ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి.
మీ ఆన్‌లైన్ డేటా గురించి మీరు తెలుసుకొనవలసినవి: అది ఎక్కడి నుండి అందించబడుతోంది, దానికి ఎవరికి యాక్సెస్ ఉంది, దాన్ని అత్యుత్తమంగా మేము ఎలా సురక్షితంగా ఉంచగలము. నిపుణుల నుండి కొన్ని సమాధానాలు
నిర్దిష్ట సమాచారాన్ని షేర్ చేయకుండా నేను నిరోధించవచ్చా?
Michael Littger, జర్మన్ ఇంటర్నెట్ భద్రతా ఇనిషియేటివ్ Deutschland sicher im Netz (DsiN)కు మేనేజింగ్ డైరెక్టర్: “నేను ఎంటర్ చేసే డేటాను నేను ఎంచుకోవచ్చు. కానీ నేను వెబ్ బ్రౌజ్ చేయడం ప్రారంభించినప్పుడు జెనరేట్ చేయబడిన సాంకేతిక డేటాను పరిమితంగా మాత్రమే నేను ప్రభావితం చేయగలను. నేను కుక్కీలను తిరస్కరించగలను లేదా తొలగించగలను. తగిన ప్రోగ్రామ్‌లతో నేను నా IP అడ్రస్‌ను కూడా సులభంగా దాచగలను. అలాగే యాక్టివేషన్ కమాండ్ కోసం వేచి ఉన్నప్పుడు నా గదిలో ఉన్న స్మార్ట్ స్పీకర్ నిష్క్రియగా వినడం నాకు ఇష్టం లేకపోతే, దాన్ని స్విచ్ ఆఫ్ చేసే ఆప్షన్ నాకు ఎల్లప్పుడూ ఉంటుంది.”
నా డేటా పట్ల ఎవరికి ఆసక్తి ఉంది, ఎందుకు?
Michael Littger, DsiN: “కంపెనీలకు యూజర్ డేటా చాలా విలువైనది. వారు తమ ప్రోడక్ట్‌లను మెరుగుపరచడానికి లేదా మరిన్ని టార్గెట్ యాడ్‌లను రూపొందించడం కోసం, వారి సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు జెనరేట్ అయిన డేటాను సేకరిస్తారు. దురదృష్టవశాత్తు, సైబర్ నేరగాళ్లకు కూడా యూజర్ డేటాపై ఆసక్తి ఎక్కువే, దాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు వ్యక్తులను బ్లాక్‌మెయిల్ చేయవచ్చు లేదా వారి బ్యాంక్ ఖాతాలపై దాడి చేయవచ్చు. పోలీసుల వంటి చట్టపరమైన అధికారులు కూడా వ్యక్తిగత డేటాను ఉపయోగించవచ్చని మనం మర్చిపోకూడదు. ఒక వ్యక్తి బ్రౌజర్ హిస్టరీని విచారణ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు – కానీ దీనికి న్యాయస్థాన ఆదేశం తప్పనిసరి.”
నేరగాళ్లు నా సమాచారానికి యాక్సెస్‌ను ఎలా పొందుతారు?
Stephan Micklitz, Google గోప్యతా, సెక్యూరిటీ టీమ్‌కు ఇంజినీరింగ్ డైరెక్టర్: “యూజర్ డేటాను చట్టవిరుద్ధంగా పొందడానికి ఉపయోగించే రెండు అత్యంత సాధారణమైన పద్ధతులు ఫిషింగ్, హ్యాకింగ్. ఫిషింగ్ అంటే యూజర్‌లు తమ డేటాను స్వచ్ఛందంగా అందించేలా మోసగించడం – ఉదాహరణకు నకిలీ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌ను సృష్టిస్తే, నమ్మి యూజర్‌లు తమ ఖాతా సమాచారాన్ని ఎంటర్ చేస్తారు. హ్యాకింగ్ అంటే దాడి చేసి వారు మాల్‌వేర్‌ను ఉపయోగించి ఖాతాలో చొరబడటం. సైబర్ నేరగాళ్లు సాధారణంగా ఈ రెండు పద్ధతులను కలిపి ఉపయోగిస్తారు.”
సహాయం, నా ఖాతా హ్యాక్ చేయబడింది! నేను ఏమి చేయాలి?
Michael Littger, DsiN: “ముందుగా, ఖాతా ప్రొవైడర్‌ను సంప్రదించి, నా పాస్‌వర్డ్‌ను మారుస్తాను. బ్యాంక్ ఖాతాల వంటి అత్యంత సున్నితమైన ఖాతాలయితే, తాత్కాలికంగా బ్లాక్ చేయడం మంచిది. ఖాతాను సులభంగా రీస్టోర్ చేయడానికి, కంపెనీ మిమ్మల్ని సంప్రదించడానికి ఉపయోగించే వేరొక ఇమెయిల్ అడ్రస్ లేదా సెల్ ఫోన్ నంబర్‌ను అందించడంలో ఇది సహాయం చేస్తుంది. నేను ఖాతాను రికవర్ చేశాక, కొన్ని టూల్స్ ఉపయోగించి నష్టాన్ని నిర్ధారిస్తాను. జరిగిన నేరానికి బాధితుడిని నేను, కాబట్టి పోలీసుల వద్దకు వెళ్లి, రిపోర్ట్‌ను ఫైల్ చేస్తాను.”
