మీ ఆన్లైన్ ఖాతాలు అన్నింటిలో సైన్ ఇన్ చేయడానికి సురక్షితమైన మార్గం.
మీ ఆన్లైన్ ఖాతాలన్నింటికీ సైన్ ఇన్ చేయడం అనేది ఇబ్బందిగా ఉండకూడదు. మీ ఖాతా వ్యక్తిగత సమాచారం భద్రత గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, ఇది వేగంగా ఇంకా సులభంగా ఉండాలి.
మీకు ఇష్టమైన యాప్‌లు, సర్వీస్‌లలోకి వేగంగా, సురక్షితంగా సైన్ ఇన్ చేయడంలో సహాయపడేలా మా బిల్ట్-ఇన్ ప్రామాణీకరణ టూల్స్ రూపొందించబడ్డాయి.
-
పాస్వర్డ్లు లేకుండా సులభమైన, సురక్షితమైన సైన్ ఇన్
పాస్-కీలు, మీ పరికర స్క్రీన్ లాక్‌ను ఉపయోగించి సరళమైన, అత్యంత సురక్షితమైన సైన్ ఇన్ను అందిస్తాయి, కాబట్టి సైన్ ఇన్ చేయడం అనేది మీ ఫోన్‌ను చూసినంతగా లేదా మీ వేలిముద్రను స్కాన్ చేసినంతగా సులభమైనది. పాస్-కీలు అనే అంశం, మీ పరికరాలన్నింటిలో, ప్లాట్‌ఫామ్‌లలో పని చేసే ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్.
మరింత తెలుసుకోండి -
మీ అన్ని పరికరాల్లోకి సులభతరమైన సైన్ ఇన్
పాస్-కీలను గుర్తుంచుకోవాల్సిన లేదా టైప్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, మీరు మీ వేలిముద్ర, ముఖం స్కాన్, PIN లేదా ఇతర స్క్రీన్ లాక్‌తో సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించండి - పాస్‌వర్డ్‌ను ఉపయోగించడంతో పోలిస్తే, ఇది రెండింతలు వేగంగా ఉంటుంది. పాస్-కీలు మీ Google ఖాతాలో స్టోర్ చేయబడతాయి కనుక, అవి మీ సింక్ చేయబడిన అన్ని పరికరాలలో అందుబాటులో ఉంటాయి.
-
నెక్స్ట్-జెనరేషన్ ఖాతా సెక్యూరిటీ
FIDO పార్ట్నర్ సంస్థ, ఇంకా W3C స్టాండర్డ్స్ ఆధారంగా, పాస్‌కీలు భౌతిక సెక్యూరిటీ కీలను బలపరిచే అదే పబ్లిక్ కీ క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్స్‌ను ప్రభావితం చేస్తాయి, ఇవి ఫిషింగ్, క్రెడెన్షియల్ స్టఫింగ్ ఇంకా ఇతర రిమోట్ దాడుల నుండి ఎదుర్కొంటాయి.
-
మీకు ఇష్టమైన యాప్‌లకు సర్వీస్‌లకు సైన్ ఇన్ చేయడానికి ఇది సురక్షితమైన మార్గం
మీ అన్ని ఆన్లైన్ ఖాతాలకు సైన్ ఇన్ చేస్తున్నప్పుడు, మీరు త్వరగా చేసే విధంగా ఉండటం, అలాగే సెక్యూరిటీతో కూడి ఉండటం అనేవి రెండూ అవసరం. మీ సైన్-ఇన్ సమాచారం, మీ Google ఖాతాతో ప్రైవేట్‌గా, సురక్షితంగా, భద్రంగా ఉంచబడిందని తెలుసుకోవడం ద్వారా, మీరు వేలాది యాప్‌లకు, వెబ్సైట్లకు మరింత సురక్షితంగా, సులభంగా సైన్ ఇన్ చేయగలరు.
'Googleతో సైన్ ఇన్'ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి -
కేవలం ఒక్క ట్యాప్ ద్వారా, ఎక్కడి నుండైనా సురక్షితంగా సైన్ ఇన్ చేయండి లేదా సైన్ అప్ చేయండి
'Googleతో సైన్ ఇన్' అనే ఫీచర్ సహాయంతో సైన్ అప్ చేయడం, సైన్ ఇన్ చేయడం ద్వారా, థర్డ్-పార్టీ యాప్‌లకు, సర్వీస్‌లకు సంబంధించిన మీ పాస్‌వర్డ్‌లను దొంగిలించే మోసపూరితమైన వ్యక్తులు లేదా సంస్థల నుండి మీరు సురక్షితంగా ఉంటారు. యాప్ లేదా సర్వీస్‌లో సెక్యూరిటీ సంబంధిత సంఘటన ఉన్నప్పటికీ, 'Googleతో సైన్ ఇన్' అనే ఫీచర్ ప్రతి లాగిన్ సమయంలో ప్రత్యేకంగా వెరిఫై చేయడం ద్వారా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.
