ఆన్లైన్ పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేయడం
ఆన్లైన్ సెక్యూరిటీ అనగానే, చాలా మంది యూజర్లు కంగారు పడిపోతుంటారు. Googleకు చెందిన మార్క్ రిషర్, స్టెఫాన్ మిక్లిట్జ్లు, భద్రతా చర్యలను రూపొందించేటప్పుడు ఈ ఎమోషన్లను పరిగణనలోకి తీసుకోవడం గురించి మాట్లాడతారు
మిస్టర్ రిషర్, మీరు Googleలో ప్రోడక్ట్ మేనేజ్మెంట్కు డైరెక్టర్‌గా, ఇంటర్నెట్ సెక్యూరిటీ సబ్జెక్ట్‌పై పని చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ స్కామ్ బారిన పడ్డారా?
మార్క్ రిషర్: ఇప్పటికిప్పుడు నాకు ఆ విషయం సరిగ్గా గుర్తుకు రావడం లేదు కానీ, నేను కూడా స్కామ్ బారిన పడి ఉండవచ్చు. అందరిలాగానే నేను కూడా వెబ్‌ను సర్ఫ్ చేసేటప్పుడు తప్పులు చేస్తాను. ఉదాహరణకు, ఇటీవలే నేను వేరే వెబ్సైట్లో నా Google పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేశాను. అదృష్టవశాత్తు, నేను Chrome పాస్వర్డ్ హెచ్చరిక ప్లగ్ఇన్ను ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను, అది నా తప్పును ఎత్తి చూపింది. ఆ తర్వాత వెంటనే నేను నా పాస్‌వర్డ్‌ను మార్చేశానులెండి.
స్టీఫెన్ మిక్‌లిట్జ్, Google గోప్యత, అలాగే సెక్యూరిటీ టీమ్‌కు ఇంజినీరింగ్ డైరెక్టర్: తప్పులు చేయడం మానవ నైజం. ఒకసారి మనం ఒక పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకున్నాక, దాన్ని మనం ఎక్కడ ఎంటర్ చేస్తున్నామన్నది గమనించకుండానే టైప్ చేసే అవకాశం మెండుగా ఉంటుంది.
రిషర్: మేము అసలు పాస్వర్డ్ అనే కాన్సెప్ట్నే పూర్తిగా ఎత్తివేయాలని అనుకుంటున్నాము, కానీ దురదృష్టవశాత్తు, అది అంత తేలిక కాదు.
"తెర వెనుక సెక్యూరిటీ పరంగా అనేక చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది."
మార్క్ రిషర్
పాస్‌వర్డ్‌లలో మరీ అంత ప్రతికూల అంశం ఏముంది?
రిషర్: వాటిలో చాలా లోపాలు ఉన్నాయి: వాటిని సులభంగా దొంగలించవచ్చు, కానీ వాటిని గుర్తుంచుకోవడం చాలా కష్టం, ఇంకా మన పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేసుకోవడం చాలా కష్టమైన పని కాగలదు. చాలా మంది యూజర్లు పాస్వర్డ్ ఎంత పొడవుగా, ఎంత సంక్లిష్టంగా ఉంటే అంత మంచిది అని భావిస్తారు – కానీ, నిజానికి ఇది సెక్యూరిటీ ముప్పును పెంచుతుంది. సంక్లిష్టంగా ఉండే పాస్‌వర్డ్‌లను యూజర్లు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలకు ఉపయోగించడానికి మొగ్గు చూపుతారు, దానితో వారి ఖాతాలు దాడికి గురయ్యే అవకాశం మరింతగా పెరుగుతుంది.
మిక్‌లిట్జ్: మీరు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసే అలవాటును ఎంత తగ్గించుకుంటే, అంత మేలు. అందుకే మీరు పదే పదే మీ ఖాతాలలోకి సైన్ ఇన్ అవ్వడం, సైన్ అవుట్ అవ్వడం చేయకూడదు. కాలం గడిచే కొద్దీ, యూజర్లు, తాము ప్రస్తుతం ఏ వెబ్ పేజీలో ఉన్నాము అనే విషయాన్ని పట్టించుకోకుండా ఉండే పరిస్థితికి ఇది దారి తీయవచ్చు, దీని వలన పాస్వర్డ్ దొంగల పని మరింత సులువు అవుతుంది. కాబట్టి, లాగిన్ అయ్యే ఉండమని మేము మా యూజర్లకు సలహా ఇస్తున్నాము.
