మీ గోప్యతను గౌరవించే యాడ్‌లు.

“ఆన్‌లైన్‌లో మిమ్మల్ని సురక్షితంగా ఉంచడం కంటే ముఖ్యమైన విషయం మాకు మరొకటి లేదు. ఆటోమేటిక్‌గా సురక్షితంగా ఉండే, డిజైన్‌లోనే గోప్యత చేర్చబడి ఉండే, ఇంకా మీకు కంట్రోల్‌ను అందించే ప్రోడక్ట్‌లను రూపొందించడం ద్వారా, ప్రతి రోజూ మీకు Googleతో మెరుగైన భద్రత అందుతోందని మేము నిర్ధారించుకుంటాము.”

- Googleలో కోర్ సిస్టమ్స్ & ఎక్స్‌పీరియన్స్‌లకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన జెన్ ఫిజ్‌ప్యాట్రిక్

బాధ్యతాయుతమైన అడ్వర్టయిజింగ్ విషయంలో మా నిబద్ధత.

ఇంటర్నెట్‌ను అందరికీ అందుబాటులో ఉంచడం, ప్రైవేట్‌గా ఉంచడం, ఇంకా సురక్షితంగా ఉంచడం మా ప్రధాన లక్ష్యం. బాధ్యతాయుతంగా యాడ్‌లను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. Googleకు చెందిన గోప్యతా నియమాలు యాడ్‌లకు ఈ విధంగా వర్తిస్తాయి:

మీ వ్యక్తిగత సమాచారాన్ని, మేము ఎప్పటికీ విక్రయించము, ఎవరికీ విక్రయించము.

యాడ్‌ల అవసరాల కోసం మాత్రమే కాకుండా, మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ఎవరికీ విక్రయించము, ఎప్పటికీ విక్రయించము.

ఏ డేటాను కలెక్ట్ చేస్తాము, ఎందుకు కలెక్ట్ చేస్తాము అనే విషయంలో మేము పారదర్శకంగా ఉంటాము.

మా ప్లాట్‌ఫామ్‌లలో మేము యాడ్‌లను, స్పాన్సర్ చేసిన కంటెంట్‌ను స్పష్టంగా లేబుల్ చేసి, నిర్దిష్ట యాడ్‌లు ఎందుకు ప్రదర్శించబడ్డాయి, ఏ సమాచారం ఉపయోగించబడుతుంది, మీ Google యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ను మీరు ఎలా కంట్రోల్ చేయగలరు అనే అంశాలను సులభంగా అర్థం చేసుకొనే వీలును మీకు అందిస్తాము.

ఉదాహరణకు, Search, YouTube, ఇంకా Discover సహాయంతో, నా యాడ్ కేంద్రం, యాడ్‌ల కోసం ఏ సమాచారం ఉపయోగించబడుతుందో మీకు చూపుతుంది, మీకు సరైన ఎక్స్‌పీరియన్స్ అందేలా చూసుకోవడానికి ఆ సమాచారాన్ని సులభంగా మేనేజ్ చేసుకొనే వీలును మీకు అందిస్తుంది.

మీ వ్యక్తిగత సమాచారాన్ని కంట్రోల్ చేయడం మేము సులభతరం చేస్తాము.

మీ సమాచారం విషయంలోనే కాకుండా, అడ్వర్టయిజింగ్ కోసం అది ఎలా ఉపయోగించబడుతుంది అనే విషయంలో కూడా కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది. Googleలోని మీ యాక్టివిటీ — అంటే, మీరు వెళ్లిన సైట్‌లు, సెర్చ్ చేసిన అంశాలు మొదలైనవి — మా ప్రోడక్ట్‌ల అంతటా, మీ ప్రాధాన్యతల ఆధారంగా యాడ్‌లను అందించడానికి ఉపయోగించబడటంతో పాటు, మీకు మెరుగైన, మరింత సహాయకరమైన ఎక్స్‌పీరియన్స్‌లను అందించడానికి ఉపయోగించబడుతుంది.

