డబ్లిన్‌లో కంటెంట్ బాధ్యతను నిర్వర్తించడం.

చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి పని చేసే Google నిపుణులకు మా యూరోపియన్ ప్రధాన కార్యాలయంలో ఉండే GSEC డబ్లిన్, ఒక ప్రాంతీయ హబ్‌గా ఉంది. అలాగే ఇక్కడ ఈ నిపుణులు చేసే పనిని మేము పాలసీ రూపకర్తలు, రీసెర్చర్‌లు, నియంత్రణ సంస్థలతో షేర్ చేయగలము.

బాధ్యతాయుతమైన కంటెంట్‌ను ప్రోత్సహించే మా కార్యక్రమాల గురించి మరింత లోతైన సమాచారం.

తాజా టెక్నాలజీని, అలాగే కృతిమ మేధస్సును ఉపయోగించి ఆన్‌లైన్‌లో వ్యక్తులను సురక్షితంగా ఉంచడానికి పని చేసే పాలసీ నిపుణులు, స్పెషలిస్ట్‌లు, ఇంకా విశ్లేషకులతో సహా విశ్వసనీయత, అలాగే భద్రతా టీమ్‌లకు డబ్లిన్ ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ కార్యక్రమాలు వారి పనులకు మరింత పారదర్శకతను జోడిస్తాయి.

YouTube ఎలా పని చేస్తుంది

మా పాలసీలు, ప్రోడక్ట్‌లు, ఇంకా చర్యల ఓవర్‌వ్యూ

ప్రతిరోజూ, లక్షలాది మంది వ్యక్తులు సమాచారం, స్ఫూర్తి లేదా వినోదం కోసం YouTubeను సందర్శిస్తుంటారు. సమయం గడిచే కొద్దీ, YouTube ఎలా పని చేస్తుంది అనే దాని గురించి అనేక ప్రశ్నలు మాకు ఎదురవ్వసాగాయి, అందుకని వాటికి కొన్ని సమాధానాలను అందించాలని, అలాగే మా కమ్యూనిటీలో భాగమైన యూజర్‌లు, క్రియేటర్‌లు, ఇంకా ఆర్టిస్ట్‌లు విశ్వసించదగ్గ విధంగా ఉండే బాధ్యతాయుతమైన ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసేందుకు మేము ఏమి చేస్తున్నామో వివరించాలని ఈ సైట్‌ను క్రియేట్ చేశాము.

పిల్లల భద్రతకు సంబంధించిన టూల్స్

ఆన్‌లైన్‌లో పిల్లలపై దురాగతానికి, వేధింపులకు వ్యతిరేకంగా పోరాడటం

ఆన్‌లైన్‌లో పిల్లలను లైంగికంగా వేధించే కంటెంట్‌ను (CSAM) నిరోధించడానికి, అలాగే ఇటువంటి కంటెంట్ వ్యాప్తికి మా ప్లాట్‌ఫామ్‌ల వినియోగాన్ని నివారించడానికి Google కట్టుబడి ఉంది. ఆన్‌లైన్‌లో పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా పోరాడటానికి మేము భారీ పెట్టుబడులు పెడతాము, అలాగే మా ప్లాట్‌ఫామ్‌లలో నేరాలను తగ్గించడానికి, గుర్తించడానికి, అలాగే తీసివేయడానికి మేము మా యాజమాన్య టెక్నాలజీని ఉపయోగిస్తాము. ఇతర సంస్థలకు, వాటి ప్లాట్‌ఫామ్‌లలో CSAMను గుర్తించి, తీసివేయడంలో సహాయపడటం కోసం టూల్స్‌ను అభివృద్ధి చేసి షేర్ చేయడానికి కూడా సాంకేతిక పరంగా మాకు ఉన్న నైపుణ్యాన్ని మేము ఉపయోగిస్తుంటాము.

