వన్-స్టాప్ కంట్రోల్ కేంద్రం: Google ఖాతా

యూజర్‌లు Googleతో ఎటువంటి డేటాను షేర్ చేయడానికి ఇష్టపడతారు, అలాగే ఎటువంటి డేటాను తమ వద్దనే గోప్యంగా ఉంచుకుంటారు అనే దాన్ని స్వయంగా వారే నిర్ణయించుకొనే వీలును వారికి కల్పించే టూల్స్‌ను డెవలప్ చేయడానికి స్టెఫాన్ మిక్‌లిట్జ్, జాన్ హన్నెమన్‌లు ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు

స్టెఫాన్ మిక్‌లిట్జ్ తాను Googleలో పని చేస్తున్నట్లు ఇతరులకు చెప్పినప్పుడు, “మీకు అంత డేటా ఎందుకు అవసరం అవుతుంది?" అనే అంశానికి సంబంధించిన ప్రశ్నలు ఆయనకు ఎక్కువగా ఎదురయ్యాయి. దానికి ఆయన సమాధానం: “డేటా అనేది Google ప్రోడక్ట్‌లను మీకు మరింత సహాయకరంగా చేయగలదు — ఉదాహరణకు, మీ సెర్చ్ ఫలితాలను సరైన భాషలో అందించడం, లేదా ఇంటికి చేరుకోవడానికి వేగవంతమైన మార్గాన్ని సిఫార్సు చేయడం వంటివి. అయితే, Google మీ డేటాను ఎలా స్టోర్ చేయాలి అనే విషయాన్ని, అలాగే మీకు తగిన విధంగా మా ప్రోడక్ట్‌లను ఆప్టిమైజ్ చేయడానికి మేము ఆ డేటాను ఉపయోగించాలా, వద్దా అనే విషయాన్ని మీరు ఎంచుకోవచ్చు అని నేను ఎల్లప్పుడూ చెప్తుంటాను. నేను చెప్పేది నమ్మడానికి ముందు, సాధారణంగా యూజర్లు దాన్ని నేరుగా చూసి నిర్ధారించుకోవాలని భావిస్తారు!”

"మేము ఈ సర్వీస్‌ను వ్యక్తిగతీకరించి, లేఅవుట్‌ను మరింత స్పష్టంగా చేయాలనుకున్నాము."

జాన్ హన్నెమన్

మిక్‌లిట్జ్ 2007 నుండి Googleలో పని చేస్తున్నారు. ఈయన మ్యూనిక్‌లో మొదటగా చేరిన సిబ్బందిలో ఒకరు. ఆ తరువాత వేగంగా ఆన్‌లైన్ సెక్యూరిటీ, డేటా గోప్యతకు సంబంధించిన టాపిక్స్‌లో లీడ్ రోల్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ సెక్యూరిటీని, గోప్యతను మెరుగుపరచడం కోసం పలు కీలకమైన Google ప్రోడక్ట్‌లను అభివృద్ధి చేసే కార్యక్రమానికి మిక్‌లిట్జ్ 2010 నుండి నాయకత్వం వహిస్తున్నారు. ఈ డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యాలయాన్ని Google సంస్థ జర్మనీలో స్థాపించడమనేది ఒక తెలివైన ఆలోచన అని ఈయన 2008లోనే భావించారు. “గోప్యత గురించి లోతుగా చర్చలు జరిగే చోట తన ఆఫీస్ ఉండాలని Google భావించింది,” అని మిక్‌లిట్జ్ గుర్తు చేసుకున్నారు.

అప్పటి నుండి చాలా విషయాలు జరిగాయి. మరీ ముఖ్యంగా, 25 మే 2018న, యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా రక్షణ నియంత్రణ చట్టం (GDPR) అమలులోకి వచ్చింది. GDPR అనేది వ్యక్తిగత డేటా వినియోగాన్ని, స్టోరేజ్‌ను నియంత్రిస్తుంది. మిక్‌లిట్జ్, తన సహోద్యోగులతో కలిసి 2016లో మొదటిసారిగా ఆ చట్టంలోని అంశాలను చదివిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. "మేము రూపొందించిన కంట్రోల్స్ లోనూ, టూల్స్ లోనూ చాలా వరకు, అప్పటికే GDPRకు తగినట్టుగా ఉన్నాయని అర్థమయింది -- అయితే మేము చేయాల్సిన పని ఇంకా ఉందని కూడా తెలిసింది" అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు, అయన నన్ను కాన్ఫరెన్స్ రూమ్‌కు తీసుకువెళ్లారు, అక్కడ తన సహోద్యోగి అయిన జాన్ హన్నెమన్‌ను కలిశారు.