మీకు నచ్చే బ్రాండ్‌లు, టాపిక్‌లు గల యాడ్‌లు ఎక్కువ కనిపించేలా, నచ్చని బ్రాండ్‌లు, టాపిక్‌లు గల యాడ్‌లు తక్కువ కనిపించేలా, Google Searchలో, Discoverలో, అలాగే YouTubeలో మీ యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లను అనుకూలంగా మార్చుకొనే వీలును నా యాడ్ కేంద్రం మీకు కల్పిస్తుంది. మద్యం, డేటింగ్, జూదం, గర్భధారణ, పిల్లల పెంపకం, ఇంకా బరువు తగ్గుదల వంటి నిర్దిష్ట గోప్యమైన యాడ్ టాపిక్‌లకు సంబంధించిన యాడ్‌లు తక్కువగా వచ్చేలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు.

డేటా, గోప్యతా సెట్టింగ్‌ల‌ను ఉపయోగించి ఏ సమయంలోనైనా మీరు యాడ్‌ల వ్యక్తిగతీకరణను పూర్తిగా ఆఫ్ చేయవచ్చు, అంతే కాకుండా మీ ఖాతాకు లింక్ అయ్యి ఉన్న యాక్టివిటీ డేటాను కూడా శాశ్వతంగా తొలగించవచ్చు.

మీ గోప్యతను మరింత మెరుగ్గా సంరక్షించడానికి, మేము ఉపయోగించే డేటాను తగ్గిస్తున్నాము.

ప్రత్యేకంగా మీకు సెట్ అయ్యే యాడ్‌లను అందించడానికి, మీ ఆరోగ్యం, జాతి, మతం, లేదా లైంగిక ఓరియంటేషన్ వంటి గోప్యమైన సమాచారాన్ని మేము ఎప్పటికీ ఉపయోగించము.

యాడ్‌ల కోసం ఉపయోగించడానికి, మీరు క్రియేట్ చేసే కంటెంట్‌తో పాటుగా, Drive, Gmail, ఇంకా Photosలో మీరు స్టోర్ చేసుకున్న కంటెంట్‌ను మేము ఎప్పటికీ ఉపయోగించము. మీ గోప్యతను మరింత మెరుగ్గా సంరక్షించడానికి, మా ప్రధాన యాక్టివిటీ సెట్టింగ్‌లలో 'ఆటోమేటిక్ తొలగింపు' అనే సెట్టింగ్ మీ ప్రమేయం అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా వర్తించేలా సెట్ చేశాము. అంటే, మీ ఖాతాకు లింక్ అయ్యి ఉండే యాక్టివిటీ డేటా, 18 నెలల తర్వాత ఆటోమేటిక్‌గా, నిరంతరంగా తొలగించబడుతూ ఉంటుంది, మీరు ఆ డేటాను ఎప్పుడైతే తొలగించాలని ఎంచుకుంటారో, ఆ సమయం దాకా దాన్ని ఉంచడం జరగదు.

చిన్నారులను ఆన్‌లైన్‌లో మరింత సురక్షితంగా ఉంచడానికి మేము ఎల్లప్పుడూ కొత్త మార్గాల కోసం అన్వేషిస్తూనే ఉంటాము, ఏ చిన్నారుల వయస్సు అయితే 18 సంవత్సరాల కంటే తక్కువ అని మాకు తెలుసో, ఆ చిన్నారులకు మేము యాడ్‌ల వ్యక్తిగతీకరణను అందుబాటులో ఉంచము.

ఆటోమేటిక్‌గా సురక్షితంగా ఉండే ప్రోడక్ట్‌లను రూపొందించడం ద్వారా మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాము.

మీ గోప్యతను సంరక్షించడం, మీ డేటాను సురక్షితంగా ఉంచడం అనేవి Google మిషన్‌లో అత్యంత కీలకమైన అంశాలు. అందుకే Google ప్రోడక్ట్‌లన్నింటినీ నిత్యం సురక్షితంగా ఉంచడానికి, ప్రపంచంలోనే అత్యంత అధునాతన సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లలో ఒకటిగా పేరు సంపాదించిన సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మేము ఉపయోగిస్తున్నాము. ఈ బిల్ట్-ఇన్ సెక్యూరిటీ, మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, స్కామ్‌లను, మోసపూరిత యాడ్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పొందాలని చేసే ప్రయత్నాలను నిరోధించడంలో సహాయపడటంతో పాటు, కొత్తగా పుట్టుకొస్తూ ఉండే ఆన్‌లైన్ ప్రమాదాలను గుర్తించి, వాటిని నిరోధించడంలో సహాయపడుతుంది.

