ఆన్‌లైన్ ప్రపంచాన్ని మరింత భద్రంగా
చేయడంలో సహాయపడటం.

అందరి కోసం టెక్నాలజీని అభివృద్ధి చేయడం అంటే, దానిని వినియోగించే అందరికీ రక్షణను కల్పించడం అని అర్థం. మా యూజర్‌లను సంరక్షించే, అలాగే పరిశ్రమను ముందుకు నడిపించే గోప్యత, అలాగే సెక్యూరిటీ టెక్నాలజీలను నిర్మించడానికి, ఇంకా వాటిని షేర్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.

Google Assistantలో గోప్యతకు సంబంధించిన ఒక ప్లే చేయదగిన వీడియో
మా
యూజర్‌లను ఆన్‌లైన్‌లో సంరక్షించడం కోసం వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టడం.

కొత్త ప్రమాదాలు పుట్టుకొస్తున్న కొద్దీ, తదనుగుణంగా యూజర్ రక్షణ విషయంలో కూడా మార్పులు చోటుచేసుకోవలసిన అవసరం ఉన్నందున, మా ప్రోడక్ట్‌లన్నింటిలో, ప్రతి యూజర్‌కు సంబంధించిన ప్రైవేట్ సమాచారాన్ని ప్రతి ప్రమాద స్థాయిలోనూ ఆటోమేటిక్‌గా సంరక్షించడానికి మేము నిరంతరం వినూత్న పద్ధతులను కనుగొంటూనే ఉంటాము.

ఒకరు "he" అని టైప్ చేస్తుంటే, దాన్ని Google "Hey" అని ఆటోమేటిక్‌గా సూచించడాన్ని ఫీచర్ చేస్తున్న ఫోన్

ఫెడరేటెడ్ లెర్నింగ్

తక్కువ డేటాతో సహాయకర ప్రోడక్ట్‌లను రూపొందించడం

ఫెడరేటెడ్ లెర్నింగ్ అనేది Google అభివృద్ధి చేసిన డేటా పరిమితి నియమ టెక్నాలజీ, ఇది నేరుగా మీ పరికరంలోకే మెషిన్ లెర్నింగ్‌ను (ML) తీసుకువస్తుంది. ఈ కొత్త విధానం, ML మోడల్‌లకు శిక్షణ ఇవ్వడానికి, వివిధ పరికరాల నుండి అజ్ఞాతీకరించబడిన సమాచారాన్ని కలుపుతుంది. ఫెడరేటెడ్ లెర్నింగ్, వీలైనంత వ్యక్తిగత సమాచారాన్ని మీ పరికరంలోనే ఉంచడం ద్వారా, మీ గోప్యతను సంరక్షించడంలో సహాయపడుతుంది.

అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్

సెక్యూరిటీ యొక్క అవసరం అత్యధికంగా ఉన్న వారి కోసం Google అందించే అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ

జర్నలిస్ట్‌లు, యాక్టివిస్ట్‌లు, బిజినెస్ లీడర్‌లు, ఇంకా రాజకీయ ప్రచార టీమ్‌లు వంటి టార్గెట్ చేసిన ఆన్‌లైన్ దాడులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి చెందిన వ్యక్తిగత Google ఖాతాలను అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ రక్షిస్తుంది. ఈ ప్రోగ్రామ్, వివిధ రకాల ప్రమాదాల నుండి సమగ్రమైన ఖాతా సెక్యూరిటీని అందిస్తుంది, అలాగే కొత్త రక్షణలను జోడించడానికి, నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.

ఇంటర్నెట్‌ను
అందరికీ సురక్షితంగా ఉండేలా చేయడానికి
ఇండస్ట్రీ స్టాండర్డ్‌లను మెరుగుపరచడం.

