మీ గోప్యతను రక్షించడం
అనేది ప్రపంచంలోని
అత్యంత అధునాతన సెక్యూరిటీతో మొదలవుతుంది.
అన్ని Google ప్రోడక్ట్‌లు ప్రపంచంలోని అత్యంత అధునాతన సెక్యూరిటీ వ్యవస్థల ద్వారా నిరంతరం రక్షించబడతాయి. ఈ బిల్ట్-ఇన్ సెక్యూరిటీ, ఆన్‌లైన్ ప్రమాదాలను గుర్తించి, నివారిస్తుంది, కాబట్టి మీ వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుందని మీరు విశ్వసించవచ్చు.
అప్‌డేట్ చేయబడిన సెక్యూరిటీతో
మిమ్మల్ని సురక్షితంగా ఉంచడం.
ఎన్‌క్రిప్షన్
ఎన్‌క్రిప్షన్, బదిలీ చేసే సమయంలో డేటాను ప్రైవేట్‌గా, సురక్షితంగా ఉంచుతుంది
ఎన్‌క్రిప్షన్ అనేది మా సర్వీస్‌లకు అత్యుత్తమ స్థాయి సెక్యూరిటీని, గోప్యతను అందిస్తుంది. మీరు ఇమెయిల్ పంపడం, వీడియోను షేర్ చేయడం, వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా మీ ఫోటోలను స్టోర్ చేయడం లాంటివి చేస్తున్నప్పుడు మీరు సృష్టించే డేటా మీ పరికరం, Google సేవలు, మా డేటా కేంద్రాల మధ్య తరలించబడుతుంది. మేము ఈ డేటాను మల్టీ లేయర్ సెక్యూరిటీతో సురక్షితంగా ఉంచుతాము, ఇందులో HTTPS, ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ వంటి అత్యుత్తమ ఎన్‌క్రిప్షన్ సాంకేతికత ఉంటుంది.
సెక్యూరిటీ అలర్ట్‌లు
చురుకైన సెక్యూరిటీ అలర్ట్‌లు, మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి
మీకు తెలియజేయాల్సిన అవసరం ఉన్న అనుమానాస్పద లాగిన్ లేదా హానికరమైన వెబ్‌సైట్, ఫైల్ లేదా యాప్ వంటి వాటిలో దేనినైనా మేము గుర్తిస్తే వెంటనే మీకు తెలియజేస్తాము, దానితో పాటు మేము మీకు సురక్షితమైన సెక్యూరిటీని అందించేలా మార్గనిర్దేశం చేస్తాము. ఉదాహరణకు, Gmailలో, మీ సెక్యూరిటీకి ప్రమాదం కలిగించే అటాచ్‌మెంట్‌ను మీరు డౌన్‌లోడ్ చేయబోయే ముందు లేదా ఎవరైనా మీకు చెందని వేరే పరికరం నుండి మీ ఖాతాకు లాగిన్ చేసినప్పుడు మేము మిమ్మల్ని హెచ్చరిస్తాము. మేము మీ ఖాతాలో అనుమానాస్పదంగా ఏదైనా గుర్తించినప్పుడు, మీ ఇన్‌బాక్స్ లేదా ఫోన్‌కు నోటిఫికేషన్‌ను పంపుతాము, కనుక మీరు మీ ఖాతాను ఒక క్లిక్‌తో రక్షించుకోవచ్చు.
మోసపూరితమైన యాడ్‌లను బ్లాక్ చేయడం
హానికరమైన, తప్పుదారి పట్టించే యాడ్‌లు మీకు చేరడానికి ముందే బ్లాక్ చేయడం
మాల్‌వేర్‌ను కలిగి ఉన్న యాడ్‌లు, మీరు చూడటానికి ట్రై చేసే కంటెంట్‌ను కవర్ చేసే యాడ్‌లు, అలాగే నకిలీ ప్రోడక్ట్‌లను ప్రమోట్ చేసే యాడ్‌లు లేదా మా అడ్వర్టయిజింగ్ పాలసీలను ఉల్లంఘించే యాడ్‌ల వలన మీ ఆన్‌లైన్ అనుభవం ప్రభావితం కావచ్చు. మేము ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తాము. ప్రతి సంవత్సరం, లైవ్ రివ్యూవర్‌లు, అధునాతన సాఫ్ట్‌వేర్ సహకారంతో – సగటున, మేము ఒక్కో సెకనుకు 100 చొప్పున – బిలియన్‌ల కొద్దీ మోసపూరితమైన యాడ్‌లను బ్లాక్ చేస్తున్నాము. అలాగే అభ్యంతరకరమైన యాడ్‌లను రిపోర్ట్ చేయడానికి, మీకు కనిపించే యాడ్‌లను కంట్రోల్ చేయడానికి మేము మీకు టూల్స్‌ను అందిస్తాము. అలాగే మేము అందరి కోసం ఇంటర్నెట్‌ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మా గణాంకాలు, బెస్ట్ ప్రాక్టీసులను ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తాము.
Cloud సెక్యూరిటీ
మా క్లౌడ్ వ్యవస్థ డేటాను 24/7 రక్షిస్తుంది
అనుకూల విధంగా రూపకల్పన చేసిన డేటా కేంద్రాలు మొదలుకుని ఖండాల మధ్య డేటాను బదిలీ చేస్తున్న సముద్రంలోని ప్రైవేట్ కేబుల్‌ల దాకా, మేము ప్రపంచంలోని అత్యంత సురక్షిత, విశ్వసనీయ క్లౌడ్ వ్యవస్థలను కలిగి ఉన్నాము. మీ డేటాను రక్షించడానికి, అలాగే దాన్ని అందుబాటులో ఉంచడానికి ఇది నిరంతరం పర్యవేక్షించబడుతుంది. అలాగే అంతరాయం ఏర్పడిన సందర్భంలో, ప్లాట్‌ఫామ్ సర్వీస్‌లు ఆటోమేటిక్‌గా, తక్షణమే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారతాయి, తద్వారా అవి అంతరాయం లేకుండా కొనసాగుతాయి.