అంతే కాకుండా, మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, మేము ప్రపంచవ్యాప్తంగా అడ్వర్టయిజర్‌లను వెరిఫై చేస్తాము, మోసపూరితమైన వ్యక్తులను లేదా సంస్థలను గుర్తించడానికి, వేరే వారిలా నటించడానికి వారు చేసే ప్రయత్నాలను పరిమితం చేయడానికి కృషి చేస్తాము. వెరిఫై చేసిన అడ్వర్టయిజర్‌లు అందించే యాడ్‌లన్నింటికీ సంబంధించిన సమాచారాన్ని అందించే, సెర్చ్ చేయదగిన హబ్ అయిన Ads Transparency Center‌కు వెళ్లడం ద్వారా మీరు మరింత తెలుసుకోవచ్చు.

మేము అధునాతన గోప్యతా టెక్నాలజీలను డెవలప్ చేసి, వాటిని ఇతరులతో షేర్ చేస్తాము.

ఏ వ్యక్తిగత సమాచారాన్ని కలెక్ట్ చేశారు, దాన్ని ఎవరు కలెక్ట్ చేస్తారు అనే అంశాల గురించి వర్రీ అవ్వకుండా మీ ఆన్‌లైన్ ఎక్స్‌పీరియన్స్‌ను మీరు ఆస్వాదించగలగాలి. అందుకే ఆన్‌లైన్‌లో వ్యక్తుల గోప్యతను మెరుగుపరచడానికి Googleలోని టీమ్ లు విస్తృత పరిధిలో పరిశ్రమతో కలిసి పనిచేస్తున్నాయి. ప్రైవసీ శాండ్‌బాక్స్ ను అమలు చేయడం, గోప్యమైన కంప్యూటింగ్ టెక్నాలజీని డెవలప్ చేయడం ఇందులో భాగంగా ఉంటుంది. ఇది బిజినెస్‌లు కస్టమర్‌లను చేరడాన్ని ఎనేబుల్ చేస్తుంది. అంతే కాకుండా, యూజర్ సమాచారానికి రక్షణ కల్పిస్తూనే, యాడ్ క్యాంపెయిన్‌ల ప్రభావాన్ని అంచనా వేయడం సాధ్యం అవుతుంది.

మీకు తగిన విధంగా ఉండే
యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఎంచుకోండి .
మీ యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుకూలంగా మార్చుకోవడానికి అవసరమైన కంట్రోల్స్‌తో, 'నా యాడ్ కేంద్రం' హబ్ పేజీకి ఇది మాక్

Googleలో యాడ్ కంట్రోల్స్

'నా యాడ్ కేంద్రం'లో, Google Search, YouTube, Discover, వీటన్నిటిలోనూ మీరు చూసే యాడ్‌లను కంట్రోల్ చేయడం గతంలో కంటే ఇప్పుడు మరింత సులభం.

మీకు యాడ్‌లను చూపడానికి ఉపయోగించే సమాచారాన్ని కంట్రోల్ చేయడాన్ని 'నా యాడ్ కేంద్రం' సులభతరం చేస్తుంది. ఇందులో భాగంగా మీ Google ఖాతాకు లింక్ చేసి ఉన్న సమాచారం, మీ యాక్టివిటీ ఆధారంగా మేం అంచనా వేసే ఆసక్తులను గురించిన సమాచారం ఉంటాయి. మీ యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుకూలంగా మార్చడానికి కూడా 'నా యాడ్ కేంద్రం'ను ఉపయోగించవచ్చు, తద్వారా మీరు ఇష్టపడే మరిన్ని బ్రాండ్‌లను చూడగలుగుతారు, అలాగే మీరు ఇష్టపడని వాటిని పరిమితం కూడా చేయగలుగుతారు. మీ ఖాతాకు లింక్ చేసి ఉన్న యాక్టివిటీ డేటాను కూడా మీరు ఎప్పుడైనా సరే శాశ్వతంగా తొలగించవచ్చు.




Googleలో సున్నితమైన టాపిక్‌ల గురించి యాడ్‌లను పరిమితం చేయండి

'నా యాడ్ కేంద్రం' ద్వారా, మీకు అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉన్న మద్యం, డేటింగ్, జూదం, గర్భం, సంతాన సాఫల్యం, బరువు తగ్గడం వంటి కొన్ని టాపిక్‌లపై వచ్చే యాడ్‌లను పరిమితం చేయవచ్చు. వివాదాస్పద యాడ్ కేటగిరీలను పరిమితం చేయడం గురించి మరింత తెలుసుకోండి.