ఇంజినీరింగ్ డైరెక్టర్ అయిన స్టెఫన్ మిక్‌లిట్జ్ (ఎడమ వైపు), Googleలో అంతర్జాతీయ గోప్యత, అలాగే సెక్యూరిటీకి బాధ్యత వహిస్తున్నారు. ఈయన టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్‌లో కంప్యూటర్ సైన్స్ చదివారు, 2007 ఏడాది చివరి నుండి Google మ్యూనిక్ ఆఫీస్‌లో పని చేస్తున్నారు.

Google, తన మొదటి డేటా గోప్యతా టూల్ అయిన Google Dashboardను 2009లో లాంచ్ చేసింది. మిక్‌లిట్జ్, అతని టీమ్‌లు దాని డెవలప్‌మెంట్‌కు బాధ్యత వహించారు. కాలక్రమేణా, అదనపు ఫంక్షన్‌లను జోడించడం జరిగింది. 2013 నుండి, యూజర్‌లు Inactive Account Manager సహాయంతో వారి Google డిజిటల్ లెగసీని మేనేజ్ చేయగలుగుతున్నారు; 2014లో, సెక్యూరిటీ చెకప్ను జోడించడం జరిగింది, ఆ తర్వాత 2015లో గోప్యతా చెకప్ను జోడించడం జరిగింది. ఈ కొత్త టూల్స్, దశల వారీగా యూజర్‌లకు వారి డేటా గోప్యత, అలాగే సెక్యూరిటీ సెట్టింగ్‌ల గురించి తెలియజేస్తాయి.

2015లో, 'నా ఖాతా'ను లాంచ్ చేయడం జరిగింది, ఇది అన్ని Google సర్వీస్‌లను ఒకే చోటుకు తీసుకువచ్చింది. మొట్టమొదటిసారిగా, ఒక వన్-స్టాప్ కంట్రోల్ కేంద్రం అనేది యూజర్‌ల కోసం అందుబాటులోకి వచ్చింది. ఎటువంటి వ్యక్తిగత డేటాను Google సేవ్ చేస్తోందో చూడటానికి, ఎటువంటి సమాచారాన్ని తొలగించాలి అనే దానిపై స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే డేటాను సేవ్ చేసి ఆన్‌లైన్ యాక్టివిటీని ట్రాక్ చేసే ఫంక్షన్‌లను ఆపివేయడానికి ఈ వన్-స్టాప్ కంట్రోల్ కేంద్రం వారికి వీలు కల్పించింది. వ్యక్తిగతీకరించిన యాడ్‌లను కూడా యూజర్‌లు నిలిపివేయవచ్చు. 'నా ఖాతా'ను ప్రారంభించిన క్షణం నుండి నిరంతరం దాన్ని విస్తరించి, మెరుగుపరచడం జరిగింది.

"Google ఎటువంటి సమాచారాన్ని స్టోర్ చేయాలి అని ఎంచుకొనే కంట్రోల్ ప్రతి యూజర్‌కు ఉండటమే మాకు కావాలి."

స్టెఫన్ మిక్‌లిట్జ్

జూన్ 2018లో, ఈ సర్వీస్‌ను మెరుగుపరిచి, 'నా ఖాతా' పేరును Google ఖాతాగా మార్చడం జరిగింది. స్టెఫాన్ మిక్‌లిట్జ్‌తో పాటు, ప్రోడక్ట్ మేనేజర్ అయిన జాన్ హన్నెమన్ ఈ రీ-లాంచ్‌కు బాధ్యత వహించారు. హన్నెమన్‌కు కంప్యూటర్ సైన్స్‌లో PhD ఉంది, ఆయన 2013 నుండి Googleకు చెందిన మ్యూనిచ్ ఆఫీస్‌లో పని చేస్తున్నారు. ఈయన 'నా ఖాతా'ను డెవలప్ చేయడంలో సహాయపడ్డారు, ఇప్పుడు కూడా Google ఖాతా బాధ్యతను ఆయనే చూస్తున్నారు. సహోద్యోగులు ఆయనకు “మిస్టర్ Google ఖాతా” అనే మారుపేరును కూడా పెట్టారు.