కేవలం Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌ల సెక్యూరిటీని మాత్రమే కాకుండా మొత్తం ఇంటర్నెట్ తాలూకు సెక్యూరిటీని బలోపేతం చేయడం ద్వారా, మా యూజర్‌లు ఆన్‌లైన్‌లోకి ఎప్పుడు వచ్చినా, వారిని సంరక్షించాలన్నదే మా లక్ష్యం. మేము ప్రపంచంలోని కొన్ని అత్యంత అధునాతనమైన గోప్యత, సెక్యూరిటీ టెక్నాలజీలను క్రియేట్ చేస్తాము, వీటిలో చాలా వరకు టెక్నాలజీలను మేము ఇతరులకు అందుబాటులో ఉండేలా షేర్ చేసి, వారికి కూడా వీటిని అందిపుచ్చుకునే వీలును కల్పిస్తాము.

కనెక్షన్ సురక్షితమైనది అనే నోటిఫికేషన్‌ను చూపుతున్న ఫోన్

HTTPS ఎన్‌క్రిప్షన్

అధునాతన ఎన్‌క్రిప్షన్‌తో వెబ్‌లో ఉన్న సైట్‌లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటం

మా సర్వీస్‌లకు HTTPS ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉన్నందున, మీ సమాచారానికి ఇతరుల నుండి అంతరాయం కలగకుండా మీరు సైట్‌లలోకి సురక్షితంగా కనెక్ట్ అయ్యి, క్రెడిట్ కార్డ్ నంబర్‌లు లాంటి మీ ప్రైవేట్ సమాచారాన్ని ఎంటర్ చేయవచ్చు. మా సైట్‌లు, సర్వీస్‌లు ఆటోమేటిక్‌గా అత్యాధునిక HTTPSను అందిస్తున్నాయని నిర్ధారించడానికి మేము తగినంత కృషి చేస్తూనే ఉంటాము, అలాగే డెవలపర్‌లు అందరికీ కావలసిన టూల్స్‌ను, రిసోర్స్‌లను అందించడం ద్వారా వెబ్‌లోని ఇతరులు కూడా HTTPS వైపు అడుగులు వేసేలా మేము సహాయపడతాము.

భేదాత్మక గోప్యత

భేదాత్మక గోప్యతతో డేటాను అజ్ఞాతీకరించడంలో సంస్థలకు సహాయపడటం

భేదాత్మక గోప్యత అనేది ఒక అధునాతనమైన అజ్ఞాతీకరణ టెక్నాలజీ, ఇది యూజర్‌ల గోప్యతకు భంగం కలిగించకుండా డేటా నుండి గణాంకాలను పొందే వెసులుబాటును మాకు కల్పిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద భేదాత్మక గోప్యత అల్గారిథమ్‌ల లైబ్రరీని నిర్మించడానికి మాకు ఒక దశాబ్దానికి పైగా సమయం పట్టింది, అలాగే, తమ డేటాకు ఇవే గోప్యతా రక్షణలను సులభంగా వర్తింపజేయడంలో సంస్థలకు సహాయపడటానికి, మేము ఆ లైబ్రరీని ఓపెన్ సోర్స్ చేశాము.

Google భద్రతా ఇంజినీరింగ్ కేంద్రం
ఆన్‌లైన్‌లో భద్రతకు ప్రాధాన్యతనిచ్చేలా
భవిష్యత్తును డిజైన్ చేయడం.

అనుభవజ్ఞులైన ఇంజినీర్‌ల టీమ్ నేతృత్వంలో నడిచే Google భద్రతా ఇంజినీరింగ్ కేంద్రం, Google ఇంటర్నెట్ భద్రతకు సంబంధించిన పనిలో గ్లోబల్ హబ్‌గా ఉంది. సమస్యను అర్థం చేసుకోవడం, పరిష్కారాలను అభివృద్ధి చేయడం, ఇతరులతో కలిసి పని చేయడం, అలాగే ప్రతిచోటా యూజర్‌లకు సాధికారత కల్పించడం ద్వారా, మేము అందరికీ మెరుగైన, సురక్షితమైన ఇంటర్నెట్‌ను నిర్మించగలము.

మరింత తెలుసుకోండి

ఆన్‌లైన్‌లో అందరినీ సురక్షితంగా ఉంచడంలో
Google ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.