నేను ఇన్‌యాక్టివ్‌గా కొన్ని నిమిషాలు ఉంటేనే, నా బ్యాంక్ వెబ్సైట్ ఆటోమేటిక్‌గా నన్ను లాగ్ అవుట్ చేసేస్తుంది.
మిక్‌లిట్జ్: దురదృష్టవశాత్తూ, అనేక కంపెనీలు ఇంకా పాతబడిపోయిన నియమాలనే ఫాలో అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కువ మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లోకి రావడానికి ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లేవారు, లేదా ఇతరులతో కంప్యూటర్ను షేర్ చేసుకొనే వారు, ఎప్పుడూ లాగ్ అవుట్ అవుతూ ఉంటే మంచిదని ఇచ్చిన సలహా ఆనాటికి చెందినది. వ్యక్తులు ఎన్ని ఎక్కువ సార్లు తమ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే, వాళ్లు సైబర్ దాడికి గురయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని మా రీసెర్చ్ తెలియజేస్తోంది. కాబట్టి, మీ సెల్ ఫోన్ లేదా కంప్యూటర్లో స్క్రీన్ లాక్‌ను యాక్టివేట్ చేయడం, అలాగే ఒక సురక్షితమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం అనేది మరింత సురక్షితమైన పని.
రిషర్: అది నిజమే. దురదృష్టవశాత్తు, చాలా తప్పు సలహాలు లేదా ఆచరణ సాధ్యం కాని సలహాలు చక్కర్లు కొడుతున్నాయి, ఇవి చాలా మంది యూజర్లను గందరగోళానికి గురి చేయవచ్చు. ఇందులో అత్యంత నెగిటివ్ విషయం ఏమిటంటే, వ్యక్తులు తీవ్ర గందరగోళానికి గురయి, "నన్ను నేను కాపాడుకోవడమే కష్టంగా ఉన్నప్పుడు, అసలు ట్రై చేయకపోవడమే మంచిది," అనుకొని ఆ పనిని పక్కకు పెట్టేస్తారు. ఇది మీ ఇంటి చుట్టుపక్కల దొంగలు ఉన్నారని మీకు తెలిసి కూడా తలుపులు తెరిచి నిద్రపోవడంలా ఉంటుంది.
పాస్‌వర్డ్‌లను ఎత్తివేస్తే, యూజర్ సెక్యూరిటీకి Google ఏ విధంగా భరోసా ఇవ్వగలదు?
రిషర్: ఇప్పటికే తెర వెనుక మేము అనేక అదనపు భద్రతా చర్యలను తీసుకుంటున్నాము. ఎవరైనా ఒక హ్యాకర్ చేతికి మీ పాస్వర్డ్, అలాగే మీ సెల్ ఫోన్ నంబర్ చిక్కినా కూడా, మీ Google ఖాతా 99.9 శాతం సురక్షితంగా ఉంటుందని మేము హామీ ఇవ్వగలము. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏ పరికరం నుండి లేదా ఏ దేశం నుండి లాగిన్ అవుతున్నారో మేము చెక్ చేయగలము. ఎవరైనా మీ ఖాతాలోకి తప్పు పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వరుసగా అనేక సార్లు లాగిన్ అవ్వాలని ట్రై చేస్తే, అది మా సెక్యూరిటీ సిస్టమ్‌లను హెచ్చరిస్తుంది.
మిక్‌లిట్జ్: అంతే కాకుండా, మేము సెక్యూరిటీ చెకప్‌ను కూడా రూపొందించాము, దీని ద్వారా యూజర్లు, తమ Google ఖాతాలోని వ్యక్తిగత సెక్యూరిటీ సెట్టింగ్‌లను దశల వారీగా రెఫర్ చేసుకోగలరు. ఇక అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ సహాయంతో, మేము మరింత భద్రతను అందించగలము.
ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏమిటి?
మిక్‌లిట్జ్: వాస్తవానికి ఈ ప్రోగ్రామ్‌ను, నేరస్థులు ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశమున్న రాజకీయ వేత్తలు, CEOలు, లేదా జర్నలిస్ట్‌ల వంటి వ్యక్తుల కోసం రూపొందించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇది అదనపు ఆన్లైన్ రక్షణ కావాలనుకొనే ఎవరికైనా అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన USB లేదా బ్లూటూత్ డాంగిల్ ఉన్న వారు మాత్రమే వారి రక్షిత Google ఖాతాను యాక్సెస్ చేయగలరు.
రిషర్: Google ఉద్యోగులందరూ, తమ కంపెనీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి సెక్యూరిటీ కీని ఉపయోగిస్తారు కనుక, ఈ సిస్టమ్ ఎంత సమర్థవంతమైనదో మాకు అనుభవపూర్వకంగా తెలుసు. ఈ భద్రతా చర్యను ప్రవేశపెట్టిన నాటి నుండి, పాస్వర్డ్ నిర్ధారణ కారణంగా ఒక్కటంటే ఒక్క ఫిషింగ్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ టోకెన్, Google ఖాతా సెక్యూరిటీని గణనీయంగా పెంచుతుంది, ఎందుకంటే, దాడి చేసే వారికి పాస్వర్డ్ తెలిసినా కూడా, టోకెన్ లేకుండా వారు ఖాతాను యాక్సెస్ చేయలేరు. సాధారణంగా, ఒక ఆన్లైన్ ఖాతాను ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా హ్యాక్ చేయవచ్చు; కానీ ఫిజికల్ సెక్యూరిటీ టోకెన్ రక్షణలో ఉన్న ఖాతాల విషయంలో అలా హ్యాక్ చేయడం అసాధ్యం.
మిక్‌లిట్జ్: ఇంకో విషయం, ఈ సెక్యూరిటీ టోకెన్లను చాలా వెబ్సైట్ల కోసం ఉపయోగించవచ్చు – కేవలం Googleకు చెందిన అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కోసం మాత్రమే కాదు. మీరు వీటిని తక్కువ ధరకే మా నుండి గానీ లేదా ఇతర ప్రొవైడర్ల నుండి గానీ కొనవచ్చు. మీకు కావలసిన వివరాలన్నీ ఇక్కడ లభిస్తాయి: g.co/advancedprotection.
"వ్యక్తులు కొన్నిసార్లు ఇంటర్నెట్ ద్వారా ఎదురయ్యే ప్రమాదాలను సరిగ్గా అంచనా వేయలేకపోతుంటారు."
స్టెఫాన్ మిక్‌లిట్జ్
నేటి ఇంటర్నెట్లో దాగి ఉన్న అతి పెద్ద ప్రమాదాలు ఏమిటి అని మీరు భావిస్తున్నారు?
రిషర్: ఒక సమస్య ఏంటంటే, ఆన్లైన్లో యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లతో ఉన్న లిస్ట్‌లు చాలా ఉన్నాయి. మా సహోద్యోగి తాడెక్ పియాట్రజెక్, ఇంకా అతని టీమ్ ఆరు వారాల పాటు ఇంటర్నెట్ను జల్లెడ పట్టి, 350 కోట్ల యూజర్‌నేమ్, పాస్వర్డ్ కాంబినేషన్లను కనిపెట్టారు. ఇది హ్యాక్ అయిన Google ఖాతాలకు సంబంధించిన డేటా కాదు – ఇది ఇతర ప్రొవైడర్ల నుండి దొంగలించబడిన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ల డేటా. అయితే, చాలా మంది యూజర్లు అనేక ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తుంటారు కనుక, ఈ లిస్ట్‌లతో మాకు కూడా సమస్యే.