మీకు కావలసినప్పుడు వ్యక్తిగతీకరించబడిన యాడ్‌లను ఆఫ్ చేయండి

మీరు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను కూడా పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. అయినప్పటికీ మీకు యాడ్‌లు కనిపిస్తాయి, కానీ అవి మీ ఆసక్తులకు సందర్భోచితంగా ఉండే అవకాశం అంతగా ఉండదు. మీ Google ఖాతాతో మీరు ఎక్కడ సైన్ ఇన్ చేసినా మీ సెట్టింగ్‌లు వర్తించబడతాయి.

మీరు చూసే
ప్రకటనల
గురించి మరింత తెలుసుకోండి.

ఈ ప్రకటన ఎందుకు

ప్రకటనలు చూపించడానికి మేము ఏ డేటాను ఉపయోగిస్తామో చూడండి

అందుకే ఒక నిర్దిష్ట ప్రకటనను మీరెందుకు చూస్తున్నారో అర్థం చేసుకోవడంలో ప్రకటనలకు సంబంధించిన ఈ లక్షణం సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు కెమెరాల కొరకు వెతుకుతున్నారు, ఫోటోగ్రఫీ వెబ్‌సైట్‌లు సందర్శించారు, లేదా కెమెరాలకు సంబంధించిన ప్రకటనలపై క్లిక్ చేశారు కాబట్టి మీరు కెమెరాల ప్రకటనలను చూస్తున్నారని కనుగొనవచ్చు.

My Ad Centerలో "ఈ ప్రకటనకు ఎవరు చెల్లించారు" పేజీ అనుకరణ, ఇది ప్రకటనదారు సంబంధిత ప్రకటనకు ఎంత చెల్లించారో చూపిస్తుంది

ప్రకటనదారు గుర్తింపు ధృవీకరణ

మీరు చూసే ప్రకటనల వెనకున్న ప్రకటనదారుల గురించి తెలుసుకోండి

మీకు ఎవరు అడ్వర్టయిజింగ్ చేస్తున్నారు అనే దాని గురించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్లాట్‌ఫామ్‌లలో అడ్వర్టయిజర్‌ల గుర్తింపును వెరిఫై చేయడానికి మేము పని చేస్తున్నాము. ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా, Google నుండి యాడ్‌లను కొనుగోలు చేయడానికి అడ్వర్టయిజర్‌లు వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది, అప్పుడు మీకు అడ్వర్టయిజర్ పేరు, దేశం వంటివి లిస్ట్ చేసి ఉండే యాడ్ డిస్‌క్లోజర్‌లు కనిపిస్తాయి.

మరింత తెలుసుకోవాలనుకుంటే – నిర్దిష్ట ప్రాంతంలో ఏ యాడ్‌లు ప్రదర్శించబడ్డాయి, లేదా యాడ్ ఫార్మాట్ ఏంటి వంటి సమాచారం – మీరు Ads Transparency Centerకు వెళ్లవచ్చు, YouTube, Search, అలాగే Display వంటి ప్లాట్‌ఫామ్‌ల అంతటా వెరిఫై చేసిన అడ్వర్టయిజర్‌లు అందించే యాడ్‌ల గురించి మొత్తం సమాచారాన్ని అందించే, సెర్చ్ చేయదగిన హబ్ ఇది. మీరు Ads Transparency Centerను నేరుగా అయినా యాక్సెస్ చేయవచ్చు, లేదా మీకు కనిపించే యాడ్‌ల పక్కన ఉండే 3 చుక్కల మెనూ ద్వారా నా యాడ్ కేంద్రానికి వెళ్లి అయినా యాక్సెస్ చేయవచ్చు.

Ads Transparency Centerకు వెళ్లండి.

యాడ్‌ల గురించి వ్యక్తులు అడుగుతున్న ప్రశ్నల గురించి మరింత తెలుసుకోండి.

యాడ్‌ల కోసం Google ఏ డేటాను ఉపయోగిస్తుంది?