ప్రామాణీకరణ టూల్స్
మీ ఆన్‌లైన్ ఖాతాలన్నింటి కోసం మరింత సురక్షితమైన సైన్ ఇన్ ప్రక్రియ
ఆన్‌లైన్ ఖాతాలు విలువైన, వ్యక్తిగతీకరించిన సర్వీస్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి, కానీ వాటిలోకి సైన్ ఇన్ చేయడం ద్వారా నేడు మనం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సెక్యూరిటీ రిస్క్ కూడా ఉంటుంది. ప్రతి రోజూ, లక్షలాది పాస్‌వర్డ్‌లు డేటా ఉల్లంఘనల కారణంగా బహిర్గతం అవుతున్నాయి, తద్వారా మీ ప్రైవేట్ సమాచారం దాడికి గురయ్యే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన యాప్‌లలో, సర్వీస్‌లలో వేగంగా, సురక్షితంగా సైన్ ఇన్ చేయడంలో సహాయపడేలా మా బిల్ట్-ఇన్ ప్రామాణీకరణ టూల్స్ రూపొందించబడ్డాయి.
ప్రోడక్ట్‌లను మేము సురక్షితంగా ఉంచుతాము.
-
Gmail మిమ్మల్ని అనుమానాస్పద ఇమెయిల్‌ల నుండి రక్షిస్తుంది,
అలాగే ప్రమాదాల గురించి మీకు అలర్ట్‌లను పంపుతుందిచాలా వరకు మాల్వేర్, ఫిషింగ్ దాడులు ఇమెయిల్‌తోనే ప్రారంభమవుతాయి. Gmail మిమ్మల్ని స్పామ్, ఫిషింగ్, మాల్వేర్ నుండి మిగతా ఇతర ఇమెయిల్ సర్వీస్ కంటే కూడా ఉత్తమంగా రక్షిస్తుంది. యూజర్లు స్పామ్‌గా గుర్తించిన ఇమెయిల్‌ల లక్షణాల ఆధారంగా, Gmail, మెషిన్ లెర్నింగ్‌ను, కృత్రిమ మేథస్సును ఉపయోగించి, కోట్లాది మెసేజ్‌లను, వాటి తీరుతెన్నులను విశ్లేషిస్తుంది. ఆపై 99.9% దాకా అనుమానాస్పద లేదా హానికరమైన ఇమెయిల్‌లు మీకు చేరడానికి ముందే వాటిని బ్లాక్ చేయడానికి ఆ విశ్లేషణను ఉపయోగిస్తుంది.
-
ఆటోమేటిక్ Chrome అప్‌డేట్ లు,
మిమ్మల్ని మాల్వేర్, మోసపూరితమైన సైట్ల నుండి రక్షిస్తాయిసెక్యూరిటీ టెక్నాలజీల్లో నిరంతరం మార్పులు వస్తూనే ఉంటాయి, కాబట్టి మీరు ఉపయోగిస్తున్న బ్రౌజర్ వెర్షన్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయి ఉందా? లేదా? అని Chrome తరచూ చెక్ చేస్తుంది. ఇందులో సెక్యూరిటీ పరిష్కారాలు, అలాగే మాల్వేర్, మోసపూరితమైన సైట్ల నుండి రక్షణలు మొదలైనవి ఉంటాయి. అలాగే, ఇది ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది, కనుక తాజా Chrome సెక్యూరిటీ టెక్నాలజీ ద్వారా రక్షణ పొందడం చాలా సులభం.
-
Google Play Protectతో
మీ Android పరికరాన్ని, యాప్‌లను, డేటాను సురక్షితంగా ఉంచడంGoogle Play Protect మీ Android పరికరంలో బిల్ట్ చేయబడి ఉంటుంది, ఇది మీ పరికరాన్ని, డేటాను, అలాగే యాప్‌లను సురక్షితంగా ఉంచడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ, మేము Android ఫోన్లలోని యాప్‌లను ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి, హానికరమైన యాప్‌లు వాటిని చేరకుండా నివారించడానికి, అలాగే Google Play Protectను ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా అమలు చేయబడే మొబైల్ ప్రమాద రక్షణ సర్వీస్‌గా చేయడానికి పని చేస్తున్నాము.
మరిన్ని మార్గాలను అన్వేషించండి.
-
గోప్యతా కంట్రోల్స్మీకు సరిపోయే గోప్యతా సెట్టింగ్‌లను ఎంచుకోండి.
-
డేటా ప్రాక్టీస్లుబాధ్యతాయుతమైన డేటా ప్రాక్టీస్‌లతో మీ గోప్యతను ఎలా గౌరవిస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
-
సెక్యూరిటీ చిట్కాలుఆన్లైన్లో సురక్షితంగా ఉండటానికి త్వరిత చిట్కాలు, అలాగే బెస్ట్ ప్రాక్టీస్‌లను కనుగొనండి.
-
యాడ్‌లు, డేటామా ప్లాట్‌ఫామ్‌లలో మీరు చూసే యాడ్‌ల గురించి మరింత తెలుసుకోండి.