-
మీ ఖాతాలు, కనెక్షన్లపై మరింత కంట్రోల్
మీరు మీ Google ఖాతా ద్వారా, 'Googleతో సైన్ ఇన్' చేయడాన్ని, లింక్ చేయబడిన ఖాతాలను ఇంకా ఇతర థర్డ్-పార్టీ కనెక్షన్లను ఎలా ఉపయోగించాలో మేనేజ్ చేయండి. మీరు ఎంచుకున్న డేటాను చూడటం, అప్డేట్ చేయడం, మేనేజ్ చేయడం లాంటివన్నీ చేయడానికి ఒకే చోట షేర్ చేయడం ద్వారా, మీరు చక్కగా ఆర్గనైజ్ చేయవచ్చు అలాగే కంట్రోల్ చేయవచ్చు.
మీ కనెక్షన్లను ఇప్పుడే రివ్యూ చేయండి
-
శక్తివంతమైన పాస్వర్డ్లు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి
మీ ఆన్లైన్ ఖాతాల కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకోవడం అనేది మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడంలో ఒక ముఖ్యమైన దశ. అయినప్పటికీ తాము ఒకే రకమైన, బలహీనమైన పాస్‌వర్డ్‌ను పలు సైట్లలో ఉపయోగిస్తున్నట్లు అధిక శాతం వ్యక్తులు చెప్పారు, దీని వల్ల వారి ఖాతాలు మరింత బలహీనంగా తయారై దాడికి గురయ్యే అవకాశం పెరుగుతుంది.
-
మీ పాస్‌వర్డ్‌లను, పాస్-కీలను మేనేజ్ చేయడంలో Google Password Manager మీకు సహాయపడుతుంది
మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను, పాస్-కీలను మేనేజ్ చేయండిChrome, అలాగే Androidలో రూపొందించబడిన, Google Password Manager మీ ఆన్లైన్ ఖాతాలు అన్నింటిలో సురక్షితమైన పాస్‌వర్డ్‌లను సూచిస్తుంది, సేవ్ చేస్తుంది, అలాగే వాటిని ఆటోమేటిక్‌గా నింపుతుంది. పాస్-కీలు, పాస్‌వర్డ్‌లతో పాటు పని చేస్తాయి అలాగే ఇవి అన్నీ ఒకే చోట సౌకర్యవంతంగా మేనేజ్ చేయబడతాయి.
-
ఆటోమేటిక్ పాస్వర్డ్ హెచ్చరికలు మీ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకోవడంలో సహాయపడతాయి
ప్రతి రోజూ, కొత్త డేటా ఉల్లంఘనలు, లక్షల కొద్దీ యూజర్‌నేమ్‌లను, పాస్‌వర్డ్‌లను పబ్లిక్‌గా బహిర్గతం చేస్తాయి. చోరీకి గురైన పాస్‌వర్డ్‌ల కోసం Google పర్యవేక్షిస్తుంది, తద్వారా మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లలో ఏవైనా డేటా ఉల్లంఘనలో ఉన్నట్లు గుర్తించినట్లయితే, మేము మిమ్మల్ని ఆటోమేటిక్‌గా అలర్ట్ చేస్తాము.
పాస్వర్డ్ చెకప్ చేయడం ద్వారా మీ అన్ని ఆన్లైన్ ఖాతాలను సురక్షితం చేసుకోండి. మీ పాస్‌వర్డ్‌ల సామర్థ్యాన్ని టెస్ట్ చేయండి, మీరు వేటినైనా ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించారో లేదో చెక్ చేసుకోండి, ఇంకా ఏవైనా చోరీకి గురయ్యాయో లేదో తెలుసుకోండి.
మరిన్ని మార్గాలను అన్వేషించండి.
-
గోప్యతా కంట్రోల్స్మీకు సరిపోయే గోప్యతా సెట్టింగ్‌లను ఎంచుకోండి.
-
డేటా ప్రాక్టీస్లుబాధ్యతాయుతమైన డేటా ప్రాక్టీస్‌లతో మీ గోప్యతను ఎలా గౌరవిస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
-
సెక్యూరిటీ చిట్కాలుఆన్లైన్లో సురక్షితంగా ఉండటానికి త్వరిత చిట్కాలు, అలాగే బెస్ట్ ప్రాక్టీస్‌లను కనుగొనండి.
-
యాడ్లు, డేటామా ప్లాట్‌ఫామ్‌లలో మీరు చూసే యాడ్ల గురించి మరింత తెలుసుకోండి.