పారదర్శకత రిపోర్ట్

సమాచారానికి యాక్సెస్‌కు సంబంధించిన డేటాను షేర్ చేయడం

ప్రభుత్వాలు, ఇంకా కార్పొరేషన్‌ల పాలసీలు, ఇంకా చర్యల వలన గోప్యత, సెక్యూరిటీ, అలాగే సమాచారానికి యాక్సెస్ వంటి అంశాలు ఎలా ప్రభావితమవుతాయో తెలియజేయడానికి, 2010 నుండి Google క్రమం తప్పకుండా పారదర్శకత రిపోర్ట్‌ను షేర్ చేస్తూ వస్తోంది. మా పారదర్శకత రిపోర్ట్ సైట్‌లో, ప్రభుత్వాల నుండి కంటెంట్‌ను తీసివేయమని వచ్చిన రిక్వెస్ట్‌లకు సంబంధించిన డేటా, ఇంకా కాపీరైట్ ఉల్లంఘనల కారణంగా తీసివేసిన కంటెంట్‌కు సంబంధించిన డేటా, YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్ అమలుకు సంబంధించిన డేటా, ఇంకా Googleలో రాజకీయ అడ్వర్టయిజింగ్‌కు సంబంధించిన డేటాతో పాటు ఇంకా చాలా డేటా ఉంటుంది.

GSEC డబ్లిన్ కేంద్రాన్ని నడిపిస్తున్న వ్యక్తుల గురించి పరిచయం.

Google భద్రతా ఇంజినీరింగ్ కేంద్రంలో వందలాది మంది విశ్లేషకులు, ఇంజినీర్‌లు, పాలసీ నిపుణులు, రీసెర్చర్‌లు, ఇంకా ఇతర నిపుణులు పని చేస్తుంటారు, వీళ్లందరూ మెరుగైన, సురక్షితమైన ఇంటర్నెట్‌ను రూపొందించడానికి కృషి చేస్తుంటారు.

అమందా స్టోరీ

“కంటెంట్ భద్రత పట్ల మేము ఎలా వ్యవహరిస్తాము అనే విషయాన్ని రెగ్యులేటర్‌లకు, పాలసీ రూపకర్తలకు, ఇంకా రీసెర్చర్‌లకు దగ్గర నుండి సులభంగా అర్థం అయ్యేలా GSEC డబ్లిన్ తోడ్పడుతుంది.”

Amanda Storey

DIRECTOR OF TRUST & SAFETY

హెలెన్ ఓషీ

"మా ప్రోడక్ట్‌లను ఉపయోగించే వ్యక్తులను సంరక్షించడం, వారి నమ్మకంతో పాటు మేము ఆపరేట్ చేసే చోట మా పార్ట్‌నర్‌ల, కమ్యూనిటీల నమ్మకాన్ని సంపాదించడం, ఇంకా దుర్వినియోగానికి, మోసపూరితమైన వ్యక్తులు లేదా సంస్థలకు Google దూరంగా ఉండేలా చేయడంలో సహాయపడటమే మా ధ్యేయం."

Helen O’Shea

HEAD OF CONTENT RISK & COMPLIANCE

మేరీ ఫెలాన్

"మా క్రమబద్ధమైన ప్రాసెస్‌ల ఫ్రేమ్‌వర్క్ ఒక వైపు ఎక్స్‌పర్ట్ సోర్స్‌ల నుండి అధికారిక సమాచారాన్ని పొందడంలో వ్యక్తులకు సహాయపడే వీలును మాకు కల్పిస్తూనే, మరో వైపు ప్రమాదకరమైనది, హానికరమైనది అని స్పష్టంగా తెలిసే కంటెంట్ నుండి మా యూజర్‌లను సంరక్షిస్తుంది."

