టింగ్‌లను సందర్శించండి.
నా డేటా ఆటోమేటిక్‌గా తొలగించబడేలా సెటప్ చేసుకోవచ్చా?
అవును, మీ యాక్టివిటీ డేటాను మీ నా యాక్టివిటీ నుండి 'ఆటోమేటిక్ తొలగింపు' చేయవచ్చు. మీ యాక్టివిటీ డేటాను అక్కడ ఎంత కాలం పాటు సేవ్ చేసి ఉంచాలో, ఆ సమయ పరిధిని ఎంచుకోండి – 3, 18 లేదా 36 నెలలు – అంత కంటే పాతదైన డేటా ఆటోమేటిక్‌గా మీ 'నా యాక్టివిటీ' నుండి నిరంతరం తొలగించబడుతుంది.
నా అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి Google Assistant డేటాను ఏ విధంగా ఉపయోగిస్తుంది?
మీ Google ఖాతాలోని డేటా Google Assistantతో మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించి, Assistant మీకు మరింత బాగా ఉపయోగపడేలా చేయగలదు.
Google Assistant మీకు సహాయం చేయాలంటే, కొన్ని రకాల ప్రశ్నలకు మీ డేటా అవసరమవుతుంది. ఉదాహరణకు, “మా అమ్మగారి పుట్టినరోజు ఎప్పుడు?” అని మీరు అడిగితే, Assistant మీ కాంటాక్ట్‌లను రిఫర్ చేసి, "అమ్మగారు" ఎవరో తెలుసుకొని, వారి పుట్టినరోజు కోసం చూడాల్సి ఉంటుంది. లేదా మీరు “రేపు నాకు గొడుగు అవసరమవుతుందా?” అని అడిగినప్పుడు, మీకు సందర్భోచితంగా ఉండే సమాధానాన్ని ఇవ్వడానికి, Assistant మీ ప్రస్తుత లొకేషన్‌ను ఉపయోగిస్తుంది.
తనకు తానుగా మీకు సూచనలను అందించడానికి కూడా Google Assistant డేటాను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, మీరు రోజూ వెళ్లే దారిలో ట్రాఫిక్ ఉంటే, మీ లొకేషన్‌ను ఉపయోగించడం ద్వారా, ఆ విషయాన్ని Assistant మీకు తెలియజేయగలుగుతుంది.
మీ Google ఖాతాలోని యాక్టివిటీని ఉపయోగించి, Google Assistant మీ ఫలితాలను మెరుగుపరచగలుగుతుంది. ఉదాహరణకు, "రాత్రి భోజనంలోకి ఏం వండాలి?" అని మీరు అడిగితే, మీ Assistant వ్యక్తిగతీకరించిన వంటకాల తయారీ సిఫార్సులను అందించడానికి, మునుపటి సెర్చ్ హిస్టరీని ఉపయోగించవచ్చు.
మీ డేటాను చూడటానికి, తొలగించడానికి, మీ ప్రస్తుత సెట్టింగ్‌లను చెక్ చేయడానికి, అందుబాటులో ఉన్న కంట్రోల్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా సరే “Google Assistantలోని మీ డేటా”ను సందర్శించవచ్చు.
మీ డేటాను Google ఏవిధంగా సంరక్షిస్తుంది, ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి Google గోప్యతా పాలసీను సందర్శించండి.
Google Assistant మీ డేటాతో ఎలా పని చేస్తుంది అనే దాని గురించి తెలుసుకోండి.
నాకు వ్యక్తిగతీకరించిన ఫలితాలను అందించాలా వద్దా అనే విషయంలో Google Assistantను నేను కంట్రోల్ చేయగలుగుతానా?
అవును. షేర్ చేసిన పరికరంలో అనేక మంది యూజర్‌లు, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని పొందగలగడాన్ని Google Assistant సులభతరం చేస్తుంది. ఆఫీస్‌కు దిశలు, వ్యక్తిగతీకరించిన వంటకాల తయారీ సిఫార్సులు మొదలైన వ్యక్తిగత ఫలితాలను పొందడానికి – మీ Assistant మీ వాయిస్‌ను గుర్తించినప్పుడు మాత్రమే ఈ దశలను ఫాలో అవ్వడం ద్వారా వాయిస్ మ్యాచ్‌ను సెటప్ చేయండి. Family Link యూజర్‌లు కూడా Google Assistant నుండి ఈ దశలను ఫాలో అవ్వడం ద్వారా వ్యక్తిగత ఫలితాలను పొందవచ్చు.