హన్నెమన్ తన స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి Google ఖాతా కొత్త డిజైన్‌ను వివరించారు. “మేము ఈ సర్వీస్‌ను వ్యక్తిగతీకరించి, లేఅవుట్‌ను మరింత స్పష్టంగా చేయాలనుకున్నాము – ముఖ్యంగా చిన్న స్క్రీన్‌లను కలిగి ఉన్న మొబైల్ పరికరాల్లో ఉపయోగించడం కోసం.” స్టెఫాన్ మిక్‌లిట్జ్ తన సొంత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకుని, యాప్‌ను తెరిచారు. “ఉదాహరణకు, నేను సర్వీస్‌ను రన్ చేసినప్పుడు, సెక్యూరిటీ చెకప్‌ను రన్ చేసే ఆప్షన్‌ను సాఫ్ట్‌వేర్ నాకు అందిస్తుంది," అని ఆయన వివరించారు. “నా Google ఖాతా సెక్యూరిటీని నేను ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే దాని గురించి Google ఏవైనా సలహాలను అందించిందో, లేదో ఇక్కడ నేను వెంటనే చూసుకోవచ్చు.”

జాన్ హన్నెమన్ (ఎడమ వైపు) Google ఖాతా ప్రోడక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు, దీన్ని గతంలో 'నా ఖాతా' అని పిలిచేవారు. ఈ సర్వీస్ యూజర్‌లకు వన్-స్టాప్ కంట్రోల్ కేంద్రం, ఇది వారి సెక్యూరిటీని, అలాగే డేటా గోప్యతను చెక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా యూజర్‌లు ఆయా సర్వీస్‌లను ఎలా ఉపయోగిస్తున్నారు, అలాగే సాధారణంగా వారి వైఖరి ఏమిటి అనే విషయాలపై Google జరిపే సర్వేలను ఆధారంగా చేసుకుని మిక్‌లిట్జ్, హన్నెమన్‌లు, వారి ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ పనులను కొనసాగిస్తుంటారు. “అమెరికన్‌లతో పోల్చితే యూరోపియన్‌లు – ప్రత్యేకించి జర్మన్‌లు – వారి వ్యక్తిగత డేటాను టెక్నాలజీ కంపెనీలు ఎలా ఉపయోగిస్తాయోనని ఎక్కువగా సందేహిస్తుంటారు,” అని హన్నెమన్ తెలిపారు. “వాస్తవానికి, ఇది మా చరిత్రతో ముడిపడి ఉన్న విషయం.” తమ డేటాను స్టోర్ చేయడానికి యూజర్‌లు అందరూ వ్యతిరేకంగా లేరు. “విమానాశ్రయానికి వెళ్లే సమయం వచ్చిందని తమ స్మార్ట్‌ఫోన్ గుర్తు చేసినప్పుడు, కొంత మంది దానిని చాలా ఉపయోగకరంగా భావిస్తారు,” అని హన్నెమన్ చెప్పారు. మరికొందరు ఆటో-కంప్లీట్ ఫీచర్‌ను స్వాగతిస్తారు, ఇది సెర్చ్ ఇంజిన్‌కు, ఏదైనా సెర్చ్ క్వెరీలోని మిగిలిన భాగాన్ని అంచనా వేసే వీలును కల్పిస్తుంది. మా ప్రోడక్ట్‌లను యూజర్‌లకు తగిన విధంగా ఆప్టిమైజ్ చేయడానికి, వారి డేటాను ఉపయోగించేందుకు యూజర్‌లు అనుమతించినప్పుడు మాత్రమే ఈ ఫీచర్‌లు, అలాగే అనేక ఇతర అంశాలు సాధ్యమవుతాయి.

గోప్యత విషయానికి వస్తే, ఒకే రకమైన పరిష్కారం అనేది ఎప్పటికీ సాధ్యపడదు అని స్టెఫాన్ మిక్‌లిట్జ్ పేర్కొన్నారు. దానికి ఒకానొక కారణం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, అలాగే కాలక్రమేణా యూజర్‌ల అవసరాలు మారుతుంటాయి. "Google ఎటువంటి సమాచారాన్ని స్టోర్ చేయాలి అన్న అంశాన్ని ఎంచుకునే కంట్రోల్ ప్రతి యూజర్‌కు ఉండాలని మేము గట్టిగా నమ్ముతాము. అది సాధ్యం అయ్యేలా చేయడానికి మేము మా టూల్స్‌ను నిరంతరం మెరుగుపరుస్తూనే ఉన్నాము.”

ఫోటోగ్రాఫ్‌లు: కానీ మిర్‌బాక్

సైబర్ సెక్యూరిటీ పురోగతులు

ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్‌లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.

మరింత తెలుసుకోండి