PC కంటే స్మార్ట్‌ఫోన్‌లో నేను దాడులకు గురయ్యే ప్రమాదం ఎక్కువా?
Mark Risher, Googleలో ఇంటర్నెట్ సెక్యూరిటీకి ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్: “గతంలో PCలలో సమస్యలకు కారణమయిన వాటిని అరికట్టే విధమైన బిల్ట్-ఇన్ రక్షణను స్మార్ట్‌ఫోన్‌లు కలిగి ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌లను రూపొందిస్తున్నప్పుడు, Google వంటి కంపెనీలకు వారి గత అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. అయినప్పటికీ, ఎల్లప్పుడూ స్క్రీన్ లాక్‌ను యాక్టివేట్ చేసుకొని ఉండమని యూజర్‌లకు నేను గట్టిగా సలహా ఇస్తాను. చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా బయటికి వెళ్లరు, దీని వల్ల వారు దొంగలకు సులభంగా టార్గెట్ అవుతారు.”
నా పాస్‌వర్డ్ ఎంత క్లిష్టంగా ఉండాలి?
Michael Littger, DsiN: “ఒక శక్తివంతమైన పాస్‌వర్డ్ డిక్షనరీలో దొరికే పదం అయి ఉండకూడదు, అందులో అక్షరాలు, నంబర్‌లు, ప్రత్యేక అక్షరాలు కలిపి ఉండాలి. మా ట్రైనింగ్ కోర్సులలో, పాల్గొనే వ్యక్తులకు శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను రూపొందించి, వాటిని తేలికగా గుర్తుంచుకునే సులభమైన సూచనలను మేము నేర్పుతాము. ఇది ఒక ప్రాథమిక పద్ధతి: ‘My buddy Walter was born in 1996!’, వంటి ఒక వాఖ్యాన్ని గుర్తు చేసుకుంటాను. తర్వాత పదాలలో ఉన్న మొదటి అక్షరాలను, నంబర్‌లను కలుపుతాను: MbWwbi1996! మరొక పద్ధతిని మేము మూడు పదాల నియమం అంటాము: నా జీవితంలో జరిగిన మరపురాని సంఘటన యొక్క సారాంశాన్ని తెలిపే మూడు పదాలను గుర్తు చేసుకుంటాను. ఉదాహరణకు, 1994లో కార్నివల్‌లో తన భార్యను కలిసిన ఒక వ్యక్తి ‘MrsCarnival1994’ అని పాస్‌వర్డ్‌ను పెట్టుకోవచ్చు.”
పాస్‌వర్డ్ మేనేజర్ ఎంత వరకు ఉపయోగకరంగా ఉంది?
Tadek Pietraszek, యూజర్ ఖాతా సెక్యూరిటీకి ప్రధాన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్: “ఒకేసారి చాలా పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన పని ఉండదని చాలా మంది వేర్వేరు ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తారు. అయితే, దాడులకు పాల్పడే వారికి ఈ పాస్‌వర్డ్ తెలిస్తే, వెంటనే ఇతర ఖాతాలను యాక్సెస్ చేసే అవకాశం ఉంది. అందుకే ఒకే పాస్‌వర్డ్‌ను చాలా ఖాతాలకు ఎప్పుడూ ఉపయోగించవద్దని మేము యూజర్‌లకు సలహా ఇస్తాము. స్కామ్ చేసే వారు రూపొందించిన వెబ్‌సైట్‌లో యూజర్‌లు ప్రమాదవశాత్తు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం కూడా సర్వసాధారణం – ప్రత్యేకించి యూజర్‌లు ఈ పాస్‌వర్డ్‌ను ఎక్కువ ఖాతాలకు ఉపయోగిస్తే ఇలా జరిగే అవకాశం ఎక్కువ. పాస్‌వర్డ్ మేనేజర్ ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ముందుగా, మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేసే ఆప్షన్‌ను ఇది తీసివేస్తుంది, కాబట్టి మీరు వాటిని తిరిగి ఉపయోగించడానికి మొగ్గు చూపరు. తర్వాత, పాస్‌వర్డ్ మేనేజర్ మనుషులలాగా మోసపూరిత సైట్‌లకు ఆకర్షించబడకుండా సరైన పాస్‌వర్డ్‌ను సరైన ఖాతాకు మాత్రమే ఉపయోగిస్తుంది. అయితే, మంచి పేరు ఉన్న కంపెనీలకు చెందిన పాస్‌వర్డ్ మేనేజర్‌లను మాత్రమే ఉపయోగించడం మంచిది – ఉదాహరణకు Dashlane, the Keeper Password Manager, లేదా Google యొక్క Chrome బ్రౌజర్‌లో ఇంటిగ్రేట్ చేసిన పాస్‌వర్డ్ మేనేజర్.”
Artwork: Jan von Holleben; Portraits: DsiN/Thomas Rafalzyk, Conny Mirbach (3)
సైబర్ సెక్యూరిటీ పురోగతులు
ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్‌లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.
మరింత తెలుసుకోండి