మేము Googleలో యాడ్‌లతో సహా మా ప్రోడక్ట్‌లలో మెరుగైన, అలాగే మరింత సహాయకరమైన ఎక్స్‌పీరియన్స్‌లను అందించడానికి – మీరు సందర్శించే సైట్‌లు, మీరు ఉపయోగించే యాప్‌లు, అలాగే మీరు సెర్చ్ చేసిన అంశాలు, లొకేషన్ వంటి సంబంధిత సమాచారం వంటి – మీ యాక్టివిటీని ఉపయోగిస్తాము.

మీకు కనిపించే యాడ్‌లను అందించడానికి ఆరోగ్యం, జాతి, మతం లేదా లైంగిక ధోరణి వంటి గోప్యమైన సమాచారాన్ని మేము ఎప్పుడూ ఉపయోగించము. అలాగే మేము యాడ్‌ల కోసం Drive, Gmail, అలాగే Photos నుండి డేటాను కూడా ఉపయోగించము.

నా యాడ్ కేంద్రంతో యాడ్‌లను వ్యక్తిగతీకరించడానికి, అలాగే మీ యాడ్‌ల ప్రాధాన్యతలను మేనేజ్ చేయడానికి ఏ సమాచారాన్ని ఉపయోగించాలో మీరు కంట్రోల్ చేయవచ్చు.

అడ్వర్టయిజింగ్ కోసం Google నా సమాచారాన్ని ఎందుకు ఉపయోగిస్తుంది?

మీ యాక్టివిటీల ఆధారంగా మీ ఆసక్తులకు సంబంధించినవిగా మేము భావించే యాడ్‌లను మీకు చూపడానికి లేదా ఏవైనా కొత్త అంశాలను కనుగొనడంలో మీకు సహాయపడటానికి Google మీ సమాచారాన్ని ఉపయోగిస్తుంది.

ఉదాహరణకు, మీరు కొత్త కార్‌లపై రీసెర్చ్ చేస్తుంటే, బాల్కనీ ఫర్నిచర్ లేదా పెంపుడు జంతువులకు సంబంధించిన సాధారణ యాడ్‌లను చూడటం కంటే లోకల్ కార్ డీలర్‌ల నుండి ప్రమోషన్‌లను ఫీచర్ చేసే యాడ్‌లను చూడటం మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

మీరు ఎల్లప్పుడూ ఉపయోగించడానికి సులభంగా ఉండే గోప్యత, సెక్యూరిటీ టూల్స్‌తో మీ డేటాపై కంట్రోల్‌ను కలిగి ఉంటారు, Googleతో సమాచారాన్ని షేర్ చేయడం, అలాగే అది యాడ్‌ల కోసం ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకోవడం అనేది ఎల్లప్పుడూ మీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది.

నాకు యాడ్‌లను చూపడానికి Google నా ఈమెయిల్స్‌ను చదువుతుందా లేదా నా ఫోన్ కాల్స్‌ను వింటుందా?

లేదు. మీ ఈమెయిల్, ఇంకా మీ సంభాషణలు వ్యక్తిగతమైనవి, అలాగే ప్రైవేట్‌గా ఉంటాయి. మీరు మీ ఈమెయిల్స్‌లో ఏమి రాస్తారు, మీరు ఫోన్‌లో ఏమి మాట్లాడతారు, లేదా Google Drive వంటి సర్వీస్‌లలో ఏమి స్టోర్ చేస్తారు అనే వాటి ఆధారంగా మేము మీకు యాడ్‌లను ఎప్పుడూ చూపించము.

Google నా సమాచారాన్ని అడ్వర్టయిజర్‌లకు విక్రయిస్తుందా?

లేదు

మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ విక్రయించము.

నేను వ్యక్తిగతీకరించిన యాడ్‌లను పూర్తిగా ఆఫ్ చేయవచ్చా?

అవును. మీరు మీ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయడానికి లేదా యాడ్‌ల వ్యక్తిగతీకరణను ఆఫ్ చేయడానికి నా యాడ్ కేంద్రంలింక్‌కు వెళ్లవచ్చు.

మీరు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూడకూడదని ఎంచుకుంటే, మీకు ఇప్పటికీ యాడ్‌లు కనిపిస్తాయి, కానీ అవి తక్కువ సందర్భోచితంగా ఉంటాయి.

మేము మిమ్మల్ని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడానికి సహాయపడే
మరిన్ని మార్గాలను అన్వేషించండి.