మొబైల్‌లోనూ, స్పీకర్‌ల వంటి షేర్ చేసిన పరికరాలలోనూ మీరు మీ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా వ్యక్తిగత ఫలితాలకు యాక్సెస్‌ను కంట్రోల్ చేయగలరు. అలాగే మొబైల్‌లో, మీ లాక్ స్క్రీన్‌పై, వ్యక్తిగత ఫలితాలు ఎలా కనపడాలో మీరు కంట్రోల్చేయగలుగుతారు.
ఫ్యామిలీల కోసం రూపొందించబడింది
మీ ఫ్యామిలీ మొత్తానికి వినోదాన్ని పంచుతూ, వారిని సంతోషంగా ఉంచడానికి Google Assistant విభిన్న రకాల మార్గాలను అందిస్తోంది. Assistantతో మీ ఫ్యామిలీ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేదాన్ని మేనేజ్ చేయడంలో Family Link లాంటి టూల్స్ మీకు సహాయపడతాయి.
ఫ్యామిలీ-ఫ్రెండ్లీ కంటెంట్‌ను Google Assistant ఎలా అందిస్తుంది?
Google Assistant విభిన్న రకాల యాక్టివిటీలను అందిస్తోంది. వీటిలో చిన్నారులు, ఫ్యామిలీల కోసం కథలు, గేమ్‌లు, లెర్నింగ్ టూల్స్‌తో పాటు థర్డ్-పార్టీ డెవలపర్‌లు అందించే కంటెంట్ కూడా కొంత ఉంటుంది. Assistantలో ఫ్యామిలీల కోసం కంటెంట్‌ను పబ్లిష్ చేయడానికి ఈ డెవలపర్‌లు టీచర్ ఆమోదించిన యాప్ ను కలిగి ఉండటం ద్వారా గానీ, లేదా తమ ఫ్యామిలీ-ఫ్రెండ్లీ చర్య కోసం Googleతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవడం ద్వారా గానీ తప్పనిసరిగా అర్హత పొందాలి. పిల్లలను ఉద్దేశించి థర్డ్-పార్టీ డెవలపర్‌లు అందిస్తున్న ఏవైనా చర్యలు తప్పనిసరిగా మా స్టాండర్డ్ చర్య పాలసీలతో పాటుగా మా ఇంటిల్లిపాదీ ఉపయోగించగల చర్యల నిర్దిష్ట అవసరాలను పాటించాలి. అవి Google Assistantలో సాధారణంగా అందుబాటులోకి రావడానికి ముందు మేము ఈ చర్యలను మా పాలసీలు, అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని రివ్యూ చేస్తాము.
Google Assistant ద్వారా నా ఫ్యామిలీ మెంబర్‌లు పొందే కంటెంట్‌ను నేను ఎలా మేనేజ్ చేయగలను?
Google Home యాప్‌లోని డిజిటల్ సంక్షేమం కంట్రోల్స్‌ను ఉపయోగించడం ద్వారా మీ ఇంట్లో షేర్ చేయబడిన స్మార్ట్ డిస్‌ప్లేల వంటి పరికరాల కోసం మీరు కంటెంట్ కంట్రోల్స్‌ను సెట్ చేయవచ్చు. ఈ సెట్టింగ్‌లతో, అందుబాటులో లేని సమయ షెడ్యూల్‌లను, కంటెంట్‌ను ఫిల్టర్ చేసే సెట్టింగ్‌లను, ఫోన్ కాల్స్ వంటి నిర్దిష్ట యాక్టివిటీలపై పరిమితం విధించడం లాంటి వాటిని మీరు మేనేజ్ చేయవచ్చు. Family Link తో మేనేజ్ చేయబడే గెస్ట్‌లు, పర్యవేక్షించబడే ఖాతాలకు లేదా ఆ పరికరానికి చెందిన అందరు యూజర్‌లకు ఈ సెట్టింగ్‌లు వర్తించాలో లేదో కూడా మీరు నిర్ణయించవచ్చు.