Mary Phelan

DIRECTOR OF TRUST & SAFETY

క్లేయిర్ లిల్లీ ఫోటో

"ప్రతిరోజూ మా టీమ్‌లు, మా ప్లాట్‌ఫామ్‌లలో సమాచారానికి యాక్సెస్ ఎలా కల్పించాలి అనే ప్రశ్నకు సమాధానం కోసం పని చేస్తూనే ఉన్నాయి, అదే సమయంలో ఆ ప్లాట్‌ఫామ్‌లను, ఇంకా వాటిని ఉపయోగించే వ్యక్తులను దుర్వినియోగాలకు, ఇంకా హానికి - అది ఆన్‌లైన్ హాని అయినా సరే, ఆఫ్‌లైన్‌లో జరిగే అవకాశమున్న హాని అయినా సరే - గురి కాకుండా సురక్షితంగా ఉంచుతున్నాయి."

Claire Lilley

CHILD ABUSE ENFORCEMENT MANAGER

రాక్వెల్ రూయిజ్ ఫోటో

"యూజర్ సమాచారానికి సంబంధించిన గోప్యతను పరిరక్షించే సురక్షితమైన లొకేషన్‌లో, మా కంటెంట్ మోడరేషన్ సిస్టమ్‌లు, ఇంకా ఇతర టెక్నాలజీలు వాస్తవంగా ఎలా పని చేస్తున్నాయి అనే దాని గురించి మరింత సమాచారాన్ని GSEC ద్వారా రెగ్యులేటర్‌లు యాక్సెస్ చేయగలుగుతారు."

Brian Crowley

DIRECTOR OF GLOBAL ADS AND CONTENT INVESTIGATIONS

నూరియా గోమెజ్ కడాహియా ఫోటో

"మా ప్లాట్‌ఫామ్‌లలో ఉండే కంటెంట్ విషయానికి వస్తే, మా ప్రోడక్ట్‌లను ఉపయోగించే వ్యక్తులను, అలాగే బిజినెస్‌లను రక్షించవలసిన బాధ్యత మాపై ఉంది, అది కూడా స్పష్టంగా, పారదర్శకంగా ఉండే పాలసీలు, ప్రాసెస్‌లను అనుసరిస్తూ రక్షించవలసిన బాధ్యత మాపై ఉంది."

Nuria Gómez Cadahía

TECHNICAL PROGRAM MANAGER

ఆలీ ఇర్విన్ ఫోటో

"మా ప్రాంతీయ విశ్వసనీయత, అలాగే భద్రతా టీమ్‌లకు డబ్లిన్ ప్రధాన కేంద్రంగా ఉంది, ఇక్కడ వివిధ రకాల పాలసీ నిపుణులు, స్పెషలిస్ట్‌లు, ఇంకా ఇంజినీర్‌లు చాలా మంది ఉన్నారు, వీరంతా తాజా టెక్నాలజీని, అలాగే కృతిమ మేధస్సును ఉపయోగించి ఆన్‌లైన్‌లో వ్యక్తులను సురక్షితంగా ఉంచడానికి పని చేస్తూ ఉంటారు."

Ollie Irwin

STRATEGIC RISK MANAGER

Google భద్రతా ఇంజినీరింగ్ కేంద్రంలో తెర వెనుక జరిగే దాన్ని తెలిపే సమాచారం.

ఇంటర్నెట్ భద్రత విషయంలో ఉన్న ఆందోళనలను అర్థం చేసుకోవడానికి మేము ప్రపంచ నలుమూలల ఉన్న యూజర్‌లతో మాట్లాడుతుంటాము. ఆన్‌లైన్ భద్రతను మెరుగుపరచడంలో సహాయపడటానికి, అత్యంత అధునాతన పరిష్కార సాధనాలను అభివృద్ధి చేయడం కోసం మేము మా ఇంజినీర్‌ల టీమ్‌కు స్వేచ్ఛను, స్ఫూర్తిని, అలాగే సపోర్ట్‌ను అందిస్తుంటాము.

సైబర్ సెక్యూరిటీ అడ్వాన్స్‌మెంట్‌లు

ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ మందిని ఆన్‌లైన్‌లో, మేము సురక్షితంగా ఎలా ఉంచుతామో తెలుసుకోండి.