మిక్‌లిట్జ్: స్పియర్ ఫిషింగ్ అనేది పెద్ద సమస్య అని నా అభిప్రాయం. ఈ పద్ధతిలో దాడి చేసే వ్యక్తి ఎంత తెలివిగా వ్యక్తిగతీకరించిన మెసేజ్‌ను తయారు చేసి పంపుతారంటే, దాని బారిన పడబోయే వ్యక్తికి అసలు అందులో మోసపూరిత ఉద్దేశమే ఉన్నట్టుగా కనబడదు. హ్యాకర్లు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటాన్ని మేము గమనిస్తున్నాము – అంతే కాకుండా, వారు సఫలం అవుతున్నారు కూడా.
రిషర్: స్టీఫెన్ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను. అదీగాక, స్పియర్ ఫిషింగ్ పద్ధతికి ఎక్కువ సమయం పడుతుందేమో అనిపిస్తుంది కానీ, నిజానికి దీనికి అంత సమయం పట్టదు. ఒక స్పామ్ ఈమెయిల్‌ను వ్యక్తిగతీకరించడానికి సాధారణంగా కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. యూజర్లు, తమ గురించి తాము ఆన్లైన్లో పోస్ట్ చేసే సమాచారాన్ని హ్యాకర్లు వాడుకోవచ్చు. క్రిప్టో కరెన్సీల విషయంలో కూడా ఇదే సమస్య, ఉదాహరణకు: ఎవరైనా తమ వద్ద 10,000 బిట్ కాయిన్లు ఉన్నాయని బహిరంగంగా పేర్కొంటే, అలాంటి సమాచారం సైబర్ నేరగాళ్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని వారు అర్థం చేసుకోవాలి.
మిక్‌లిట్జ్: నేను ఒక పెద్ద మార్కెట్ మధ్యలో నిలబడి ఒక పెద్ద లౌడ్ స్పీకర్‌తో నా బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను ప్రకటించడం లాంటిదే ఇది కూడా. అలా ఎవరు చేస్తారు? ఎవరూ చేయరు. కానీ వ్యక్తులు కొన్నిసార్లు ఇంటర్నెట్ ద్వారా ఎదురయ్యే ప్రమాదాలను సరిగ్గా అంచనా వేయలేకపోతుంటారు.
సాధారణ స్పామ్ ఈమెయిల్స్‌ను హ్యాండిల్ చేయడం ఇప్పటికీ సమస్యగానే ఉందా?
రిషర్: పరికరాలను, సర్వీస్‌లను లింక్ చేయడం మాకు ఒక పెద్ద సవాలుగా ఉంది. వ్యక్తులు ఆన్‌లైన్‌లోకి కేవలం ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లను ఉపయోగించే రావడం లేదు – వారు TVలను, స్మార్ట్‌వాచ్‌లను, ఇంకా స్మార్ట్ స్పీకర్లను ఉపయోగించి కూడా ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. ఈ పరికరాలన్నింటిలో వివిధ రకాల యాప్‌లు రన్ అవుతూ ఉంటాయి, దీనితో దాడి చేయడానికి హ్యాకర్ల ముందు అనేక రకాల అవకాశాలు ఉంటున్నాయి. అలాగే, ఈ రోజుల్లో అనేక పరికరాలు కనెక్ట్ అయి ఉంటున్నాయి కనుక, హ్యాకర్లు ఒక పరికరాన్ని ఉపయోగించి మరొక పరికరంలో స్టోర్ చేసి ఉన్న సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేయవచ్చు. ఇప్పుడు మేము ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి: అనేక కొత్త వినియోగ అలవాట్లు ఉన్న ఈ పరిస్థితుల్లో, మా యూజర్ల భద్రతకు మేము ఎలా హామీ ఇవ్వగలము?
మిక్‌లిట్జ్: దీని కోసం, ప్రతి సర్వీస్‌కు వాస్తవానికి ఏ డేటా అవసరం అవుతుంది, అలాగే సర్వీస్‌ల మధ్య ఏ డేటా ఎక్స్ఛేంజ్ అవుతుంది అనే ప్రశ్నను మనకు మనము వేసుకోవాలి.