Family Link అందిస్తోన్న తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఉపయోగించి ఒక్కో చిన్నారికి ఒక్కో రకంగా మీరు పరిమితులను సెట్ చేయవచ్చు. షేర్ చేయబడిన పరికరాలలో, వాయిస్ మ్యాచ్ ను ఉపయోగించి మీ చిన్నారి ఖాతాను పరికరానికి మీరు లింక్ చేయవచ్చు, అలా చేస్తే Assistant వారిని గుర్తించగలుగుతుంది. మీ చిన్నారి ఎన్‌రోల్ చేసుకోగానే, “ఫ్యామిలీల కోసం” బ్యాడ్జ్‌తో వారు కేవలం Google-కాని చర్యలను మాత్రమే యాక్సెస్ చేయగలిగి, Assistant ద్వారా కొనుగోళ్లు చేయడం లాంటి నిర్దిష్ట చర్యలను అమలు చేయడం నుండి నివారించబడతారు. వారు ఎన్‌రోల్ చేసుకున్న ఏ Google Assistant పరికరాలలోనైనా ఈ పరిమితులు వర్తిస్తాయి. Google Home, Assistantతో Family Link ఖాతా ఎలా పనిచేస్తుందనే దాని గురించి మరింత సమాచారం కోసం, Google for Families సహాయం పేజీని చూడండి.
పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని Google Assistant ఎలా రక్షిస్తుంది?
మీ చిన్నారి పేరు, ఇమెయిల్ అడ్రస్, వాయిస్ రికార్డింగ్‌లు లేదా నిర్దిష్ట లొకేషన్ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటిల్లిపాదీ ఉపయోగించగల చర్యల ప్రొవైడర్‌లకు Google షేర్ చేయదు. తమ Google Assistant సంభాషణల నుండి యూజర్‌ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించబోమని ఈ ప్రొవైడర్‌లు కూడా అంగీకరిస్తాయి. ఈ పాలసీలను ఉల్లంఘించే చర్యలను వేటినైనా మేము గుర్తిస్తే, వాటిపై మేము చర్య తీసుకుంటాము.
చిన్నారులకు చెందిన ఫీచర్‌ల నుండి ఆడియో రికార్డింగ్‌లను Google Assistant సేవ్ చేస్తుందా?
మేము ఆడియో రికార్డింగ్‌లను చేర్చడానికి ఎంచుకున్న Family Linkతో మేనేజ్ చేయబడే Google ఖాతా కోసం చేసే సమ్మతిని కలిగి ఉన్నట్లయితే తప్ప, ఇంటిల్లిపాదీ ఉపయోగించగల చర్యల యాక్టివిటీలు లేదా YouTube Kids వీడియోల లాంటి చిన్నారులకు చెందిన ఫీచర్‌లలోని ఇంటరాక్షన్‌ల నుండి మేము ఆడియో రికార్డింగ్‌లను సేవ్ చేయము. మరిన్ని వివరాల కోసం, మా గోప్యతా ప్రకటన ను చూడండి.
నా చిన్నారికి చెందిన Google Assistant యాక్టివిటీల నుండి నేను ఏదైనా డేటాను తీసివేయవచ్చా?
అవును, తీసివేయవచ్చు. Family Link ద్వారా మేనేజ్ చేయబడుతున్న వారి ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా మీ చిన్నారికి చెందిన సేవ్ చేయబడిన యాక్టివిటీని మీరు యాక్సెస్ చేయవచ్చు, ఎగుమతి చేయవచ్చు, తొలగించవచ్చు. Family Link యాప్ ద్వారా లేదా families.google.com లింక్‌ను సందర్శించి, చిన్నారి ప్రొఫైల్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు మీ చిన్నారికి చెందిన యాక్టివిటీ సెట్టింగ్‌లను మేనేజ్ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం, g.co/childaccounthelp కు వెళ్లండి.