యూజర్లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మీరు కృతిమ మేధస్సును ఎలా ఉపయోగిస్తున్నారు?
మిక్‌లిట్జ్: Google చాలా కాలం నుండి కృతిమ మేధస్సును ఉపయోగిస్తోంది.
రిషర్: ఆ టెక్నాలజీని మొదటి నుండే మా ఈమెయిల్ సర్వీస్ అయిన Gmailలో ఉపయోగిస్తున్నాము. అంతేగాక, Google సొంతంగా TensorFlow అనే మెషిన్ లెర్నింగ్ లైబ్రరీని కూడా డెవలప్ చేసుకుంది, ఇది మెషిన్ లెర్నింగ్‌లో భాగమైన ప్రోగ్రామర్ల పనిని సులభతరం చేస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే TensorFlow నుండి Gmail బాగా లాభపడుతోంది, ఎందుకంటే, విలక్షణంగా ఉండే నమూనాలను గుర్తించడంలో TensorFlow చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
ఈ నమూనా గుర్తింపు అనేది ఎలా పని చేస్తుందో మీరు మాకు వివరించగలరా?
రిషర్: ఉదాహరణకు, అనేక యూజర్ల మధ్య జరుగుతున్న, వర్గీకరించలేని అనుమానాస్పద యాక్టివిటీని మేము గమనించాం అనుకుందాం. స్వీయ అభ్యాస మెషిన్ అనేది ఈ ఈవెంట్లను పోల్చి, ఉత్తమ పరిస్థితుల్లో, కొత్త తరహా మోసాలను, అవి ఆన్లైన్ అంతటా వ్యాప్తి చెందడం మొదలవ్వక ముందే గుర్తించగలదు.
మిక్‌లిట్జ్: కానీ ఈ విషయంలో పరిమితులు ఉన్నాయి: ఏ మెషిన్ పనితనం అయినా దాన్ని ఉపయోగించే వ్యక్తి తెలివి మీదనే ఆధారపడి ఉంటుంది. మెషిన్లో నేను తప్పు డేటా లేదా ఏక పక్ష డేటాను ఫీడ్ చేస్తే, అది గుర్తించే నమూనాలు కూడా తప్పుగా లేదా ఏక పక్షంగానే ఉంటాయి. కృతిమ మేధస్సు విషయంలో ఎంతో ఆర్భాటం, హడావిడి ఉన్నప్పటికీ, దాని ప్రభావం అనేది దాన్ని ఉపయోగించే వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. మెషిన్‌ను హై క్వాలిటీ డేటాతో ట్రయిన్ చేసి, ఆ తర్వాత ఫలితాలను చెక్ చేయవలసిన బాధ్యత యూజర్‌దే.
రిషర్: గతంలో నేను వేరే ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ వద్ద పని చేసేటప్పుడు, లాగోస్‌లో నివసించే ఒక బ్యాంక్ ఉద్యోగి నుండి మాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ సమయంలో, మోసపూరిత ఈమెయిల్స్ చాలానే ప్రచారంలో ఉండేవి – అవి నైజీరియా నుండి వచ్చేవి కాబోలు. ఆ వ్యక్తి ఒక ప్రముఖ బ్యాంక్‌లోనే పని చేస్తున్నప్పటికీ, అతను పంపే ఈమెయిల్స్ అన్నీ ఎల్లప్పుడూ గ్రహీత స్పామ్ ఫోల్డర్లోకే వెళ్లేవని అతను ఫిర్యాదు చేశాడు. అరకొర సమాచారాన్ని అందించినప్పుడు నమూనా గుర్తింపు సిస్టమ్ ఆ సమాచారాన్ని దాన్ని పోలి ఉండే మిగతా వాటికి కూడా వర్తింపజేస్తుంది, దాని కారణంగా తలెత్తిన సాధారణ సమస్య ఇది. అల్గారిథమ్‌ను మార్చి మేము ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడగలిగాము.
ఫోటోగ్రాఫ్‌లు: కానీ మిర్‌బాక్
సైబర్ సెక్యూరిటీ పురోగతులు
ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్లైన్లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.
మరింత తెలుసుకోండి